ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 2000 టీచర్ పోస్టులు | 2000 teacher posts in Army Public Schools | Sakshi
Sakshi News home page

ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 2000 టీచర్ పోస్టులు

Published Tue, Aug 30 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 2000 టీచర్ పోస్టులు

ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 2000 టీచర్ పోస్టులు

 దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలటరీ స్టేషన్ల పరిధిలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో (ఏపీఎస్‌లలో) ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన మొదటి దశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ‘కంబైన్డ్ సెలెక్షన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఎస్‌ఈ)-2016’గా పేర్కొనే ఈ పరీక్ష నిర్వహణకు ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్)ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా 137 ఏపీఎస్‌లు ఉండగా వాటిలో సుమారు 8 వేల మంది టీచర్లు పని చేస్తున్నారు. అయితే వివిధ  కారణాల రీత్యా ఈ పాఠశాలల్లో ఏటా దాదాపు రెండువేల ఖాళీలు ఏర్పడుతున్నాయి.  వీటి భర్తీకి ఆయా పాఠశాలలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లను విడుదల చేస్తాయి.
 
  రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మూడు ఆర్మీ పబ్లిక్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో రెండు సికింద్రాబాద్ (రామకృష్ణాపురం, బొల్లారం)లో, ఒకటి గోల్కొండలో ఉన్నాయి. ఏపీఎస్ టీచర్ల నియామక ప్రక్రియలో రెండో దశ (ఇంటర్వ్యూ), మూడో దశ (ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ) పరీక్షలను ఆయా పాఠశాలలే నిర్వహిస్తాయి. స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారినే రెండు, మూడు దశలకు అనుమతిస్తారు. కాగా స్క్రీనింగ్ పరీక్ష రాసేందుకు టెట్/సీటెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరికాదు.
 
 టీచర్ల కేటగిరీలు
 ఏపీఎస్‌లలో 17 సబ్జెక్టులను బోధించేందుకు మూడు కేటగిరీల టీచర్లను నియమిస్తారు.
 1. పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్)  
 2. టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్)
 3. పీఆర్‌టీ (ప్రైమరీ టీచర్)
 
 వేతనం: బేసిక్, గ్రేడ్‌పే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో ఉంటాయి. అలవెన్సులను పాఠశాల యాజమాన్యాలే నిర్ణయిస్తాయి.
 
 ఎంపిక విధానం: ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్ల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది.
 స్టేజ్-1: స్క్రీనింగ్ ఎగ్జామ్‌ను ఏటా నవంబర్ చివరి ఆదివారం/డిసెంబర్ మొదటి ఆదివారం నిర్వహిస్తారు. ఉత్తీర్ణులకు స్కోర్ కార్డ్ ఇస్తారు. స్కోర్ కార్‌‌డ అందుకున్న మూడేళ్లలోపు ఏదైనా సీబీఎస్‌ఈ స్కూల్‌లో టీచర్‌గా చేరితే ఈ స్కోర్ కార్‌‌డకు లైఫ్ టైమ్ (జీవిత కాల) వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పరీక్షను తాజా అభ్యర్థులతోపాటు కింద పేర్కొన్నవారు కూడా రాయొచ్చు.

 1.గత స్కోర్లను మెరుగుపరచుకోవాలనుకునేవారు
 2.అప్‌గ్రెడేషన్ కోరుకునేవారు. అంటే గతంలో టీజీటీ స్కోర్ కార్డ్ ఉన్నవారు ఇప్పుడు పీజీటీ స్కోర్ కార్డు కోసం ప్రయత్నించడం.
 
 స్క్రీనింగ్ పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్ష పీజీటీ/టీజీటీలకు; పీఆర్‌టీలకు విడివిడిగా ఉంటుంది. పీజీటీ/టీజీటీలకు నిర్వహించే పరీక్షలో రెండు పార్ట్‌లు ఉంటాయి. పార్ట్-ఏ, పార్ట్-బీలకు కలిపి 180 నిమిషాల (3 గంటల) వ్యవధిలో 180 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులను గుర్తించాలి. పార్ట్-ఏలో 90 ప్రశ్నలు జనరల్ అవేర్‌నెస్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్, మెథడాలజీ నుంచి; పార్ట్-బీలో 90 ప్రశ్నలు సంబంధిత సబ్జెక్ట్ నుంచి వస్తాయి. ఉత్తీర్ణత సాధించేందుకు ప్రతి పార్ట్‌లోనూ కనీసం 50 శాతం మార్కులు పొందాలి. పీఆర్‌టీలకు నిర్వహించే పరీక్షలో పార్ట్-ఏ మాత్రమే ఉంటుంది. ఇందులో 90 నిమిషాల వ్యవధిలో 90 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ప్రశ్నలు జనరల్ అవేర్‌నెస్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్, మెథడాలజీ నుంచి వస్తాయి. నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని అమలు చేస్తారు. ఒక తప్పు సమాధానానికి పావు (0.25) మార్కు కోత విధిస్తారు. స్కోర్‌ను 100కు నార్మలైజ్ చేస్తారు.     
 
 స్టేజ్-2: ఇంటర్వ్యూ
 స్టేజ్-3: ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ఎఫిషియెన్సీ. లాంగ్వేజ్ టీచర్లకు ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్‌తోపాటు రాత పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ఎస్సేకు 15, కాంప్రెహెన్షన్‌కు 15 మార్కులు ఉంటాయి.
 
 వయసు: 2017, ఏప్రిల్ 1 నాటికి 40 ఏళ్ల లోపు ఉండాలి. గత 10 ఏళ్లలో 5 ఏళ్ల బోధన అనుభవం గల వారికి 57 ఏళ్లలోపు ఉండాలి.
 
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
 దరఖాస్తు రుసుం: రూ.600లను ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
 పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, తెలంగాణలో సికింద్రాబాద్.
 
 ముఖ్య తేదీలు:
 1.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2016, సెప్టెంబర్ 13 సా. 5 గంటల వరకు మాత్రమే.
 2.మాక్ టెస్టులు  http://aps-csb.inలో అందుబాటులో ఉండే తేది: అక్టోబర్ 10 తర్వాత
 3.హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: నవంబర్ 15 తర్వాత
 4.పరీక్ష తేది: నవంబర్ 26 లేదా 27
 5.ఫలితాల ప్రకటన: డిసెంబర్ 15
 ఫాలో అప్: పరీక్షలో ఉత్తీర్ణులైనవారు ఆర్మీ పాఠశాలల్లోని టీచర్ పోస్టుల కోసం ఏడబ్ల్యూఈఎస్ వెబ్‌సైట్‌ను చూస్తుండాలి. టీచర్ పోస్టులకు ప్రకటనలు వెలువడిన అనంతరం దరఖాస్తులను 2017, జనవరి 20లోపు ఆయా స్కూళ్లకు పంపాలి.
 
 వెబ్‌సైట్లు
 1.ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు, ఇతర వివరాలకు: http://aps-csb.in        
 2.ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ వెబ్‌సైట్: www.awesindia.com        
 
 విద్యార్హతలు
 ఈ మూడు కేటగిరీల టీచర్లకు ఉండాల్సిన కనీస విద్య, వృత్తి సంబంధ అర్హతలు, మార్కుల శాతాలు పట్టిక రూపంలో..
 
 గమనిక: టీజీటీ/పీజీటీలను రెగ్యులర్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించేందుకు టెట్/సీటెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. అయితే ఇతర అన్ని అర్హతలు ఉండి, టెట్/సీటెట్ స్కోర్ లేని వారిని ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించే వరకు ‘అడ్‌హక్’ ప్రాతిపదికన నియమిస్తారు.
 

Advertisement
Advertisement