ప్రాక్టీస్ బిట్స్
1. ఇంచియాన్‌లో ముగిసిన 17వ ఆసియా క్రీడల్లో భారత్ స్థానం?
ఎ) 5 బి) 4 సి) 8 డి) 9
2. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘స్వచ్ఛ్ భారత్’ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) అక్టోబర్ 1 బి) అక్టోబర్ 2
సి) అక్టోబర్ 3 డి) అక్టోబర్ 4
3. 17వ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత హాకీ జట్టు కెప్టెన్?
ఎ) మన్‌దీప్ సింగ్ బి) పీఆర్ శ్రీజేష్
ిసి) సర్దార్ సింగ్ డి) కొతాజిత్ సింగ్
4. 18వ ఆసియా క్రీడలను 2018లో ఏ దేశంలో నిర్వహించనున్నారు?
ఎ) థాయిలాండ్ బి) వియత్నాం
సి) చైనా డి) ఇండోనేషియా
5. 2014 ఏప్రిల్ ఎన్నికల్లో విజయం సాధించిన విక్టర్ ఆర్బన్ ఏ దేశానికి రెండోసారి ప్రధాని అయ్యారు?
ఎ) రుమేనియా బి) హంగేరీ
సి) బల్గేరియా డి) సెర్బియా
6. భారతదేశంలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఏ నగరంలో ప్రారంభమైంది?
ఎ) ముంబై బి) న్యూఢిల్లీ
సి) బెంగళూరు డి) చెన్నై
7. ఐరోపా యూనియన్ దేశాల్లోకెల్లా అతి తక్కువ విస్తీర్ణం గల రాజధాని?
ఎ) విల్నియస్ బి) రీగా
సి) నికోషియా డి) వలెట్టా
8. 61వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో గీతాంజలి థాపా కు ఏ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు లభించింది?
ఎ) షిప్ ఆఫ్ థీసియస్ బి) షాహిద్
సి) లయర్స్ డైస్ డి) నా బంగారు తల్లి
9. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
ఎ) వాంగ్ షిజియాన్ బి) వాంగ్ యిహాన్
సి) లీ జురుయ్ డి) ల్యూ జిన్
10. మిస్ ఇండియా-2014 కిరీటాన్ని ఎవరు కైవ సం చేసుకున్నారు?
ఎ) ఝటాలేఖా మల్హోత్రా బి) గైల్ డి సెల్వా
సి) కోయల్ రాణా డి) నవనీత్ కౌర్
11. ర్యాన్‌బాక్సీ లేబోరేటరీస్‌ను కొనుగోలు చేసిన సంస్థ?
ఎ) శాండోజ్ బి) ఫైజర్
సి) మైలాన్ లేబోరేటరీస్ డి) సన్ ఫార్మాస్యూటికల్
12. చైనా ప్రభుత్వ మద్దతు గల బోవో ఫోరం ఫర్ ఆసియా(బీఎఫ్‌ఏ) బోర్డులో సభ్యత్వం లభించిన భారతీయ పారి
శ్రామిక ప్రముఖుడు?
ఎ) సునీల్ మిట్టల్ బి) రతన్ టాటా
సి) ఎస్.డి.శిబులాల్ డి) నారాయణ మూర్తి
13. 2014-15 ఏడాదికిగాను నాస్‌కామ్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) కె. నటరాజన్ బి) బీవీఆర్ మోహన్ రెడ్డి
సి) ఆర్ చంద్రశేఖరన్ డి) కిరణ్ కార్నిక్
14. విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన భారత క్రికెటర్?
ఎ) విరాట్ కోహ్లి బి) చటేశ్వర్ పుజారా
సి) ఆర్.అశ్విన్ డి) శిఖర్ ధావన్
15. {బిటన్‌లోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన
నైట్ గ్రాండ్ క్రాస్ అవార్డు లభించిన భారతీయ పారిశ్రామికవేత్త?
ఎ) యశ్ బిర్లా బి) రతన్ టాటా
సి) కుమార మంగళం బిర్లా
డి) ముకేశ్ అంబానీ
16. కిందివాటిలో తొలి భారతీయ సినిమా స్కోప్ చిత్రం ఏది?
ఎ) కాగజ్ కే పూల్ బి) ప్యాసా
సి) రాజా హరిశ్చంద్ర డి) మిస్టర్ అండ్ మిసెస్ 55
17. ఇండియన్ సూపర్ లీగ్‌లో సచిన్ టెండూల్కర్ కొనుగోలు చేసిన ఫుట్‌బాల్ జట్టు?
ఎ) ముంబై బి) ఢిల్లీ సి) కొచ్చి డి) గోవా
18. విజ్డెన్ క్రికెటర్స్ అల్మనాక్ ముఖచిత్రంగా వచ్చిన తొలి భారత క్రికెటర్?
ఎ) సునీల్ గవాస్కర్ బి) కపిల్ దేవ్
సి) రాహుల్ ద్రవిడ్ డి) సచిన్ టెండూల్కర్
19. {పస్తుత కేంద్ర ఆర్థిక కార్యదర్శి ?
ఎ) అరవింద్ మాయారాం
బి) సుమిత్ బోస్ సి) రాజీవ్ టక్రూ
డి) రవి మాథుర్
20. భారతీయ అమెరికన్ విజయ్ శేషాద్రికి 2014 పులిట్జర్ పురస్కారం ఏ పుస్తకానికి లభించింది?
ఎ) ద లోలాండ్ బి) త్రీ సెక్షన్స్
సి) వాకింగ్ విత్ కామ్రేడ్స్ డి) నేమ్‌సేక్
21. భారతీయ సంతతికి చెందిన ఎంతమంది రచయితలకు ఇప్పటివరకు పులిట్జర్ పురస్కారం లభించింది?
ఎ) 2 బి) 3 సి) 5 డి) 4
22. ‘ద గోల్డ్‌ఫించ్’ అనే రచనకు కల్పనా సాహిత్యం విభాగంలో ఈ ఏడాది పులిట్జర్ బహుమతికి ఎంపికైన రచయిత్రి?
ఎ) లిడియా డేవిస్ బి) హిలరీ మాంటెల్
సి) ఎలినార్ కాటన్ డి) డోనా టార్ట్
23. 2014 ఏప్రిల్‌లో ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌ను గెలుచుకున్న జట్టు?
ఎ) బరోడా బి) గోవా
సి) ఉత్తరప్రదేశ్ డి) కర్ణాటక
24. సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ను ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1990 బి) 1988 సి) 1992 డి) 1994
25. సెబీ ప్రస్తుత చైర్మన్ ఎవరు?
ఎ) సీబీ భావే బి) ఆర్ దామోదరన్
సి) యు.కె.సిన్హా డి) బీఎల్ జలాన్
26. కమోడిటీ ప్యూచర్ మార్కెట్లను ఏ సంస్థ నియంత్రిస్తుంది?
ఎ) సెబీ బి) ఆర్‌బీఐ
సి) నాబార్డ్ డి) ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్
27. క్యాషియార్కర్ వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది?
ఎ) విటమిన్లు బి) కార్బొహైడ్రేట్లు
సి) ప్రోటీన్లు డి) ఖనిజ లవణాలు
28. కిందివాటిలో ఏ క్షిపణి 700 కి.మీ దూరంలోని లక్ష్యాలను చేధించగలదు?
ఎ) బ్రహ్మోస్ బి) పథ్వీ- 1
సి) అగ్ని- 1 డి) ధనుష్
29. సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) డెరైక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) రాజీవ్ బి) సుభాష్ గోస్వామి
సి) దిలీప్ త్రివేది డి) డీకే పాఠక్
30. ఒక నౌక సముద్రంలో మునిగిపోవడంతో 300 మంది మరణించిన ఘటన ఇటీవల ఏ దేశంలో జరిగింది?
ఎ) మలేషియా బి) దక్షిణ కొరియా
సి) జపాన్ డి) చైనా
31. 61వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఏ చిత్రానికి గాను హన్సల్ మెహతాకు ఉత్తమ దర్శకుడు అవార్డు లభించింది?
ఎ) జాలీ ఎల్‌ఎల్‌బీ బి) షిప్ ఆఫ్ థీసియస్
సి) షాహిద్ డి) గులాబ్ గ్యాంగ్
32. ‘టోకోఫెరాల్’ అని ఏ విటమిన్‌ను అంటారు?
ఎ) సి బి) ఇ సి) ఎ డి) బి 6
33. రైడర్ కప్ ఏ క్రీడకు సంబంధించినది?
ఎ) బ్రిడ్జి బి) పోలో
సి) గోల్ఫ్ డి) బాస్కెట్‌బాల్
34. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ‘నా బంగారు తల్లి’ సినిమా దర్శకుడెవరు?
ఎ) వారెన్ జోసెఫ్ బి) అనూప్ అరవిందన్
సి) శేఖర్ కమ్ముల డి) రాజేష్ టచ్రీవర్
35. 61వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ‘నా బంగారు తల్లి’ చిత్రానికి ఎన్ని అవార్డులు లభించాయి?
ఎ) 2 బి) 1 సి) 3 డి) 4
సమాధానాలు
1) సి; 2) బి; 3) సి; 4) డి; 5) బి;
6) ఎ; 7) డి; 8) సి; 9) ఎ; 10) సి;
11) డి; 12) బి; 13) సి; 14) డి; 15) బి;
16) ఎ; 17) సి; 18) డి; 19) ఎ; 20) బి;
21) సి; 22) డి; 23) ఎ; 24) బి; 25) సి;
26) డి; 27) సి; 28) సి; 29) డి; 30) బి;
31) సి; 32) బి; 33) సి; 34) డి; 35) సి.
పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో రీజనింగ్ విభాగం కోసం ఏవిధంగా ప్రిపేర్ కావాలి?
రీజనింగ్ విభాగంలో.. వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ అనే రెండు అంశాలు ఉంటాయి. ఇందులో వెర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ శాతం ప్రశ్నలు వస్తాయి. వెర్బల్ రీజనింగ్‌లో.. సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, రక్త సంబంధాలు, దిక్కులు, తార్కిక వెన్ చిత్రాలు, సిల్లాయిజమ్ సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. నాన్ వెర్బల్ విభాగం నుంచి సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్స్, మిర్రర్/వాటర్ ఇమేజస్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మాదిరి ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇందులో మంచి స్కోర్ సాధించవచ్చు.
ఈ విభాగంలోని ప్రశ్నలను త్వరగా చేయాలంటే పట్టు సాధించాల్సిన అంశాలు.. ఆంగ్ల అక్షరాలను అ నుంచివరకు, నుంచి అ వరకు వేగంగా చదవగలగాలి. అ నుంచి వరకు సరిగా రాయడం రావాలి. అ నుంచివరకు అక్షరాల స్థాన విలువలు అంటే అ-1, ఆ-2, ...-26 పక్కాగా తెలిసి ఉండాలి. అ నుంచి వరకు అక్షరాల తిరోగమన స్థాన విలువలు అంటే అ-26, ఆ-25, 1 క్షుణ్నంగా నేర్చుకోవాలి. అ నుంచి వరకు అక్షరాల తిరోగమన స్థాన అక్షరాలు అంటే పై పట్టు సాధించాలి. ఆంగ్లంలో అచ్చులు తెలిసి ఉండాలి.
-రవిపాల్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
2018 ఆసియా క్రీడలను ఏ దేశం నిర్వహిస్తుంది ?
Published Thu, Oct 9 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM
Advertisement
Advertisement