దేశవ్యాప్తంగా కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలో ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ 2019కు నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు చూస్తోంది.
పోస్టుల సంఖ్య: 8000 (టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ).
ఎంపిక: ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్టు, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు ఆయా స్కూల్స్ ఇచ్చే ప్రకటనకు అనుగుణంగా తదుపరి నియామక ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ/రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లకు మించరాదు. ఐదేళ్ల బోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 57 ఏళ్లు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: 22.09.2019.
దరఖాస్తు ఫీజు: రూ.500
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్
ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్టు తేదీ: అక్టోబర్ 19,20, 2019
ఫలితాల వెల్లడి: 30.10.2019
వెబ్‌సైట్: http://aps-csb.in
Comments
Please login to add a commentAdd a comment