వెబ్ కౌన్సెలింగ్- విధివిధానాలు... | Web counseling procedures | Sakshi
Sakshi News home page

వెబ్ కౌన్సెలింగ్- విధివిధానాలు...

Published Wed, Jun 10 2015 11:32 PM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM

Web counseling procedures

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 12 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వీటికి సంబంధించి ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్ తేదీల ప్రకటన సైతం విడుదలైంది. తెలంగాణలో ఈ నెల 12వ తేదీన కౌన్సెలింగ్  పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదలకానుంది. 18 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎంసెట్ కౌన్సెలింగ్ రెండు దశలుగా ఉంటుంది. మొదటిది సర్టిఫికెట్ వెరిఫికేషన్. రెండోది వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ.  స్థూలంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నుంచి వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ తర్వాత కాలేజీ అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం వరకు మొత్తం 9 దశల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. దశల వారీగా వివరాలు..
 
 మొదటి దశ (స్టేజ్-1)
 రిజిస్ట్రేషన్ విద్యార్థులు ర్యాంకుల ప్రకారం నిర్దేశించిన తేదీల్లో, హెల్ప్‌లైన్ సెంటర్లకు హాజరై తమ ర్యాంకుకార్డ్‌ను సంబంధిత అధికారికి అందజేసి తమ పేరు నమోదు చేసుకోవాలి. తర్వాత తమ ర్యాంకును పిలిచినప్పుడు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రశీదు తీసుకోవాలి. ఈ సమయంలో తప్పనిసరిగా విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ నెంబర్‌ను తెలియజేయాలి. (ఈ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా లాగిన్ ఐడీ పంపుతారు. దీని ద్వారానే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకోసం లాగిన్ అవాలి). తర్వాత రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫామ్‌ను తీసుకోవాలి. అందులో వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో క్షుణ్నంగా పరిశీలించి సంతకం చేయాలి.
 
 రెండో దశ
 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తమ పేరును పిలిచినప్పుడు వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లాలి. ఈ సమయంలో అభ్యర్థులు తమ ర్యాంకు కార్డ్, హాల్ టికెట్, మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికెట్స్, ఇన్‌కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ వంటివి అందజేయాలి. వీటిని పరిశీలించిన తర్వాత సదరు వెరిఫికేషన్ ఆఫీసర్ సర్టిఫికెట్స్ అందినట్లు ఒక రశీదు ఇస్తారు. వివరాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించి సంతకం చేయాలి. ఇదే సమయంలో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి ముందస్తు కసరత్తు కోసం ఉద్దేశించిన మా న్యువల్ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్‌ను ఇస్తారు. దీన్ని కూడా తీసుకుంటే రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినట్లే.
 
 మూడో దశ ఆప్షన్స్ ఎంట్రీ కసరత్తు
 రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో విద్యార్థులకు మాన్యువల్ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్‌ను ఇస్తారు. అభ్యర్థులు ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా అందుబాటులో ఉన్న కళాశాలలు, కోర్సులను పరిశీలించి తమ ఆసక్తి మేరకు ప్రాథమ్యాలను ముందుగా మ్యాన్యువల్‌గా పూర్తి చేసుకోవాలి. (ఎంసెట్ కౌన్సెలింగ్ కళాశాలలు కోర్సులు, కాలేజ్ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్, కోర్స్ కోడ్ వంటివి అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
 ఏపీ ఎంసెట్ వెబ్‌సైట్: www.apeamcet.nic.in,
 తెలంగాణ ఎంసెట్ వెబ్‌సైట్: www.tseamcet.in).
 
 నాలుగో దశ
 ఇంటర్నెట్ ఆధారంగా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్‌సైజ్ ప్రక్రియ ప్రారంభం ఈ దశలో విద్యార్థులు ఇంటర్నెట్ ఆధారంగా కౌన్సెలింగ్ వైబ్‌సైట్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత పాస్‌వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆప్షన్స్ ఎంటర్ చేయాలి. (కోర్సు, కళాశాల ప్రాథమ్యాల సంఖ్య). అన్నీ పూర్తయ్యాక లాగ్ అవుట్ చేయాలి. ఇందుకోసం అనుసరించాల్సిన విధనాలు వరుస క్రమంలో..ముందుగా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. ఇందుకోసం కచ్చితంగా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9.0 లేదా అంతకంటే అడ్వాన్స్‌డ్ వెర్షన్‌ను మాత్రమే వినియోగించాలి. గూగుల్ క్రోమ్, మొజిల్లా వంటి వాటి ద్వారా సాధ్యం కాదు. తప్పనిసరిగా మైక్రోసాఫ్ట్ 7 ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్ ఉండాలి.
 
 పాస్‌వర్డ్ జనరేషన్
 అభ్యర్థులు వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన తర్వాత హోంపేజీలో కనిపించే క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అనే విండో ఓపెన్ అవుతుంది. అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ (సర్టిఫికెట్ వెరిఫికేషన్ కమ్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చేది), ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, పుట్టిన తేదీ బాక్స్‌లో సంబంధిత వివరాలు పొందుపరచి జనరేట్ పాస్‌వర్డ్ బటన్‌పై క్లిక్ చేయాలి.
 
 జనరేట్ పాస్‌వర్డ్ బటన్‌పై క్లిక్ చేశాక అభ్యర్థుల వివరాలతోపాటు, ఎంటర్ యువర్ పాస్‌వర్డ్ కాలమ్స్ ఉండే స్క్రీ న్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎంటర్ యువర్ పాస్‌వర్డ్ స్క్రీన్‌లో పాస్‌వర్డ్, రీ ఎంటర్ పాస్‌వర్డ్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ వివరాలు పొందుపర్చాలి. గమనిక: పాస్‌వర్డ్ కనీసం 8క్యారెక్టర్లతో ఉండాలి. ఇందు లో ఒక క్యారెక్టర్ తప్పనిసరిగా స్పెషల్ క్యారెక్టర్ అయి ఉండాలి (ఉదా: ః, ు, చ వంటివి). పాస్‌వర్డ్ వివరాలు జనరేట్ చేశాక సేవ్ పాస్‌వర్డ్‌పై క్లిక్ చేస్తే పాస్‌వర్డ్ సేవ్ అవుతుంది. తర్వాత లాగ్ అవుట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మళ్లీ వెబ్‌సైట్ హోంపేజీ కనిపిస్తుంది.
 
 తదుపరి దశ ఆప్షన్స్ ఎంట్రీ- లాగిన్ ఐడీ
 లాగ్ అవుట్ అవడం ద్వారా హోంపేజీకి వెళ్లాక ఆప్షన్స్ ఎంట్రీ ప్రక్రియ మొదలవుతుంది. ఇందుకోసం ముందుగా హోం పేజీలో కనిపించే క్యాండిడేట్స్ లాగిన్ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలు పొందుపర్చాలిన విండో కనిపిస్తుంది. లాగిన్ ఐడీని విద్యార్థులకు తాము తెలియజేసిన మొబైల్ ఫోన్ నెంబర్లకు సంక్షిప్త సందేశం ద్వారా పంపిస్తారు. దాన్ని మాత్రమే లాగిన్ ఐడీ కాలమ్‌లో పేర్కొనాలి. ఈ వివరాలు పూర్తి చేశాక సైన్ ఇన్ బటన్‌పై క్లిక్ చేస్తే నమూనా ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దాన్ని పరిశీలించాలి. తర్వాత నిజమైన ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చేందుకు One Time Password (ైఖ్కీ) కాలమ్ పక్కన టిక్ చేస్తే విద్యార్థుల మొబైల్ నెంబర్‌కు వన్ టైం పాస్‌వర్డ్ మెసేజ్ వస్తుంది. ఆ పాస్‌వర్డ్‌ను ఓటీపీ బాక్స్‌లో పొందుపర్చాలి. తర్వాత డిక్లరేషన్ ఫామ్‌ను చదివి దాని పక్కన ఉండే బాక్స్‌లో టిక్ చేసి ‘క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ’ బటన్‌పై క్లిక్ చేయాలి.
 
 డిస్‌ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్
 క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ బటన్‌పై క్లిక్ చేశాక రీజియన్లు, జిల్లాలు, కోర్సులతో కూడిన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు తమకు సరిపడే బాక్స్‌ల పక్కన టిక్ చేసి డిస్‌ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్‌పై క్లిక్ చేయాలి.
 
 ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్
 డిస్‌ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్‌పై క్లిక్ చేశాక అప్పుడు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న రీజియన్ల పరిధిలో, ఎంపిక చేసుకున్న జిల్లాల్లో ఉన్న కళాశాలల కోడ్‌లు, జిల్లా బ్రాంచ్‌లతో కూడిన ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్‌లో ముందుగా ఎంసెట్ హాల్‌టికెట్ కాలమ్‌లో ఎంసెట్ హాల్‌టికెట్ నెంబర్‌ను పొందుపర్చాలి. తర్వాత.. విద్యార్థులు తమకు నచ్చిన ప్రాథమ్యం ఆధారంగా ఆయా కాలేజీ కోడ్‌ల పక్కన, బ్రాంచ్ కోడ్‌ల కింద కనిపించే బాక్స్‌లలో ప్రాధాన్యత సంఖ్యను పొందుపర్చాలి. (ఉదాహరణకు: జేఎన్‌టీయూ - హైదరాబాద్‌లో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను మొదటి ప్రాధాన్యంగా భావిస్తే ఆప్షన్స్ ఎంట్రీ విండోలోని ఒూఖీఏ కోడ్ పక్కన ఇఐగ బ్రాంచ్ కోడ్ బాక్స్‌లో 1వ అంకెను పొందుపర్చాలి.
 
  అదే విధంగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈని రెండో ఆప్షన్‌గా భావిస్తే అ్ఖఇఉ కోడ్ పక్కన ఇఉ బ్రాంచ్ కోడ్ బాక్స్‌లో 2వ అంకెను పొందుపర్చాలి.) ఇలా.. అభ్యర్థులు ఎన్ని ఆప్షన్లనైనా పొందుపర్చుకోవచ్చు. ఆప్షన్ల ఎంట్రీలో ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. ఆప్షన్స్ ఎంట్రీ సమయంలో క్రమం తప్పకుండా ్చఠ్ఛి ైఞ్టజీౌట బటన్‌పై క్లిక్ చేస్తుండాలి.ఆప్షన్స్ ఎంట్రీ పూర్తయిన తర్వాత వ్యూ అండ్ ప్రింట్ బటన్‌పై క్లిక్ చేస్తే అప్పటి వరకు విద్యార్థులు ఎంటర్ చేసిన ఆప్షన్ల వివరాలతో కూడిన ఫైల్ కనిపిస్తుంది. దీన్ని ప్రింట్ తీసుకుని ఉంచుకోవాలి.
 
 లాగ్ అవుట్
 ఆప్షన్స్ ఎంట్రీ ప్రక్రియ మొత్తం పూర్తయిందని భావించిన తర్వాత ఔౌజ ైఠ్ట బటన్‌పై క్లిక్ చేస్తే .. Save and Logout, Confirm Logout, Cancel Logout అని మూడు బాక్స్‌లు కనిపిస్తాయి. విద్యార్థులు మరిన్ని ఆప్షన్లను ఇచ్చుకోవాలంటే Cancel Logout న్‌పై క్లిక్ చేయాలి. ్చఠ్ఛి ్చఛీ ఔౌజౌఠ్ట బటన్‌పై క్లిక్ చేస్తే విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల వివరాల విండో ఓపెన్ అవుతుంది. వీటిని సరిచూసుకున్నాక ఎలాంటి మార్పులు లేవనుకుంటే ఇౌజజీటఝ ఔౌజౌఠ్ట బటన్‌పై క్లిక్ చేయాలి.
 
 అయిదో దశ
 సీట్ అలాట్‌మెంట్ విద్యార్థులు ఆప్షన్స్ ఎంట్రీలో ఇచ్చిన ప్రాధాన్యత క్రమం, ర్యాంకును అనుసరించి వారికి కేటాయించిన కాలేజీ వివరాలు తెలిపే దశ ఇది. పూర్తిగా సాఫ్ట్‌వేర్ ఆధారితంగా సాగే ప్రక్రియ. ఈ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను తెలుసుకునేందుకు నిర్దేశిత తేదీల్లో వెబ్‌సైట్‌లో లాగిన్ అయి అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
 
 ఆరో దశ
 ఫీజు చెల్లింపు విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీ ఆధారంగా నిర్దేశిత ఫీజును చెల్లించాలి. ఇందుకోసం గతేడాది ఎంసెట్ వెబ్‌సైట్ నుంచి చలాన ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆంధ్రా బ్యాంక్ లేదా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ల్లో ఫీజు చెల్లించే విధానం ఉంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఈ విధానానికి స్వస్తి పలికి నేరుగా కళాశాలలోనే ఫీజు చెల్లించే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. అంటే ఒక అభ్యర్థి తొలి దశ సీట్ అలాట్‌మెంట్ జరిగిన కాలేజీలో చేరడం ఇష్టం లేకపోతే రిపోర్ట్ చేయనక్కర్లేదు. మలి దశ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. అదే విధంగా ఒక అభ్యర్థి తొలి దశ సీట్ అలాట్‌మెంట్ జరిగిన కాలేజీలో రిపోర్ట్ చేసి ఫీజు చెల్లించినా తర్వాత రెండో దశ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. రెండో దశ కౌన్సెలింగ్‌లో అలాట్‌మెంట్ అయిన కాలేజీలో చేరాలనుకుంటే తొలి దశలో అలాట్‌మెంట్ జరిగిన కాలేజ్‌లో చెల్లించిన ఫీజు ఆటోమేటిక్‌గా రెండో దశ కౌన్సెలింగ్ ద్వారా రిపోర్ట్ చేసిన కాలేజీకి బదిలీ అవుతుంది.
 
 ఏడో దశ
 కాలేజీలో రిపోర్టింగ్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న విద్యార్థులు దాన్ని తీసుకుని తమకు కేటాయించిన కళాశాలలో నిర్దేశిత తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే సీటు కేటాయింపు రద్దవుతుంది.
 
 ఎనిమిదో దశ
 కౌన్సెలింగ్ తదుపరి దశలకు హాజరవడం తొలి దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనని విద్యార్థులు, తొలి దశలో పాల్గొన్నప్పటికీ సీటు లభించని విద్యార్థులు తదుపరి దశ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. ఈ క్రమంలో తొలిదశలో పాల్గొనని విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా మలి దశ కౌన్సెలింగ్‌కు నిర్దేశిత హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. తొలి దశలో సీటు లభించినప్పటికీ సదరు కళాశాలలో చేరడం ఆసక్తి లేని విద్యార్థులు ఫీజు చెల్లించక్కర్లేదు. మలిదశ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు వీరు కూడా అర్హులే. తొలి దశ కౌన్సెలింగ్‌లో సీటు లభించి, ఫీజు చెల్లించి, కాలేజ్‌లో రిపోర్ట్ చేసిన విద్యార్థులు కూడా మలి దశ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. మలి దశ కౌన్సెలింగ్‌లో లభించిన కాలేజ్‌లో చేరేందుకు మాత్రమే అర్హత ఉంటుంది. మలిదశలో లభించిన కాలేజ్‌ను వద్దనుకుని తొలిదశలో లభించిన కాలేజ్‌లో రిపోర్ట్ చేసే అవకాశం ఉండదు.
 
 తొమ్మిదో దశ
 సీటు రద్దు చేసుకునే ప్రక్రియఅన్ని దశల కౌన్సెలింగ్ పూర్తయ్యాక తమ అలాట్‌మెంట్‌ను రద్దు చేసుకోవాలనుకునే విద్యార్థులు నిర్దేశిత కటాఫ్ తేదీలోపు రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కటాఫ్ తేదీలోపు రద్దు ఆలోచన ఉంటే కన్వీనర్ ద్వారా జరుగుతుంది. ఆ కటాఫ్ తేదీ తర్వాత రద్దు చేసుకోవాలనుకుంటే మాత్రం తమకు కేటాయించిన కళాశాల ప్రిన్సిపాల్ నిర్ణయంపై ఆధారపడాల్సి ఉంటుంది.
 
 ప్రతి ఆప్షన్ తొలి ప్రాధాన్యంగా భావించాలి
 విద్యార్థులకు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ విషయంలో ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. అయితే అభ్యర్థులు తాము ఇచ్చే మొదటి ప్రాధాన్యత, చివరి ప్రాధాన్యత కూడా తమ దృష్టిలో మంచిది అని భావించేలా ఉండాలి. అంటే ఇచ్చే ప్రతి ప్రాధాన్యం, కోర్సు, కళాశాల కూడా మంచిదిగా ఉండేలా ముందుగానే కసరత్తు చేయాలి. అప్పుడు ఎలాంటి ఆప్షన్లు ఇచ్చినా సాఫ్ట్‌వేర్ ఆధారంగా సీట్ అలాట్‌మెంట్ జరిగినప్పుడు సదరు కళాశాలలో చేరేందుకు మానసికంగా సంసిద్ధత లభిస్తుంది. కళాశాలలు, ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేసుకునే ముందు ఆయా కళాశాలల విద్యార్థులను కలిసి సదరు కళాశాలలో సదుపాయాలపై ఆరా తీయాలి. ‘స్టూడెంట్స్ ఆర్ అంబాసిడర్స్ టు ఇన్‌స్టిట్యూట్స్’ అని గుర్తించాలి. వారి ద్వారా కళాశాలకు చెందిన వాస్తవాలు తెలుస్తాయి.     - సాయిబాబు, ఏపీ ఎంసెట్ కన్వీనర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement