
న్యూఢిల్లీ: మ్యూజిక్ లేబుల్ దిగ్గజం సారేగామా ఇండియా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్)లో నికర లాభం 17 శాతం ఎగసి దాదాపు రూ. 34 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 29 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 34 శాతంపైగా జంప్‌చేసి రూ. 145 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో కేవలం రూ. 108 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ వ్యయాలు సైతం క్యూ2లో 43 శాతం పెరిగి 105 కోట్లయ్యాయి. దేశీయంగా ఊపందుకున్న డిజిటైజేషన్, లాక్‌డౌన్ తదితర అంశాలు కంటెంట్ భారీ వినియోగానికి కారణమైనట్లు ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ పేర్కొంది. దీర్ఘకాలంలోనూ ఈ ట్రెండ్ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడింది.
ఫలితాల విడుదల నేపథ్యంలో సారేగామా ఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 4,216 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment