1. శాకాహార జంతువుల్లో లోపించిన దంతాలు?
a) కుంతకాలు b) రదనికలు
c) చర్వణకాలు d) అగ్రచర్వణకాలు
2. మలకబళనాన్ని ప్రదర్శించే జంతువు?
a) గుర్రం b) కుందేలు c) గేదె d) మానవుడు
3. ఎంజైమ్‌లు లేని జీర్ణరసం?
a) పైత్యరసం b) క్లోమరసం
c) జఠర రసం d) పైవన్నీ
4. ఆహారాన్ని మింగడం ఏ చర్య?
a) నియంత్రిత b) అనియంత్రిత
c) అసంకల్పిత d) ఏదీకాదు
5. మానవుని దంత సూత్రం?
a) b)
c) d)
6. మానవునిలోని లాలాజల గ్రంథుల సంఖ్య?
a) 3 b) 3 జతలు c) 4 d) 4 జతలు
7. ప్లనేరియా విసర్జక అవయవం?
a) వృక్కం b) జ్వాలాకణం
c) సంకోచ రిక్తిక d) మూత్రపిండం
8. కిందివాటిలో యూరియోటెలిక్ జీవి?
a) కీటకం b) పీత c) పాము d) కప్ప
9. విసర్జక పదార్థాలను తనలోనే నిల్వ చేసుకునే జీవి?
a) కప్ప b) బొద్దింక c) లెపిస్మా d) నత్త
10. మూత్రంలో ఉండే నీటి శాతం?
a) 4 b) 1 c) 96 d) 94
11. సముద్రాలు దేనికి సింకులుగా పని చేస్తాయి?
a) CO b) SO2 c) CO2 d) O2
12. నీటిలోని బ్యాక్టీరియాలను సంహరించడానికి వాడే వాయువు?
a) O2 b) CO2 c) Cl d) F
13. సహజవాయువు ఏ పదార్థాల మిశ్రమం?
a) మీథేన్, ఆక్సిజన్ b) మీథేన్, ఈథేన్
c) మీథేన్, ఈథేన్, ప్రొపేన్ d) అమ్మోనియా, CO2, O2
14. చైనా గడ్డి అనేది?
a) శైవలం b) శిలీంద్రం
c) చిన్న మొక్క d) ఒక విధమైన గడ్డి
15. సముద్రపు కలుపుమొక్కలు ఏ ఖనిజ లవణాన్ని నిక్షిప్తం చేసుకుంటాయి?
a) క్లోరిన్ b) అయోడిన్ c) కాల్షియం d) ఐరన్
16. సువాసన తైలాల మొక్కలకు ఉదాహరణ?
a) నిమ్మగడ్డి b) తులసి c) యూకలిప్టస్ d) పైవన్నీ
17. {పాథమిక జీవక్రియోత్పన్నాలకు ఉదాహరణ?
a) పిండి పదార్థాలు b) ప్రోటీన్‌స
c) కొవ్వులు d) పైవన్నీ
18. వేప ఆకులో ఉన్న ఆల్కలాయిడ్ ఏది?
a) మార్ఫిన్ b) క్వినైన్ c) రిసర్పిన్ d) నింబిన్
19. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్?
a) పెప్సిన్ b) ట్రిప్సిన్ c) రెన్నిన్ d) లైపేజ్
20. కండరాలకు వచ్చే కేన్సర్‌ను ఏమంటారు?
a) కార్సినోమా b) ల్యుకేమియా
c) లింఫోమా d) సార్కోమా
21. క్షయకరణ విభజన అనంతరం ఏర్పడే పిల్ల కణాల సంఖ్య?
a) 2 b) 4 c) 8 d) 16
22. కణాలు వాటి ముందున్న కణాల నుంచి ఏర్పడతాయని పేర్కొన్నవారు?
a) రాబర్‌ట బ్రౌన్ b) రాబర్‌ట హుక్ c) ష్వాన్ d) విర్షో
23. సూక్ష్మనాళికలు దేనిలో భాగం?
a) రైబోజోమ్‌లు b) లైసోజోమ్‌లు
c) కణ అస్థిపంజరం d) గాల్జీ సంక్లిష్టం
24. {సావక కణాంగం అని దేన్నంటారు?
a) మైటోకాండ్రియా b) కేంద్రకం
c) గాల్జీ సంక్లిష్టం d) హరితరేణువు
25. వృక్ష కణంలో లేనిది?
a) రిక్తిక b) కణకవచం c) ప్లాస్టిడ్‌స d) సెంట్రియోల్
26. విదరింగ్ దేనికి సంబంధించింది?
a) గాలి b) నీరు c) మృత్తిక d) లోహాలు
27. {Xన్‌హౌస్ ఎఫెక్ట్‌కు కారణమైన వాయువు?
a) CO2 b) O2 c) SO2 d) SO
28. బంగారు పసుపు వర్ణం లేబిల్ కలిగిన విత్తనాలు?
a) పునాది b) బ్రీడర్ c) ఫౌండేషన్ d) ధ్రువీకరణ
29. తొలిసారిగా పుట్టిన ప్రాణులుగా గుర్తింపు పొందినవి?
a) శిలీంద్రాలు b) సైనోబ్యాక్టీరియా
c) ప్రోటోజోవా d) చిన్న మొక్కలు
30. భూమి పుట్టినప్పుడు వాతావరణంలో లేని వాయువు?
a) మీథేన్ b) హైడ్రోజన్
c) ఆక్సిజన్ d) అమ్మోనియా
31. హీవియా బ్రెజిలెన్సిస్ నుంచి లభించేది?
a) రబ్బరు b) ఆల్కలాయిడ్ c) నూనె d) రంజకం
32. కిందివాటిలో కార్సినోజెన్ కానిది?
a) డీడీటీ b) అప్లోటాక్సిన్ c) సాకరిన్ d) గ్లూకోజ్
33. టోనోప్లాస్ట్ దేనికి సంబంధించింది?
a) మైటోకాండ్రియా b) హరితరేణువు
c) రిక్తిక d) రైబోజోమ్‌లు
34. కేంద్రకత్వచం నుంచి కణత్వచం వరకు వ్యాపించే కణాంగం?
a) గాల్జీ సంక్లిష్టం b) మైటోకాండ్రియా
c) అంతర్జీవ ద్రవ్యజాలకం d) హరితరేణువు
35. త్వచరహిత కణాంగం?
a) కేంద్రకం b) లైసోజోమ్‌లు
c) రైబోజోమ్‌లు d) b, c
36. జీవ సంబంధ కేన్సర్ కారకాలకు ఉదాహరణ?
a) వైరస్ b) గీకిరణాలు
c) పొగ, మసి d) UV కిరణాలు
37. ఆహారాన్ని నిల్వ చేసే ప్లాస్టిడ్‌స?
a) క్రోమోప్లాస్ట్‌లు b) ల్యూకోప్లాస్ట్‌లు
c) క్లోరోప్లాస్ట్‌లు d) సయనోప్లాస్ట్‌లు
38. ప్లాస్మా పొర వేటితో నిర్మితమై ఉంటుంది?
a) ప్రోటీన్లు b) లిపిడ్లు c) సెల్యులోజ్ d) a, b
39. మొలస్కా జీవుల్లో మూత్రపిండం (వృక్కాల గుంపు) దేనిలోకి తెరుచుకుంటుంది?
a) పేగు b) హృదయావరణ కుహరం
c) బయటకు d) శరీర కుహరం
40. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు?
a) బోలస్ b) కైము c) ఖైల్ d) ఎంబోలస్
41. ఏ జీవిలో ‘రాడ్యులా’ ఉంటుంది?
a) వానపాము b) నత్త c) జలగ d) దోమ
42. ఏకరక భక్షక జీవికి ఉదాహరణ?
a) మానవుడు b) ఆవు
c) పట్టుపురుగు d) తేనెటీగ
43. ఏ అణువుల కలయిక వల్ల సెల్యులోజ్ ఏర్పడుతుంది?
a) గ్లూకోజ్ b) సుక్రోజ్ c) రైబోజ్ d) పెంటోజ్
44. నెమరువేసే జీవుల్లో అసలైన జీర్ణకోశంగా పిలిచే గది?
a) మొదటి గది b) మూడో గది
c) నాలుగో గది d) రెండో గది
45. మానవునిలో విసురు దంతాల సంఖ్య?
a) 4 b) 8 c) 12 d) 14
46. ఆవరణ వ్యవస్థలో పోషక స్థాయి అంటే?
a) నీటి స్థాయి b) ఆక్సిజన్ స్థాయి
c) శక్తి స్థాయి d) లవణాల స్థాయి
47. ఆవరణ వ్యవస్థలో మొక్కలు?
a) ప్రాథమిక ఉత్పత్తిదారులు
b) ప్రాథమిక వినియోగదారులు
c) విచ్ఛిన్నకారులు d) ఏదీకాదు
48. స్పైరోమీటర్‌ను దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు?
a) రక్తపోటు b) ఆధార జీవక్రియా రేటు
c) నాడీ చర్యలు d) పెరుగుదల
49. న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ ఎక్కడుంది?
a) ముంబై b) హైదరాబాద్
c) కాకినాడ d) విజయవాడ
50. ‘వన్యప్రాణి సంరక్షణ చట్టం’ ఏర్పడిన సంవత్సరం?
a) 1952 b) 1972 c) 1962 d) 1900
51. మొక్కల్లో విసర్జక అవయవాలు?
a) వేర్లు b) కాండం c) పత్రాలు d) ఏదీకాదు
52. పైనస్ మొక్క నుంచి లభించే పదార్థం?
a) ఆల్కలాయిడ్లు b) టానిన్లు c) లేటెక్స్ d) రెజిన్లు
53. చిన్నపిల్లల్లో మూత్ర విసర్జన ఏ చర్య?
a) అనియంత్రిత b) సంకల్పిత
c) ప్రతీకార d) నియంత్రిత
54. వ్యాపన ప్రక్రియలో విసర్జనను జరిపే జీవి?
a) వానపాము b) సాలీడు c) బొద్దింక d) అమీబా
55. కోల్‌గ్యాస్‌లోని వాయువులు?
a) H2, CH4, CO
b) H2, O2 c) NH3, H2O
d) CO, CO2, NH3
Answers
1) b 2) b 3) a 4) a 5) b
6) b 7) b 8) d 9) c 10) c
11) c 12) c 13) c 14) a 15) b
16) d 17) d 18) d 19) c 20) d
21) b 22) d 23) c 24) c 25) d
26) c 27) a 28) b 29) b 30) c
31) a 32) d 33) c 34) c 35) c
36) a 37) b 38) d 39) b 40) b
41) b 42) c 43) a 44) c 45) c
46) c 47) a 48) b 49) b 50) b
51) d 52) d 53) a 54) d 55) a
మానవునిలోని లాలాజల గ్రంథుల సంఖ్య?...
Published Fri, May 23 2014 9:59 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement