The immune system
-
అలర్జీలకు చికిత్స ఉందా?
హోమియో కౌన్సెలింగ్ నాకు ఇటీవల వరుసగా తుమ్ములు రావడం, ఆ తర్వాత కాసేపు ముక్కు కారడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే అలర్జీ అన్నారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? - రవి, నరసన్నపేట అలర్జీ అంటే మన సొంత రోగనిరోధక వ్యవస్థే మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎన్నో అంశాలు మనకు అలర్జీ కలిగించవచ్చు. ఉదాహరణకు పూలమొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు, దుమ్ము, ధూళి, కొన్ని ఆహారాలు (పాలు, గుడ్లు, చేపలు వంటివి), కొన్ని రకాల మందులు (యాంటీబయాటిక్స్, బీపీ పందులు మొ.) రబ్బరు లేదా ఇతర సరిపడని పదార్థాలను తాకడం, జంతుస్పర్శ, వాతావరణ మార్పులు మొదలైన అంశాల వల్ల మన శరీరం అసాధారణంగా స్పందిస్తుంది. ఇలా మన శరీరం ప్రదర్శించే అసాధారణ ప్రతిచర్యనే అలర్జీ అంటారు. ఇలా మన శరీరం అతిగా స్పందించడాన్ని ‘హైపర్ సెన్సిటివిటీ’ అని కూడా అంటారు. మనకు అలర్జీ కలిగించే పదార్థాలను అలర్జెన్స్ అంటారు. వాటిని వల్ల మన శరీరంలో కలిగే ప్రతిక్రియను ‘అలర్జిక్ రియాక్షన్’ అంటారు. కారణాలు: అలర్జీకి కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే జన్యుపరమైన అంశాలు, వాతావరణంలో మార్పుల వల్ల అలర్జీ వచ్చేందుకు అవకాశం ఉంది. రకాలు: అలర్జీ వ్యక్తమయ్యే తీరును బట్టి దాన్ని అనేక రకాలుగా వర్గీకరించి, దానికి అనుగుణంగా పేరుపెడతారు. ఉదాహరణకు మీకు ఉన్న సమస్యలో కనిపించినట్లుగా వరసగా తుమ్ములు రావడం, ముక్కు కారడాన్ని ‘అలర్జిక్ రైనైటిస్’గా పేర్కొంటారు. దీన్ని అశ్రద్ధ చేస్తే ఈ ‘అలర్జిక్ రైనైటిస్’ మరిన్ని సమస్యలకు కారణం కావచ్చు. ఉదాహరణకు ముక్కుదిబ్బడ, శ్వాస ఆడకపోవడం, కళ్లెపడటం, ముఖం వాపునకు గురికావడం, తలనొప్పి వంటి సమస్యలకు దారితీయవచ్చు. అటుపై ఈ వ్యాధి గాలిగొట్టాల్లోకి చేరి, ఊపిరితిత్తులకు సోకడం వల్ల దగ్గు ప్రారంభమై, కళ్లెతో కూడిన దగ్గుగా మారుతుంది. వైద్యపరిభాషలో దీన్ని ‘అలర్జిక్ బ్రాంకైటిస్’ అని అంటారు. ఈ పరిస్థితికి ఆయాసం, పిల్లికూతలు తోడైతే దాన్ని ‘అలర్జిక్ ఆస్తమా’ అంటారు. స్కిన్ అలర్జీ: అలర్జీ అనేది చర్మం ద్వారా కూడా వ్యక్తమవుతుంది. కొన్ని రకాల మందులు వాడటం, ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల ఆహారాలు, సరిపడని వస్తువులు తగిలితే చర్మం కూడా ప్రభావితమవుతుంది. అలాంటప్పుడు చర్మంపై దురద, దద్దుర్లు, చర్మం ఎర్రబారడం జరుగుతాయి. ఇది కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు ఉండొచ్చు. చాలా సందర్భాల్లో సమస్య దానంతట అదే తగ్గుతుంది. కానీ ఒక్కోసారి అది ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది. జీర్ణకోశం అలర్జీ: కొన్ని రకాల ఆహారపదార్థాలు ఒంటికి సరిపడకపోవడంతో జీర్ణకోశ అలర్జీలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో నీరసం, వికారం, మలబద్దకం వంటి లక్షణాలతో పాటు ఒక్కోసారి వాంతులు, విరేచనాలు కనిపిస్తాయి. నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్ష, ఎక్స్-రే, సీటీస్కాన్, పీఎఫ్‌టీ... వంటి పరీక్షలు అవసరం. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా అలర్జిక్ వ్యాధులను పూర్తిగా నయం చేయవచ్చు. హోమియో వైద్య విధానంలో అలర్జ్జీలకు నమ్మకమైన చికిత్స ఉంది. కాబట్టి మీరు నిపుణులైన హోమియో వైద్యులను కలిసి, చికిత్స తీసుకోండి. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ పెద్ద పేగు క్యాన్సర్ వంశపారంపర్యమా? గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. గృహిణిని. మా నాన్న పెద్దపేగు క్యాన్సర్‌తో చనిపోయారు. ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? అలాగైతే ముందే గుర్తించే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? , - పార్వతి, నిజామాబాద్ పెద్దపేగుకు వచ్చే క్యాన్సర్ విషయంలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువే. కాబట్టి మీరు ముందునుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ప్రస్తుతం క్యాన్సర్ లక్షణాలు లేనప్పటికీ ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోండి. క్యాన్సర్ లక్షణాలు బయటపడకముందే క్యాన్సర్‌ను గుర్తించడాన్ని స్క్రీనింగ్ అంటారు. పెద్దపేగుల క్యాన్సర్‌ను కొలనోస్కోపీ అనే పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. కాబట్టి మీరు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోండి. అది నార్మల్‌గా ఉంటే మీరు భయపడాల్సిన అవవసరం లేదు. మళ్లీ పదేళ్ల తర్వాత మరోసారి స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా క్యాన్సర్‌ను మొదటే గుర్తించవచ్చు. నా వయసు 65 ఏళ్లు. నాకు గత ఆర్నెల్ల నుంచి మలవిసర్జనలో మార్పు కనిపిస్తోంది. మలవిసర్జనకు ముందు రక్తం పడుతోంది. ఆకలి కూడా బాగా తగ్గింది. మలవిసర్జనకు వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఇది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందా? - పద్మనాభరావు, విజయవాడ మలవిసర్జనకు ముందు రక్తం పడటానికి చాలా కారణాలు ఉంటాయి. హెమరాయిడ్స్ (పైల్స్) అంటే మొలలు, పెద్దపేగుల్లో కణితులు, క్యాన్సర్ కణితులు, పుండ్లు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్‌లో ఇలా రక్తం పడటం కనిపిస్తుంది. మీ వయసునూ, ఆకలి మందగించడం వంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటే మీరు పెద్దపేగుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారనిపిస్తోంది. మలవిసర్జనలో మార్పు కనిపిస్తోందని రాశారుగానీ, అది ఏ రకమైన మార్పు అన్నది రాయలేదు. పెద్దపేగుల్లో కణితులు ఉంటే మొదట మల విసర్జన ప్రక్రియలో తేడా వస్తుంది. రానురానుపూర్తిగా మలవిసర్జన కష్టమవుతుంది. కాబట్టి మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోండి. దీని వల్ల రక్తం పడటానికి కారణం తెలుస్తుంది. దాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. మీరు వీలైనంత త్వరగా దగ్గర్లోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవండి. కళ్లు తిరిగి పడిపోయాడు.. సమస్య ఏమిటి? పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకు పదేళ్లు. ప్రేయర్ సమయంలో కళ్లు తిరిగిపడిపోయాడని స్కూల్లో టీచర్ పిలిపించి చెప్పారు. రెండుసార్లు ఇలా జరిగింది. మొదటిసారి ఏమీ అనిపించలేదు. కానీ రెండోసారి జరగడం వల్ల ఆందోళనగా ఉంది. దయచేసి మా అబ్బాయి విషయంలో తగిన సలహా ఇవ్వండి. - భవాని, కోదాడ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పిల్లలకు ఉన్న రుగ్మత సింకోప్ లేదా సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పవచ్చు. చాలా మంది పిల్లల్లో ఏదో ఒక సమయంలో కనిపించే సమస్యే ఇది. అయితే పిల్లల్లో ఈ సమస్య కనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఆర్థోస్టాకిక్ హైపోటెన్షన్. అంటే పిల్లల పొజిషన్స్‌లో మార్పుల వల్ల వాళ్లలో రక్తపోటు తగ్గి ఇలా జరగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యూరో కార్డియోజెనిక్ మార్పులు, గుండె సమస్యలు కూడా ఇలాపడిపోడానికి కారణం కావచ్చు. కొందరు పిల్లల్లో రక్తంలో గ్లూకోజ్ పాళ్లు తగ్గడం, ఫిట్స్, మైగ్రేన్, ఊపిరి బిగబట్టడం (బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్) వంటివి ఇందుకు కారణమవుతాయి. అయితే ఇదెంత సాధారణమైన సమస్య అయినప్పటికీ ఇలా పడిపోవడం మాటిమాటికీ కనిపిస్తుంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం. ప్రధానంగా ఇటువంటి పిల్లల్లో గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుండెకు సంబంధించిన సమస్య లేదని నిర్ధారణ అయితే కాస్త నిశ్చింతగా ఉండవచ్చు. ఇక పైన పేర్కొన్న ఇతర కారణాలు ఏమైనా కావచ్చేమో అని తెలుసుకోవడం కూడా అవసరం. అరుదుగా ఫిట్స్‌కూడా ఈ రకంగానే కనిపించవచ్చు. సాధారణంగా చాలా ఎక్కువగా భయం కలగడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల, భయానక దృశ్యాలు చూడటం వల్ల లేదా డీహైడ్రేషన్ వల్ల అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే కొబ్బరినీళ్ల వంటివి తాగిస్తూ ఉండటం, పిల్లలు కింద కూర్చుని పైకి లేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటివి ఈ సమస్య నివారణకు తోడ్పడతాయి. మీ బాబు విషయంలో పైన పేర్కొన్న కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే అంతా చక్కబడుతుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు మరోసారి మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్ విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
లక్షణాలతో ఔషధం - స్వైన్‌ఫ్లూ దూరం
స్వైన్ ఫ్లూ... హోమియో చికిత్ హోమియో వైద్యవిధానంలో రోగలక్షణాలతోబాటు వ్యక్తిగత లక్షణాలను బట్టి మందును సూచిస్తారు. కాబట్టి స్వైన్ ఫ్లూ వ్యాధికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. హోమియో మందులు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. తద్వారా చికిత్సతోపాటు... నివారణ కోసం కూడా ఈ మందులను ఉపయోగించవచ్చు. ఈ వ్యాధి కోసం ఉపయోగించి మందుల్లో ముఖ్యమైనవి... ఇన్ఫ్లుయెంజినమ్: ఇది ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ద్వారా తయారైన మందు. స్వైన్‌ఫ్లూ వ్యాధి నివారణిగా ప్రధానంగా వాడదగిన ఔషధం. ఫ్లూ లక్షణాలు, వ్యాధి తీవ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒళ్లునొప్పులు, అలసట, గొంతునొప్పి, చలిజ్వరం, విరేచనాలు, వాంతులు మొదలైన ఫ్లూ జ్వర లక్షణాలకు ఇది చక్కగా పనిచేస్తుంది. ఇంతకుముందు వచ్చిన సాంక్రమిక వ్యాధుల వల్ల వచ్చే జ్వరం పూర్తిగా తగ్గనప్పుడు ఈ మందు బాగా పనిచేస్తుంది. మలవిసర్జన సమయంలో కడుపునొప్పి, మనోవ్యాకులత, మానసికంగా బాధపడటం, గనేరియా వ్యాధి చరిత్ర కలిగి ఉన్నవారికి ఇన్ఫ్లుయెంజినమ్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. జెల్సీమియం: నీరసం, మైకం, మగత ఈ ఔషధ లక్షణం. కండరాల నొప్పులు, నిరంతర చల్లదనం, అలసట, ఒళ్లునొప్పులు, దగ్గు తీవ్రంగా ఉండటం, హఠాత్తుగా వచ్చే తుమ్ములు, ముక్కు నుంచి స్రావం, చర్మం ఒరుసుకుపోయినట్లుగా అవడం, ఉదాసీనత వల్ల శ్వాస నెమ్మదిగా ఆడటం వంటి లక్షణాలు ఉన్నవారికి జెల్సీమియం చక్కగా పనిచేస్తుంది. బాప్టీషియా: ఫ్లూ జ్వరంతో పాటు జీర్ణాశయానికి సంబంధించిన లక్షణాలు ఉన్నట్లయితే బాప్టీషియా ప్రయోజనకరమైన ఔషధం. ముఖ్యంగా విరేచనాలు భరింపరాని, కుళ్లిన వాసన కలిగి ఉండటం, విశ్రాంతి తీసుకున్నా శరీరమంతా పుండులా అనిపించడం, బలహీనత, జ్వరం హఠాత్తుగా పెరగడం, ముఖం కమిలిపోవడం, శారీరక-మానసిక బలహీనత, శ్వాసతీసుకోవడం ఇబ్బంది, వీపు భాగంలో చలి, ద్రవపదార్థాలు తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నవారికి బాప్టీషియా మందు చక్కగా పనిచేస్తుంది. ఆర్సినికం ఆల్బమ్: చలి, వేడి ఆవిర్లు, రొంప, తుమ్ములు, ముక్కు నుంచి స్రావాలు, ఆందోళన, భయం, దాహం, తరచూ నీళ్లు తాగాలనిపించడం, బలహీనత, ఏదైనా తిన్న లేదా తాగిన వెంటనే మలవిసర్జనకు వెళ్లాలనిపించడం, ఆహారం వాసన కూడా వికారం కలిగించడం, మంటతో కూడిన ఒళ్లునొప్పులు ఉన్నవారికి ఈ మందు చక్కగా పనిచేస్తుంది. ఆర్స్-ఆల్బ్ రోగులు వ్యాధి పట్ల భయం కలిగి ఉంటారు. వ్యాధి తమకే వస్తుందనే భయం, ఆందోళన, ఒక్కచోట కుదురుగా ఉండలేక అటు-ఇటు తిరగడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. రస్టాక్స్: ఫ్లూ జ్వరంతో పాటు విపరీతమైన ఒళ్లునొప్పులు, తుమ్ములు, దగ్గు (ముఖ్యంగా సాయంకాలం ఎక్కువగా ఉండటం), చల్లటి వాతావరణం, తేమ వాతావరణంలో బాధలు ఉద్రేకించడం, నీరసం, మాంద్యం, రోగికి టైఫాయిడ్ జ్వరాన్ని పోలిన లక్షణాలు ఉండటం, ముఖ్యంగా నాలుక మంట, మైకం, పిచ్చిగా మాట్లాడటం, రాత్రుళ్లు నిద్రపట్టకపోవడం, దగ్గు కారణంగా ఛాతీలో మంట, కొన్నిసార్లు అసంకల్పితంగా మూత్రవిసర్జన వంటి లక్షణాలు ఉన్నవారికి రస్టాక్స్ చాలా ప్రయోజనకరమైన ఔషధం. యుపటోరియం: శరీరమంతా పుండులా విపరీతమైన నొప్పి కలిగినవారికీ, శ్వాసనాళంతో పాటు గొంతు పుండులా మారి దగ్గు, గొంతుబొంగురుపోవడం, రొంపతో పాటు విపరీతమైన దాహం ఉండటం, అయినప్పటికీ ద్రవపదార్థాలు తీసుకుంటే వాంతులు కావడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు యుపటోరియం చక్కగా పనిచేస్తుంది. అకోనైట్: కొద్దిపాటి ఫ్లూ జ్వరం లక్షణాలు ముఖ్యంగా ముక్కు, కళ్ల నుంచి నీరు కారడం, ఇంకా ఏ ఇతర లక్షణాలు లేనప్పటికీ స్వైన్‌ఫ్లూ ఉందేమోనని ఆందోళన చెందిన రోగులకు అకోనైట్ వాడదగిన ఔషధం. డా. శ్రీకాంత్ మోర్లావర్, ఇకఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
ఇమ్యునాలజీ పితామహుడు ఎవరు?
రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోకి ప్రవేశించిన వ్యాధి కారకాన్ని గుర్తించి నిర్మూలించే వ్యవస్థను అసంక్రామ్యత వ్యవస్థ లేదా రోగ నిరోధక వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరానికి రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పెరుగుతుంది. అసంక్రామ్యత వ్యవస్థ అధ్యయనం ద్వారా టీకాలను అభివృద్ధి చేశారు. ఇమ్యూనిటీ - రకాలు మానవుడిలో ఇమ్యూనిటీ రెండు రకాలు. అవి.. స్వాభావిక, స్వీకృత ఇమ్యూనిటీలు. పుట్టుకతోనే లభించేది స్వాభావిక ఇమ్యూనిటీ. శరీరంలోకి ఏ వ్యాధి కారకం ప్రవేశించక ముందే ఈ ఇమ్యూనిటీ ఉంటుంది. చర్మం, శ్లేష్మస్తరాలు బాహ్య అవరోధాలుగా వ్యవహరిస్తూ స్వాభావిక ఇమ్యూనిటీని అందిస్తాయి. వీటికి అదనంగా బ్యాక్టీరియా నాశినిగా పనిచేసే కంటిలోని లైసోజైం అనే ఎంజైమ్, జఠర రసంలోని హైడ్రో క్లోరిక్ ఆమ్లం కూడా స్వాభావిక ఇమ్యూనిటీని అందిస్తాయి. అందరిలో స్వాభావిక ఇమ్యూనిటీ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఆర్జించే ఇమ్యూనిటీ.. స్వీకృత లేదా ఆర్జిత ఇమ్యూనిటీ. ఒక వ్యక్తి నివసించే ప్రాంతం, తాగే నీరు, పీల్చే గాలి, ఆహారపు అలవాట్లపై ఇది ఆధారపడుతుంది. కాబట్టి ఇది అందరిలోనూ ఒకే విధంగా ఉండదు. మానవుడిలో ఇమ్యూనిటీ వ్యవస్థ మానవుడి ఇమ్యూనిటీ వ్యవస్థలో తెల్ల రక్త కణాలు, లింఫాయిడ్ అవయవాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు శరీర రక్షక భటుల లాంటివి. వీటిలో ఇసినోఫిల్స్ అలర్జీ చర్యల్లో పాల్గొనగా, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ భక్షక కణాలుగా వ్యవహరిస్తాయి. లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాలు చాలా కీలకమైనవి. ఇవి రెండు రకాలు ఖీ - లింఫోసైట్స్, ఆ - లింఫోసైట్స్. ఖీ- లింఫోసైట్స్ మళ్లీ రెండు రకాలు - ఇఈ4/ఖీ4, ఇఈ8 కణాలు. ఇమ్యూనిటీ వ్యవస్థలోని అవయవాలు రెండు రకాలు. ఎముక మజ్జ, థైమస్ అనేవి ప్రాథమిక అవయవాలు. ఎముక మజ్జలో లింఫోసైట్స్ ఏర్పడతాయి. ఆ లింఫోసైట్స్ మాత్రం ఎముక మజ్జలో పరిపక్వత చెందగా, ఫోసైట్స్ థైమస్ నుంచి విడుదలయ్యే థైమోసిన్ హార్మోన్ ప్రేరణతో పరిపక్వత చెందుతాయి. స్పెసిఫిక్ ఇమ్యూనిటీ ఖీ, ఆ లింఫోసైట్స్ ద్వారా లభించే నిరోధక శక్తిని స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటారు. వ్యాధి కారకం ఉపరితలంపై ఉన్న ప్రతిజనకం ఆధారంగా దీన్ని గుర్తించి ఖీ ృ లింఫోసైట్స్ అందించే ఇమ్యూనిటీని సెల్యూలార్ లేదా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటారు. వ్యాధి కారకాన్ని గుర్తించి ఖీ ృ లింఫోసైట్స్ భక్షక కారకాలను ప్రేరేపిస్తాయి. ఫలితంగా భక్షక కణాలు వ్యాధి కారకాన్ని భక్షిస్తాయి. కొన్ని సందర్భాల్లో వ్యాధి కారకాన్ని నేరుగా ఖీ ృ లింఫోసైట్స్ నాశనం చేస్తాయి. ముఖ్యంగా ఇఈ8 కణాలు ఈ విధంగా వ్యవహరిస్తాయి. కొన్ని ఖీ4 లింఫోసైట్స్ వ్యాధి కారకాన్ని గుర్తించిన వెంటనే ఆ లింఫోసైట్స్‌ను ప్రేరేపిస్తాయి. ఈ విధంగా ప్రేరణకు గురైన ఆ ృ లింఫోసైట్స్ వ్యాధి కారకానికి విరుద్ధంగా ప్రత్యేకంగా ప్రతిదేహకాలు లేదా ప్రతిరక్షకాల (అ్టజీఛౌఛీజ్ఛీట)ను విడుదల చేస్తాయి. ఇవి వ్యాధి కారకం ఉపరితలంపై ప్రతి జనకం ఆధారంగా దాన్ని గుర్తించి నాశనం చేస్తుంది. అంతేగాకుండా కొన్ని ఆ ృ కణాలు వ్యాధి కారకాన్ని గుర్తుపెట్టుకునే ఇమ్యునలాజికల్ మెమొరీ అనే గుణాన్ని ప్రదర్శిస్తాయి. అదే వ్యాధి కారకం మళ్లీ శరీరంలోకి ప్రవేశిస్తే ఈ సారి అధిక మోతాదులో వేగంగా ప్రతిదేహకాలు విడుదలై దాన్ని పూర్తిగా నిరోధిస్తాయి. ఈ రకంగా ప్రతిదేహకాల ద్వారా ఆ ృ లింఫోై సెట్స్ అందించే ఇమ్యూనిటీయే హ్యుమొరల్ ఇమ్యూనిటీ. వ్యాక్సిన్ టీకా లేదా వ్యాక్సిన్ అనేది ఒక నివారణ ఔషధం. వ్యాధి కారకం శరీరంలోకి చేరకముందే దీన్ని ఇస్తారు. దాంతో భవిష్యత్తులో సంక్రమించడానికి అవకాశమున్న వ్యాధి కారకాన్ని నిరోధించడానికి వీలవుతుంది. కేవలం చిన్న పిల్లలకే కాకుండా పెద్దలు కూడా వేయించుకునే టీకాలు ఉంటాయి. సాధారణంగా టీకాలు రెండు రకాలు. సంప్రదాయ, ఆధునిక టీకాలు. సంప్రదాయ టీకాల్లో క్షీణింపజేసిన లేదా మృత వ్యాధి కారకాలు ఉంటాయి. ఇలాంటి వాటిని అందించడం ద్వారా వ్యాధి అభివృద్ధి చెందదు. అయితే వ్యాధికారక ఉపరితలంపై ఉన్న ప్రతిజనకానికి విరుద్ధంగా శరీరంలో ప్రతిదేహకాలు విడుదలై మెమొరీ అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి టీకాను రెండు లేదా మూడుసార్లు వేయించినట్లయితే శరీరంలో ఆ వ్యాధికి విరుద్ధంగా పూర్తిస్థాయి నిరోధకత లభిస్తుంది. ఉదా: ఓరల్ పోలియో వ్యాక్సిన్ , డీపీటీ వ్యాక్సిన్. సంప్రదాయ టీకాల్లో కొన్ని లోపాలను అధిగమించడానికి ఆధునిక టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక టీకాల్లో శుద్ధమైన ప్రతిజనకం లేదా వ్యాధి కారకానికి చెందిన ఉపరితల భాగం ఉంటాయి. ఇవి సంప్రదాయ టీకాల కంటే సురక్షితమైనవి. ఉదా: హెపటైటిస్ అ, ఆ టీకాలు. స్థిరమైన ప్రతిజనకం లేని కారణంగా హెచ్ఐవీ లాంటి వాటికి విరుద్ధంగా టీకాలేవీ అందుబాటులోకి రాలేదు. భారత టీకా కార్యక్రమం 1975లో ప్రపంచవ్యాప్తంగా మశూచిని పారదోలిన తర్వాత భారత ప్రభుత్వం 1978లో ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఉ్కఐ) అనే టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1974లో ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన నమూనా ఆధారంగా భారత్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 1990 నాటికి దేశంలోని చిన్నారులందరికీ టీకాలు అందించాలనేది దీని లక్ష్యం. 1985లో యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ను ప్రభుత్వం ప్రారంభించి, 1990 నాటికల్లా 85 శాతం చిన్నారులకు టీకాలను అందించాలని నిర్ణయించింది. 1990 నాటికి టీకాల ఉత్పాదనలో స్వయం సమృద్ధిని సాధించాలనేది కూడా దీని లక్ష్యం. ఆ తర్వాత కొన్ని ఇతర కార్యక్రమాల్లో భాగంగా అమలు చేశారు. ప్రస్తుతం జాతీయ ఆరోగ్య మిషన్‌లో టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్న టీకాలు కనీసమైనవి, కచ్చితమైనవి. గర్భిణులకు రెండు డోసుల ఖీ.ఖీ (టెటనస్ టాక్సాయిడ్) టీకాను ఇస్తున్నారు. నవజాత శిశువులకు కింది ప్రాణాంతక వ్యాధులకు నివారణగా టీకాలను అందిస్తున్నారు. క్షయ - బాసిల్లస్ కాల్మేట్ గ్వెరిన్ పోలియో-ఓరల్ పోలియో వ్యాక్సిన్ డిఫ్తీరియా - డీపీటీ పర్టుసిస్ - డీపీటీ టెటనస్ - డీపీటీ మీజిల్స్ - మీజిల్స్ హెపటైటిస్ఆ - హెప్ఆ వీటికి అదనంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో జపనీస్ ఎన్సిఫలైటీస్ టీకాను అందుబాటులోకి తీసుకువచ్చారు. త్వరలో నీమోకోకల్ కాంజు గేట్, హ్యూమన్ పాపిల్లోమ, రోటా, హెచ్ఐబీ (హీమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బి) టీకాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం అందిస్తున్న టీకాలకు అదనంగా కూడా కొన్ని కచ్చిత టీకాలను పిల్లలకు ఇవ్వాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియా ట్రిక్స్(ఐఏపీ) సూచిస్తోంది. మంప్స్ - ఎంఎంఆర్ టీకా మీజిల్స్ - ఎంఎంఆర్ టీకా రుబెల్లా - ఎంఎంఆర్ టీకా పోలియో - ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ టైఫాయిడ్ - టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ హీమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బి (హెచ్ఐబీ) సర్వైకల్ క్యాన్సర్ - హ్యూమన్ పాపిల్లోమ వీటికి అదనంగా కూడా కొన్ని ఐచ్ఛిక టీకా లను ఐఏపీ సూచిస్తోంది. హెపటైటిస్ ఎ - హెప్ ఎ అమ్మవారు - వారి సెల్ల ప్రతిజనకం: వ్యాధి కారకం ఉపరితలంపై ఉంటూ శరీర నిరోధక శక్తిని ప్రేరేపించే అన్య పదార్థాన్ని ప్రతిజనకం అంటారు. రసాయనికంగా ఇది ఏదైనా కావచ్చు. దీనికి విరుద్ధంగా శరీరంలోని ఆ ృ లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాలు ప్రతిదేహకాలు అనే జీవ క్షిపణులను విడుదల చేస్తాయి. కాంబినేషన్ వ్యాక్సిన్: నాలుగు, అంతకంటే ఎక్కువ వ్యాధి కారకాలకు నిరోధక ఔషధాలు ఉంటే కాంబినేషన్ టీకా అంటారు. భారత్‌లో ప్రస్తుతం ఇలాంటి రెండు టీకాలు ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. అవి.. టెట్రావలెంట్ టీకా(నాలుగు వ్యాధులకు), పెంటావలెంట్ టీకా(ఐదు వ్యాధులకు). తొలిసారిగా ఇలాంటి టీకాలను ప్రభుత్వం కేరళ, తమిళనాడులో పెలైట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది.