బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో | 500 PO posts in Bank of Maharashtra | Sakshi
Sakshi News home page

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో

Published Wed, Aug 17 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో

500 పీవో పోస్టులు
 ప్రధాన జాతీయ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ (జేఎంజీఎస్)-1 ప్రొబేషనరీ ఆఫీసర్ల (పీవోల) నియామకానికి అర్హుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన వారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సులో ఏడాది పాటు (మూడు నెలల ఇంటర్న్‌షిప్‌తో కలిపి) శిక్షణ ఇచ్చి అనంతరం పీవోలుగా నియమిస్తారు. ట్రైనింగ్‌ను సొంత ఖర్చులతో పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ బ్రాంచ్‌ల్లో మూడు నెలల పాటు నిర్వహించే ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ. 20,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌పై స్పెషల్ ఫోకస్..
 
 ఖాళీల వివరాలు: పోస్టుల సంఖ్య 500. ఇందులో ఎస్సీ-50, ఎస్టీ-37, ఓబీసీ-135, జనరల్-253. మొత్తం మీద 15 పోస్టులను దివ్యాంగులకు రిజర్వ్ చేశారు.
 
  వేతనం: నెలకు రూ.23,700-42020 పేస్కేల్‌తోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ వంటి అలవెన్సులన్నీ కలుపుకొని వార్షిక వేతనం రూ.8 లక్షల 50 వేలు చెల్లిస్తారు.
 
  విద్యార్హత: 2016, జూలై 1 నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
 
  వయో పరిమితి: 2016, జూలై 1 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్టం 30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
 
  ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ఆన్‌లైన్ టెస్ట్ (రాత పరీక్ష): 120 నిమిషాల (రెండు గంటల) వ్యవధిలో జరిగే ఈ పరీక్షలో 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు జవాబులను గుర్తించాలి. ఒక ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించారు. ఈ ప్రశ్నలు నాలుగు విభాగాల నుంచి వస్తాయి. ఇంగ్లిష్ మినహా ఇతర విభాగాల ప్రశ్నలు ఇంగ్లిష్‌తో పాటు హిందీలోనూ ఉంటాయి. ప్రతి అభ్యర్థి ప్రతి విభాగంలోనూ, మొత్తం మీద కనీస మార్కులు సాధించాలి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రశ్నల సంఖ్య, మార్కుల వివరాలు..
 
 క్ర.సం.    సబ్జెక్టు    ప్రశ్నల సంఖ్య     మార్కులు
 1.    రీజనింగ్ ఎబిలిటీ    50    50
 2.     క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్    50    50
 3.    ఇంగ్లిష్ లాంగ్వేజ్    50    50
 4.    జనరల్ అవేర్‌నెస్    50    50
     (బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యత)
 మొత్తం        200    200
 
  ఇంటర్వ్యూ: రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారిని పోస్టుల సంఖ్యను బట్టి ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తర్వాత ట్రైనింగ్‌కు ఎంపిక చేసేందుకు రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
 
 శిక్షణ రుసుం: పీజీడీబీఎఫ్ కోర్సు శిక్షణకు సుమారు రూ.3.14-3.50 లక్షలు ఖర్చవుతుంది. లాడ్జింగ్, బోర్డింగ్, కోర్సు మెటీరియల్, ల్యాబ్ చార్జీలు/ప్రాక్టికల్స్, వైద్య సేవలు, ఎగ్జామ్ ఫీజు, సర్టిఫికెట్ ఫీజు అన్నీ ఇందులో ఉన్నాయి.
 
  శిక్షణ కేంద్రాలు: రెండు చోట్ల శిక్షణ ఇస్తారు. అభ్యర్థిని ఏ క్యాంపస్‌కు పంపాలనేది బ్యాంక్ నిర్ణయిస్తుంది.
 
 1. ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ, నీమ్‌రానా, ఎన్‌హెచ్-8, ఢిల్లీ-జైపూర్ హైవే, అల్వార్ జిల్లా, రాజస్థాన్, పిన్‌కోడ్ నంబర్: 301705
 
 2. మణిపాల్ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్, జైపూర్ దెహ్మి కలాన్, నియర్ జీవీకే టోల్ ప్లాజా, జైపూర్-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ హైవే, జైపూర్, రాజస్థాన్, పిన్‌కోడ్ నంబర్: 303007.
 
  రుణ సౌకర్యం: కోర్సు ఫీజును చెల్లించేందుకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. ఎడ్యుకేషన్ లోన్‌ను మంజూరు చేస్తుంది. ఈ మొత్తాన్ని శిక్షణ పూర్తయిన తర్వాత 60 వాయిదాల్లో (60 నెలల-ఐదేళ్ల వ్యవధి లోపు) చెల్లించాల్సి ఉంటుంది.
 
 పరీక్ష కేంద్రం: ఆన్‌లైన్ పరీక్షను తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి.   
 
 దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.100; ఇతరులకు రూ.600.
 దరఖాస్తుకు చివరి తేది: 2016 సెప్టెంబర్ 6
 వెబ్‌సైట్: దరఖాస్తు, ఇతర వివరాలకు www.bankofmaharashtra.in
చూడొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement