1. జిరాప్ ధాల్మియం వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది?
1) నాలుక 2) కండరం
3) కంటిరెప్ప 4) కన్ను
2. కిందివాటిలో ట్రేస్ మూలకం కానిది?
1) మాంగనీస్ 2) సిలీనియం
3) కాల్షియం 4) ఫ్లోరిన్
3. ఒక గ్రాము కొవ్వు ఎన్ని కిలో క్యాలరీల శక్తినిస్తుంది?
1) 9.54 2) 9.45 3) 9.35 4) 9.53
4. కిందివాటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్‌లు, కొవ్వుల జీవక్రియకు ఆవశ్యకమైంది ఏది?
1) రైబోఫ్లోవిన్ 2) నియాిసిన్
3) పెరిడాక్సిన్ 4) థయాలిన్
5. జంతువుల్లో పిండి పదార్థం?
1) లాక్టోస్ 2) సుక్రోజ్
3) సెల్యులోజ్ 4) గ్లైకోజెన్
6. థైరాక్సిన్ హార్మోన్ గురించి సరికానిది?
1) జీవక్రియ రేటును పెంచుతుంది 2) ఎక్కువ ఉష్ణోగ్రత ఉత్పత్తి అయ్యేట్లు
చేస్తుంది
3) కణజాలాలు పెరగడంలో,
{పత్యేకత పొందడంలో తోడ్పడుతుంది
4) రక్తం, ఎముకల్లో ఉండే C2,ఫాస్పేట్‌ల స్థాయిని నియంత్రిస్తుంది
7. ద్విధావిచ్ఛిత్తి జరుపుకునే జంతువు?
1) బ్యాక్టీరియా 2) యూగ్లీనా
3) 1, 2 4) ఏదీకాదు
8. మస్తిష్క వల్కలంలో ఉండే నాడీకణాల సంఖ్య(బిలియన్లలో)?
1) 2.6 2) 3.6 3) 4.6 4) 5.6
9. ఎల్లోజ్వరాన్ని కలిగించే వాహకాలు ఏవి?
1) ఎలుకలు 2) కీటకాలు
3) కోతులు 4) పాములు
10. పెరుగుదలకు కావాల్సిన ఏదో ఒక పదార్థం పాలలో ఉందని 1912లో కనుగొన్నవారు?
1) సర్ ఫ్రాన్సిస్ గాల్టన్
2) హెచ్.జి. హాప్‌కిన్‌స
3) సర్‌క్రిక్ 4) సర్ వాట్సన్
11. వానపాములో స్త్రీ బీజ కోశాలుండే ఖండితాల సంఖ్య?
1) 11 2) 12 3) 13 4) 14
12. ఫోరోఫిరిన్ అణువుల్లో ఉండేవి?
1) హిమోగ్లోబిన్‌లోని గ్లోబిన్ ప్రోటీన్
2) ఐరన్
3) కర్బన అణువులు 4) అన్నీ
13. నాడీ మండలంలో క్రియాత్మక పరిమాణాలు?
1) గ్లియల్ కణాలు 2) సహాయ కణాలు
3) నాడీకణాలు 4) నిస్సెల్ కణాలు
14. శరీరంలోకి ప్రవేశించిన ప్రతిజనకాలను గుర్తించి, ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తూ వ్యాధులను నివారించే W.B.C.?
1) మోనో సైట్‌లు 2) లింఫోసెట్‌లు
3) ఇస్‌నోఫిల్స్ 4) బేసోఫిల్స్
15. జాతీయ గీతం వినగానే భక్తి శ్రద్ధలతో లేచి నిలబడటం ఏ చర్య?
1) నిబంధన రహిత 2) నిబంధన సహిత
3) సంకల్పిత 4) అసంకల్పిత
16. కప్పలో సంతానోత్పత్తి కాలం?
1) జూన్ - ఆగస్టు
2) జూన్ - సెప్టెంబరు
3) జూన్ - అక్టోబరు
4) ఆగస్టు- నవంబరు
17. ఉభయ జీవుల్లో సిరాసరిణి తెరుచుకునే హృదయపు గది?
1) ఎడమ జఠరిక 2) కుడి కర్ణిక
3) కుడి జఠరిక 4) ఎడమ కర్ణిక
18. బాల్య వివాహాల అదుపు చట్టాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో చేసింది?
1) 1972 2) 1974
3) 1976 4) 1978
19. అధిక సంఖ్యలో అండాలు ఒక సమూహాంగా విడుదలవుతాయి. దీన్ని ఏమంటారు?
1) స్పాన్ 2) మిల్ట్
3) స్కలన నాళం 4) పుటికలు
20. ఏ వ్యాధి చికిత్సలో డై ఇథైల్ కార్బ మొజైన్‌ను ఔషధంగా వాడతారు?
1) బోదరోగం 2) కోరింత దగ్గు
3) గవద బిళ్లల వ్యాధి
4) తట్టువ్యాధి
21. శరీరం మొత్తం బరువులో ఎంతశాతం కంటే ఎక్కువ కొవ్వులు ఉన్నవారిని స్థూల కాయులు అంటారు?
1) 10 2) 15 3) 12 4) 20
22. పరిపూర్ణ ప్రోటీన్‌లు అని వేటినంటారు?
1) మాంసం 2) పాలు
3) గుడ్లు 4) అన్నీ
23. పారామిషియంలో సమవిభజన ద్వారా ఏర్పడిన ‘8’ కేంద్రకాల్లో అదృశ్యం అయ్యేవి ఎన్ని?
1) 2 2) 3 3) 4 4) 5
24. ఆడకప్పలో ఉండనివి?
1) స్వరకోశాలు 2) ఏంప్లక్సరి
3) 1, 2 4) ఏదీకాదు
25. అతిముఖ్యమైన వేగస్ కపాలనాడీ ఎన్నోది?
1) ఒకటి 2) ఐదు
3) పది 4) పదకొండు
26. హార్మోన్‌లు చర్య జరిపే కణజాలం?
1) నిర్వాహక 2) మృదు
3) లింప్ 4) స్థంభాకార
27. గర్బధారణ తర్వాత ఎన్ని వారాలకు ముఖ్య అవయవాలన్నీ ఏర్పడతాయి?
1) 11 2) 10 3) 9 4) 12
28. చేపల్లో అంతర జలశ్వాస రంధ్రాలు తెరచుకునే భాగం?
1) నోరు 2) ఆస్యకుహరం
3) గ్రసని 4) స్వరకోశాలు
29. అండాశయంలో ఉబ్బిన భాగం నుంచి అండాలు పెరిగే భాగాన్ని ఏమంటారు?
1) అండాతర కణజాలం
2) కలాజా
3) అండన్యాస స్థానం 4) అండద్వారం
30. రక్త వర్గాలను కనిపెట్టినవారు?
1) అరిస్టాటిల్ 2) విలియం హార్వే
3) కార్‌లలాండ్ స్టీనర్ 4) ల్యూవెన్ హుక్
31. సాలమండర్‌లో శ్వాసక్రియ?
1) పుపుస శ్వాసక్రియ 2) జల శ్వాసక్రియ
3) చర్మ శ్వాసక్రియ 4) విసరణ
32. ఎర్రరక్తకణంలో కేంద్రకం ఉన్న సక శేరుకాలకు ఉదాహరణ?
1) కప్ప 2) ఒంటె
3) కప్ప, మానవుడు, ఒంటె
4) కప్ప, ఒంటె
33. చేమంతిలో పిలకమొక్కలు దేని నుంచి ఏర్పడతాయి?
1) వేరు 2) కాండం
3) పత్రం 4) వేరు బుడిపెలు
34. ఎయిడ్‌స వ్యాధిలో బలహీనపడే తెల్ల రక్త కణాలు?
1) బేసోఫిల్స్ 2) న్యూట్రోఫిల్స్
3) మోనోసైట్స్ 4) లింఫోసైట్స్
35. కణజాల వర్ధనంలో ఏకస్థితిక మొక్కల ఉత్పత్తికి వాడేవి?
1) పత్రాలు 2) కాండ కణాలు
3) పరాగ రేణువులు
4) వేరు చివరి కణాలు
36. ఎర్ర రక్తకణాల స్మశాన వాటిక?
1) కాలేయం 2) క్లోమం
3) ఎముక మజ్జ 4) ప్లీహం
37. ఫలదీకరణ సమయంలో పూర్తిగా ఏర్పడిన పిండకోశంలోని కణాలు ఎన్ని గుంపులుగా చేరతాయి?
1) 7 2) 2 3) 4 4) 3
38. ఎలర్జీ సమయంలో పెరిగే తెల్ల రక్తకణాలు?
1) ఇసినోఫిల్స్ 2) న్యూట్రోఫిల్స్
3) లింఫోసైట్స్ 4) మోనోసైట్స్
39. కన్నుల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క?
1) క్యారట్ 2) రణపాల
3) బంగాళదుంప 4) చేమంతి
40. కీటకాలను ఆకర్షించి పరాగ సంపర్కానికి తోడ్పడే పుష్ప భాగం?
1) కేసరావళి 2) అండకోశం
3) ఆకర్షక పత్రావళి 4) రక్షక పత్రావళి
41. జీవక్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థ పదార్థాలను తిరిగి ఉపయోగించుకునే శక్తి ఉన్నవి?
1) మొక్కలు 2) జంతువులు
3) మానవుడు 4) జీవులు
42. ఏ తెల్ల రక్తకణాల కేంద్రకం మూత్రపిండం ఆకారంలో ఉంటుంది?
1) మోనోసైట్స్ 2) లింఫోసైట్స్
3) త్రాంబోసైట్స్ 4) ఎరిత్రోసైట్స్
43. అంకురచ్చర రహిత విత్తనాలకు ఉదాహరణ?
1) వరి 2) బఠాణి
3) మొక్కజొన్న 4) ఆముదం
44. కణజాల వర్ధనంలో టోటిపొటెన్సీ దేనికి సంబంధించింది?
1) పత్రాలు 2) కాలస్
3) ఎక్స్‌ప్లాంట్ 4) ఏదీకాదు
45. పిండకోశంలోని ప్రతిపాదక కణాల సంఖ్య?
1) 2 2) 3 3) 4 4) 5
46. క్యారట్ మొక్కల్లో చేసే ఛేదనాలు?
1) కాండం 2) వేరు
3) పత్రం 4) అన్నీ
47. దానిమ్మ, నిమ్మ, నారింజల్లో గూటి పద్ధతి ఒక?
1) నేల అంటు తొక్కడం 2) కొమ్మ అంట్లు
3) వేరు ఛేదనం 4) కాండ ఛేదనం
48. వేరు మొగ్గల నుంచి కొత్త మొక్కలను ఉత్పత్తి చేసేవి?
1) క్యారట్, వేప
2) క్యారట్, కరివేపాకు
3) వేప, కరివేపాకు 4) అన్నీ
49. కొంచెం గట్టిదారు ఛేదనాలకు ఉదాహరణ?
1) మందార, స్వర్ణగన్నేరు
2) డాలియా, పిసినిక
3) గులాబీ, జిరేనియం
4) డాలియా, జిరేనియం
50. కంటిలోని శంకులలో ఉండే వర్ణకం?
1) ఐడాఫ్సిన్ 2) ట్రిిపిన్‌స
3) పెప్సినోసిన్ 4) రాఢాఫ్సిన్
51. శోషరసం ఏ వ్యవసకు చెందుతుంది?
1) జీర్ణ 2) విసర్జన
3) నాడీ మండలం 4) రవాణా
52. మనదేశంలో ఖజి+ శాతం?
1) 63 2) 7 3) 93 4) 50
53. పదార్థాల రవాణా, శరీర రక్షణ చర్యల్లో రక్తం ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడే ప్రోటీన్లు?
1) గ్లోబ్యులిన్‌లు 2) ఆల్బుమిన్‌లు
3) పొత్రాంబిన్ 4) పైబ్రినోజన్
54. బ్యాక్టీరియా ద్విదావిచ్ఛిత్తి, శిలీంద్ర సిద్ధబీ జాశయంలో కేంద్రకాలు జరిపే విభజనలు వరుసగా?
1) క్షయ, సమ 2) క్షయ, క్షయ
3) సమ, సమ 4) సమ, క్షయ
55. అంకురచ్ఛద కేంద్రకం ఏ స్థితిలో ఉంటుంది?
1) త్రయ స్థితికం 2) ఏక స్థితికం
3) ద్వయ స్థితికం 4) చతుర స్థితికం
56. బొద్దింకలో ఎన్ని గదుల హృదయం ఉంటుంది?
1) 3 2) 11 3) 5 4) 13
57. ప్లాస్మాలో అ, ఆ ప్రతిరక్షకాలు లేని రక్త వర్గం?
1) B 2) A 3) O 4) AB
58. ఒక వ్యక్తి రక్తాన్ని మరో వ్యక్తికి దేని ద్వారా ఎక్కిస్తారు?
1) ధమని 2) సిర
3) కండరాలు 4) వాయునాళం
59. పత్ర కోరకాల ద్వారా శాఖీయోత్పత్తి జరుపుకునే మొక్క?
1) చేమంతి 2) ఆలుగడ్డ
3) కరివేపాకు 4) రణపాల
60. ద్వివలయ ప్రసరణ హృదయం ఉన్న జీవి?
1) వానపాము 2) బొద్దింక
3) చేప 4) కోతి
61. బ్లడ్ బ్యాంకులో నిర్జీవ స్థితిలో రక్తం గడ్డకట్ట కుండా ఉండటానికి ఉపయోగించే పదార్థం?
1) కాపర్ 2) సోడియం సిట్రైట్
3) సోడియం నైట్రేట్ 4) హెపారిన్
62. కిరణజన్య సంయోగక్రియలో కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది?
1) ఆవర్ణిక 2) స్ట్రోమా
3) త్వచం 4) గ్రానా
63. కిరణజన్య సంయోగక్రియ ఎక్కువగా ఏ కాంతిలో జరుగుతుంది?
1) ఎరుపు, నీలి
2) ఆకుపచ్చ, నీలి
3) అరుణ, నీలి
4) అరుణ, ఎరుపు
64. గ్లూకోజ్ ఫైరూవిక్ ఆమ్లంగా ఏర్పడే టప్పుడు పొందే నికర లాభం?
1) 38 అఖ్కీ అణువులు
2) 4 అఖ్కీ అణువులు
3) 36 అఖ్కీ అణువులు
4) 2 అఖ్కీ అణువులు
65. మైటోకాండ్రియాలో లోపలి ముడుతలను ఏమంటారు?
1) క్రిస్టే 2) మాతృక
3) ప్రాథమిక రేణువులు 4) స్ట్రోమా
66. మానవునిలో వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృధులాస్థి ఉంగరాల ఆకారం?
1) U 2) O 3) S 4) C
67. పురుషుల్లో శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రముఖ పాత్ర వహించేది?
1) ఉదర వితానం 2) అంగిలి
3) ఉపజిహ్వక 4) ఏదీ కాదు
68. అమీబాలో శ్వాసక్రియ విధానం?
1) ఉచ్ఛ్వాసం 2) బాష్పీభవనం
3) విసరణం 4) ఆష్మాసిస్
69. ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్‌లో ఏర్పడేది?
1) వాయు సహిత శ్వాసక్రియలో అఈ్క 2) వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే ATP 3) సూర్యరశ్మిలో ఏర్పడే అఖ్కీ 4) అన్నీ
70. ఎడమ ఊపిరితిత్తిలోని తమ్మెల సంఖ్య?
1) 3 2) 2 3) 1 4) 4
71. సిరాసరణి లేని జంతువు?
1) కప్ప 2) చేప
3) సాలమండర్ 4) మానవుడు
72. గ్లూకోజ్ ఆక్సీకరణలో మొదటిదశ?
1) క్రెబ్స్ వలయం 2) సిట్రిక్ వలయం
3) గ్లెకాలసిస్ 4) కిణ్వనం
సమాధానాలు
1) 4; 2) 3; 3) 2; 4) 2;
5) 4; 6) 4; 7) 3; 8) 1;
9) 3; 10)2; 11) 3; 12) 4;
13) 3; 14) 2; 15) 2; 16) 2;
17) 2; 18) 4; 19) 1; 20)1;
21) 4; 22) 4; 23) 2; 24) 3;
25) 3; 26) 1; 27) 4; 28) 3;
29) 3; 30) 3; 31) 3; 32) 4;
33) 2; 34) 4; 35) 3; 36) 4;
37) 4; 38) 1; 39) 3; 40) 3;
41) 1; 42) 1; 43) 2; 44) 3;
45) 2; 46) 2; 47) 2; 48) 3;
49) 4; 50) 1; 51) 4; 52) 3;
53) 1; 54) 3; 55) 1; 56) 4;
57) 4; 58) 2; 59) 4; 60) 4;
61) 2; 62) 2; 63) 3; 64) 4;
65) 1; 66) 4; 67) 1; 68) 3;
69) 2; 70) 2; 71) 4; 72) 3.
కన్నుల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క?
Published Fri, Jun 6 2014 10:00 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement