అణుశక్తి
1. ఇండియా రేర్ ఎర్‌త్స లిమిటెడ్ ఎక్కడ ఉంది?
ముంబై
2. భారత అణుశక్తి పితామహుడు?
డా. హోమీ జహంగీర్ బాబా
3. కైగా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది?
కర్ణాటక
4. ఒక రేడియో ధార్మిక కేంద్రకం నుంచి బీటా వికిరణం విడుదలవడం ద్వారా పరమాణు సంఖ్య ఎన్ని ప్రమాణాలు పెరుగుతుంది?
ఒక ప్రమాణం
5. నరోర అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది?
ఉత్తరప్రదేశ్
6. భారతదేశ మొదటి రియాక్టర్ నిర్మాణానికి సహకరించిన అమెరికా సంస్థ?
జనరల్ ఎలక్ట్రిక్
7. మొదటి దేశీయ రియాక్టర్ ఏది?
రావటభట్ట అటామిక్ పవర్ స్టేషన్-2
8. మొదటి 540 MW సామర్థ్యమున్న దేశ అణు రియాక్టర్?
తారాపూర్ అటామిక్ పవర్‌స్టేషన్&IV
9. కూడంకుళంలోని మొదటి రియాక్టర్ సామర్థ్యం?
1000 MW
10. మూడో దశ దేశ అణుశక్తి రియాక్టర్?
అడ్వాన్‌సడ్ హెవీ వాటర్ రియాక్టర్
11. గుజరాత్‌లోని ఏ ప్రాంతంలో కొత్త అణు రియాక్టర్‌ను నిర్మించదలిచారు?
మితివర్ది
12. మూడో దశ రియాక్టర్‌లో ఇంధనం?
థోరియ-యురేనియం-233 మిశ్రమం
13. 2022లో మొత్తం అన్ని అణురియాక్టర్లను మూసివేయాలని నిర్ణయించిన మొదటి దేశం?
జర్మనీ
14. U-233 పై పనిచేసే పరిశోధన రియాక్టర్?
కామిని, కల్పక్కం
15. రేడియోధార్మిక ఐసోటోపులను ఎగుమతి చేస్తున్న భారత అణుశక్తి విభాగ సంస్థ?
బోర్‌డ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ
16. ఏ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న టోకమ్యాక్‌ను సాహా ఇన్‌స్టిట్యుట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ వద్ద ఏర్పాటు చేశారు?
తోషిబా (జపాన్)
17. రక్తంలో ఏర్పడిన అవరోధాన్ని తొలగించడానికి ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోపు?
సోడియం-24
18. బోర్‌డ ఫర్ రీసెర్‌చ ఇన్ న్యూక్లియర్ సెన్సైస్ ఎక్కడ ఉంది?
ముంబై
19. అణు రియాక్టర్లలో వాడే నియంత్రణ కడ్డీలు?
బోరాన్ స్టీల్, కాడ్మియం కడ్డీలు
20. తొలిసారిగా భారత్ అణు పరీక్షలను ఎప్పుడు నిర్వహించింది?
1974
21. హిరోషిమాపై అమెరికా అణుబాంబును ఎప్పుడు వేసింది?
ఆగస్టు 6, 1945
22. నత్రజనిపై ఆల్ఫా వికిరణాన్ని తాడనం చేయడం ద్వారా ఆది ఏ కేంద్రకంగా మారుతుంది?
ఆక్సిజన్
23. తొలిసారిగా హోమీ జహంగీర్ బాబా ఏ కేంద్రం వద్ద అణుపరీశోధనలను నిర్వహించాడు?
టీఐఎఫ్‌ఆర్ (టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్‌చ)
24. మొదటి దశ రియాక్టర్‌లో లభించే దేన్ని యురేనియంతో కలిపి రెండో దశ రియాక్టర్ ఇంధనంగా వినియోగిస్తారు?
ఫ్లుటోనియం
25. హరీష్ చంద్ర రీసెర్‌చ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
అలహాబాద్
26. టాటా మెమోరియల్ సెంటర్ ఎక్కడ ఉంది?
కోల్‌కతా
27. జైతాపూర్ వద్ద ఏర్పాటు చేయదల్చిన రియాక్టర్?
ఎవల్యూషనరీ పవర్ రియాక్టర్
28. 2020 నాటికి అణుశక్తి ఉత్పాదన లక్ష్యం?
20,000 MW
29. అణు రియాక్టర్లలో కూలెంట్‌గా వాడేది?
సాధారణ జలం, భారజలం
30. సెరామిక్స్, వైట్ పిగ్మెంట్‌ను ఉత్పత్తి చేసే అణుశక్తి విభాగ కేంద్రం?
ఇండియా రేర్ ఎర్‌త్స లిమిటెడ్
కైగా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది?
Published Tue, Apr 22 2014 10:19 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement