కరువుపై వెల్లువెత్తిన వైఎస్సార్సీపీ పోరుబాట | ysrcp leaders protests in ap district mro offices over droughts action | Sakshi
Sakshi News home page

కరువుపై వెల్లువెత్తిన వైఎస్సార్సీపీ పోరుబాట

Published Mon, May 2 2016 12:56 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

కరువుపై వెల్లువెత్తిన వైఎస్సార్సీపీ పోరుబాట - Sakshi

కరువుపై వెల్లువెత్తిన వైఎస్సార్సీపీ పోరుబాట

గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో కరువు విలయతాండవం చేస్తున్నా సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు దిగింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా గుంటూరు జిల్లా మాచర్ల ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్తో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ వైఎస్సార్ పార్టీ నేతలు, నాయకులు కరువుపై పోరులో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

వైఎస్సార్ జిల్లా: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  రాజంపేటలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, కకమలాపురంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో, కడపలో ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేశ్బాబు, జమ్మలముడుగులో వైఎస్సార్ సీపీ నేత సుధీర్రెడ్డి, రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ధర్నా, ర్యాలీ నిర్వహించారు.

శ్రీకాకుళం: రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, శ్రీకాకుళంలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, రణస్థలంలో గొర్లె కిరణ్కుమార్ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

విజయనగరం: జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకుల నేతృత్వంలో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నెలిమర్లలోనూ పార్టీ ఆధ్వర్యంలో వెయ్యి మంది మహిళలు ఖాళీ బిందెలతో తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు సాంబశివరాజు పాల్గొన్నారు. కురుపాంలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విజయనగరం మున్సిపల్ కార్యాలయం ఎదుట కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

విశాఖపట్టణం: మున్సిపల్ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లిలో జానకీరామరాజు, భీమిలిలో వెంకట్రావు,నర్సీపట్నంలో గణేశ్, యలమంచిలిలో నాగేశ్వరరావు నేతృత్వంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తూర్పుగోదావరి: కొత్తపేటలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజమండ్రి రూరల్లో ఆకుల వీర్రాజు, జగ్గంపేటలో రఘురాం నేతృత్వంలో ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. పెద్దాపురం, సామర్లకోట, గోపవరం ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు.

పశ్చిమగోదావరి: పాలకొల్లు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఎమ్మెల్సీ శేషుబాబు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెనుగొండలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఆకివీడులో సుందరరామానాయుడు ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ధర్నా కార్యక్రమాలు చేపట్టారు.

కృష్ణాజిల్లా: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.  విజయవాడ గాంధీనగర్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ నాయకులు పార్థసారధి, గౌతంరెడ్డి నేతృత్వంలో ఖాళీ బిందెలతో ధర్నా, ర్యాలీ నిర్వహించారు. మైలవరంలో మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, పెడన, గూడూరులో ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు.

గుంటూరు: గుంటూరు జిల్లా మాచర్ల మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పెద్దసంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు. ప్రజలు తాము ఎదుర్కోంటున్న సమస్యలను రైతులు, మహిళలు వైఎస్ జగన్కు వివరించారు.చంద్రబాబు వైఖరికి వ్యతిరేకంగా మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బాపట్లలో ఎమ్మెల్యే కోనరఘుపతి నేతృత్వంలో ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన చేశారు. మంగళగిరిలో చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్యే ఆర్కేతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ప్రకాశం: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు, ఒంగోలు కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తత నెలకొంది. యర్రగొండపాలెం, పుల్లలచెరువు ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ధర్నా, ర్యాలీ నిర్వహించారు.

నెల్లూరు: కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు, నెల్లూరు జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్థన్రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

చిత్తూరు: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మదనపల్లెలో ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగారుపాలెంలో ఎమ్మెల్యే డా.సునీల్ కుమార్, పుంగనూరులో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  ఆధ్వర్వంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు.

అనంతపురం: కరువుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని మండల కేంద్రాల్లో సోమవారం నిరసనలకు దిగింది. కూడేరు ఎమ్మెల్వో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతపురం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

కర్నూలు: కల్లూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బనగానపల్లె, పత్తికొండ, ఎమ్మిగనూరు ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నాయకుల నేతృత్వంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నందికొట్టూరులో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement