C. Hari Krishna
-
ఇమ్యునాలజీ పితామహుడు ఎవరు?
రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోకి ప్రవేశించిన వ్యాధి కారకాన్ని గుర్తించి నిర్మూలించే వ్యవస్థను అసంక్రామ్యత వ్యవస్థ లేదా రోగ నిరోధక వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరానికి రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పెరుగుతుంది. అసంక్రామ్యత వ్యవస్థ అధ్యయనం ద్వారా టీకాలను అభివృద్ధి చేశారు. ఇమ్యూనిటీ - రకాలు మానవుడిలో ఇమ్యూనిటీ రెండు రకాలు. అవి.. స్వాభావిక, స్వీకృత ఇమ్యూనిటీలు. పుట్టుకతోనే లభించేది స్వాభావిక ఇమ్యూనిటీ. శరీరంలోకి ఏ వ్యాధి కారకం ప్రవేశించక ముందే ఈ ఇమ్యూనిటీ ఉంటుంది. చర్మం, శ్లేష్మస్తరాలు బాహ్య అవరోధాలుగా వ్యవహరిస్తూ స్వాభావిక ఇమ్యూనిటీని అందిస్తాయి. వీటికి అదనంగా బ్యాక్టీరియా నాశినిగా పనిచేసే కంటిలోని లైసోజైం అనే ఎంజైమ్, జఠర రసంలోని హైడ్రో క్లోరిక్ ఆమ్లం కూడా స్వాభావిక ఇమ్యూనిటీని అందిస్తాయి. అందరిలో స్వాభావిక ఇమ్యూనిటీ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఆర్జించే ఇమ్యూనిటీ.. స్వీకృత లేదా ఆర్జిత ఇమ్యూనిటీ. ఒక వ్యక్తి నివసించే ప్రాంతం, తాగే నీరు, పీల్చే గాలి, ఆహారపు అలవాట్లపై ఇది ఆధారపడుతుంది. కాబట్టి ఇది అందరిలోనూ ఒకే విధంగా ఉండదు. మానవుడిలో ఇమ్యూనిటీ వ్యవస్థ మానవుడి ఇమ్యూనిటీ వ్యవస్థలో తెల్ల రక్త కణాలు, లింఫాయిడ్ అవయవాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు శరీర రక్షక భటుల లాంటివి. వీటిలో ఇసినోఫిల్స్ అలర్జీ చర్యల్లో పాల్గొనగా, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ భక్షక కణాలుగా వ్యవహరిస్తాయి. లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాలు చాలా కీలకమైనవి. ఇవి రెండు రకాలు ఖీ - లింఫోసైట్స్, ఆ - లింఫోసైట్స్. ఖీ- లింఫోసైట్స్ మళ్లీ రెండు రకాలు - ఇఈ4/ఖీ4, ఇఈ8 కణాలు. ఇమ్యూనిటీ వ్యవస్థలోని అవయవాలు రెండు రకాలు. ఎముక మజ్జ, థైమస్ అనేవి ప్రాథమిక అవయవాలు. ఎముక మజ్జలో లింఫోసైట్స్ ఏర్పడతాయి. ఆ లింఫోసైట్స్ మాత్రం ఎముక మజ్జలో పరిపక్వత చెందగా, ఫోసైట్స్ థైమస్ నుంచి విడుదలయ్యే థైమోసిన్ హార్మోన్ ప్రేరణతో పరిపక్వత చెందుతాయి. స్పెసిఫిక్ ఇమ్యూనిటీ ఖీ, ఆ లింఫోసైట్స్ ద్వారా లభించే నిరోధక శక్తిని స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటారు. వ్యాధి కారకం ఉపరితలంపై ఉన్న ప్రతిజనకం ఆధారంగా దీన్ని గుర్తించి ఖీ ృ లింఫోసైట్స్ అందించే ఇమ్యూనిటీని సెల్యూలార్ లేదా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటారు. వ్యాధి కారకాన్ని గుర్తించి ఖీ ృ లింఫోసైట్స్ భక్షక కారకాలను ప్రేరేపిస్తాయి. ఫలితంగా భక్షక కణాలు వ్యాధి కారకాన్ని భక్షిస్తాయి. కొన్ని సందర్భాల్లో వ్యాధి కారకాన్ని నేరుగా ఖీ ృ లింఫోసైట్స్ నాశనం చేస్తాయి. ముఖ్యంగా ఇఈ8 కణాలు ఈ విధంగా వ్యవహరిస్తాయి. కొన్ని ఖీ4 లింఫోసైట్స్ వ్యాధి కారకాన్ని గుర్తించిన వెంటనే ఆ లింఫోసైట్స్‌ను ప్రేరేపిస్తాయి. ఈ విధంగా ప్రేరణకు గురైన ఆ ృ లింఫోసైట్స్ వ్యాధి కారకానికి విరుద్ధంగా ప్రత్యేకంగా ప్రతిదేహకాలు లేదా ప్రతిరక్షకాల (అ్టజీఛౌఛీజ్ఛీట)ను విడుదల చేస్తాయి. ఇవి వ్యాధి కారకం ఉపరితలంపై ప్రతి జనకం ఆధారంగా దాన్ని గుర్తించి నాశనం చేస్తుంది. అంతేగాకుండా కొన్ని ఆ ృ కణాలు వ్యాధి కారకాన్ని గుర్తుపెట్టుకునే ఇమ్యునలాజికల్ మెమొరీ అనే గుణాన్ని ప్రదర్శిస్తాయి. అదే వ్యాధి కారకం మళ్లీ శరీరంలోకి ప్రవేశిస్తే ఈ సారి అధిక మోతాదులో వేగంగా ప్రతిదేహకాలు విడుదలై దాన్ని పూర్తిగా నిరోధిస్తాయి. ఈ రకంగా ప్రతిదేహకాల ద్వారా ఆ ృ లింఫోై సెట్స్ అందించే ఇమ్యూనిటీయే హ్యుమొరల్ ఇమ్యూనిటీ. వ్యాక్సిన్ టీకా లేదా వ్యాక్సిన్ అనేది ఒక నివారణ ఔషధం. వ్యాధి కారకం శరీరంలోకి చేరకముందే దీన్ని ఇస్తారు. దాంతో భవిష్యత్తులో సంక్రమించడానికి అవకాశమున్న వ్యాధి కారకాన్ని నిరోధించడానికి వీలవుతుంది. కేవలం చిన్న పిల్లలకే కాకుండా పెద్దలు కూడా వేయించుకునే టీకాలు ఉంటాయి. సాధారణంగా టీకాలు రెండు రకాలు. సంప్రదాయ, ఆధునిక టీకాలు. సంప్రదాయ టీకాల్లో క్షీణింపజేసిన లేదా మృత వ్యాధి కారకాలు ఉంటాయి. ఇలాంటి వాటిని అందించడం ద్వారా వ్యాధి అభివృద్ధి చెందదు. అయితే వ్యాధికారక ఉపరితలంపై ఉన్న ప్రతిజనకానికి విరుద్ధంగా శరీరంలో ప్రతిదేహకాలు విడుదలై మెమొరీ అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి టీకాను రెండు లేదా మూడుసార్లు వేయించినట్లయితే శరీరంలో ఆ వ్యాధికి విరుద్ధంగా పూర్తిస్థాయి నిరోధకత లభిస్తుంది. ఉదా: ఓరల్ పోలియో వ్యాక్సిన్ , డీపీటీ వ్యాక్సిన్. సంప్రదాయ టీకాల్లో కొన్ని లోపాలను అధిగమించడానికి ఆధునిక టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక టీకాల్లో శుద్ధమైన ప్రతిజనకం లేదా వ్యాధి కారకానికి చెందిన ఉపరితల భాగం ఉంటాయి. ఇవి సంప్రదాయ టీకాల కంటే సురక్షితమైనవి. ఉదా: హెపటైటిస్ అ, ఆ టీకాలు. స్థిరమైన ప్రతిజనకం లేని కారణంగా హెచ్ఐవీ లాంటి వాటికి విరుద్ధంగా టీకాలేవీ అందుబాటులోకి రాలేదు. భారత టీకా కార్యక్రమం 1975లో ప్రపంచవ్యాప్తంగా మశూచిని పారదోలిన తర్వాత భారత ప్రభుత్వం 1978లో ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఉ్కఐ) అనే టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1974లో ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన నమూనా ఆధారంగా భారత్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 1990 నాటికి దేశంలోని చిన్నారులందరికీ టీకాలు అందించాలనేది దీని లక్ష్యం. 1985లో యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ను ప్రభుత్వం ప్రారంభించి, 1990 నాటికల్లా 85 శాతం చిన్నారులకు టీకాలను అందించాలని నిర్ణయించింది. 1990 నాటికి టీకాల ఉత్పాదనలో స్వయం సమృద్ధిని సాధించాలనేది కూడా దీని లక్ష్యం. ఆ తర్వాత కొన్ని ఇతర కార్యక్రమాల్లో భాగంగా అమలు చేశారు. ప్రస్తుతం జాతీయ ఆరోగ్య మిషన్‌లో టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్న టీకాలు కనీసమైనవి, కచ్చితమైనవి. గర్భిణులకు రెండు డోసుల ఖీ.ఖీ (టెటనస్ టాక్సాయిడ్) టీకాను ఇస్తున్నారు. నవజాత శిశువులకు కింది ప్రాణాంతక వ్యాధులకు నివారణగా టీకాలను అందిస్తున్నారు. క్షయ - బాసిల్లస్ కాల్మేట్ గ్వెరిన్ పోలియో-ఓరల్ పోలియో వ్యాక్సిన్ డిఫ్తీరియా - డీపీటీ పర్టుసిస్ - డీపీటీ టెటనస్ - డీపీటీ మీజిల్స్ - మీజిల్స్ హెపటైటిస్ఆ - హెప్ఆ వీటికి అదనంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో జపనీస్ ఎన్సిఫలైటీస్ టీకాను అందుబాటులోకి తీసుకువచ్చారు. త్వరలో నీమోకోకల్ కాంజు గేట్, హ్యూమన్ పాపిల్లోమ, రోటా, హెచ్ఐబీ (హీమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బి) టీకాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం అందిస్తున్న టీకాలకు అదనంగా కూడా కొన్ని కచ్చిత టీకాలను పిల్లలకు ఇవ్వాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియా ట్రిక్స్(ఐఏపీ) సూచిస్తోంది. మంప్స్ - ఎంఎంఆర్ టీకా మీజిల్స్ - ఎంఎంఆర్ టీకా రుబెల్లా - ఎంఎంఆర్ టీకా పోలియో - ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ టైఫాయిడ్ - టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ హీమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బి (హెచ్ఐబీ) సర్వైకల్ క్యాన్సర్ - హ్యూమన్ పాపిల్లోమ వీటికి అదనంగా కూడా కొన్ని ఐచ్ఛిక టీకా లను ఐఏపీ సూచిస్తోంది. హెపటైటిస్ ఎ - హెప్ ఎ అమ్మవారు - వారి సెల్ల ప్రతిజనకం: వ్యాధి కారకం ఉపరితలంపై ఉంటూ శరీర నిరోధక శక్తిని ప్రేరేపించే అన్య పదార్థాన్ని ప్రతిజనకం అంటారు. రసాయనికంగా ఇది ఏదైనా కావచ్చు. దీనికి విరుద్ధంగా శరీరంలోని ఆ ృ లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాలు ప్రతిదేహకాలు అనే జీవ క్షిపణులను విడుదల చేస్తాయి. కాంబినేషన్ వ్యాక్సిన్: నాలుగు, అంతకంటే ఎక్కువ వ్యాధి కారకాలకు నిరోధక ఔషధాలు ఉంటే కాంబినేషన్ టీకా అంటారు. భారత్‌లో ప్రస్తుతం ఇలాంటి రెండు టీకాలు ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. అవి.. టెట్రావలెంట్ టీకా(నాలుగు వ్యాధులకు), పెంటావలెంట్ టీకా(ఐదు వ్యాధులకు). తొలిసారిగా ఇలాంటి టీకాలను ప్రభుత్వం కేరళ, తమిళనాడులో పెలైట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. -
మధుమేహ రోగులు అధికంగా ఉన్న దేశం?
మానవ శరీర ధర్మశాస్త్రం శరీరంలోని వివిధ భాగాల మధ్య అర్థవంతమైన సమన్వయం చాలా అవసరం. మానవునిలో దీనికోసం నాడీ వ్యవస్థ, అంతస్రావిక వ్యవస్థలు ఉన్నాయి. నాడీ వ్యవస్థలో నాడీ ప్రచోదనం అనే నాడీ సమాచార ప్రసారం ద్వారా వేగవంతమైన సమన్వయం సాధ్యమవుతుంది. అంతస్రావిక వ్యవస్థలోని అంతస్రావిక గ్రంథుల నుంచి విడుదలయ్యే హార్మోన్లు కూడా కీలకమైన సమన్వయాన్ని నిర్వహిస్తాయి. నాడీకణం నాడీ వ్యవస్థలోని ప్రతి భాగం నాడీకణాలతో నిర్మితమై ఉంటుంది. నాడీ కణాలకు కణవిభజన శక్తి ఉండదు. నాడీ కణాల సంఖ్య స్థిరంగా ఉంటుంది. మిగతా శరీర కణాల కంటే నాడీ కణాలు పొడవుగా ఉంటాయి. నాడీ కణం లో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. అవి: వెడల్పాటి కణదేహం, పొడవైన ఏక్సాన్. కణదేహం (Cyton)లో కేంద్రకం ఉంటుంది. కేంద్రకం చుట్టూ నిస్సల్స్ కణికలు ఉంటాయి. కణదేహం అంతా డెండ్రైట్స్ అనే విభజనలు ఉంటాయి. ఏక్సాన్ తంతువు చివరన టెలిడెండ్రైట్స్ ఉంటాయి. ఏక్సాన్ చుట్టూ మైలిన్పొర విద్యుత్ బంధకంగా వ్యవహరిస్తుంది. దీని చుట్టూ న్యూరిలెమ్మా ఉంటుంది. న్యూరిలెమ్మా, మైలిన్ పొరల మధ్య ప్రత్యేకంగా ష్క్వాన్ కణాలు ఉంటాయి. నాడీ ప్రచోదనం నాడీ వ్యవస్థలోని ప్రతి భాగం నాడీ కణాలతో నిర్మితమై ఉంటుంది. మెదడు, వెన్నుపాము నాడులన్నీ నాడీ కణాలతోనే నిర్మితమై ఉంటాయి. అనేక నాడీకణాలు ఒక దాని వెనుక మరొకటి చేరి ఒక సమూహంగా ఏర్పడితే, దాన్ని ‘నాడు’ అంటారు. ఒక నాడులోని నాడీకణాల ద్వారా సాగే నాడీ సమాచారం ప్రసారమే నాడీ ప్రచోదనం. ఇది విద్యుత్ రూపంలో ప్రసారమవుతుంది. నాడీ ప్రచోదనం రెండు నాడీ కణాల మధ్య రసాయన మాధ్యమంతో ముందుకు సాగుతుంది. నాడీ ప్రచోదనంలో ఉపయోగపడే ఈ రసాయనాలను న్యూరోట్రాన్సమీటర్లు అంటారు. నాడీ వ్యవస్థ భాగాలు నాడీ వ్యవస్థను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి: కేంద్ర, పరధీయ, స్వయంచోదిత నాడీ మండలాలు. మెదడు, వెన్నుపాములను కలిపి కేంద్ర నాడీ మండలం అంటారు. ఈ రెండూ అతి సున్నితమైన భాగాలు. వీటి చుట్టూ మూడు రక్షణ పొరలు, మెనింజిస్ ఉంటాయి. కపాలం అనే అస్థిపంజర నిర్మాణంలో మెదడు, వెన్నెముకలోని వెన్నుపాము సురక్షితంగా ఉంటాయి. మెదడులో అతిపెద్ద భాగం మస్తిష్కం. ఇది రెండు మస్తిష్క గోళార్ధాల రూపంలో ఉంటుంది. మస్తిష్కం తెలివి తేటలు, ఆలోచన, జ్ఞాపకశక్తి, విచక్షణా శక్తి, సమస్యా పరిష్కారం లాంటి గుణాలను, అనేక భావాలను నియంత్రిస్తుంది. మస్తిష్కం తర్వాత మెదడులోని పెద్ద భాగం అనుమస్తిష్కం. ఇది శరీర చలనాన్ని, సమన్వయాన్ని, కండర సంకోచాలను నియంత్రిస్తుంది. బ్రెయిన్స్టెంలో పాన్‌స అనే భాగం మెదడు వెన్నుపాముల మధ్య సమాచార మార్పిడికి ఒక రిలే కేంద్రంగా వ్యవహరిస్తుంది. పాన్‌స కింద మజ్జాముఖం ఉంటుంది. ఇది ప్రధానంగా శ్వాసను నియంత్రిస్తుంది. మస్తిష్కం కింద ఉండే అథాపర్యంకం (Hypothalamus) శరీర ఉష్ణోగ్రత, ఆకలి, దప్పిక, నిద్ర, లైంగిక వాంఛలను నియంత్రిస్తుంది. మెదడు, కింది భాగం వెన్నుపాముగా కొనసాగుతుంది. వెన్నుపాము ఒక సెంటీ మీటర్ మందంలో ఉంటుంది. ఇది అసంకల్పిత ప్రతీకార చర్యలను నియంత్రిస్తుంది. మెదడు, వెన్నుపాముల నుంచి సాగే నాడులన్నీ కలిిసి పరధీయ నాడీ మండలం ఏర్పడుతుంది. మెదడు నుంచి సాగే నాడులను ‘మస్తిష్క/ కపాల నాడులు’ అంటారు. ఇవి 12 జతలు. వెన్నుపాము నుంచి సాగే నాడులను ‘వెన్నునాడులు’ అంటారు. ఇవి 31 జతలు. కేంద్ర నాడీ మండలానికి సంబంధం లేకుండా వ్యవహరించే నాడీ కేంద్రాల వల లాంటి నిర్మాణం, స్వయంచోదిత నాడీ మండలం సహానుభూత, పరసహానుభూత వ్యవస్థలు అనే రెండు రకాలుగా స్వయంచోదిత నాడీ వ్యవస్థ విభజన చెంది ఉంటుంది. అంతస్రావిక వ్యవస్థ అంతస్రావిక వ్యవస్థలో అంతస్రావిక గ్రంథులు, వాటి నుంచి హార్మోన్లు అనే రసాయన విభాగాలు ఉంటాయి. అంతస్రావిక గ్రంథులు వాటి స్రావితాలను, ఏ నాళం సాయం లేకుండా నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. వీటిని వినాళ గ్రంథులు అంటారు. ఇవి శరీరంలోని వివిధ భాగాల్లో ఉంటాయి. ఒక అంతస్రావిక గ్రంథి ద్వారా రక్తంలోకి విడుదలై, రక్తం ద్వారా ఇతర భాగాలకు చేరి, క్రియాశీల చర్యలను నియంత్రించే రసాయనాలను హార్మోన్లు అంటారు. మెదడు కింది భాగంలో పీయూష గ్రంథి ఉంటుంది. దీనిలో పూర్వ, మధ్యస్థ, పర లంబికలు ఉంటాయి. పూర్వలంబిక నుంచి ట్రాపిన్స అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి కొన్ని ఇతర అంతస్రావిక గ్రంథులను ప్రేరేపిస్తాయి. పూర్వలంబిక నుంచి విడుదలయ్యే పెరుగుదల హార్మోన్ శారీరక పెరుగుదలను ప్రేరేపిస్తుంది. దీని అల్పస్రావం ద్వారా పిల్లల్లో మరుగుజ్జుత నం వస్తుంది. అధికస్రావం వల్ల జెగాంటిజం (అతిదీర్ఘకాయం)వస్తుంది. మధ్యస్థలంబిక నుంచి మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (MSH) విడుదలవుతుంది. పరలంబిక నుంచి విడుదలయ్యే ఆక్సిటోసిన్ శిశు జననానికి తోడ్పడుతుంది. వాసోప్రెసిన్ అతిమూత్రాన్ని నిరోధిస్తుంది. మెడలో వాయునాళానికి ముందుగా స్వరపేటిక దిగువన అవటు గ్రంథి ఉంటుంది. దీని నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది జీవక్రియారేటును నియంత్రిస్తుం ది. థైరాక్సిన్ లోపం వల్ల క్రెటినిజం అనే మానసిక, శారీరక మాంద్యంతో శిశువు పుట్టే ప్రమాదముంది. పెద్దల్లో థైరాక్సిన్ అల్పస్రావం ద్వారా మిక్సోడియ/ గల్స్ వ్యాధి అధిక స్రావం ద్వారా గ్రేవ్స వ్యాధి/ ఎక్సాఫ్తాల్మిక్ గాయిటర్ వస్తాయి. అవటుకు దగ్గరగా నాలుగు చిన్న పార్శ్వ అవటు గ్రంథులుంటాయి. వీటి నుంచి పారాథార్మోన్ విడుదలవుతుంది. అవటు నుంచి విడుదలయ్యే కాల్సిటోనిన్ అనే హార్మోన్‌తో కలిసి పారాథార్మోన్ రక్తంలో కాల్షియం శాతాన్ని నియంత్రిస్తుంది. క్లోమం క్లోమం జీర్ణాశయం కింది భాగాన, చిన్న పేగులోకి తెరుచుకొని ఉంటుంది. ఇది ఒక మిశ్రమ గ్రంథి. దీనిలోని అంతస్రావిక భాగం లాంగర్హన్స పుటికలు. క్లోమంలోని ఆల్ఫా కణాలు గ్లూకగాన్ హార్మోన్‌ను, బీటా కణాలు ఇన్సులిన్‌ను విడుదల చేస్తాయి. ఈ రెండు హార్మోన్లు కలిసి రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి. గ్లూకగాన్ రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది. ఇన్సులిన్ తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర శాతం పెరిగి, శరీర అవయవాల పనితీరు దెబ్బతినే రుగ్మతను ‘మధుమేహం’ (Diabetes mellitus) అంటారు. ఇది రెండు రకాలు. పూర్తిగా ఇన్సులిన్ ఏర్పడక పోవడం ద్వారా సంభవించేది టైప్-1 మధుమేహం. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం లేదా సరిగా పనిచేయకపోవడం ద్వారా సంభవించేది రెండో రకం మధుమేహం. రక్తంలో చక్కెర శాతం పెరిగే కొద్దీ రక్త సరఫరాకు అవరోధం ఏర్పడి, వివిధ అవయవాల పనితీరు దెబ్బతింటుంది. గాయాలు తొందరగా మానవు. పాదాల్లో అల్సర్లు ఏర్పడతాయి. మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. కంటి చూపు మందగిస్తుంది (డయాబెటిక్ రెటినోపతి). చివరకు గుండె పనితీరు దెబ్బతిని, వ్యక్తి కోమా స్థితిలోకి చేరి మరణిస్తాడు. అధివృక్క గంథ్రి అధివృక్క గ్రంథులు మూత్రపిండాలపై టోపిలా కనిపిస్తాయి. వీటి నిర్మాణంలో రెండు భాగాలుంటాయి. వెలుపలి వల్కలం (Cortex), లోపలి దవ్వ (Medulla) వల్కలం నుంచి విడుదలయ్యే కార్టికాయిడ్‌స మూడు రకాలు. గ్లూకో, ఖనిజ, లైంగిక కార్డికాయిడ్స దవ్వ నుంచి ఎపినెఫ్రిన్ (అడ్రినలిన్) నార్ ఎపినెఫ్రిన్ (నార్ అడ్రినలిన్) అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఈ రెండూ ఎమర్జెన్సీ లేదా పోరాట పలాయన హార్మోన్లు. బీజకోశాలు పురుష బీజ కోశాలైన ముష్కాలు, స్త్రీ బీజ కోశాలైన అండాశయాలు లైంగిక హార్మోన్లను విడుదల చేస్తాయి. పురుష లైంగిక హార్మోన్లు ఆండ్రోజెన్స. వీటిలో ప్రధానమైంది టెస్టోస్టిరాన్. స్ట్రీ లైంగిక హార్మోన్లు ఈస్ట్రోజెన్స. వీటిలో ప్రధానమైంది బీటా-ఈస్ట్రడయోల్. ఈ లైంగిక హార్మోన్లు స్త్రీ, పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని ప్రేరేపిస్తాయి. అదనంగా జీర్ణకోశం నుంచి కొన్ని హార్మోన్లు, మెదడులో ఉండే పీనియల్ గ్రంథి నుంచి మెలటోనిన్ అనే హార్మోన్, యుక్తవయసు వరకు మాత్రమే ఉండే బాలగ్రంథి (థైమస్) నుంచి థైమోసిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. మాదిరి ప్రశ్నలు 1. మెదడులో థర్మోస్టాట్‌గా పనిచేసే భాగం? 1) మస్తిష్కం 2) అనుమస్తిష్కం 3) అథాపర్యంకం 4) మజ్జాముఖం 2. {పపంచ అల్జీమర్స దినం? 1) ఏప్రిల్ 2 2) మే 14 3) జూన్ 23 4) సెప్టెంబరు 21 3. జపనీస్ ఎన్సిఫలైటిస్ కారక వైరస్ ఏది? 1) ఫ్లేమి వైరస్ 2) టోగా 3) ఆల్ఫా 4) పాక్స్ 4. ఏ న్యూరో ట్రాన్‌సమీటర్ లోపం ద్వారా పార్కిన్‌సన్‌స వ్యాధి వస్తుంది? 1) అసిటైల్ కొలిన్ 2) డోపమైన్ 3) సెరటోనిన్ 4) గ్లైసిన్ 5. మనిషి మెదడు సగటు బరువు ఎంత? 1) 1350 గ్రాములు 2) 1800 గ్రాములు 3) 2000 గ్రాములు 4) 1000 గ్రాములు 6. మెదడులోని ఏ భాగానికి గాయమైతే, శ్వాస ఆగిపోయి వ్యక్తి మరణించే ప్రమాదం ఉంటుంది? 1) మస్తిష్కం 2) అనుమస్తిష్కం 3) మజ్జాముఖం 4) అథాపర్యంకం 7. మెదడులో ఏర్పడే అసాధారణ పరిస్థితులను తెలుసుకోవడానికి వినియోగించే నిర్ధారణ పరీక్ష ఏది? 1) ఎక్స్‌రే 2) అల్ట్రాసౌండ్ స్కానింగ్ 3) మ్యాగ్నెటిక్ రెసొనెన్స ఈమేజింగ్ 4) ఎండోస్కోపి 8. హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించింది? 1) బ్యాంటింగ్, బెస్ట్ 2) యంగ్వల్, పర్లమన్ 3) అలెక్ జెఫ్రీస్ 4) బేలిస్, స్టార్లింగ్ 9. మధుమేహ రోగులు అధికంగా ఉన్న దేశం ఏది? 1) భారత్ 2) చైనా 3) అమెరికా 4) బ్రెజిల్ 10. పుట్టుకతోనే శరీరంలోని ఏ భాగంలోనూ మెలనిన్ ఏర్పడని జన్యు వ్యాధి? 1) విటిలిగో 2) ల్యూకోడెర్మ 3) పైబాల్డ్ 4) ఆల్బినిజం 11. థైరాక్సిన్ ఏర్పడటానికి అవసరమయ్యే ఖనిజం ఏది? 1) అయోడిన్ 2) ఇనుము 3) కాల్షియం 4) మాంగనీస్ 12. ఆహారంలో తగినంత అయోడిన్ లోపిస్తే, అవటు గ్రంథి? 1) క్షీణిస్తుంది 2) బంతిలా వాచిపోతుంది 3) పూర్తిగా అదృశ్యం అవుతుంది 4) ఏ మార్పూ ఉండదు సమాధానాలు 1) 3; 2) 4; 3) 1; 4) 2; 5) 1; 6) 3; 7) 3; 8) 4; 9) 2; 10) 4; 11) 1; 12) 2 కాంపిటీటివ్ కౌన్సెలింగ్ సివిల్స్ ప్రిలిమ్స్‌లో చరిత్రలో ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి? ఏయే అంశాలపై దృష్టి సారించాలి? - ఎస్.ప్రకాశ్ రెడ్డి, హైదరాబాద్. చరిత్రలో ‘ప్రాచీన భారతదేశ చరిత్ర’ నుంచి 3 నుంచి 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రాచీన ప్రాంతాలు, పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన కట్టడాలు, పరికరాలు, సింధూనాగరికత, ఆర్యులు, మత ఉద్యమాలు, మౌర్యుల పరిపాలనాంశాలు, గుప్తుల సాంస్కృతిక సేవ లాంటి అంశాలపై దృష్టి సారించాలి. ‘మధ్య యుగ భారతదేశ చరిత్ర’కు సంబంధించి సూఫీ, భక్తి ఉద్యమకారుల ప్రభావం, ఢిల్లీ, మొగల్ చక్రవర్తుల సాహిత్య, సాంస్కృతిక సేవ, విజయనగర - బహమనీ రాజ్యాల ప్రభావం, దక్షిణ భారతంలో చోళ, పాండ్య రాజ్యాల ఆర్థిక, శిల్పకళా రంగాలు, దక్షిణ భారతదేశం సందర్శించిన యాత్రికులు, వారి రచనల్లోని అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అదేవిధంగా బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ప్రభావం, సామాజిక సంస్కరణోద్యమాలు, స్వాతంత్రోద్యమంలోని దశలు, స్వాతంత్య్రం అనంతరం పరిస్థితులపై పట్టు సాధించాలి. గత మూడు, నాలుగేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో అర్థమవుతుంది. 2008 సివిల్స్‌లో కింది ప్రశ్నను అడిగారు. ప్రశ్న: జతపర్చండి. -1 (సూఫీమతం) ఎ) చిస్తీ సిల్సిలా బి) నక్షబంది సిల్సిలా సి) ఖాద్రీ సిల్సిలా డి) సౌహాద్రి సిల్సిలా 2 (నాయకులు) 1) షేక్ అహ్మద్ షేర్‌హింద్ 2) షేక్ బహ్రూద్దీన్ జకారియా 3) షేక్ హమీదుద్దీన్ 4) సయ్యద్ ముక్దుమ్ మహ్మద్ గిలాని 1) ఎ-3, బి-4, సి-1, డి-2 2) ఎ-1, బి-4, సి-3, డి-2 3) ఎ-3, బి-1, సి-4, డి-2 4) ఎ-1, బి-3, సి-4, డి-2 సమాధానం: 3 1857 సిపాయిల తిరుగుబాటును ‘నాగరికత- అనాగరికతల’ తిరుగుబాటుగా పేర్కొన్నవారు ఎవరు? 1869లో కార్ల్‌మార్క్స్ ఈ తిరుగుబాటును ఏమని వ్యాఖ్యానించాడు? లాంటి ప్రశ్నలు అడిగే అవకాశముంది. ‘గాంధీయుగం’ నుంచి గాంధీ వ్యక్తిత్వం, పోరాట పద్ధతులు, సత్యాగ్రహం + అహింస ప్రాధా న్యం, 1942 క్విట్ ఇండియాలో ‘డూ ఆర్ డై’ అని ఎందుకు పిలుపునిచ్చారు? దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఆసియన్ల హక్కుల కోసం పోరాడటానికి కారణాలు, గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. ఈ సమాచారమంతా ప్రామాణిక పాఠ్యపుస్తకాల్లో లభిస్తుంది. చదువుతున్నప్పుడే అర్థం చేసుకున్న అంశాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. అప్పుడే సబ్జెక్టుపై ప్రాథమిక అవగాహన వస్తుంది. సివిల్ సర్వీసెస్, కాలేజ్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించిన నెట్/ స్లెట్ ప్రశ్న పత్రాల్లోంచి 50 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. పాత విషయాలే కాకుండా, నూతన, సమకాలీన, సాంస్కృతిక పరమైన అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమినరీ పరీక్ష జ్ఞానానికి సంబంధించిందే తప్ప, సబ్జెక్టుకు సంబంధించింది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది కేవలం వడపోత (ఎలిమినేట్) చేయడానికి నిర్వహించేది మాత్రమే. డాక్టర్ పి.మురళి, సీనియర్ ఫ్యాకల్టీ, నిజాం కాలేజ్, హైదరాబాద్. -
బట్టమేక పక్షి శాస్త్రీయ నామం?
జీవశాస్త్ర పరిచయం భూమిపై ఎన్నో వైవిధ్యభరితమైన జీవులుంటాయి. జీవుల శాస్త్రీయ అధ్యయనమే బయాలజీ. సుమారు 4.5-5 బిలియన్ ఏళ్ల క్రితం భూమి ఏర్పడింది. భూమి ఏర్పడిన 1 నుంచి 1.5 బిలియన్ ఏళ్ల తర్వాత జీవం ఆవిర్భవించింది. ఆ తర్వాత జరిగిన జీవ పరిణామం ద్వారా ఎన్నో రకాలు జీవులు ఆవిర్భవించాయి. * భూమిపై జీవ ఆవిర్భావాన్ని వివరించే సిద్ధాంతాల్లో ప్రధానమైంది పాన్‌స్పెర్మియ, జీవావిర్భావ సిద్ధాంతాలు. పాన్‌స్పెర్మియ సిద్ధాంతం ప్రకారం భూమిపై జీవులు ఆవిర్భవించనే లేదు. భూమి వెలుపల నుంచి గ్రహ శకలాల ద్వారా లేదా గ్రహాంతర వాసుల ద్వారా భూమిపైకి చేరి ఆ తర్వాత పరిణామం చెందాయని ఈ సిద్ధాంతం వి వరిస్తోంది. స్వాంటె అర్హీనియస్ దీన్ని వివరించాడు. ప్రస్తుతం అధిక ఆమోదంలో ఉన్న సిద్ధాంతం ఖీజిౌ్ఛటడ ౌజ ౌటజజీ ౌజ జీజ్ఛ(జీవావిర్భావ సిద్ధాంతం). దీన్ని అ.ఐ. ఒపారిన్ అనే రష్యాకు చెందిన జియోకెమిస్ట్, జేబీఎస్ హాల్టేన్ అనే బ్రిటన్ జన్యుశాస్త్రవేత్తలు స్వతంత్రంగా ప్రతిపాదించారు. వీరు ప్రతిపాదించిన వివరాల ప్రకారం భూమిపై జీవావిర్భావానికి ముందు జీవ రసాయనాలు ఆవిర్భవించాయి. * పూర్వభూమి వాతావరణం కార్బన్, హై డ్రోజన్, నత్రజని వాయువుల మిశ్రమంగా ఉండేది. నీరు, నీటి ఆవిరి ఉన్నప్పటికీ స్వేచ్ఛా ఆక్సిజన్ ఉండేది కాదు. ఇలాంటి వాతావరణాన్ని క్షయకరణ (ఖ్ఛఛీఠఛిజీజ) వాతావరణం అంటారు. అప్పటి అధిక ఉష్ణోగ్రతల ప్రభావానికి కార్బన్, హైడ్రోజన్, నత్రజని మధ్య రసాయన చర్యలు జరిగి మీథేన్, హైడ్రోజన్ సయనైడ్, అమోనియా లాంటివి ఏర్పడ్డాయి. వీటితో నీటి ఆవిరి చర్యపొందడం ద్వారా ప్రస్తుతం కేవ లం జీవుల్లో మాత్రమే కనిపించే అమైనో ఆమ్లాలు, చక్కెరలు, కొవ్వు ఆమ్లాలు, నత్రజని క్షారాలు లాంటి సరళ జీవ రసాయనాలు ఏర్పడ్డాయి. ఈ సరళమైన అణువుల మధ్య చర్యల ద్వారా ప్రోటీన్లు, కొవ్వులు, కేంద్రకామ్లాలు, పిండి పదార్థాలు తయారయ్యాయి. సముద్ర నీటిలో ఈ రసాయనాలు కలిసిపోయి జరిగిన కొన్ని చర్యల ద్వారా పూర్వపర జీవకణం ఏర్పడింది. * భూమిపై ఏర్పడిన మొదటి జీవులన్నీ అవాయుజీవులు (అ్చ్ఛటౌఛ్ఛట). వీటి చర్యల ద్వారా నీటి అణువు విచ్ఛిన్నమై క్రమంగా స్వేచ్ఛా ఆక్సిజన్ విడుదలైంది. ఆ తర్వాత మొక్కలు ఆవిర్భవించి వాటిలోని కిరణజన్య సంయోగక్రియ ద్వారా మరింత ఆక్సిజన్ వాతావరణంలోకి విడుదలైంది. ప్రస్తుతం భూమిపై ఉన్న 21 శాతం ఆక్సిజన్‌కు ప్రధాన మూలం మొక్కల్లోని కిరణజన్య సంయోగక్రియ. భూమిపై జీవం ఆవిర్భవించిన తర్వాత, జీవ పరిణా మం జరిగింది. సరళస్థాయి నుంచి సంక్లిష్ట స్థాయి జీవులు ఎలా పరిణామం చెందాయన్నది మూడు ప్రధాన సిద్ధాంతాలు వివరిస్తాయి. వీటిలో మొదటిది ‘ఫ్రాన్సకు చెందిన జంతుశాస్త్రవేత్త జె.బీ.లామార్‌క ప్రతిపాదించిన ఆర్జిత లక్షణాల అనువంశిక సిద్ధాంతం (ఖీజిౌ్ఛటడ ౌజ ఐజ్ఛిటజ్ట్చీఛ్ఛి ౌజ అ్ఞఠజీట్ఛఛీ ఛిజ్చిట్చఛ్ట్ఛిటట). పర్యావరణ ప్రభావం ద్వారా జీవుల్లో కొత్త లక్షణా లు ఏర్పడి అవి తర్వాతి తరాలకు అవిచ్ఛిన్నంగా సంక్రమించడం ద్వారా కొత్త జాతు లు ఆవిర్భవిస్తాయని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. ఇంగ్లండ్‌కు చెందిన ఛార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకృతివరణ సిద్ధాంతం.దీని ప్రకారం ప్రకృతిలోని పోటీ ఫలితంగా ఆ పోటీ తట్టుకొని నిలిచే జీవజాతులను ప్రకృతి వరిస్తుంది. హ్యూగోడివ్రీస్ అనే డచ్ వృక్ష శాస్త్రవేత్త ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. * భూమిపై ఉన్న జీవులను వర్గీకరించడం ద్వారా వాటిపై సమగ్ర అవగాహన సాధ్యమవుతుంది. అన్ని జీవులు పెరుగుదల, జీవక్రియ, ప్రత్యుత్పత్తి లాంటి సమాన లక్షణాలను ప్రదర్శించినప్పటికీ వాటిలోని కొన్ని ప్రత్యేకతల కారణంగా వాటిని విభజించాల్సిన అవసరముంటుంది. భూ మిపై ఉన్న జీవులన్నింటినీ మొక్కలు, జంతువులు అనే రెండు రకాలుగా అరిస్టాటిల్ వర్గీకరించాడు. అనంతరం అనేక సూక్ష్మజీవులను గుర్తించిన తర్వాత వాటిని కూడా కలుపుకొని అర్థవంతంగా వర్గీకరించాల్సిన అవసరం ఏర్పడింది. రాబర్ట విట్టేకర్ అనే జీవశాస్త్రవేత్త జీవులన్నింటినీ ఐదు ప్రధాన రాజ్యాలుగా వర్గీకరించాడు. ప్రస్తుతం ఈ వర్గీకరణే ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉంది. కణ సంక్లిష్టత, శరీర సంక్లిష్టత, పోషణ ఆధారంగా జీవులను ఐదు రాజ్యాలుగా వర్గీకరించాడు. * మొనీరా రాజ్యం: కేంద్రక పూర్వ జీవులన్నింటినీ ఈ రాజ్యంలో వర్గీకరించారు. ఇవన్నీ ఏక కణజీవులు. ఇవి కేంద్రక పూర్వ కణాలతో నిర్మితమై ఉంటాయి. ఉదా: బ్యాక్టీరియా, సయనో బ్యాక్టీరియా (పూర్వనామం: నీలి ఆకుపచ్చ శైవలాలు) * పొటిస్టా రాజ్యం: నిజ కేంద్రక జీవుల్లో ఏక కణజీవులను ఈ రాజ్యంలో చేర్చారు. జంతువుల్లో ప్రోటోజోవా అనే ఏక కణ జీవులను, మొక్కల్లోని ఏకకణ శైవలాలను ఈ రాజ్యంలో చేర్చారు. * శిలీంధ్ర రాజ్యం: మొక్కలు, జంతువులు కానీ శిలీంధ్రాలు (ఊఠజజీ) ఈ వర్గంలో చేర్చారు. శిలీంధ్రాలు పరపోషకాలు. అత్యధిక శిలీంధ్రాలు విచ్ఛిన్నకారులు. జంతు, వృక్ష కళేబరాలపై ఆధారపడతాయి. శిలీంధ్రాల ద్వారా మానవుల్లో, పంట మొక్కల్లో అనేక వ్యాధులు కలుగుతాయి. ఉదా: కాండిడా, పెన్సీలియం. * వృక్ష రాజ్యం: అన్ని బహుకణ మొక్కలను ఈ వర్గంలో చేర్చారు. కిరణ జన్య సంయోగక్రియ ద్వారా వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి. ఇవన్నీ స్వయం పోషకాలు. ఉదా: బహుకణ శైవలాలు, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, వివృత బీజాలు, ఆవృత బీజాలు. * జంతురాజ్యం : అన్ని బహుకణ జంతువులను ఈ రాజ్యంలో వర్గీకరించారు. ఇవన్నీ పరపోషకాలు. అత్యధికంగా స్వేచ్ఛా జీవులు. కొన్ని పరాన్న జీవులు కూడా ఉంటాయి. ఉదా: రక్తాన్ని పీల్చే ఆడదోమలు, పేగులోని బద్దెపురుగులు. అత్యధిక జంతువులు శాకాహారులు. కొన్ని మాంసాహారులు, మరికొన్ని సర్వభక్షకాలు కూడా ఉంటాయి. -
కైగా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది?
అణుశక్తి 1. ఇండియా రేర్ ఎర్‌త్స లిమిటెడ్ ఎక్కడ ఉంది? ముంబై 2. భారత అణుశక్తి పితామహుడు? డా. హోమీ జహంగీర్ బాబా 3. కైగా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? కర్ణాటక 4. ఒక రేడియో ధార్మిక కేంద్రకం నుంచి బీటా వికిరణం విడుదలవడం ద్వారా పరమాణు సంఖ్య ఎన్ని ప్రమాణాలు పెరుగుతుంది? ఒక ప్రమాణం 5. నరోర అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది? ఉత్తరప్రదేశ్ 6. భారతదేశ మొదటి రియాక్టర్ నిర్మాణానికి సహకరించిన అమెరికా సంస్థ? జనరల్ ఎలక్ట్రిక్ 7. మొదటి దేశీయ రియాక్టర్ ఏది? రావటభట్ట అటామిక్ పవర్ స్టేషన్-2 8. మొదటి 540 MW సామర్థ్యమున్న దేశ అణు రియాక్టర్? తారాపూర్ అటామిక్ పవర్‌స్టేషన్&IV 9. కూడంకుళంలోని మొదటి రియాక్టర్ సామర్థ్యం? 1000 MW 10. మూడో దశ దేశ అణుశక్తి రియాక్టర్? అడ్వాన్సడ్ హెవీ వాటర్ రియాక్టర్ 11. గుజరాత్‌లోని ఏ ప్రాంతంలో కొత్త అణు రియాక్టర్‌ను నిర్మించదలిచారు? మితివర్ది 12. మూడో దశ రియాక్టర్లో ఇంధనం? థోరియ-యురేనియం-233 మిశ్రమం 13. 2022లో మొత్తం అన్ని అణురియాక్టర్లను మూసివేయాలని నిర్ణయించిన మొదటి దేశం? జర్మనీ 14. U-233 పై పనిచేసే పరిశోధన రియాక్టర్? కామిని, కల్పక్కం 15. రేడియోధార్మిక ఐసోటోపులను ఎగుమతి చేస్తున్న భారత అణుశక్తి విభాగ సంస్థ? బోర్డ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ 16. ఏ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న టోకమ్యాక్ను సాహా ఇన్స్టిట్యుట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ వద్ద ఏర్పాటు చేశారు? తోషిబా (జపాన్) 17. రక్తంలో ఏర్పడిన అవరోధాన్ని తొలగించడానికి ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోపు? సోడియం-24 18. బోర్డ ఫర్ రీసెర్చ ఇన్ న్యూక్లియర్ సెన్సైస్ ఎక్కడ ఉంది? ముంబై 19. అణు రియాక్టర్లలో వాడే నియంత్రణ కడ్డీలు? బోరాన్ స్టీల్, కాడ్మియం కడ్డీలు 20. తొలిసారిగా భారత్ అణు పరీక్షలను ఎప్పుడు నిర్వహించింది? 1974 21. హిరోషిమాపై అమెరికా అణుబాంబును ఎప్పుడు వేసింది? ఆగస్టు 6, 1945 22. నత్రజనిపై ఆల్ఫా వికిరణాన్ని తాడనం చేయడం ద్వారా ఆది ఏ కేంద్రకంగా మారుతుంది? ఆక్సిజన్ 23. తొలిసారిగా హోమీ జహంగీర్ బాబా ఏ కేంద్రం వద్ద అణుపరీశోధనలను నిర్వహించాడు? టీఐఎఫ్ఆర్ (టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ) 24. మొదటి దశ రియాక్టర్లో లభించే దేన్ని యురేనియంతో కలిపి రెండో దశ రియాక్టర్ ఇంధనంగా వినియోగిస్తారు? ఫ్లుటోనియం 25. హరీష్ చంద్ర రీసెర్చ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? అలహాబాద్ 26. టాటా మెమోరియల్ సెంటర్ ఎక్కడ ఉంది? కోల్‌కతా 27. జైతాపూర్ వద్ద ఏర్పాటు చేయదల్చిన రియాక్టర్? ఎవల్యూషనరీ పవర్ రియాక్టర్ 28. 2020 నాటికి అణుశక్తి ఉత్పాదన లక్ష్యం? 20,000 MW 29. అణు రియాక్టర్లలో కూలెంట్‌గా వాడేది? సాధారణ జలం, భారజలం 30. సెరామిక్స్, వైట్ పిగ్మెంట్ను ఉత్పత్తి చేసే అణుశక్తి విభాగ కేంద్రం? ఇండియా రేర్ ఎర్‌త్స లిమిటెడ్ -
రాష్ట్రంలో ఎన్ని టైగర్ రిజర్వులున్నాయి?
పర్యావరణం - జీవ వైవిధ్యం 1. ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన మెగా బయోడైవర్సిటీ కేంద్రాల్లో భారత్ స్థానం? ఆరో స్థానం (మొదటిది ఆస్ట్రేలియా) 2. గ్రీన్ హౌస్ ఉద్గారాల నియంత్రణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం? క్యోటోప్రోటోకాల్ 3. తలసరి గ్రీన్హౌస్ ఉద్గారాల విడుదలలో మొదటి స్థానంలో ఉన్న దేశం? ఖతర్ 4. యునెటైడ్ నేషన్స ఎన్విరాన్మెంట్ ప్రోగ్రా మ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? నైరోబీ (కెన్యా) 5. రాష్ట్రంలో ఎన్ని టైగర్ రిజర్వులున్నాయి? రెండు 1. రాజీవ్‌గాంధీ/నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ 2. కవాల్ టైగర్ రిజర్వ 6. నేషనల్ బోర్డ ఫర్ వైల్డ్ లైఫ్ చైర్మన్? ప్రధానమంత్రి 7. 2010 లెక్కల ప్రకారం భారత్‌లో పులుల సంఖ్య? 1706 8. ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశం? భారత్ 9. చిత్తడి నేలల సంరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం? రామ్సార్ ఒప్పందం 10. వలస పక్షుల సంరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం? బాన్ కన్వెన్షన్ 11. ప్రపంచంలో ఏర్పాటైన భారీ భవిష్య విత్తన నిధి? స్వాల్బార్డ దీవిలోని సీడ్ వాల్ట్ 12. 2013లో క్రిటికల్లీ ఎండేంజర్‌డ జాబితాలో గుర్తించిన బట్టమేక పక్షి (ఎట్ఛ్చ్ట ఐఛీజ్చీ ఆఠట్ట్చటఛీ) శాస్త్రీయ నామం? ఆర్డియోటిస్ నైగ్రిసెప్స్ 13. జీవ వైవిధ్య పరిరక్షణకు ఏర్పాటైన కన్వెన్షన్ బయలాజికల్ డైవర్సిటీ (ఇఆఈ) ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 29 డిసెంబరు 1993 14. శరీరంలోకి కాలుష్య కారకంగా ప్రవేశించిన సీసం దేని ఉత్పత్తిని నిరోధిస్తుంది? హీమోగ్లోబిన్ 15. మిథైల్ మెర్క్యూరీతో కలుషితమైన చేపలను తినడం ద్వారా వచ్చే పక్షవాత వ్యాధి? మినిమట వ్యాధి 16. ఏ భారలోహం కాలుష్యం ద్వారా మనిషిలో ఇటామి-ఇటామి వ్యాధి సంభవిస్తుంది? కాడ్మియం 17. ఆమ్ల వర్షాలకు కారణమయ్యే ప్రధాన కాలుష్య కారకాలు? సల్ఫర్ డై ఆక్సైడ్, నత్రజని ఆక్సైడ్లు 18. శీతోష్ణస్థితి మార్పుపై అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనాలు నిర్వహిస్తున్న ఐపీసీసీ(ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్) ఎప్పుడు ఏర్పాటైంది? 1988 19. ఐపీసీసీ చైర్మన్ ఎవరు? భారత్‌కు చెందిన రాజేంద్ర కుమార్ పచౌరీ 20. భారత్‌లో భవిష్య విత్తన నిధిని ఎక్కడ ఏర్పాటు చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్లో లఢక్‌లోని లేహ్ వద్ద 21. ప్రపంచంలోని అతిపెద్ద బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది? రాయల్ బొటానికల్ గార్డెన్, క్యూ, లండన్ 22. భారత్‌లో ఎన్ని బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్‌ను గుర్తించారు? మూడు. పశ్చిమ కనుమలు, హిమాలయాలు, ఇండోబర్మా 23. అచాన్కమర్ అమర్కంటక్ బయోస్ఫియర్ రిజర్వ ఏ రాష్ర్టంలో ఉంది? చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ 24. సిమ్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ ఏ రాష్ర్టంలో ఉంది? ఒడిశా 25. ఏ జంతు సంరక్షణకు ఒడిశాలో గహిర్మాతా బీచ్ సాంక్చుయరీ ఏర్పాటు చేశారు? ఆలివ్ రిడ్లీ టర్టల్ 26. అరుణాచల్ ప్రదేశ్, కేరళల రాష్ర్ట పక్షి? {Vేట్ హార్నబిల్ 27. బక్సాటైగర్ రిజర్వ ఎక్కడ ఉంది? పశ్చిమ బెంగాల్ 28. ఏ మూడు రాష్ట్రాల్లో నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ ఉంది? కేరళ, తమిళనాడు, కర్ణాటక 29. ఆహార పదార్థాల ప్యాకేజింగ్ మెటిరియల్స్లోని హానికర రసాయనం బీపీఏ అంటే? బిస్ఫినాల్ - ఎ 30. దేశంలో సింహాలను ఎక్కడ సంరక్షిస్తున్నారు? గిర్ అడవులు, గుజరాత్ 31. ఉత్తరప్రదేశ్ రాష్ర్ట పక్షి? సారస్ క్రేన్ 32. చింపాంజీ, గొరిల్లా, గిబ్బన, ఒరంగూటాన్ లాంటి ఏప్స్ అనే జంతువుల్లో భారత్‌లో కనిపించేది? హూలాక్ గిబ్బన్ 33. పశువులో వాడే ఏ వాపు నివారణ ఔషదం ద్వారా దేశంలో రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గింది? డైక్లోఫినాక్ 34. గంగానది డాల్ఫిన్ శాస్త్రీయ నామం? ప్లటనిస్టా గాంజిటిక 35. క్యాన్సర్‌కు కారణమయ్యే భార లోహం? ఆర్సినిక్ 36. భూతాపానికి కారణమవుతున్నట్లుగా ఐపీసీసీ గుర్తించిన ప్రధాన గ్రీన్‌హోస్ ఉద్గారాలు? కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, పర్ఫ్లోరోకార్బన్ (PFC), హైడ్రోఫ్లోరోకార్బన్ (HFC), సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ (SF6) 37. శీతోష్ణస్థితి మార్పునకు చెందిన సభ్యదేశాల 19వ వాతావరణ సదస్సు(COP-19)ను గతేడాది ఎక్కడ నిర్వహించారు? వార్సా (పోలెండ్) 38. దేశంలోని ఏ ప్రాంతంలో ప్రత్యేకంగా లయన్ టెయిల్డ్ మకాక్ అనే కోతి కనిపిస్తుంది? పశ్చిమ కనుమలు 39. అంతరించే ప్రసారమున్న జీవజాతుల జాబితా రెడ్ లిస్ట్‌ను రూపొందించే అంతర్జాతీయ సంస్థ? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ (IUCN) 40. ప్రకృతిలో దీర్ఘకాలం పాటు చెక్కు చెదరకుండా ఉండే కర్బన వ్యర్థాల నివారణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం? స్టాక్‌హోం కన్వెన్షన్ 41. క్యోటో ప్రొటోకాల్ తొలుత ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2005 ఫిబ్రవరి 16 42. ఓజోన్ పరిరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం? మాంట్రియాల్ ప్రోటోకాల్ 43. ప్రపంచ జీవ వైవిధ్య దినం? మే 22 44. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం? సెప్టెంబరు 16 45. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన బయోస్ఫియర్ రిజర్‌వల నెట్వర్కను ఏర్పర్చేది? యునెస్కో 46. తిమింగలాల వేటను నిరోధించడానికి ఏర్పాటైన అంతర్జాతీయ సంఘం? ఇంటర్నేషనల్ వాలింగ్ కమిషన్, కేంబ్రిడ్‌జ, ఇంగ్లండ్ 47. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం మనుగడ సాగించే లెకైన్ అనే జీవులు ఏ భిన్న జీవుల సహజీవనం ద్వారా ఏర్పడతాయి? శైవలం, శిలీంధ్రం 48. ఎల్లో స్టోన్ నేషనల్ పార్క ఏ దేశంలో ఉంది? అమెరికా 49. ఏ ఉభయచర జీవిని ప్రవేశపెట్టడం ద్వారా ఆస్ట్రేలియాలో జీవవైవిధ్యం నష్టం సంభవిస్తుంది? అమెరికన్ కేన్టోడ్ 50. దేశవ్యాప్తంగా విస్తరిస్తూ అటవీ వైవిధ్యాన్ని నష్టపరుస్తున్న కలుపు మొక్కలు? పార్థీనియం హిస్టీరోఫోరస్ (వయ్యారిభామ), లాంటాన్ క్యామర 51. ఒక వ్యక్తి తన శక్తి వినియోగ చర్యల ద్వారా విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్ మోతను ఏమంటారు? కార్బన్ ఫూట్ప్రింట్ 52. తేలియాడే జాతీయ పార్కు (Floating National Park)గా ప్రసిద్ధి గాంచింది? కేబుర్ లామ్జావో జాతీయ పార్కు (మణిపూర్) 53. మారిషస్‌లో అంతరించిన పక్షి? డాడో (పాసింజర్ పక్షి) 54. కేవలం ఒక భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన జీవ జాతులను ఏమంటారు? ఎండమిక్ (స్థానీయ) జాతీయ 55. పత్రిధూళి అలర్జీ ద్వారా వచ్చే ఉపిరితిత్తుల క్షీణత వ్యాధి? బెస్సైనోసిస్ 56. ఇనుముధూళి అలర్జీ ద్వారా వచ్చే ఉపిరి తిత్తుల క్షీణత వ్యాధి? సిడరోసిస్ 57. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవాళ భిత్తిక (Coral Reef)? ఈశాన్య ఆస్ట్రేలియా తీరంలోని గ్రేట్ బ్యారియర్ రిఫ్ 58. పన్నా బయోస్ఫియర్ రిజర్వ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్ 59. జాతీయ వారసత్వ జంతువు? ఆసియా ఏనుగు (Elephas Maximus) ఎలిఫస్ మాక్సిమస్ 60. దేశాల సరిహద్దుల ద్వారా సాగే హానికర పదార్థాల రవాణాను అడ్డుకునే అంతర్జాతీయ ఒప్పందం? బేసల్ కన్వెన్షన్ 61. అంతర్జాతీయ జీవ వైవిధ్య సంరక్షణ ఒప్పందానికి చెందిన సభ్యదేశాల 12వ సమావేశం (COP–12) ఈ ఏడాది ఎక్కడ జరగనుంది? దక్షిణ కొరియా 62. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రతిపాదించింది? ఎ.జి. టాన్సలే 63. జీవావరణ పిరమిడ్ అనే భావనను తొలిసారిగా ప్రవేశపెట్టింది? చార్లెస్ ఎల్టన్ 64. రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్యనున్న పరివర్తన ప్రాంతం? ఎకోటోన్ 65. ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగం? ఆహార శృంఖలు 66. ఆవరణ వ్యవస్థలోని ప్రధాన విచ్ఛిన్నకారులు? శిలీంధ్రాలు 67. పోషణపరంగా మానవుడు ఒక? సర్వభక్షకుడు