బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఫలితాలు బాగున్నాయ్‌ | Bank of Maharashtra reports Q2 net profit of Rs 919. 8 crore, up 72percent YoY | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఫలితాలు బాగున్నాయ్‌

Published Thu, Oct 19 2023 5:04 AM | Last Updated on Thu, Oct 19 2023 5:04 AM

Bank of Maharashtra reports Q2 net profit of Rs 919. 8 crore, up 72percent YoY - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర  2023–24 రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ2 లో నికర లాభం 72% జంప్‌చేసి రూ. 920 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడం, మొండి రుణాలు తగ్గడం ఇందుకు సహకరించింది.

నిర్వహణ లాభం 31% బలపడి రూ. 1,920 కోట్లకు చేరినట్లు బ్యాంక్‌ ఎండీ ఏఎస్‌ రాజీవ్‌ పేర్కొన్నారు. బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ. 4,317 కోట్ల నుంచి రూ. 5,796 కోట్లకు పుంజుకుంది.  స్థూల మొండిబకాయిలు 3.4% నుంచి 2.19%కి తగ్గాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement