భూగోళశాస్త్రం
1. నెప్ట్యూన్ గ్రహాన్ని ఇలా కూడా పిలుస్తారు?
ఎ) ఇంద్రుడు బి) యముడు
సి) కుజుడు డి) వరుణుడు
2. చాంబర్లీన్ ఎవరితో కలిసి ‘గ్రహకాల పరికల్పన’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు?
ఎ) మౌల్టన్ బి) ఇమాన్యుల్‌కాంట్
సి) లాప్లేస్ డి) లిమిటిమర్
3. ఏ సంవత్సరం నుంచి గ్రీనిచ్ రేఖాంశాన్ని (0 డిగ్రీ రేఖాంశం) ప్రధాన కాల ప్రామాణిక రేఖాంశంగా
గుర్తిస్తున్నారు?
ఎ) 1883 బి) 1884
సి) 1885 డి) 1886
4. గాలి ప్రవాహం అంటే?
ఎ) భూమి ఉపరితలంపై క్షితిజ సమాంతరంగా పయనించే గాలి
బి) భూమి ఉపరితలంపై ఉన్న గాలి భూవికిరణం వల్ల వేడెక్కి పైకి పయనించడం
సి) భూ ఉపరితలంపై ఉన్న గాలి సౌర వికిరణం ద్వారా ప్రభావితం చెంది అల్పపీడనం వైపు ప్రయాణించడం
డి) భూ ఉపరితలంపై నిటారుగా కదిలే గాలి
5. నార్కోండం ఆగ్ని పర్వతాన్ని కింది ఏ ఆగ్ని పర్వతంతో పోల్చవచ్చు?
ఎ) కిలిమింజారో బి)వెసూవియస్
సి) ఫ్యూజీయామా డి) క్రాకటోవా
6. ఒకాపిస్ (Okapis) అనేది?
ఎ) ఆస్ట్రేలియా తీరప్రాంతంలోని ప్రజలు ఆహారంగా ఉపయోగించే చేపలు
బి) దక్షిణ అమెరికా పర్వత ప్రాంతంలో పెరిగే వృక్షం. దీంతో సంగీత వాయిద్యం తయారు చేస్తారు.
సి) ఆఫ్రికా ఖండంలో నివసించే జంతువు
డి) ఆసియా ఖండం ఉత్తర భాగాన నివసించే పక్షి
7. దట్టమైన రుతుపవన వర్షారణ్యాలు పెరిగే ప్రాంతాలలో వర్షపాతం ఎంత ఉంటుంది?
ఎ) 100 సెం.మీ.పైన
బి) 100-200 సెం.మీ. మధ్య
సి) 200 సెం.మీ.పైన డి) 300 సెం.మీ.పైన
8. భూమీ మీద ఒక అక్షాంశానికి మరొక అక్షాంశానికి మధ్య దూరం?
ఎ) 156 కి.మీ. బి) 111 కి.మీ.
సి) 128 కి.మీ. డి) 108 కి.మీ.
9. ఆసియా ఖండ ఉనికి?
ఎ) 180-900 ఉత్తర అక్షాంశ రేఖలు, 200-1800 తూర్పు, పశ్చిమ రేఖాంశాల మధ్య
బి) 100-780 ఉత్తర అక్షాంశరేఖలు, 200 తూర్పు రేఖాంశం-1800 పశ్చిమ రేఖాంశాల మధ్య
సి) 100-800 ఉత్తర అక్షాంశ రేఖలు, 280 తూర్పు రేఖాంశం-1700 పశ్చిమ రేఖాంశాల మధ్య
డి) ఏదీకాదు
10. సహారా, కలహారి ఎడారులలో, కాంగో నదీ పరివాహక ప్రాంతంలో నివసించే ఆటవిక జాతులు వరుసగా?
ఎ) బిడౌన్లు, బుష్‌మెన్లు, పిగ్మీలు
బి) బిడౌన్లు, హట్టేన్‌టాట్లు, బుష్‌మెన్లు
సి) హట్టెన్‌టాట్లు, పిగ్మీలు, బిడౌన్లు
డి) పిగ్మీలు, బిడౌన్లు, హట్టెన్‌టాట్లు
11. వాటికన్ సిటీ వైశాల్యం?
ఎ) 1000 చ.కి.మీ. బి) 100 చ.కి.మీ.
సి) 76 చ.కి.మీ. డి) 44 చ.కి.మీ.
12. కింది వాటిలో యూరప్-అమెరికాల మధ్య వాయు మార్గం కానిది?
ఎ) లండన్-లిస్బన్-డాకర్-సటాల్-సాల్వడార్-బ్రెజిల్
బి) స్టాక్‌హోమ్-ఓస్లో-ఒట్ట్టావా/న్యూయార్క్
సి) ప్యారిస్-లిస్బన్-బర్ముడా-న్యూయార్క్
డి) లండన్-ఆమ్‌స్టర్‌డామ్-ఓస్లో-మార్సెల్లస్-ఏథెన్స్
13. పపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణులు?
ఎ) హిమాలయాలు బి) ఆండిస్
సి) ఆమెజాన్ డి) పశ్చిమ కార్డిలెరాస్
14. బొగ్గుకు మూలాధారం వృక్షాలు. ఇవి దశల వారీగా బొగ్గుగా రూపాంతరం చెందుతాయి. ఆ దశల క్రమం?
ఎ) కర్ణమ-పీట్-బొగ్గు బి) కాక్వినా-బొగ్గు-పీట్
సి) సుద్ద-పీట్-బొగ్గు డి) భిత్తి-పీట్-బొగ్గు
15. కాశ్మీర్‌లోయ ఎలాంటి మైదానం?
ఎ) స్క్రాల్ మైదానం బి) లోయస్ మైదానం
సి) సరోవర మైదానం
డి) గిరిపద ఒండ్రుమట్టి మైదానం
16. అతి తక్కువ మందం గల ఆవరణం?
ఎ) ఎక్సో బి) స్ట్రాటో
సి) థర్మో డి) ట్రోపో
17. చినూక్ పవనాలు ఎక్కడ వీస్తాయి?
ఎ) ఆసియా బి) అమెరికా
సి) ఆస్ట్రేలియా డి) ఆఫ్రికా
18. హంగేరీలోని గడ్డి భూములను ఏమని పిలుస్తారు?
ఎ) వెల్డ్‌లు బి) సెడార్‌లు
సి) పూజ్టలు డి) డౌన్‌లు
19. ‘గ్రాండ్‌బ్యాంక్’ ఉన్న స్థానం?
ఎ) ఉత్తర అట్లాంటిక్ బి) దక్షిణ అట్లాంటిక్
సి) వాయవ్య అట్లాంటిక్
డి) ఈశాన్య అట్లాంటిక్
20. కింది వాటిలో స్థూలమైన స్కేలు గల మాన చిత్రం?
ఎ) ఆంధ్రప్రదేశ్ మాన చిత్రం
బి) భారతదేశ మాన చిత్రం
సి) ఢిల్లీ నగర మాన చిత్రం
డి) హైదరాబాద్ జిల్లా మాన చిత్రం
21. షార్క్ కోరల వల్ల, వేల్స్ ఎముకలతో ఏర్పడే బంక మట్టి?
ఎ) ఎర్ర బంకమన్ను బి) నల్ల బంకమన్ను
సి) నీలి బంకమన్ను డి) పచ్చ బంకమన్ను
22. భూ ప్రాంతాల నుంచి నీరు ఆవిరై వాతావరణంలో కలిసే ప్రక్రియ?
ఎ) అవపాతం బి) భాష్పీభవనం
సి) భాష్పీభవన పూరణం
డి) భాష్పోత్యర్జనం
23. వరదలు సంభవించే పరిస్థితులలో ముందస్తు హెచ్చరికలు చేయడానికి వీలుగా భూజలతలాన్ని కొలిచే సాధనం?
ఎ) ఫైలోమీటర్ బి) నైలోమీటర్
సి) స్టిగ్మామీటర్ డి) స్లైడోమీటర్
24. ‘బగూయియస్ (Baguios)’ వర్షాలు ఎక్కడ కురుస్తాయి?
ఎ) మలేషియా బి) ఇండోనేషియా
సి) న్యూజిలాండ్ డి) ఫిలిప్పీన్స్
25. సునామీలు ఏర్పడడానికి కింది వాటిలో కారణం
ఎ) శక్తిమంతమైన సముద్రాంతర్గత అగ్ని పర్వత ఉద్బీదనం
బి) శక్తిమంతమైన భూకంప ఆధికేంద్రం సముద్ర తీరానికి దగ్గర్లో ఉండడం
సి) సముద్రం లోపల సంభవించిన భారీ భూపాతం
డి) సముద్ర ప్రాంతాన్ని భారీ ఉల్క ఢీకొనడం
26. తెలంగాణ ప్రాంత వైశాల్యం?
ఎ) 1,12,550 చ.కి.మీ. బి) 1,14.800 చ.కి.మీ.
సి) 1,10,700 చ.కి.మీ. డి) 1,15,050 చ.కి.మీ.
27. కింది వాటిలో కృష్ణా నది ఉపనది కానిది?
ఎ) మానేరు బి) పాలేరు
సి) వర్ణ డి) భీమా
28. ఒక బేలు పత్తిలో ఎన్ని కిలోగ్రాముల పత్తి ఉంటుంది?
ఎ) 154 బి) 162
సి) 170 డి) 178
29. భారతదేశంలో అతిలోతైన ఓడరేవు ఎక్కడ ఉంది?
ఎ) ముంబై బి) కోల్‌కతా
సి) తిరువనంతపురం డి) విశాఖపట్నం
30. కింది మృత్తికలలో ఉష్ణమండల చెర్నోజెమ్స్‌గా వేటిని పిలుస్తారు?
ఎ) నల్లరేగడి మృత్తికలు బి) ఒండ్రు మృత్తికలు
సి) లాటరైట్ మృత్తికలు డి) ఎర్ర మృత్తికలు
31. భాక్రానంగల్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యులైన రాష్ట్రాలు?
ఎ) గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్
బి) హర్యానా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్
సి) పంజాబ్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్
డి) పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్
32. సాగర్ సామ్రాట్ ఎక్కడ ఉంది?
ఎ) దిగ్భాయ్ బి) ఆంకలేశ్వర
సి) బాంబేహై డి) హాల్దియా
33. దాలిరాజా, నవ్‌మండి,జోనమ్‌ఘర్‌లు వేటికి ప్రసిద్ధి?
ఎ) బొగ్గు గనులు బి) ముడి ఇనుము గనులు
సి) రాగి ఉత్పత్తి క్షేత్రాలు
డి) సున్నపు రాయి గనులున్న ప్రాంతం
34. 2001-11 మధ్య అత్యధిక అక్షరాస్యత పెరుగుదల ఏ కేంద్రపాలిత ప్రాంతంలో నమోదైంది?
ఎ) ఢిల్లీ బి) పాండిచ్చేరి
సి) డామన్ డయ్యు డి) దాద్రానగర్‌హవేలీ
35. అత్యధికంగా లింగ నిష్పత్తి ఉన్న మొదటి మూడు రాష్ట్రాలు?
ఎ) కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్
బి) కేరళ, కర్ణాటక, గుజరాత్
సి) కేరళ, తమిళనాడు, పంజాబ్
డి) కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర
చరిత్ర
36. పూర్వ చారిత్రక యుగం అంటే?
ఎ) లిఖిత వాజ్ఞ్మయం మొదట ప్రవేశపెట్టిన కాలం
బి) లిఖిత ఆధారాలు లేని కాలం
సి) చారిత్రక యుగ కాల విశేషాలు నమోదైన కాలం
డి) నాగరికత లేని కాలం
37. చక్రాన్ని కనుగొన్న నాగరికత?
ఎ) సింధూ బి) ఈజిప్టు
సి) మెసపటోనియా డి) సుమేరియన్
38. ‘ఆక్టోబరిస్ట్‌లు’ అంటే
ఎ) రష్యాలో జార్‌లు ప్రవేశపెట్టిన సంస్కరణలతో తృప్తి చెందిన వారు
బి) రష్యాలో జార్‌ల నిరంకుశ విధానాలతో వ్యతిరేకించిన ప్రజాస్వామ్యవాదులు
సి) రష్యాలో జార్ రాజుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన అక్టోబర్ విప్లవంలో పాల్గొన్న విప్లవకారులు
డి) రష్యాలో జార్ రాజుల శాసన నిర్మాణాధికారాన్ని ఆహ్వానించి అక్టోబర్ విప్లవానికి దూరంగా ఉన్న సామ్యవాదులు
39. ‘ఇల్‌పాపోలోడి ఇటాలియా’ అనే పత్రికను ప్రారంభించింది?
ఎ) నెపోలియన్ బి) అడాల్ఫ్ హిట్లర్
సి) లెనిన్ డి) ముస్సోలిని
40. జర్మనీ, ఇంగ్లండ్‌పై వైమానిక దాడుల సమయంలో అమెరికా బ్రిటన్‌కు సంపూర్ణ సహాయం అందించడానికి ఆధారం?
ఎ) అట్లాంటిక్ చార్టర్ బి) లాండ్‌లీజ్ బిల్లు
సి) న్యూడీల్ ఒప్పందం డి) నాటో ఏర్పాటు
41.‘ఎథ్మా’ అనే దేవత వేటికి అధిపతి అని వారి నమ్మకం?
ఎ) ఆర్యోగం, ధనసంపాదనకు
బి) అలంకరణ, ఆటలకు
సి) విజయాలు, కళలకు
డి) పంటలు, వర్షాలకు
42. ‘ఇస్లాం’ అంటే?
ఎ) ఆత్మనిగ్రహం బి) ఆత్మసమర్పణం
సి) ఆత్మ నిరాడంబరత డి) ఆత్మ చైతన్యం
43. ‘నలభై స్తంభాల’ భవనం ఎక్కడ ఉంది?
ఎ) ఫతేపూర్‌సిక్రీ బి) అలహాబాద్
సి) కాన్పూర్ డి) లాహోర్
44. ‘యుథోపియా (Utopia)’ అనే గ్రంథ రచయిత?
ఎ) థామస్ మోర్ బి) రఫెల్
సి) ఇరాస్మస్ డి) పెట్రార్క్
45. నిద్రాణవస్థలో ఉన్న తన దేశ ప్రజలను తన సాహిత్య రచనల ద్వారా మేల్కొల్పాలని భావించింది?
ఎ) జోసెఫ్ మజ్జిని బి) కౌంట్‌కపూర్
సి) గారిబాల్డీ డి) నెపోలియన్
46. ‘కామన్‌సెన్స్’ అనే కరపత్రంలో ఉన్న విషయాలు ఎవరి గురించి ప్రస్తావించినవి?
ఎ) ఇంగ్లండ్ రాజుల నిరంకుశత్వ విధానాలు
బి) రోమ్‌లోని క్రైస్తవ మత గురువుల అనైతిక కార్యకలాపాలు
సి) అమెరికా ప్రజల బాధలు
డి) ఫ్రెంచి తాత్విక బోధకుల నిజ స్వరూపం
47. తనకు తాను ప్రజల రాజుగా ప్రకటించుకుంది?
ఎ) చార్లెస్-గీ బి) నెపోలియన్ బోనాపార్టీ
సి) జార్ అలెగ్జాండర్ డి) లూయీఫిలిప్
48. దేవ్‌గఢ్ రాతి ఆలయం ఎక్కడ ఉంది?
ఎ) ఝాన్సీ బి) బెనారస్
సి) సారనాథ్ డి) భోపాల్
49. జైన మత సాహిత్యం ఎక్కువగా ఏ భాషలో ఉంది?
ఎ) తెలుగు బి) తమిళం
సి) కన్నడం డి) మలయాళం
50. ‘రూపదర్శక’ అంటే?
ఎ) రాజాస్థాన భవన అలంకరణను పర్యవేక్షించే వారు
బి) ప్రజల సమాచారాన్ని రాజుకు చేరవేసే వారు
సి) రాజా కోశాగారాన్ని, ఆర్థిక స్థితిగతులను
పరిశీలించేవారు
డి) నాణేలను పరీక్షించే వారు
51. ‘బృహత్కధామంజరి’ గ్రంథకర్త?
ఎ) గుణాడ్యుడు బి) హలుడు
సి) క్షేమేంద్రుడు డి) నాగార్జునుడు
52. అద్వైతాన్ని ప్రవచించింది?
ఎ) రామానుజాచార్యులు
బి) శంకరాచార్యులు
సి) రామానందుడు డి) మద్వాచార్యుడు
53. కింది వారిలో ‘ప్రిన్స్ ఆఫ్ మనీయర్స్’ ఎవరు?
ఎ) అక్బర్ బి) షాజహాన్
సి) మహ్మద్-బిన్-తుగ్లక్
డి) అల్లావుద్దీన్‌ఖిల్జీ
54. ఐహోలు శాసనంలో ఏ రాజు విజయాలను వివరించారు?
ఎ) గౌతమీపుత్ర శాతకర్ణి
బి) రెండో పులకేశి సి) మొదటి శాతకర్ణి
డి) హర్షవర్ధనుడు
55. వాస్కోడిగామా ఇండియాలో ఏ సంవత్సరంలో అడుగు పెట్టాడు?
ఎ) 1493 బి) 1499
సి) 1498 డి) 1496
56. ఇండియాలో మొదటి గవర్నర్ జనరల్?
ఎ) వారన్ హేస్టింగ్స్ బి) విలియం బెంటింక్
సి) కారన్‌వాలీస్ డి) రాబర్ట్ క్లైవ్
57. భారతదేశపు ‘జోన్ ఆఫ్ ఆర్క్’గా ప్రశంస పొందింది?
ఎ) నానాసాహెబ్ బి) శివాజీ
సి) తాంతియాతోపే డి) ఝాన్సీలక్ష్మీభాయ్
58. ‘వేదాలకు తిరిగి వెళ్దాం’ అనేది ఎవరి సందేశం?
ఎ) ఆర్య సమాజం బి) ప్రార్థన సమాజం
సి) బ్రహ్మ సమాజం డి) రామకృష్ణ మిషన్
59. ‘ఆంధ్ర తిలక్’గా ప్రసిద్ధి చెందిన వారు?
ఎ) చిలకమర్తి లక్ష్మి నర్సింహారావు
బి) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
సి) పట్టాభి సీతారామయ్య
డి) అల్లూరి సీతారామరాజు
60. జలియన్‌వాలా బాగ్ ఉదంతం ఏ రోజున జరిగింది?
ఎ) ఏప్రిల్ 9, 1919 బి) ఏప్రిల్ 13, 1919
సి) ఏప్రిల్ 16, 1919 డి) ఏప్రిల్ 6, 1919
61. రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీతోపాటు పాల్గొన్న కాంగ్రెస్ ప్రతినిధి?
ఎ) అంబేద్కర్ బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) దుర్గాభాయ్ దేశ్‌ముఖ్
డి) సరోజిని నాయుడు
62. ‘దివాలా తీస్తున్న బ్యాంక్‌పై భవిష్యత్ తేదీతో ఇచ్చిన చెక్కు’ అని గాంధీ ఏ ప్రతిపాదనలను విమర్శించారు?
ఎ) క్రిప్స్ ప్రతిపాదనలు
బి) వేవేల్ ప్రణాళిక
సి) మౌంట్‌బాటన్ ప్రణాళిక
డి) ఆగస్ట్ ప్రతిపాదనలు
63. ‘ఛలో ఢిల్లీ’ నినాదం ఎవరిది?
ఎ) గాంధీ బి) నెహ్రూ
సి) సుభాష్ చంద్రబోస్ డి) అంబేద్కర్
64. సమాఖ్య న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసిన చట్టం?
ఎ) 1909 మింటో-మార్లే చట్టం
బి) 1935 భారత ప్రభుత్వ చట్టం
సి) 1919 మాంటేగ్ చెమ్స్ ఫర్డ్ చట్టం
డి) 1947 భారత స్వాతంత్య్ర చట్టం
65. లండన్‌లో ‘ఇండియా హౌస్’ను నెలకొల్పింది?
ఎ) లాలాహరదయాల్, దామోదర్ చాపేకర్
బి) శ్యాంజీకృష్ణ వర్మ, లాలాహరదయాల్
సి) దామోదర్ చాపేకర్, దామోదర్ సావర్కర్
డి) శ్యాంజీకృష్ణ వర్మ, దామోదర్ సావర్కర్
సివిక్స్
66. భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రస్తావించిన తేదీ?
ఎ) 1947, ఆగస్ట్ 15 బి) 1949, నవంబర్ 26
సి) 1950, జనవరి 26
డి) 1948, డిసెంబర్ 9
67. కింది వాటిలో సమాఖ్య రాజ్య లక్షణం కానిది?
ఎ) అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వడం
బి) కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ
సి) లిఖిత రాజ్యాంగం
డి) స్వతంత్ర న్యాయస్థానం
68. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వడమనేది రాష్ట్రపతికి గల ఏవిధమైన అధికారం?
ఎ) ఆర్థికాధికారం
బి) న్యాయపాలన అధికారం
సి) కార్యనిర్వహణాధికారం
డి) శాసననిర్మాణాధికారం
69. ఉత్తరప్రదేశ్‌లోని రాజ్యసభ స్థానాల సంఖ్య?
ఎ) 42 బి) 32 సి) 44 డి) 34
70. ఆర్థిక బిల్లును విధానపరిషత్ ఎన్ని రోజులు ఆమోదించకుండా ఆపగలదు?
ఎ) 6 వారాలు బి) 30 రోజులు
సి) 2 వారాలు డి) 45 రోజులు
71.ఙ్ట్చఛగ్రామ సభ సభ్యులకు కావల్సిన అర్హతలకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
ఎ)ఙ్ట్చఛగ్రామ కార్యదర్శి గ్రామ సభలో సభ్యుడు కావచ్చు లేదా కాకపోవచ్చు
బి)ఙ్ట్చఛగ్రామ ఉపసర్పంచ్ గ్రామ సభలో సభ్యుడు కావచ్చు లేదా కాకపోవచ్చు
సి) ఎ, బి డి) ఏదీకాదు
72. కింది వారిలో ప్రత్యక్షంగా ఎన్నిక కాని వారు?
ఎ) ఎంఎల్‌ఏ బి) సర్పంచ్
సి) మేయర్, పురపాలక సంఘ చైర్మన్
డి) జడ్‌పీటీసీ, ఎంపీటీసీ
73. సమానత్వపు హక్కు గురించి వివరిస్తున్న మన రాజ్యాంగంలోని అధికరణలు?
ఎ) 12 నుంచి 16 అధికరణలు
బి) 14 నుంచి 18 అధికరణలు
సి) 13 నుంచి 19 అధికరణలు
డి) 15 నుంచి 21 అధికరణలు
74. 2014లో ముగిసిన లోక్‌సభ ఎన్నోది?
ఎ) 14 బి) 15 సి) 16 డి) 13
75. ‘అందరికీ విద్య’ అనే ప్రభుత్వ పత్రం ఏ సంవత్సరంలో ఆమోదం పొందింది?
ఎ) 1990 బి) 1988
సి) 1992 డి) 1994
76. సార్క్ సభ్య దేశాల సంఖ్య?
ఎ) 6 బి) 7 సి) 8 డి) 9
77. ఐక్యరాజ్యసమితి వాణిజ్యాభివృద్ధి సమావేశం 1964లో ఏ నగరంలో జరిగింది?
ఎ) శాన్‌ఫ్రాన్సిస్కో బి) న్యూయార్క్
సి) పారిస్ డి) జెనీవా
78. స్వేచ్ఛ, సమానత్వాలను వ్యతిరేకించింది?
ఎ) కులవ్యవస్థ బి) ప్రాంతీయతత్వం
సి) మతతత్వం డి) రాజకీయ వ్యవస్థ
79. ఈ దేశం నాది అనే భావనను పటిష్టం చేసేది?
ఎ) ప్రజాస్వామ్యం బి) లౌకికతత్వం
సి) జాతీయ సమైక్యత డి) సామాజిక న్యాయం
80. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి నియామకానికి కావల్సిన అర్హతలో కింది వాటిలో లేనిది?
ఎ) భారతదేశ పౌరుడై ఉండాలి
బి) 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి
సి) కనీసం 10 ఏళ్లపాటు దిగువ కోర్ట్‌లో న్యాయమూర్తిగా పని చేసి ఉండాలి
డి) కనీసం 10 ఏళ్లపాటు హైకోర్ట్‌లో న్యాయవాదిగా పని చేసి ఉండాలి.
ఎకనామిక్స్
81. జాతీయ ఆదాయం అంటే?
ఎ) ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూలజాతీయోత్పత్తి
బి) ఉత్పత్తి కారకాల దృష్ట్యా దేశీయోత్పత్తి
సి) ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర దేశీయోత్పత్తి
డి) ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి
82. తక్కువ ఆదాయ వర్గానికి చెందిన వ్యక్తులు కొనే వస్తువులపై ఎక్కువ పన్ను, ఎక్కువ ఆదాయ వర్గానికి చెందిన వ్యక్తులు కొనే వస్తువులపై తక్కువ పన్ను విధించే విధానాన్ని ఇలా పిలుస్తారు?
ఎ) తిరోగామి పన్ను బి) పురోగామి పన్ను
సి) అనుపాత పన్ను డి) పరోక్ష పన్ను
83. కోశలోటు-వడ్డీ చెల్లింపులు=?
ఎ) రెవెన్యూ లోటు బి) బడ్జెట్ లోటు
సి) ప్రాథమిక లోటు డి) అనువంశిక లోటు
84. బేరరునకు కొంత నిర్ణీత కాలం తర్వాత కొంత నిర్ణీత వడ్డీతో చెల్లిస్తామని వాగ్దానం చేసే కాగితపు పత్రం?
ఎ) చెక్కులు బి) బాండులు
సి) డిబెంచర్లు డి) బ్యాంక్ క్రెడిట్ కార్డులు
85. 3వ పంచవర్ష ప్రణాళికలో ప్రధాన లక్ష్యం?
ఎ) సుస్థిరాభివృద్ధి
బి)సమతౌల్య అభివృద్ధి
సి) సమతౌల్య ప్రాంతీయాభివృద్ధి
డి) సుస్థిర ప్రాంతీయాభివృద్ధి
86. కమాండ్ ఏరియాలో అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్డడానికి కారణం?
ఎ) వరదల నియంత్రణకు
బి) వర్షపు నీరును సాగుకు ఉపయోగపడేట్లు చేయడం
సి) నదీ పరివాహక ప్రాంతాన్ని సారవంతం చేయడం
డి) భారీ మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్ట్‌ల మధ్య దూరాన్ని తగ్గించడం
87. కింది వాటిలో ఉత్పాదక వస్తు పరిశ్రమ?
ఎ) రసాయన బి) ఇంజనీరింగ్
సి) సిమెంట్ డి) ఎరువుల
88. ‘రాజ్యాల సంపద’ అనే గ్రంథ ర చయిత?
ఎ) అమర్త్యసేన్ బి) ఆడమ్ స్మిత్
సి) జేఎమ్ కీన్స్ డి) మార్షల్
89. ఏకస్వామ్యదారు చేసే ధర విచక్షణకు ప్రాతిపదిక?
ఎ) ధరల వ్యాకోచం బి) ఆదాయ వ్యాకోచం
సి) స్థల/మార్కెట్ వ్యాకోచం
డి) డిమాండ్ వ్యాకోచం
90. ఉపాధి హామీ పథకాన్ని మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) మహారాష్ట్ర
సి) గుజరాత్ డి) పంజాబ్
91. కింది వాటిలో కేంద్రప్రభుత్వ ఆదాయ వనరు కానిది?
ఎ) భూమిశిస్తు బి) కస్టమ్స్ డ్యూటీ
సి) కార్పొరేట్ పన్ను డి) ఇన్‌కమ్ ట్యాక్స్
92. కింది వాటిలో దేన్ని కొలవడానికి లారెంజ్ వక్రరేఖను ఉపయోగిస్తారు?
ఎ) మానవాభివృద్ధి సూచిక
బి) ఆదాయ అసమానతలు
సి) దారిద్య్రం లేదా పేదరికం
డి) ద్రవ్యోల్బణం
93. పత్తిని వస్త్రంగా మార్చడం?
ఎ) కాలప్రయోజనం బి) సేవా ప్రయోజనం
సి) స్థల ప్రయోజనం డి) రూప ప్రయోజనం
94. కింది వాటిలో అంతర్గత ఆదాలకు చెందనది?
ఎ) మార్కెటింగ్ ఆదాలు బి) ఆర్థికపరమైన ఆదాలు
సి) పరిశోధన ఆదాలు డి) సాంకేతిక ఆదాలు
95. ‘ఐరన్ లా ఆఫ్ వేజెస్’అని ఏ సిద్ధాంతాన్ని పిలుస్తారు?
ఎ) ఉపాంత ఉత్పాదక సిద్ధాంతం
బి) జీవనాధార వేతన సిద్ధాంతం
సి) వేతన నిధి సిద్ధాంతం
డి) వేతన వశిష్ట యోగ్యతా సిద్ధాంతం
96. జాతీయాదాయాన్ని పంపిణీ కోణం నుంచి లెక్కించే జాతీయాదాయ మదింపు పద్ధతి?
ఎ) ఆదాయ మదింపు బి) ఉత్పత్తి మదింపు
సి) వ్యయాల మదింపు డి) నికర మదింపు
97. కింది వాటిలో రిజర్వ్ బ్యాంక్ విధికానిది?
ఎ) డిపాజిట్ల సేకరణ
బి) ద్రవ్యపరపతి నియంత్రణ
సి) బ్యాంకులకు బ్యాంక్
డి) ప్రభుత్వానికి బ్యాంకర్
98. సంక్షేమ రాజ్యంలో ఆర్థిక వ్యవస్థ విస్తరించిన కొలది ప్రభుత్వ వ్యయం పెరుగుతుందనే ప్రతిపాదన కింది విధంగా ప్రాచుర్యం పొందింది?
ఎ) ఫిషర్ సూత్రం బి) పిగూ సూత్రం
సి) వాగ్నర్ సూత్రం డి) రికార్డో సూత్రం
99. ఒక వేళ ఉత్పత్తి ఫలం ఏకజాతీయ డిగ్రీ ఒకటిగా ఉంటే దాని వ్యాకోచత్వం ఏవిధంగా ఉంటుంది?
ఎ) క్షీణిస్తున్న ప్రతిఫలాలు
బి) పెరుగుతున్న స్థాయి ప్రతిఫలాలు
సి) తగ్గుతున్న స్థాయి ప్రతిఫలాలు
డి) స్థిర ప్రతిఫలాలు
100. 14వ ఆర్థిక సంఘం చైర్మన్?
ఎ) రంగరాజన్ బి) వేణుగోపాల్ రెడ్డి
సి) విజయ్ కేల్కర్
డి) మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా