సస్పెండైన వారికి మద్దతుగా నల్లబ్యాడ్జీలతో హాజరైన పీఆర్ ఉద్యోగులు
- ఆందోళన విరమించిన పీఆర్ ఉద్యోగులు
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లా పరిషత్ ఏడుగురు ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్ ఉత్తర్వులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్ గురువారం తెలిపారు. జిల్లా పరిషత్ ఏఓ విచారణ రిపోర్టు ఆధారంగా వారిపై విధించిన ఉత్తర్వులను రద్దు పరుస్తామని ఉద్యోగులకు హమీ ఇచ్చారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించారని ఎడుగురు ఉద్యోగలను విధుల నుంచి ఇటీవల సస్పెండ్ చేయగా..పంచాయతీజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో హాజరై..పెన్‌డౌన్ నిర్వహించారు. దీంతో జెడ్పీ సీఈఓ నాగేశ్ పీఆర్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నడింపల్లి వెంకటపతిరాజు ఆధ్వర్యంలో ఉద్యోగులతో చర్చించారు. ఏడుగురు ఉద్యోగులను ఒకేసారి సస్పెండ్ చేయడం వల్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని, మానవతా దృక్పథంతో రద్దు చేయాలని కోరారు. స్పందించిన సీఈఓ సస్పెన్షన్‌ను రద్దు చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెల రవీంద్రప్రసాద్, అసోసియేట్ అధ్యక్షులు బనిగండ్లపాటి భానుమూర్తి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పాషా, జిల్లా కోశాధికారి వై.సురేందర్‌రెడ్డి, జిల్లా కౌన్సిలర్లు అంకుబాబు, రాజేష్, వెంకటేశ్వరరావు, గౌసుద్దీన్, శ్రీనివాస్‌రావు, సర్పరాజ్, వాణిశ్రీ, శ్రీనివాసరావు, అంబిక, రవి, కిశోర్‌రెడ్డి, శారద, విజయలక్ష్మి, రమణ, శంకర్, సాంబశివారెడ్డి, కిశోర్, గంగా భవాని, పద్మ, సుజాత, రామకృష్ణరెడ్డి పాల్గొన్నారు.