ఇమ్యునాలజీ పితామహుడు ఎవరు?
రోగ నిరోధక వ్యవస్థ
శరీరంలోకి ప్రవేశించిన వ్యాధి కారకాన్ని గుర్తించి నిర్మూలించే వ్యవస్థను అసంక్రామ్యత వ్యవస్థ లేదా రోగ నిరోధక వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరానికి రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పెరుగుతుంది. అసంక్రామ్యత వ్యవస్థ అధ్యయనం ద్వారా టీకాలను అభివృద్ధి చేశారు.
ఇమ్యూనిటీ - రకాలు
మానవుడిలో ఇమ్యూనిటీ రెండు రకాలు. అవి.. స్వాభావిక, స్వీకృత ఇమ్యూనిటీలు. పుట్టుకతోనే లభించేది స్వాభావిక ఇమ్యూనిటీ. శరీరంలోకి ఏ వ్యాధి కారకం ప్రవేశించక ముందే ఈ ఇమ్యూనిటీ ఉంటుంది. చర్మం, శ్లేష్మస్తరాలు బాహ్య అవరోధాలుగా వ్యవహరిస్తూ స్వాభావిక ఇమ్యూనిటీని అందిస్తాయి. వీటికి అదనంగా బ్యాక్టీరియా నాశినిగా పనిచేసే కంటిలోని లైసోజైం అనే ఎంజైమ్, జఠర రసంలోని హైడ్రో క్లోరిక్ ఆమ్లం కూడా స్వాభావిక ఇమ్యూనిటీని అందిస్తాయి. అందరిలో స్వాభావిక ఇమ్యూనిటీ దాదాపు ఒకే విధంగా ఉంటుంది.
ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఆర్జించే ఇమ్యూనిటీ.. స్వీకృత లేదా ఆర్జిత ఇమ్యూనిటీ. ఒక వ్యక్తి నివసించే ప్రాంతం, తాగే నీరు, పీల్చే గాలి, ఆహారపు అలవాట్లపై ఇది ఆధారపడుతుంది. కాబట్టి ఇది అందరిలోనూ ఒకే విధంగా ఉండదు.
మానవుడిలో ఇమ్యూనిటీ వ్యవస్థ
మానవుడి ఇమ్యూనిటీ వ్యవస్థలో తెల్ల రక్త కణాలు, లింఫాయిడ్ అవయవాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు శరీర రక్షక భటుల లాంటివి. వీటిలో ఇసినోఫిల్స్ అలర్జీ చర్యల్లో పాల్గొనగా, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ భక్షక కణాలుగా వ్యవహరిస్తాయి. లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాలు చాలా కీలకమైనవి. ఇవి రెండు రకాలు ఖీ - లింఫోసైట్స్, ఆ - లింఫోసైట్స్. ఖీ- లింఫోసైట్స్ మళ్లీ రెండు రకాలు - ఇఈ4/ఖీ4, ఇఈ8 కణాలు. ఇమ్యూనిటీ వ్యవస్థలోని అవయవాలు రెండు రకాలు. ఎముక మజ్జ, థైమస్ అనేవి ప్రాథమిక అవయవాలు. ఎముక మజ్జలో లింఫోసైట్స్ ఏర్పడతాయి. ఆ లింఫోసైట్స్ మాత్రం ఎముక మజ్జలో పరిపక్వత చెందగా, ఫోసైట్స్ థైమస్ నుంచి విడుదలయ్యే థైమోసిన్ హార్మోన్ ప్రేరణతో పరిపక్వత చెందుతాయి.
స్పెసిఫిక్ ఇమ్యూనిటీ
ఖీ, ఆ లింఫోసైట్స్ ద్వారా లభించే నిరోధక శక్తిని స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటారు. వ్యాధి కారకం ఉపరితలంపై ఉన్న ప్రతిజనకం ఆధారంగా దీన్ని గుర్తించి ఖీ ృ లింఫోసైట్స్ అందించే ఇమ్యూనిటీని సెల్యూలార్ లేదా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటారు. వ్యాధి కారకాన్ని గుర్తించి ఖీ ృ లింఫోసైట్స్ భక్షక కారకాలను ప్రేరేపిస్తాయి.
ఫలితంగా భక్షక కణాలు వ్యాధి కారకాన్ని భక్షిస్తాయి. కొన్ని సందర్భాల్లో వ్యాధి కారకాన్ని నేరుగా ఖీ ృ లింఫోసైట్స్ నాశనం చేస్తాయి. ముఖ్యంగా ఇఈ8 కణాలు ఈ విధంగా వ్యవహరిస్తాయి. కొన్ని ఖీ4 లింఫోసైట్స్ వ్యాధి కారకాన్ని గుర్తించిన వెంటనే ఆ లింఫోసైట్స్‌ను ప్రేరేపిస్తాయి. ఈ విధంగా ప్రేరణకు గురైన ఆ ృ లింఫోసైట్స్ వ్యాధి కారకానికి విరుద్ధంగా ప్రత్యేకంగా ప్రతిదేహకాలు లేదా ప్రతిరక్షకాల (అ్టజీఛౌఛీజ్ఛీట)ను విడుదల చేస్తాయి. ఇవి
వ్యాధి కారకం ఉపరితలంపై ప్రతి
జనకం ఆధారంగా దాన్ని గుర్తించి నాశనం చేస్తుంది. అంతేగాకుండా కొన్ని ఆ ృ కణాలు వ్యాధి కారకాన్ని గుర్తుపెట్టుకునే ఇమ్యునలాజికల్ మెమొరీ అనే గుణాన్ని ప్రదర్శిస్తాయి. అదే వ్యాధి కారకం మళ్లీ శరీరంలోకి ప్రవేశిస్తే ఈ సారి అధిక మోతాదులో వేగంగా ప్రతిదేహకాలు విడుదలై దాన్ని పూర్తిగా నిరోధిస్తాయి. ఈ రకంగా ప్రతిదేహకాల ద్వారా ఆ ృ లింఫోై సెట్స్ అందించే ఇమ్యూనిటీయే హ్యుమొరల్ ఇమ్యూనిటీ.
వ్యాక్సిన్
టీకా లేదా వ్యాక్సిన్ అనేది ఒక నివారణ ఔషధం. వ్యాధి కారకం శరీరంలోకి చేరకముందే దీన్ని ఇస్తారు. దాంతో భవిష్యత్తులో సంక్రమించడానికి అవకాశమున్న వ్యాధి కారకాన్ని నిరోధించడానికి వీలవుతుంది. కేవలం చిన్న పిల్లలకే కాకుండా పెద్దలు కూడా వేయించుకునే టీకాలు ఉంటాయి. సాధారణంగా టీకాలు రెండు రకాలు. సంప్రదాయ, ఆధునిక టీకాలు. సంప్రదాయ టీకాల్లో క్షీణింపజేసిన లేదా మృత వ్యాధి కారకాలు ఉంటాయి. ఇలాంటి వాటిని అందించడం ద్వారా వ్యాధి అభివృద్ధి చెందదు. అయితే వ్యాధికారక ఉపరితలంపై ఉన్న ప్రతిజనకానికి విరుద్ధంగా శరీరంలో ప్రతిదేహకాలు విడుదలై మెమొరీ అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి టీకాను రెండు లేదా మూడుసార్లు వేయించినట్లయితే శరీరంలో ఆ వ్యాధికి విరుద్ధంగా పూర్తిస్థాయి నిరోధకత లభిస్తుంది. ఉదా: ఓరల్ పోలియో వ్యాక్సిన్ , డీపీటీ వ్యాక్సిన్.
సంప్రదాయ టీకాల్లో కొన్ని లోపాలను అధిగమించడానికి ఆధునిక టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక టీకాల్లో శుద్ధమైన ప్రతిజనకం లేదా వ్యాధి కారకానికి చెందిన ఉపరితల భాగం ఉంటాయి. ఇవి సంప్రదాయ టీకాల కంటే సురక్షితమైనవి.
ఉదా: హెపటైటిస్ అ, ఆ టీకాలు. స్థిరమైన ప్రతిజనకం లేని కారణంగా హెచ్‌ఐవీ లాంటి వాటికి విరుద్ధంగా టీకాలేవీ అందుబాటులోకి రాలేదు.
భారత టీకా కార్యక్రమం
1975లో ప్రపంచవ్యాప్తంగా మశూచిని పారదోలిన తర్వాత భారత ప్రభుత్వం 1978లో ఎక్స్‌పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఉ్కఐ) అనే టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1974లో ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన నమూనా ఆధారంగా భారత్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 1990 నాటికి దేశంలోని చిన్నారులందరికీ టీకాలు అందించాలనేది దీని లక్ష్యం. 1985లో యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ను ప్రభుత్వం ప్రారంభించి, 1990 నాటికల్లా 85 శాతం చిన్నారులకు టీకాలను అందించాలని నిర్ణయించింది. 1990 నాటికి టీకాల ఉత్పాదనలో స్వయం సమృద్ధిని సాధించాలనేది కూడా దీని లక్ష్యం. ఆ తర్వాత కొన్ని ఇతర కార్యక్రమాల్లో భాగంగా అమలు చేశారు. ప్రస్తుతం జాతీయ ఆరోగ్య మిషన్‌లో టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
భారత ప్రభుత్వం ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్న టీకాలు కనీసమైనవి, కచ్చితమైనవి. గర్భిణులకు రెండు డోసుల ఖీ.ఖీ (టెటనస్ టాక్సాయిడ్) టీకాను ఇస్తున్నారు. నవజాత శిశువులకు కింది ప్రాణాంతక వ్యాధులకు నివారణగా టీకాలను అందిస్తున్నారు.
క్షయ - బాసిల్లస్ కాల్మేట్ గ్వెరిన్
పోలియో-ఓరల్ పోలియో వ్యాక్సిన్
డిఫ్తీరియా - డీపీటీ
పర్టుసిస్ - డీపీటీ
టెటనస్ - డీపీటీ
మీజిల్స్ - మీజిల్స్
హెపటైటిస్‌ఆ - హెప్‌ఆ
వీటికి అదనంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో జపనీస్ ఎన్సిఫలైటీస్ టీకాను అందుబాటులోకి తీసుకువచ్చారు. త్వరలో నీమోకోకల్ కాంజు గేట్, హ్యూమన్ పాపిల్లోమ, రోటా, హెచ్‌ఐబీ (హీమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బి) టీకాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వం అందిస్తున్న టీకాలకు అదనంగా కూడా కొన్ని కచ్చిత టీకాలను పిల్లలకు ఇవ్వాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియా ట్రిక్స్(ఐఏపీ) సూచిస్తోంది.
మంప్స్ - ఎంఎంఆర్ టీకా
మీజిల్స్ - ఎంఎంఆర్ టీకా
రుబెల్లా - ఎంఎంఆర్ టీకా
పోలియో - ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్
టైఫాయిడ్ - టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్
హీమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బి (హెచ్‌ఐబీ)
సర్వైకల్ క్యాన్సర్ - హ్యూమన్ పాపిల్లోమ
వీటికి అదనంగా కూడా కొన్ని ఐచ్ఛిక టీకా లను ఐఏపీ సూచిస్తోంది.
హెపటైటిస్ ఎ - హెప్ ఎ
అమ్మవారు - వారి సెల్ల
ప్రతిజనకం: వ్యాధి కారకం ఉపరితలంపై ఉంటూ శరీర నిరోధక శక్తిని ప్రేరేపించే అన్య పదార్థాన్ని ప్రతిజనకం అంటారు. రసాయనికంగా ఇది ఏదైనా కావచ్చు. దీనికి విరుద్ధంగా శరీరంలోని ఆ ృ లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాలు ప్రతిదేహకాలు అనే జీవ క్షిపణులను విడుదల చేస్తాయి.
కాంబినేషన్ వ్యాక్సిన్: నాలుగు, అంతకంటే ఎక్కువ వ్యాధి కారకాలకు నిరోధక ఔషధాలు ఉంటే కాంబినేషన్ టీకా అంటారు. భారత్‌లో ప్రస్తుతం ఇలాంటి రెండు టీకాలు ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. అవి.. టెట్రావలెంట్ టీకా(నాలుగు వ్యాధులకు), పెంటావలెంట్ టీకా(ఐదు వ్యాధులకు). తొలిసారిగా ఇలాంటి టీకాలను ప్రభుత్వం కేరళ, తమిళనాడులో పెలైట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది.