AP High Court Judge Visits Srisaila Mallikarjuna Temple - Sakshi
Sakshi News home page

మల్లన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

Published Sat, Sep 25 2021 8:44 AM | Last Updated on Sat, Sep 25 2021 11:03 AM

AP High Court Judge Visiting Srisaila Mallanna - Sakshi

దర్శనానికి వెళ్తున్న జస్టిస్‌ కృష్ణమోహన్‌ దంపతులు 

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ శుక్రవారం దర్శించుకున్నారు. న్యాయమూర్తికి అతిథి గృహం వద్ద దేవస్థాన పీఆర్వో టి.శ్రీనివాసరావు స్వాగతం పలికారు. అనంతరం ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి దంపతులకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ మల్లికార్జున స్వామిని, శ్రీభ్రమరాంబాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement