బయాలజీ | biology | Sakshi
Sakshi News home page

బయాలజీ

Published Fri, Jan 24 2014 9:40 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

బయాలజీ - Sakshi

బయాలజీ

గత వీఆర్వో/వీఆర్‌ఏ ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే కంటి, చర్మ సంబంధ వ్యాధులు; ఖరీఫ్, రబీ పంటలు; వివిధ రకాల ఎరువుల గురించి ప్రధానంగా ప్రశ్నలు అడిగినట్లు గమనించొచ్చు. కాబట్టి అభ్యర్థులకు
 సంబంధిత అంశాలపై ప్రాథమిక అవగాహన ఉండాలి.
 
 మొక్కలు - జంతువుల ఆర్థిక ప్రాముఖ్యత
 1.    వేసవికాలంలో కోతకు వచ్చే పంటలను ఏమంటారు?
     రబీ పంటలు
 2.    రబీ పంటలకు ఉదాహరణలు?
     గోధుమ, బార్లీ, నువ్వులు
 3.    ఖరీఫ్ పంటలకు ఉదాహరణలు?
     వరి, చెరకు, మొక్కజొన్న
 4.    స్వల్పకాలిక పంటల పంట కాలం ఎంత?
     100 రోజులు లేదా అంతకంటే తక్కువ
 5.    దీర్ఘకాలిక పంటల పంట కాలం?
     180 రోజులు లేదా అంతకంటే ఎక్కువ
 6.    కాలికో ముద్రణలో ఏ  పిండిని ఉపయోగిస్తారు?
     వరి(బియ్యం)
 7.    గ్లూకోజ్, రేయాన్, కాగితం పరిశ్రమల్లో వాడే మొక్క?
     మొక్కజొన్న
 8.    {పపంచంలో అతి పురాతన నార?
     పత్తినార
 9.    ఫలాల నుంచి నారనిచ్చే మొక్క?
     కొబ్బరి
 10.    కాంఫర్ అనే ఔషధం ఏ మొక్క నుంచి లభిస్తుంది?
     ఆసిమమ్/తులసి
 11.    జీర్ణాశయ, నరాల సంబంధ వ్యాధుల నివారణలో వాడే ఔషధం?
     {బూసిన్
 12.    వేర్వేరు కాలాల్లో వేర్వేరు పంటలను పండించడాన్ని ఏమంటారు?
     పంట మార్పిడి
 13.    ఒకటి కంటే ఎక్కువ రకాల పంటలను పండించడాన్ని ఏమంటారు?
     మిశ్రమ పంటలు
 14.    ‘పచ్చిరొట్ట ఎరువులు’గా వాడేవి?
     వెంపలి, ఉలవ, పిల్లిపెసర, అలసంద, పెసర
 15.    పంచగవ్యలోని పదార్థాలు ఏవి?
     ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రం
 16.    వర్మి కంపోస్ట్ తయారీలో ఉపయో గపడేవి?
     వానపాములు
 17.    శ్రీవరి సాగులో ఖఐ అంటే?
system of rice intensification
 18.    మొలగొలుకులు, పొట్టిబాసంగి, బంగారు తీగ ఏ ధాన్యపు రకాలు?
     వరి
 19.    ఆకర్షక పంటలకు ఉదాహరణ?
     మిర్చిపొలాల్లో బంతిమొక్కల పెంపకం, పత్తి చేలల్లో జనుము పెంపకం
 20.    మెరినో జాతి గొర్రె ఏ దేశానికి చెందింది?
     స్పెయిన్
 21.    ‘మ్యూల్’ ఎలా జన్మిస్తుంది?
     మగ గాడిద గీ ఆడ గుర్రం సంకరణం వల్ల
 22.    కృత్రిమ గర్భధారణలో వాడే హార్మోన్ ఏమిటి?(సూపర్ ఓవ్యులేషన్ కోసం)
     సీరమ్ గొనాడో ట్రాపిన్
 23.    శుక్ర కణాలను క్రయోప్రిజర్వేషన్‌లో ఏ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు?
     196నిఇ వద్ద
 24.    అసిల్, చిట్టగాంగ్, గాగూస్ అనేవి ఏ రకాలు?
     దేశీయ కోడి రకాలు
 25.    జెర్సీ, హాలీస్టీన్ జాతుల ఆవులు ఏ దేశాలకు చెందినవి?
     ఇంగ్లండ్, డెన్మార్‌‌క
 26.    పట్టు పరిశ్రమ మొదట ఏ దేశంలో ప్రారంభమైంది?
     చైనా
 27.    తేనెపట్టులో ఉండే రాణి ఈగల సంఖ్య?
     ఒకటి
 28.    సువాసన నూనెలనిచ్చే మొక్కలకు ఉదాహరణ?
     ల్యావెండర్, నిమ్మ, కర్పూరతైలం
 29.    ఎలుకల నివారణలో వాడే రసాయన పదార్థాలు ఏవి?
     జింక్‌ఫాస్ఫైడ్, వార్పరిన్
 30.    మొక్క వేర్లు నేలలోకి చొచ్చుకుపోవడానికి అవసరమయ్యే స్థూల పోషకం?
     భాస్వరం(ఫాస్ఫరస్)
 
 జ్ఞానేంద్రియాలు

 1.    దేహంలో అతిపెద్ద అవయవం ఏది?
     చర్మం
 2.    చర్మం గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
     డెర్మటాలజీ
 3.    చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించే వర్ణకం పేరు?
     మెలనిన్
 4.    గోర్లు, కొమ్ములు, రోమాల్లో ఉండే ప్రోటీన్?
     కెరాటిన్
 5.    శరీరంపై రుచి గ్రాహకాలను  కలిగి ఉండే జీవులు?
     చేపలు, అకశేరుకాలు
 6.    ఏ జ్ఞానేంద్రియాలు రసాయన జ్ఞానాలను గుర్తిస్తాయి?
     ముక్కు, నాలుక
 7.    జ్ఞానేంద్రియాలన్నింటిలో కెల్లా ముఖ్యమైంది?
     కన్ను
 8.    దేహ ఉష్ణోగ్రతను క్రమపరిచే జ్ఞానేంద్రియం?
     చర్మం
 9.    ఎక్కువ ధ్వని తీవ్రతకు గురైన చెవిలో మోగుతున్నట్లు ఉండే స్థితిని ఏమంటారు?
     టిన్నిటస్
 10.    ఇంద్రియ జ్ఞానం అనేది ఒక సంక్లిష్టమైన విధానం. దీనిలో పాల్గొనేవి?
     జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు, మెదడు
 11.    కంటిలోని దండాలు, కోనుల నిష్పత్తి?
     15:1
 12.    కంటి ఫోవియా లేదా ఎల్లో స్పాట్‌లో ఉండే కణాలు?
     కోనులు/శంకు కణాలు
 13.    దండాలు, కోనుల్లో ఉండే పదార్థాలు?
     రొడాప్సిన్, ఐడాప్సిన్
 14.    క్షీరదాల్లో ఉన్న దృష్టి రకం?
     బైనాక్యులర్ విజన్
 15.    మధ్య చెవికి, గ్రసనితో సంబంధాన్ని ఏర్పరిచే నిర్మాణం?
     {శోతఃపథనాళం/యుస్టాచియన్ నాళం
 16.    దేహంలోని అతిచిన్న ఎముక పేరు?
     స్టేపిస్/కర్ణాంతరాస్థి/అంకవన్నె
 17.    శరీర సమతాస్థితికి సహాయపడే జ్ఞానేం ద్రియం?
     చెవి
 18.    మధ్య చెవిలోని ఎముకల సంఖ్య?
     మూడు
 19.    మానవుని అంతర చెవిలోని అర్ధవర్తుల కుల్యల సంఖ్య?
     మూడు
 20.    విసర్జన క్రియలో ఏ జ్ఞానేంద్రియం పాల్గొంటుంది?
     చర్మం
 21.    మన కంటిలోని కటకం ఏ ఆకారంలో ఉంటుంది?
     ద్వికుంభాకారం
 22.    బేసిలార్ త్వచం ఏ జ్ఞానేంద్రియానికి సంబంధించింది?
     చెవి
 23.    జంతువుల కళ్లు చీకటిలో మెరవడానికి కారణం?
     వాటి నేత్రపటలానికి ముందు టపేటమ్ లూసిడమ్  పొర ఉండటం.
 24.    కంటిగుడ్డును కదపడానికి ఎన్ని కండరాలు పనిచేస్తాయి?
     ఆరు
 25.    కట్లపాము, తాచుపాముల విషాలు మానవుని ఏ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి?
     నాడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement