జి శ్రీనివాస్
శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు
రాబర్‌ట కోచ్: క్షయ, కలరా వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే క్రిములు, రోగ లక్షణాలు, నివారణలను తెలిపాడు.
ఆండ్రియస్ వెసాలియస్: మానవ శరీర నిర్మాణాన్ని కనుక్కున్నాడు.
చార్లెస్ డార్విన్: జీవ పరిణామ సిద్ధాంతం.
{Vెగర్ మెండల్: అనువంశిక సిద్ధాంతం.
అలెగ్జాండర్ ఫ్లెమింగ్: పెన్సిలిన్ ఆవిష్కర్త.
ఎంవోపీ అయ్యంగార్: థాలోఫైటా మొక్క లపై పరిశోధన, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫైకాలజీ.
జె.సి.బోస్: క్రెస్కోగ్రాఫ్ (మొక్కల పెరుగుదలను గుర్తించే పరికరం)
జకారియస్ జాన్సన్: సంయుక్త సూక్ష్మదర్శిని
హరగోవింద్ ఖొరానా: కృత్రిమ జన్యు సంశ్లేషణ
బీర్బల్ సహాని: సెలైన్ సిరీస్ ఆఫ్ ది సాల్ట్‌రేంజ్, ఖండాల కదలిక సిద్ధాంతం, వివృతబీజ మొక్కల శిలాజాలు
పంచానన్ మహేశ్వరి: వృక్షాల ఆధునిక పిం డోత్పత్తి శాస్త్ర పిత. పరస్థానిక ఫలదీకరణం.
ఎం.ఎస్. స్వామినాథన్: హరిత విప్లవ కారకుడు. సంకరజాతి వంగడాల సృష్టికర్త.
సలీం అలీ: భారత పక్షి శాస్త్రవేత్త (ఆర్నిథాలజిస్ట్).
వాట్సన్, క్రిక్: డీఎన్‌ఏ ద్వికుండలి నిర్మాణం. అణుజీవ శాస్త్రానికి పునాదులు వేశారు.
ఎల్లాప్రగడ సుబ్బారావు: అద్భుత ఔషధ సృష్టికర్త. ఫోలికామ్లం, టెట్రాసైక్లిన్/ ఆరియోమైసిన్‌ల ఆవిష్కర్త.
రోనాల్డ్‌రాస్: మలేరియా వ్యాప్తి దోమల ద్వారా జరుగుతుందని కనుక్కున్నాడు. నోబెల్ బహుమతి గ్రహీత(1902). సికిం ద్రాబాద్‌లో తన పరిశోధనలు చేశాడు.
మార్సిల్లో మాల్ఫీజి: గుండెకు రక్తం అందే విధానాన్ని కనుక్కున్నాడు.
ఏ విలియం హార్వే.. గుండె పనిచేయడానికి రక్త ప్రసరణ ముఖ్యమని ప్రయోగ పూర్వకంగా చెప్పాడు. కానీ రక్తం గుండెకు ఎలా చేరుతుందో తెలపలేదు.
లూయీ పాశ్చర్:
గాలి, నీరు, నేలలోని సూక్ష్మజీవుల ఉనికిని రుజువు చేశాడు.
గొర్రెలకు సోకే ఆంథ్రాక్స్ వ్యాధికి టీకా.
రేబీస్ వ్యాధికి టీకాను 1885లో కనుక్కున్నాడు.
{Mిమి సిద్ధాంతం లేదా జెర్‌మథియరీని ప్రతిపాదించాడు.
సూక్ష్మజీవులు ద్రాక్షరసాన్ని పులిసేలా చేస్తాయని నిరూపించాడు.
పట్టుపురుగు గుడ్లను సూక్ష్మజీవులు పాడు చేస్తాయని కనుక్కున్నాడు.
పాలను నిల్వచేసే పద్ధతి పాశ్చరై జేషన్‌ను కనుక్కున్నాడు.
పాశ్చరైజేషన్: పాలను 72నిఇ వరకు వేడి చేసి 15 సెకన్లు ఉంచి వెంటనే 10నిఇ వరకు చల్లార్చి నిలువ చేస్తారు.
లివెన్‌హుక్: బ్యాక్టీరియాలను వర్ణించిన శాస్త్రజ్ఞుల్లో ప్రథముడు. ఏకకటక సూక్ష్మదర్శినిని కనుక్కున్నాడు.
అరిస్టాటిల్: జీవశాస్త్ర పిత. మొదటిసారి శాస్త్రీయంగా జీవులను వర్గీకరించడానికి ప్రయత్నం చేశారు. పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికారు.
జంతువుల వర్గీకరణ
పృష్ట వంశం ఆధారంగా జంతువులను అకశేరుకాలు, సకశేరుకాలుగా వర్గీకరించారు
అకశేరుకాలు- వర్గీకరణ:
జంతురాజ్యంలో 95 శాతం అకశేరుకాలే. వీటిని ప్రధానంగా 9 వర్గాలుగా విభజించారు.
ప్రోటోజోవా: ఏకకణ జీవులు
ఉదా: అమీబా, పారామీషియం
పొరిఫెరా: సరళ బహుకణ జీవులు చలనాన్ని చూపవు.
ఉదా: స్పాంజీలు(స్పంజికలు)
సీలింటరేటా: ద్విస్తరిత బహుకణ జీవులు. నోటిచుట్టూ టెంటకిల్సు అనే నిర్మాణాలుంటాయి.
ఉదా: హైడ్రా, ఒబీలియా, జెల్లీచేప
ప్లాటీహెల్మింథిస్: త్రిస్తరిత బహుకణ జీవులు. శరీరం రిబ్బనులా బల్లపరుపుగా ఉంటుంది.
ఉదా: పనేరియా, బద్దెపురుగు
నిమాటి హెల్మింథిస్: త్రిస్తరిత బహుకణ జీవులు. శరీరం పొడవుగా, దారంలా ఉంటుంది.
ఉదా: ఏలికపాము/ఆస్కారిస్
అనెలిడ: వలయాకార ఖండితాలను కలిగిన స్తూపాకార దేహం ఉంటుంది.
ఉదా: వానపాము, జలగ
ఆర్థ్రోపొడ: అతుక్కుని ఉండే కాళ్లు కలిగిన జీవులు. శరీరం తల, రొమ్ము, ఉదరం అనే భాగాలుగా ఉంటుంది.
ఉదా: కీటకాలు (బొద్దింక, సీతాకోకచిలుక)
మొలస్కా: శరీరం మెత్తగా ఉంటుంది. దేహాన్ని ఆవరించి ఇ్చఇై3 కర్పరం ఉంటుంది.
ఉదా: నత్తగుల్ల, ఆల్చిప్ప
ఇఖైనోడర్మట: శరీరంపై ముళ్లలాంటి నిర్మాణాలుంటాయి. ఉదా: సముద్ర అర్చిన్, సముద్రనక్షత్రం
టీనోఫొరా: ఉదా: మూన్‌జెల్లి
మాదిరి ప్రశ్నలు
1. హెచ్‌ఐవీ సంక్రమించడానికి ప్రధాన కారణం? (వీఆర్‌ఏ-2012)
జ. అరక్షిత విచ్చలవిడి శృంగారం
2. మెదడువాపు వ్యాధి దేనివల్ల కలుగుతుంది? (వీఆర్‌ఏ-2012)
జ. వైరస్
3. రేబీస్ వ్యాధికి టీకాను కనుక్కున్న సంవత్సరం?
జ. 1885
4. మొక్కలపై దాడిచేసే వైరస్‌లను ఏమంటారు? (వీఆర్‌వో-2012)
జ. పైటోఫేజ్
5. పశువుల్లో ఫుట్, మౌత్ వ్యాధి దేనివల్ల వస్తుంది? (వీఆర్‌వో-2012)
జ. వైరస్
6. అన్ని రకాల వాతావరణాల్లో నివసించే సూక్ష్మజీవులు?
జ. బాక్టీరియా
7. సజీవులకు, నిర్జీవులకు మధ్య సంధానకరంగా ఉండే సూక్ష్మజీవులు?
జ. వైరస్
8. జంతురాజ్యంలో ఎక్కువ జీవులు ఏ వర్గానికి చెందినవి?
జ. ఆర్థ్రోపొడ
9. బీసీజీ వ్యాక్సిన్ ఏ వ్యాధి నివారణలో వాడతారు?
జ. క్షయ
10. దోమకాటు వల్ల వ్యాపించే వైరల్ వ్యాధి?
జ. మెదడు వాపు
11. గొర్రెల్లో ఆంత్రాక్స్ వ్యాధి దేనివల్ల కలుగుతుంది?
జ. బాక్టీరియా
12. {Mిమిసిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
జ. లూయి పాశ్చర్
13. అద్భుత ఔషధ సృష్టికర్తగా పేరొందిన శాస్త్రవేత్త?
జ. వై. సుబ్బారావు