srisailam mallanna
-
మల్లన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ శుక్రవారం దర్శించుకున్నారు. న్యాయమూర్తికి అతిథి గృహం వద్ద దేవస్థాన పీఆర్వో టి.శ్రీనివాసరావు స్వాగతం పలికారు. అనంతరం ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి దంపతులకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ మల్లికార్జున స్వామిని, శ్రీభ్రమరాంబాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. -
శ్రీశైలంలో మంత్రి కొడలి నాని ప్రత్యేక పూజలు
-
మండుటెండలో సైతం.. భక్తిభావం ఉప్పొంగగా..
సాక్షి, శ్రీశైలం/టెంపుల్: తమ ఇంటి ఆడపడుచు భ్రమరాంబకు సారె సమర్పించాలని.. తమ ఇలవేల్పు మల్లన్నను దర్శించుకోవాలని పాదయాత్రగా బయలుదేరిన కన్నడిగులు వడివడిగా ఇల కైలాసం చేరుకుంటున్నారు. వారి ఆధ్యాత్మిక మార్గంలో అడుగడుగునా భక్తిభావం ఉప్పొంగుతుండగా.. మండుటెండలు సైతం చిన్నబోతున్నాయి. నల్లమల అడవులు చల్లని గాలులతో స్వాగతం పలుకుతున్నాయి. అన్నదాతలు ఆహారపానీయాలు అందిస్తూ వారి సేవలో తరిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం అధికారులు మౌలిక వసతులు కల్పించి భరోసా కల్పిస్తున్నారు. ఉగాది ఉత్సవాలకు తరలిస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర భక్తులతో శ్రీశైలంలో సందడి నెలకొంది. చదవండి: నేరుగా అమ్మ దర్శనానికే..! ఆంధ్రజ్యోతి ప్రెస్‌కు ఐలా నోటీసులు -
పుష్పపల్లకోత్సవం.. నయనానందకరం
సాక్షి, శ్రీశైలం: మల్లికార్జునస్వామి స్వామి పుష్పపల్లకోత్సవం కనుల పండువగా జరిగింది. దేవేరి భ్రామరితో కలిసి శ్రీశైలేశుడు పురవీధుల్లో విహరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన మల్లన్న పుష్పపల్లకీ గ్రామోత్సవాన్ని లక్షలాది మంది భక్తజనం తిలకించి తరించారు. అంతకు ముందు ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి కల్యాణమండపంలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు విశేష వాహనసేవలు నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను ఆలయప్రదక్షిణ చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఈఓ కేఎస్‌రామారావు, మాజీ ఈఓ వంగాలశంకర్రెడ్డి, ట్రస్ట్‌బోర్డ్ చైర్మన్ శివరామిరెడ్డి,సభ్యులు గిరీష్‌పాటిల్, చాటకొండ శ్రీని వాసులు,మర్రి శ్రీరాములు, రావినాద్రావు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రదక్షిణానంతరం ఉత్సవమూర్తులను ఊరేగింపుగా రథశాల వద్దకు చేర్చి పుష్పాలంకృతశోభతో కళకళలాడుతున్న పల్లకీలో ఉత్సవమూర్తులను కూర్చొబెట్టారు. ఈ పుష్పపల్లకీ కోసం 2000 కేజీలకు పైగా తెలుపు, పసుపు చామంతులు,ఎరుపు,పసుపు బంతిపూలు, కనకాంబరం, నందివర్ధనం, కాగడా, జబ్ర, కార్నేషన్, ఆర్కిడ్స్, గ్లాడియోలస్, టైగర్రోజ్, స్టార్ రోజ్, ఆస్టర్, ఆ్రస్టిడ్ మొదలైన 18 రకాల పుష్పాలను వినియోగించినట్లు హారి్టకల్చరిస్ట్ లోకేష్ తెలిపారు. దీంతో పాటు వేలాది విడి పుష్పాల(కట్‌ప్లవర్స్)తో అత్యంత సుందరంగా పల్లకీని తీర్చిదిద్దారు. నేడు శ్రీశైలంలో... శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు గురువారం శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను గజవాహనంపై ఆవహింపజేసి విశేషపూజలు చేస్తారు. తర్వాత గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనంపై అధిష్టింపజేసిన ఉత్సవ మూర్తులకు విశేషపూజలు చేస్తారు. వాహన సమేతులైన స్వామి అమ్మవార్లను ప్ర«ధానాలయ గోపురం నుంచి «రథశాల వద్దకు చేరుస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత నందిమండపం, అంకాలమ్మగుడి, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఊరేగిస్తారు. గురువారం జరిగే ప్రత్యేక పూజల్లో భాగంగా ఉదయం 7.30 గంటలకు నిత్యహోమ బలిహరణలు, జపానుష్టానములు నిర్వహిస్తారు. మల్లన్న గ్రామోత్సవానికిభారీగా తరలివచ్చిన భక్తజనం మంత్రి పేర్ని నాని రాక కర్నూలు(సెంట్రల్) : రాష్ట్ర సమాచార, రోడ్డు రవాణా శాఖమంత్రి పేర్ని నాని మల్లన్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు గురువారం శ్రీశైలానికి రానున్నారు. మచిలిపట్నం నుంచి గురువారం ఆయన బయలు దేరి సాయంత్రం నాలుగు గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. 21వ తేదీ జరిగే వివిధ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఆ రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు తిరిగి మచిలిపట్నంకు వెళ్లిపోతారు. -
శ్రీశైలం.. ఉత్సవ శోభితం
సాక్షి, శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం.. రావణ వాహనంపై శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహన ప్రత్యేక పూజలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ఈఓ కేఎస్ రామరావు తదితరులు పాల్గొన్నారు. విశేషపూజల అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి ప్రధానాలయ రాజగోపురం గుండా రథశాల వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలను చేసి నారికేళం సమరి్పంచి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. రథశాల నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం అంకాలమ్మగుడి, నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు కనుల పండువగా సాగింది. లక్షలాది మంది భక్తులు రావణ వాహనా«దీశులైన స్వామిఅమ్మవార్లను పురవీధుల్లో దర్శించుకొని కర్పూర నీరాజనాలు అరి్పంచారు. రాత్రి 9.30 గంటలకు గ్రామోత్సవం ఆలయ ప్రాంగణం చేరుకుంది. మల్లన్నకు పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి బుగ్గన ఈ నెల 21వ తేదీన నిర్వహించే శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పట్టువ్రస్తాలను సమరి్పంచారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువ్రస్తాలను సమర్పించడం ఆనవాయితీగా ఉంది. ఇందులో భాగంగా ప్రధానాలయగోపురం ముందు ఏర్పాటు చేసిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తుల ఎదుట పట్టువ్రస్తాలు, ఫలపుష్పాదులను ఉంచి శాస్త్రోక్తంగా అర్చకులు, వేదపండితులు పూజలను నిర్వహించారు. అనంతరం మంత్రి, ఈఓ తదితరులంతా పట్టువ్రస్తాలు, ఫలపుష్పాదులను తలపై పెట్టుకుని ఆలయప్రవేశం చేశారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పట్టువస్త్రాలను సమరి్పంచిన అనంతరం వారు రావణవాహనంపై అధిష్టింపజేసిన శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సేవలో పాల్గొన్నారు. ఆత్మకూరు–దోర్నాల ఘాట్ రోడ్డు పరిస్థితిపై ఎమ్మెల్యే శిల్పాతో చర్చించామని అటవీశాఖ పరిధిలో ఉన్నందున ఆ శాఖ అధికారులు, ప్రతినిధులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు. నేడు మల్లన్నకు పుష్పపల్లకీ సేవ.... మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను పుష్పపల్లకీ అధిష్టింపజేసి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనికి ముందుగా ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలను చేస్తారు. ఉత్సవమూర్తులను గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన పుష్పపల్లకీపై అధిష్టింపజేసి గ్రామోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈ పుష్పపల్లకి మహోత్సవం రథశాల నుంచి నందిమండపం వద్దకు వెళ్లి తిరిగి రథశాల వద్దకు చేరుకుంటుంది. -
మయూరవాహనంపై శ్రీశైల మల్లన్నా
-
మనోహరం..మయూర వాహనోత్సవం
సాక్షి, శ్రీశైలం : శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి మయూరవాహనంపై ముగ్ధమనోహరంగా భక్తులకు సో మవారం దర్శనమిచ్చారు. స్వామివార్ల దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు ‘ఓం హర శంభో శంకరా... శ్రీశైల మల్లన్నా పా హిమాం.. పాహిమాం’ అంటూ పురవీధుల్లో సాగిలపడ్డారు. రాత్రి 7.30 గంటలకు అలంకార మండపంలో ఉత్సవమూర్తులను మయూర వాహనంపై అధిష్టింపజేశారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు శా్రస్తోక్తంగా వాహన పూజలను నిర్వహించారు. అనంతరం వాహన సమేతులైన శ్రీ స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రాంగణం నుంచి ఊరేగిస్తూ కృష్ణదేవరాయుల గోపురం గుండా రథశాల వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, బయలువీరభద్రస్వామి మండపం చేరుకొని తిరిగి రాత్రి 9.30గంటలకు ఆలయ ప్రాంగణం చేరింది. గ్రామోత్సవంలో లక్షలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకొని కర్పూర నీరాజనాలు అర్పించి పునీతులయ్యారు. పట్టు వ్రస్తాల సమర్పణ.. బ్రహ్మోత్సవాల్లో శివరాత్రి పర్వదినాన జరిగే స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం, కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానాల తరపున ఆదివారం పట్టు వ్రస్తాలను సమరి్పంచారు. కాణిపాకం దేవస్థానం తరపున ఈఓ వి. దేముళ్లు , టీటీడీ దేవస్థానం తరఫు ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ , టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, ఆ దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి, అర్చక వేదపండిత బృందం పట్టువ్రస్తాలు, ఫలపుష్పాదులకు శాస్త్రోక్త పూజలు చేసి స్వామిఅమ్మవార్లకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంగళవారం సాయంత్రం సంప్రదాయానుసారం పట్టువ్రస్తాలను సమరి్పంచనున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. నేటి రాత్రి 7.30 గంటల వరకే మల్లన్న స్పర్శదర్శనం భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని మంగళవారం రాత్రి 7.30 వరకు మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని ఏర్పాటు చేసినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. ఆ తర్వాత నుంచి దూర (అలంకార)దర్శనం ప్రారంభిస్తామన్నారు. ఈనెల 24 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు మల్లికార్జునస్వామివార్ల దూరదర్శనం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. శివస్వాములు, సాధారణ భక్తజనంతో పాటు వీఐపీలు, వీవీఐపీలకు కూడా మల్లన్న స్పర్శదర్శనం శివరాత్రి ముగిసే వరకు ఉండబోదని స్పష్టం చేశారు. నేడు శ్రీశైలంలో... బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవరోజు మంగళవారం శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను రావణవాహనంపై అధిష్టింపజేసి గ్రామోత్సవా న్ని నిర్వహిస్తారు.ఉదయం 7.30గంటలకు నిత్య హోమ బలిహరణలు, జపానుష్ఠానములు, నిర్వహిస్తారు. సాయంత్రం 5.30గంటల నుంచి నిత్యపూజలు, అనుష్ఠానములు, నిత్యహవనములు, బలిహరణలను సమర్పిస్తారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి జ్ఞాపికను అందిస్తున్న శ్రీశైలం ఈఓ శ్రీశైలం అభివృద్ధికి టీటీడీ సహకారం శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి టీటీడీ సహకారం అందజేస్తుందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్వామిఅమ్మవార్లకు పట్టువ్రస్తాలను సమరి్పంచిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివార్లకు సంప్రదాయానుసారం టీడీపీ తరపున పట్టువస్త్రాలను సమరి్పస్తున్నామన్నారు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యాల కల్పనకు టీటీడీ తరపున నిధులను కూడా విడుదల చేస్తామని అన్నారు. శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి, వెంకటేశ్వరస్వామి స్వామి కృపతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. -
హంస వాహనాధీశా.. హరోం హర
సాక్షి, శ్రీశైలం: శ్రీగిరి కొండలు శివ నామస్మరణతో ప్రతిధ్వనిస్తుండగా.. శ్రీశైల క్షేత్రం బ్రహ్మోత్సవ కాంతులతో కళకళ లాడుతుండగా.. దేవేరి భ్రామరితో కలసి మల్లన్న మందస్మిత దరహాస వీచికలతో హంస వాహనంపై కనులపండువగా దర్శనమివ్వగా.. హంస వాహనాధీశా.. హరోం.. హర అంటూ శివ స్వాములు ప్రణమిల్లారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు ఆదివారం రాత్రి శ్రీభ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునస్వామి హంస వాహనంపై విశేష వాహన పూజలు అందుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం వద్ద ఉన్న అక్కమహాదేవి అలంకార మండపంలో రాత్రి 7.30 గంటలకు హంస వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక అలంకార పూజలు, వాహన, వింజామర సేవలను వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు, వేదపండితులు పండితులు నిర్వహించారు. మంగళవాయిద్యాలు మారుమోగుతుండగా, భక్తులు పంచాక్షరి నామస్మరణ చేస్తున్న సమయాన హంసవాహనాధీశులైన స్వామివార్లను ఆలయ ప్రదక్షిణ చేయించి ఆలయప్రాకార ప్రధాన రాజగోపురం మీదుగా రథశాల వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ప్రధాన పురవీధిలోని అంకాలమ్మ గుడి, నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం జరిగింది. అక్కడి నుంచి నేరుగా స్వామి అమ్మవార్ల ఆలయ ప్రాంగణం చేరుకుంది. వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలనర్పించారు. శివరాత్రి రోజు జరిగే బ్రహ్మోత్సవ కల్యాణానికి మొదటిసారిగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరపున ఈఓ సురేష్‌బాబు దంపతులు ఆదివారం రాత్రి పట్టువస్త్రాలను సమర్పించారు. స్వామి అమ్మవార్లకు ఫలపుష్పాదులు, పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, గాజులుతో కూడిన పళ్లాలను తలపై పెట్టుకుని ఆలయప్రదక్షిణ చేసి సమర్పించారు. నేడు శ్రీశైలంలో.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను మయూర వాహనంపై ఉంచి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనాధీశులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలు చేస్తారు. వాహన సమేతులైన స్వామిఅమ్మవార్లను రథశాల నుంచి నందిమండపం, అంకాలమ్మ గుడి, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఊరేగిస్తారు. కాగా సోమవారం జరిగే ప్రత్యేక పూజల్లో భాగంగా ఉదయం 7.30 గంటలకు నిత్యహోమ బలిహరణలు, జపానుష్టానములు, నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివార్లకు విశేషార్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు చేస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి నిత్యపూజలు చేపడతారు. టీటీడీ తరపున పట్టువస్త్రాల సమర్పణ మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కల్యాణమూర్తులకు సోమవారం తిరుమల, తిరుపతి దేవస్థానం తరపున పట్టువస్త్రాలను సమర్పిస్తారు. గత కొన్నేళ్లుగా టీటీడీ దేవస్థానం తరపున శ్రీశైలంలో జరిగే శివరాత్రి, దసరా ఉత్సవాలకు పట్టువస్త్రాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. కళా నీరాజనం బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామోత్సవంలో కళాకారుల అమోఘంగా తమ కళలను ప్రదర్శించడంతో భక్తులు పులకించిపోయారు. తప్పెట చిందులు, కోలాటం, డోలు కళాకారుల విన్యాసాలు, చెంచు గిరిజనుల నృత్యప్రదర్శన, గొరవయ్యల ఈల పాటల నృత్యాలు, కేరళ నృత్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలన్ని భక్తులను తమ అలసటను మరిచిపోయేలా చేశాయి. -
శ్రీశైలం మల్లన్నకు చీరాల తలపాగా సిద్ధం
చీరాల: శ్రీశైలం మల్లన్న పెళ్లికి తలపాగ సిద్ధమైంది. మహాశివరాత్రి రోజున ఈ తలపాగా చుట్టిన తర్వాతే మల్లికార్జున స్వామికి భ్రమరాంబతో పెళ్లి తంతు మొదలవుతుంది. పరమశివుణ్ని పెళ్లి కుమారుడిగా అలంకరించే వస్త్రాన్ని ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపురి హస్తినాపురంలోని ఓ చేనేత కుటుంబం నేస్తుంది. ఇక్కడి పృథ్వీ వంశస్థులు వందేళ్లకు ముందు నుంచి ఈ ఆచారం కొనసాగిస్తున్నారు. ఏటా మహా శివరాత్రిన జరిగే శ్రీశైలం మల్లన్న కల్యాణోత్సవంలో శివుణ్ని వరుడిగా అలంకరణ చేస్తారు. 150 గజాలు ఉండే ఈ వస్త్రాన్ని ఆలయ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ చుడతారు. కల్యాణం అనంతరం ఈ వస్త్రాన్ని వేలంలో దక్కిం చుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు సైతం పోటీపడతారు. ఈ తలపాగాతో మం గళవారం ఉదయం పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం ఊరేగింపుగా శ్రీశైలం బయల్దేరింది. తాను నేసిన బట్టతో పరమశివుణ్ని వరుడిగా అలంకరించడం తన అదృష్టమని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కాగా, మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కల్యాణోత్సవానికి ఏపీ ప్రభుత్వం తరపున ఆర్అండ్ బి, రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు దంపతు లు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. -
మల్లన్న సన్నిధిలో వైఎస్ జగన్
-
మల్లన్నను దర్శించుకున్న వైఎస్ జగన్
-
మల్లన్నను దర్శించుకున్న వైఎస్ జగన్
కర్నూలు : వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకున్నారు. అంతకు ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం జేఈవో, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కాగా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర నేటికి రెండోరోజుకు చేరింది. శ్రీశైలం నియోజకవర్గం దోర్నాలలో యాత్ర కొనసాగనుంది. ముందుగా దోర్నాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడతారు. అక్కడ నుంచి ఆత్మకూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.