కాంపిటీటివ్ కౌన్సెలింగ్: అసిస్టెంట్ లోకోపైలట్ పరీక్షల్లో నాన్ టెక్నికల్ విభాగం
అసిస్టెంట్ లోకోపైలట్ పరీక్షల్లో నాన్ టెక్నికల్ విభాగంలో ఏయే అంశాలు ఉంటాయి?
ఎన్ని ప్రశ్నలు అడుగుతారు? రిఫరెన్‌స బుక్స్‌ను సూచించండి?
- బి.రాజేంద్ర కుమార్, ఖైరతాబాద్
అసిస్టెంట్ లోకోపైలట్, టెక్నీషియన్‌స ఉద్యోగాల పరీక్షల్లో టెక్నికల్ విభాగాల (మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బేసిక్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ)తోపాటు నాన్ టెక్నికల్ విభాగాల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. నాన్ టెక్నికల్ విభాగంలో భాగంగా జనరల్ అవేర్‌నెస్ (25 మార్కులు), అర్థమెటిక్ (20 మార్కులు), రీజనింగ్ (10 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్‌స (5 మార్కులు), జనరల్ సైన్‌స (30 మార్కులు)ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ అన్ని అంశాల నుంచి 90 ప్రశ్నల వరకు వస్తాయి. జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా కరెంట్ అఫైర్‌స, వ్యక్తులు-నియామకాలు-అవార్డులు, క్రీడలు, భారత స్వాతంత్య్రోద్యమం మొదలైన అంశాలను బాగా చదవాలి.
అర్థమెటిక్‌లో భాగంగా సంఖ్యలు, గసాభా, కసాగు, సమీకరణాలు, వయస్సు, నిష్పత్తి, అనుపాతం, భాగస్వామ్యం, శాతాలు, లాభ-నష్టాలు, సరళ వడ్డీ, చక్రవడ్డీ, కాలం-పని, కాలం-దూరం, వైశాల్యం, ఘనపరిమాణాలు వంటివాటిపై ప్రశ్నలడుగుతారు. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి మ్యాథ్‌స పాఠ్యపుస్తకాలను సాధన చేస్తే ఈ విభాగంలో అధిక మార్కులు సాధించొచ్చు. రీజనింగ్‌లో భాగంగా కేలండర్స్, క్లాక్స్, కోడింగ్-డీకోడింగ్, అనాలజీ, ఆల్ఫాబెట్ లెటర్ సిరీస్, డెరైక్షన్స్, రక్త సంబంధాలు, సిరీస్, ఎనలిటికల్ రీజనింగ్, లాజికల్ వెన్ చిత్రాలు, వెర్బల్ - నాన్ వెర్బల్ రీజనింగ్ వంటివాటిపై ప్రశ్నలు ఇస్తారు. జనరల్ సైన్‌సలో భాగంగా మానవుడు-రక్తవర్గాలు, మానవుడు - వివిధ వ్యాధులు, శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు, పరిశోధనలు - బహుమతులు, కాంతి మొదలైనవాటిపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
రిఫరెన్‌స బుక్స్
1. అర్థమెటిక్: ఆర్.ఎస్. అగర్వాల్, గులాటి
2. రీజనింగ్: ఆర్.ఎస్.అగర్వాల్ (వెర్బల్ - నాన్ వెర్బల్)
3. ఆరు నుంచి పదో తరగతి వరకు మ్యాథ్‌స, సైన్‌స పాఠ్యపుస్తకాలు
మాదిరి ప్రశ్నలు:
1. అ, ఆ లు ఇరువురు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. ఆ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తే, అ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు?
1) 30 రోజులు 2) 25 రోజులు
3) 20 రోజులు 4) 18 రోజులు
సమాధానం: 1
2. ఒక సమబాహు త్రిభుజం భుజం 12 సెం.మీ. అయితే దాని వైశాల్యం ఎంత?
1) 72cm2 2) 36Ö3 cm2
3) 72Ö2 cm 2 4) 72Ö3 cm2
సమాధానం: 2
3. ఒక పరిభాషలో POWDERను ONVCDQ గా రాశారు. BELONG ను అదే పరిభాషలో ఏ విధంగా రాస్తారు?
1) ADKNMF 2) CFMPOH
3) AFKPNH 4) CDMNOF
సమాధానం: 1
నేను 2014 సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. గతేడాది సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2 ఎలా వచ్చిందో విశ్లేషణ ఇవ్వండి?
-పి.స్వాతి, దిల్‌సుఖ్‌నగర్
గతేడాది మే 26న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 21,600 మందికిపైగా ఈ పరీక్షకు హాజరయ్యారు. పేపర్-2(ఆప్టిట్యూడ్ టెస్ట్) విషయానికి వస్తే.. మొత్తం 80 ప్రశ్నలు, 200 మార్కులకు అడిగారు. రీడింగ్ కాంప్రహెన్షన్ పరిధిని తగ్గించారు. బేసిక్ న్యూమరసీ విభాగం నుంచి ప్రశ్నలు పెంచారు. మూడు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేరాగ్రాఫ్‌లు అడిగారు. వీటికింద 8 ప్రశ్నలు వచ్చాయి. ఒకసారి క్షుణ్నంగా చదివితే చాలు సమాధానాలు గుర్తించగలిగేలా ఈ ప్రశ్నలు ఉన్నాయి. డె సిషన్ మేకింగ్ విభాగం నుంచి ఆరు ప్రశ్నలు వచ్చాయి. 2012లో ఈ విభాగం నుంచి 7 ప్రశ్నలు వచ్చాయి. 2012లో నాన్ వెర్బల్ రీజనింగ్‌పై కొన్ని ప్రశ్నలు వచ్చాయి. 2013లో ఈ విభాగం నుంచి ఒక్క ప్రశ్న కూడా రాలేదు. గతేడాది రీడింగ్ కాంప్రహెన్షన్‌పై 23 ప్రశ్నలు ఇచ్చారు. 2012లో ఈ విభాగం నుంచి 30కిపైగా ప్రశ్నలు వచ్చాయి. మొత్తంగా చూస్తే గతేడాది పేపర్-2లో రీడింగ్ కాంప్రహెన్షన్ పరిధిని తగ్గించి బేసిక్ న్యూమరసీ విభాగం ప్రశ్నలు పెంచారు.
ఇన్‌పుట్స్: బండ రవిపాల్‌రెడ్డి,
సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
ఇన్‌పుట్స్: బి.ఉపేంద్ర,
డెరైక్టర్, క్యాంపస్ స్టడీ సర్కిల్,
హైదరాబాద్