g.srinivas
-
మానవునిలోని లాలాజల గ్రంథుల సంఖ్య?...
1. శాకాహార జంతువుల్లో లోపించిన దంతాలు? a) కుంతకాలు b) రదనికలు c) చర్వణకాలు d) అగ్రచర్వణకాలు 2. మలకబళనాన్ని ప్రదర్శించే జంతువు? a) గుర్రం b) కుందేలు c) గేదె d) మానవుడు 3. ఎంజైమ్‌లు లేని జీర్ణరసం? a) పైత్యరసం b) క్లోమరసం c) జఠర రసం d) పైవన్నీ 4. ఆహారాన్ని మింగడం ఏ చర్య? a) నియంత్రిత b) అనియంత్రిత c) అసంకల్పిత d) ఏదీకాదు 5. మానవుని దంత సూత్రం? a) b) c) d) 6. మానవునిలోని లాలాజల గ్రంథుల సంఖ్య? a) 3 b) 3 జతలు c) 4 d) 4 జతలు 7. ప్లనేరియా విసర్జక అవయవం? a) వృక్కం b) జ్వాలాకణం c) సంకోచ రిక్తిక d) మూత్రపిండం 8. కిందివాటిలో యూరియోటెలిక్ జీవి? a) కీటకం b) పీత c) పాము d) కప్ప 9. విసర్జక పదార్థాలను తనలోనే నిల్వ చేసుకునే జీవి? a) కప్ప b) బొద్దింక c) లెపిస్మా d) నత్త 10. మూత్రంలో ఉండే నీటి శాతం? a) 4 b) 1 c) 96 d) 94 11. సముద్రాలు దేనికి సింకులుగా పని చేస్తాయి? a) CO b) SO2 c) CO2 d) O2 12. నీటిలోని బ్యాక్టీరియాలను సంహరించడానికి వాడే వాయువు? a) O2 b) CO2 c) Cl d) F 13. సహజవాయువు ఏ పదార్థాల మిశ్రమం? a) మీథేన్, ఆక్సిజన్ b) మీథేన్, ఈథేన్ c) మీథేన్, ఈథేన్, ప్రొపేన్ d) అమ్మోనియా, CO2, O2 14. చైనా గడ్డి అనేది? a) శైవలం b) శిలీంద్రం c) చిన్న మొక్క d) ఒక విధమైన గడ్డి 15. సముద్రపు కలుపుమొక్కలు ఏ ఖనిజ లవణాన్ని నిక్షిప్తం చేసుకుంటాయి? a) క్లోరిన్ b) అయోడిన్ c) కాల్షియం d) ఐరన్ 16. సువాసన తైలాల మొక్కలకు ఉదాహరణ? a) నిమ్మగడ్డి b) తులసి c) యూకలిప్టస్ d) పైవన్నీ 17. {పాథమిక జీవక్రియోత్పన్నాలకు ఉదాహరణ? a) పిండి పదార్థాలు b) ప్రోటీన్స c) కొవ్వులు d) పైవన్నీ 18. వేప ఆకులో ఉన్న ఆల్కలాయిడ్ ఏది? a) మార్ఫిన్ b) క్వినైన్ c) రిసర్పిన్ d) నింబిన్ 19. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్? a) పెప్సిన్ b) ట్రిప్సిన్ c) రెన్నిన్ d) లైపేజ్ 20. కండరాలకు వచ్చే కేన్సర్‌ను ఏమంటారు? a) కార్సినోమా b) ల్యుకేమియా c) లింఫోమా d) సార్కోమా 21. క్షయకరణ విభజన అనంతరం ఏర్పడే పిల్ల కణాల సంఖ్య? a) 2 b) 4 c) 8 d) 16 22. కణాలు వాటి ముందున్న కణాల నుంచి ఏర్పడతాయని పేర్కొన్నవారు? a) రాబర్ట బ్రౌన్ b) రాబర్ట హుక్ c) ష్వాన్ d) విర్షో 23. సూక్ష్మనాళికలు దేనిలో భాగం? a) రైబోజోమ్‌లు b) లైసోజోమ్‌లు c) కణ అస్థిపంజరం d) గాల్జీ సంక్లిష్టం 24. {సావక కణాంగం అని దేన్నంటారు? a) మైటోకాండ్రియా b) కేంద్రకం c) గాల్జీ సంక్లిష్టం d) హరితరేణువు 25. వృక్ష కణంలో లేనిది? a) రిక్తిక b) కణకవచం c) ప్లాస్టిడ్స d) సెంట్రియోల్ 26. విదరింగ్ దేనికి సంబంధించింది? a) గాలి b) నీరు c) మృత్తిక d) లోహాలు 27. {Xన్హౌస్ ఎఫెక్ట్‌కు కారణమైన వాయువు? a) CO2 b) O2 c) SO2 d) SO 28. బంగారు పసుపు వర్ణం లేబిల్ కలిగిన విత్తనాలు? a) పునాది b) బ్రీడర్ c) ఫౌండేషన్ d) ధ్రువీకరణ 29. తొలిసారిగా పుట్టిన ప్రాణులుగా గుర్తింపు పొందినవి? a) శిలీంద్రాలు b) సైనోబ్యాక్టీరియా c) ప్రోటోజోవా d) చిన్న మొక్కలు 30. భూమి పుట్టినప్పుడు వాతావరణంలో లేని వాయువు? a) మీథేన్ b) హైడ్రోజన్ c) ఆక్సిజన్ d) అమ్మోనియా 31. హీవియా బ్రెజిలెన్సిస్ నుంచి లభించేది? a) రబ్బరు b) ఆల్కలాయిడ్ c) నూనె d) రంజకం 32. కిందివాటిలో కార్సినోజెన్ కానిది? a) డీడీటీ b) అప్లోటాక్సిన్ c) సాకరిన్ d) గ్లూకోజ్ 33. టోనోప్లాస్ట్ దేనికి సంబంధించింది? a) మైటోకాండ్రియా b) హరితరేణువు c) రిక్తిక d) రైబోజోమ్‌లు 34. కేంద్రకత్వచం నుంచి కణత్వచం వరకు వ్యాపించే కణాంగం? a) గాల్జీ సంక్లిష్టం b) మైటోకాండ్రియా c) అంతర్జీవ ద్రవ్యజాలకం d) హరితరేణువు 35. త్వచరహిత కణాంగం? a) కేంద్రకం b) లైసోజోమ్‌లు c) రైబోజోమ్‌లు d) b, c 36. జీవ సంబంధ కేన్సర్ కారకాలకు ఉదాహరణ? a) వైరస్ b) గీకిరణాలు c) పొగ, మసి d) UV కిరణాలు 37. ఆహారాన్ని నిల్వ చేసే ప్లాస్టిడ్స? a) క్రోమోప్లాస్ట్లు b) ల్యూకోప్లాస్ట్లు c) క్లోరోప్లాస్ట్‌లు d) సయనోప్లాస్ట్లు 38. ప్లాస్మా పొర వేటితో నిర్మితమై ఉంటుంది? a) ప్రోటీన్లు b) లిపిడ్లు c) సెల్యులోజ్ d) a, b 39. మొలస్కా జీవుల్లో మూత్రపిండం (వృక్కాల గుంపు) దేనిలోకి తెరుచుకుంటుంది? a) పేగు b) హృదయావరణ కుహరం c) బయటకు d) శరీర కుహరం 40. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు? a) బోలస్ b) కైము c) ఖైల్ d) ఎంబోలస్ 41. ఏ జీవిలో ‘రాడ్యులా’ ఉంటుంది? a) వానపాము b) నత్త c) జలగ d) దోమ 42. ఏకరక భక్షక జీవికి ఉదాహరణ? a) మానవుడు b) ఆవు c) పట్టుపురుగు d) తేనెటీగ 43. ఏ అణువుల కలయిక వల్ల సెల్యులోజ్ ఏర్పడుతుంది? a) గ్లూకోజ్ b) సుక్రోజ్ c) రైబోజ్ d) పెంటోజ్ 44. నెమరువేసే జీవుల్లో అసలైన జీర్ణకోశంగా పిలిచే గది? a) మొదటి గది b) మూడో గది c) నాలుగో గది d) రెండో గది 45. మానవునిలో విసురు దంతాల సంఖ్య? a) 4 b) 8 c) 12 d) 14 46. ఆవరణ వ్యవస్థలో పోషక స్థాయి అంటే? a) నీటి స్థాయి b) ఆక్సిజన్ స్థాయి c) శక్తి స్థాయి d) లవణాల స్థాయి 47. ఆవరణ వ్యవస్థలో మొక్కలు? a) ప్రాథమిక ఉత్పత్తిదారులు b) ప్రాథమిక వినియోగదారులు c) విచ్ఛిన్నకారులు d) ఏదీకాదు 48. స్పైరోమీటర్‌ను దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు? a) రక్తపోటు b) ఆధార జీవక్రియా రేటు c) నాడీ చర్యలు d) పెరుగుదల 49. న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ ఎక్కడుంది? a) ముంబై b) హైదరాబాద్ c) కాకినాడ d) విజయవాడ 50. ‘వన్యప్రాణి సంరక్షణ చట్టం’ ఏర్పడిన సంవత్సరం? a) 1952 b) 1972 c) 1962 d) 1900 51. మొక్కల్లో విసర్జక అవయవాలు? a) వేర్లు b) కాండం c) పత్రాలు d) ఏదీకాదు 52. పైనస్ మొక్క నుంచి లభించే పదార్థం? a) ఆల్కలాయిడ్లు b) టానిన్లు c) లేటెక్స్ d) రెజిన్లు 53. చిన్నపిల్లల్లో మూత్ర విసర్జన ఏ చర్య? a) అనియంత్రిత b) సంకల్పిత c) ప్రతీకార d) నియంత్రిత 54. వ్యాపన ప్రక్రియలో విసర్జనను జరిపే జీవి? a) వానపాము b) సాలీడు c) బొద్దింక d) అమీబా 55. కోల్గ్యాస్లోని వాయువులు? a) H2, CH4, CO b) H2, O2 c) NH3, H2O d) CO, CO2, NH3 Answers 1) b 2) b 3) a 4) a 5) b 6) b 7) b 8) d 9) c 10) c 11) c 12) c 13) c 14) a 15) b 16) d 17) d 18) d 19) c 20) d 21) b 22) d 23) c 24) c 25) d 26) c 27) a 28) b 29) b 30) c 31) a 32) d 33) c 34) c 35) c 36) a 37) b 38) d 39) b 40) b 41) b 42) c 43) a 44) c 45) c 46) c 47) a 48) b 49) b 50) b 51) d 52) d 53) a 54) d 55) a -
జీవశాస్త్రం
శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు రాబర్ట కోచ్: క్షయ, కలరా వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే క్రిములు, రోగ లక్షణాలు, నివారణలను తెలిపాడు. ఆండ్రియస్ వెసాలియస్: మానవ శరీర నిర్మాణాన్ని కనుక్కున్నాడు. చార్లెస్ డార్విన్: జీవ పరిణామ సిద్ధాంతం. {Vెగర్ మెండల్: అనువంశిక సిద్ధాంతం. అలెగ్జాండర్ ఫ్లెమింగ్: పెన్సిలిన్ ఆవిష్కర్త. ఎంవోపీ అయ్యంగార్: థాలోఫైటా మొక్క లపై పరిశోధన, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫైకాలజీ. జె.సి.బోస్: క్రెస్కోగ్రాఫ్ (మొక్కల పెరుగుదలను గుర్తించే పరికరం) జకారియస్ జాన్సన్: సంయుక్త సూక్ష్మదర్శిని హరగోవింద్ ఖొరానా: కృత్రిమ జన్యు సంశ్లేషణ బీర్బల్ సహాని: సెలైన్ సిరీస్ ఆఫ్ ది సాల్ట్రేంజ్, ఖండాల కదలిక సిద్ధాంతం, వివృతబీజ మొక్కల శిలాజాలు పంచానన్ మహేశ్వరి: వృక్షాల ఆధునిక పిం డోత్పత్తి శాస్త్ర పిత. పరస్థానిక ఫలదీకరణం. ఎం.ఎస్. స్వామినాథన్: హరిత విప్లవ కారకుడు. సంకరజాతి వంగడాల సృష్టికర్త. సలీం అలీ: భారత పక్షి శాస్త్రవేత్త (ఆర్నిథాలజిస్ట్). వాట్సన్, క్రిక్: డీఎన్ఏ ద్వికుండలి నిర్మాణం. అణుజీవ శాస్త్రానికి పునాదులు వేశారు. ఎల్లాప్రగడ సుబ్బారావు: అద్భుత ఔషధ సృష్టికర్త. ఫోలికామ్లం, టెట్రాసైక్లిన్/ ఆరియోమైసిన్ల ఆవిష్కర్త. రోనాల్డ్‌రాస్: మలేరియా వ్యాప్తి దోమల ద్వారా జరుగుతుందని కనుక్కున్నాడు. నోబెల్ బహుమతి గ్రహీత(1902). సికిం ద్రాబాద్‌లో తన పరిశోధనలు చేశాడు. మార్సిల్లో మాల్ఫీజి: గుండెకు రక్తం అందే విధానాన్ని కనుక్కున్నాడు. ఏ విలియం హార్వే.. గుండె పనిచేయడానికి రక్త ప్రసరణ ముఖ్యమని ప్రయోగ పూర్వకంగా చెప్పాడు. కానీ రక్తం గుండెకు ఎలా చేరుతుందో తెలపలేదు. లూయీ పాశ్చర్: గాలి, నీరు, నేలలోని సూక్ష్మజీవుల ఉనికిని రుజువు చేశాడు. గొర్రెలకు సోకే ఆంథ్రాక్స్ వ్యాధికి టీకా. రేబీస్ వ్యాధికి టీకాను 1885లో కనుక్కున్నాడు. {Mిమి సిద్ధాంతం లేదా జెర్మథియరీని ప్రతిపాదించాడు. సూక్ష్మజీవులు ద్రాక్షరసాన్ని పులిసేలా చేస్తాయని నిరూపించాడు. పట్టుపురుగు గుడ్లను సూక్ష్మజీవులు పాడు చేస్తాయని కనుక్కున్నాడు. పాలను నిల్వచేసే పద్ధతి పాశ్చరై జేషన్‌ను కనుక్కున్నాడు. పాశ్చరైజేషన్: పాలను 72నిఇ వరకు వేడి చేసి 15 సెకన్లు ఉంచి వెంటనే 10నిఇ వరకు చల్లార్చి నిలువ చేస్తారు. లివెన్హుక్: బ్యాక్టీరియాలను వర్ణించిన శాస్త్రజ్ఞుల్లో ప్రథముడు. ఏకకటక సూక్ష్మదర్శినిని కనుక్కున్నాడు. అరిస్టాటిల్: జీవశాస్త్ర పిత. మొదటిసారి శాస్త్రీయంగా జీవులను వర్గీకరించడానికి ప్రయత్నం చేశారు. పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికారు. జంతువుల వర్గీకరణ పృష్ట వంశం ఆధారంగా జంతువులను అకశేరుకాలు, సకశేరుకాలుగా వర్గీకరించారు అకశేరుకాలు- వర్గీకరణ: జంతురాజ్యంలో 95 శాతం అకశేరుకాలే. వీటిని ప్రధానంగా 9 వర్గాలుగా విభజించారు. ప్రోటోజోవా: ఏకకణ జీవులు ఉదా: అమీబా, పారామీషియం పొరిఫెరా: సరళ బహుకణ జీవులు చలనాన్ని చూపవు. ఉదా: స్పాంజీలు(స్పంజికలు) సీలింటరేటా: ద్విస్తరిత బహుకణ జీవులు. నోటిచుట్టూ టెంటకిల్సు అనే నిర్మాణాలుంటాయి. ఉదా: హైడ్రా, ఒబీలియా, జెల్లీచేప ప్లాటీహెల్మింథిస్: త్రిస్తరిత బహుకణ జీవులు. శరీరం రిబ్బనులా బల్లపరుపుగా ఉంటుంది. ఉదా: పనేరియా, బద్దెపురుగు నిమాటి హెల్మింథిస్: త్రిస్తరిత బహుకణ జీవులు. శరీరం పొడవుగా, దారంలా ఉంటుంది. ఉదా: ఏలికపాము/ఆస్కారిస్ అనెలిడ: వలయాకార ఖండితాలను కలిగిన స్తూపాకార దేహం ఉంటుంది. ఉదా: వానపాము, జలగ ఆర్థ్రోపొడ: అతుక్కుని ఉండే కాళ్లు కలిగిన జీవులు. శరీరం తల, రొమ్ము, ఉదరం అనే భాగాలుగా ఉంటుంది. ఉదా: కీటకాలు (బొద్దింక, సీతాకోకచిలుక) మొలస్కా: శరీరం మెత్తగా ఉంటుంది. దేహాన్ని ఆవరించి ఇ్చఇై3 కర్పరం ఉంటుంది. ఉదా: నత్తగుల్ల, ఆల్చిప్ప ఇఖైనోడర్మట: శరీరంపై ముళ్లలాంటి నిర్మాణాలుంటాయి. ఉదా: సముద్ర అర్చిన్, సముద్రనక్షత్రం టీనోఫొరా: ఉదా: మూన్జెల్లి మాదిరి ప్రశ్నలు 1. హెచ్ఐవీ సంక్రమించడానికి ప్రధాన కారణం? (వీఆర్ఏ-2012) జ. అరక్షిత విచ్చలవిడి శృంగారం 2. మెదడువాపు వ్యాధి దేనివల్ల కలుగుతుంది? (వీఆర్ఏ-2012) జ. వైరస్ 3. రేబీస్ వ్యాధికి టీకాను కనుక్కున్న సంవత్సరం? జ. 1885 4. మొక్కలపై దాడిచేసే వైరస్‌లను ఏమంటారు? (వీఆర్వో-2012) జ. పైటోఫేజ్ 5. పశువుల్లో ఫుట్, మౌత్ వ్యాధి దేనివల్ల వస్తుంది? (వీఆర్వో-2012) జ. వైరస్ 6. అన్ని రకాల వాతావరణాల్లో నివసించే సూక్ష్మజీవులు? జ. బాక్టీరియా 7. సజీవులకు, నిర్జీవులకు మధ్య సంధానకరంగా ఉండే సూక్ష్మజీవులు? జ. వైరస్ 8. జంతురాజ్యంలో ఎక్కువ జీవులు ఏ వర్గానికి చెందినవి? జ. ఆర్థ్రోపొడ 9. బీసీజీ వ్యాక్సిన్ ఏ వ్యాధి నివారణలో వాడతారు? జ. క్షయ 10. దోమకాటు వల్ల వ్యాపించే వైరల్ వ్యాధి? జ. మెదడు వాపు 11. గొర్రెల్లో ఆంత్రాక్స్ వ్యాధి దేనివల్ల కలుగుతుంది? జ. బాక్టీరియా 12. {Mిమిసిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? జ. లూయి పాశ్చర్ 13. అద్భుత ఔషధ సృష్టికర్తగా పేరొందిన శాస్త్రవేత్త? జ. వై. సుబ్బారావు