
వాడ వాడకు నవరత్నాలు
►బూత్ కమిటీలను శక్తివంతంగా తయారు చేయడమే లక్ష్యం
►జగనన్న అధికారంలోకి వస్తే పనిచేసిన కార్యకర్తలందరికీ గుర్తింపు
►కంటికి రెప్పలా కార్యకర్తలను కాపాడుకుంటా
►ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ప్రకటించిన నవరత్నాలను వాడ వాడకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక దొరసానిపల్లెలోని శేగిరెడ్డికాటిరెడ్డి కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని బూత్ కమిటీలకు సంబంధించి నవరత్నాల సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులకంటే వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అండగా నిలిచే కార్యకర్తలంటేనే తనకు ఇష్టమని తెలిపారు. ఒక తల్లి గర్భాన జన్మించిన పిల్లల్లా ఐక్యమత్యంగా ఉంటూ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయనను ముఖ్యమంత్రిగా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నియోజకవర్గ పరిధిలోని 258 పోలింగ్ బూత్‌లకు సంబంధించి వాడవాడలా జగనన్న నవరత్నాల గురించి ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.
నవరత్నాలు అద్భుతం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు అద్భుతంగా ఉన్నాయని ఎమ్మె ల్యే తెలిపారు. ప్రతి కార్యకర్త వీటిని ఘంటాపథంగా చెప్పేలా నేర్చుకోవాలని కోరారు. వైఎస్సార్ రైతు భరోసా వల్ల ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతుకు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.50వేలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని, రూ.12,500 చొప్పు న నాలుగు విడుతలుగా చెల్లిస్తామని తెలిపారు. డ్వాక్రా మహిళలకు సంబం ధించి పూర్తిగా రుణమాఫీ చేస్తామన్నారు. వృద్ధాప్య పింఛన్ల మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2వేలకు పెంచుతామని, అ మ్మఒడి పథకం ద్వారా చిన్నారుల విద్యాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలా కాకుండా ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లను నిర్మించి ఇంటి తాళాలను పేదలకు అందిస్తామన్నారు.
చతికలబడిన ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం వస్తుందని, ప్రస్తుతంలా కాకుం డా సీటు పొందిన ప్రతి విద్యార్థికి పూర్తి రీయింబ ర్స్‌మెంట్‌తోపాటు భోజన వసతి ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు. జలయజ్ఞం ప్రా జెక్టులను పూర్తి చేసి నీరందిస్తామన్నారు. దశల వారీగా మద్యం నిషేధం అమలు చేస్తామని తెలిపారు. ప్రతి బూత్‌లో సుమారు 300 ఇళ్లు ఉంటాయని, పది మంది బూత్ కమిటీ సభ్యులు మళ్లీ ఈ పథకాలను ప్రజల చెవిలో వేయవచ్చన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం, తాను ఎమ్మెల్యే అయితే రాచమల్లు అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని తెలిపారు. 2014లో కూడా అసెంబ్లీకి పం పిన మీ కృషి, పట్టుదల మరువలేనిదని పేర్కొన్నారు. వైఎస్సార్‌కు గుర్తుగా, జగనన్నకు తోడుగా అన్న పదం వింటుంటే తన ఒళ్లు పులకరిస్తుందన్నారు.
జగన్‌ది సాహసోపేత నిర్ణయం
నవరత్నాలు సభ తర్వాత వైఎస్సార్ కుటుంబం పథకం అమలవుతుందని, తర్వాత అక్టోబర్‌లో 13 జిల్లాలకు సంబంధించి 7 నెలలపాటు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాలని జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారన్నారు. భార్యాబిడ్డలను వదలి ఏడు నెలలపాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించడం జగన్ సాహసోపేత నిర్ణయమని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డిలా తక్కువ కాలం జీవించినా పాలకులు ప్రజల మన్ననలను పొందాలని తెలిపారు. సభకు వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్ అధ్యక్షత వహించారు.