Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page
breaking news

ప్రధాన వార్తలు

chandrababu Government Conspiracy To Ys Jagan Public Tours 1
వైఎస్‌ జగన్‌ బంగారుపాళ్యం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్ర

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. జులై 9న (బుధవారం) వైఎస్‌ జగన్‌ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్‌ జగన్‌ పర్యటనలో ‘పార్టీ శ్రేణులు 500 మందికి మించరాదు. రోడ్‌షో, పబ్లిక్‌ మీటింగ్‌ పెట్టకూడదు. హెలిప్యాడ్‌ వద్ద 30 మందికి మించి ఉండకూదు’అని ఎస్పీ మణికంఠ వెల్లడించారు.వైఎస్‌ జగన్‌ చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా వస్తుండటంతో కూటమి ప్రభుత్వం కంగారు పడుతోంది. ఇప్పటి వరకు మామిడి రైతులను ఆదుకోవడంలోనూ, వారికి మద్దతు ధర కల్పించడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్‌ జగన్‌ వస్తున్నారని తెలిసి, కూటమి పెద్దలు కుట్రలకు దిగారు. బంగారుపాళ్యం పర్యటనపై అనుమతులు ఇచ్చే విషయంలో పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

DY Chandrachud Explains Why Moving Out Not Easy2
పిల్లలది ప్రత్యేక పరిస్థితి.. అందుకే ఇల్లు మారడం కష్టమవుతోంది; మాజీ సీజేఐ

న్యూఢిల్లీ: ఒక్క ఏడాది వెనక్కి వెళితే.. డీవై చంద్రచూడ్‌ సుప్రీంకోర్టు సీజేఐ స్థానంలో కచ్చితమైన తీర్పులతో ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు. ఇప్పుడు అదే చంద్రచూడ్‌ మాజీ సీజేఐ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ అధికారిక నివాసం విషయమై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ రాయడంతో ఆయన మరోసారి వార్తల్లోకి వచ్చారు.జస్టిస్‌ చంద్రచూడ్‌ పదవీ విరమణ అనంతరం నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉండటాన్ని సర్వోన్నత న్యాయస్థానం లేఖలో ప్రస్తావించింది. అయితే దీనిపై ఇప్పటికే స్పందించిన చంద్రచూడ్‌.. మరోసారి తాను ఆ నివాసాన్ని ఇప్పటివరకూ ఎందుకు ఖాళీ చేయాలేకపోయాననే అంశంపై ఎన్డీటీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో కాస్త వివరంగా షేర్‌ చేసుకున్నారు.పిల్లల్ని ప్రత్యే పరిస్థితుల్లో పెంచుతున్నాం..‘మా పిల్లలు ప్రియాంక, మహిలను ప్రత్యేక పరిస్థితుల్లో పెంచాల్సి వస్తుంది. 24 గంటలు వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. నేను, నా భార్య కల్పనా దాస్‌ ఇద్దరం కలిసి పిల్లల ఆలనా పాలన చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు ప్రత్యేకమైన డిజార్డర్‌తో బాదపడుతున్నారు. పిల్లల ఇద్దరికీ అరుదైన డిజార్డర్‌ కలిగి ఉన్నారు. నెమలైన్‌ మయోపతి(శరీరంలోని కండరాల సమస్యతో బాధపడుతున్నారు). దీనిపై భారత్‌తో పాటు విదేశాల్లో పరిశోధనలు జరుగుతున్నప్పటికీ ప్రస్తుతానికి ట్రీట్‌మెంట్ ఏమీ కూడా ప్రపంచంలో లేదు. ఇది మోటార్‌ స్కిల్స్‌ డిజార్డర్‌. దీనికి డెవలప్‌మెంటల్‌ కో ఆర్డినేషన్‌ డిజార్డర్‌(డీసీడీ) లేదా డైస్ప్రాక్సియా అని కూడా పిలుస్తారు. అందుకే ఖాళీ చేయలేకపోతున్నాంపిల్లలకు ఈ డిజార్డర్‌ నయం చేయడానికి ఎంతోమంది స్పెషలిస్టులతో సంప్రదిస్తూనే ఉంటాం. వారికి మంచి ప్రపంచాన్ని ఇవ్వడానికి కృషి చేస్తున్నాం. వారిని వారు పనులు చేసుకునేలా, వారి కాళ్ల మీద వారు నిలబడలా చేయడమే మా ముందున్న కర్తవ్యం. ప్రపంచం వారి శ్రేయస్సు కోసం తిరుగుతోంది’ అని చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. ఈ క్రమంలొనే తాము ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇచ్చిన నివాసాన్ని ఖాళీ చేయలేకపోయామన్నారుప్రస్తుతం ప్రభుత్వం తమకు తాత్కాలికంగా అద్దెకు ఇచ్చిన బంగ్లాకు మరమ్మత్తులు జరుగుతున్నాయన్నారు. పిల్లల అవసరాలకు తగ్గట్టు దాన్ని డిజైన్‌ చేయించుకుంటున్నామన్నారు. ఈ క్రమంలోనే ఆలస్యం అవుతుందన్నారు. ప్రస్తుతం ఖాళీ చేసే పనిలోనే ఉన్నామని, అక్కడ ఇంకా పనులు జరుగుతున్నందున ఖాళీ చేయడం వీలు కాలేదన్నారు.

Hyderabad family died in road accident in the United States3
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కి చెందిన కుటుంబం సజీవ దహనం

సాక్షి,హైదరాబాద్: అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. డల్లాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న శ్రీవెంకట్, తేజస్సుని దంపతులు. వారి ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలోని డల్లాస్‌లో నివాసం ఉంటుంన్న వారి కుటుంబసభ్యుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి స్థానికంగా ఉండే బంధువులను కలిసిందేకు కారులో వెళ్లారు. వారిని కలిసి తిరిగి వచ్చే సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది.మృతులు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్‌ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న శ్రీ వెంకట్‌ కుటుంబం సజీవదహనమైంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాల గుర్తింపు కోసం ప్రమాదం జరిగిన ప్రాంతంలో సేకరించిన అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం ప్రయోగశాలకి పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ENG U19 Vs IND U19 5th Youth ODI: Vaibhav Suryavanshi Out For 33 In 42 Balls4
శాంతించిన వైభవ్‌ సూర్యవంశీ.. విధ్వంసం డోసు కాస్త తగ్గింది..!

ఇంగ్లండ్‌ పర్యటనలో భారత యువ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ తొలిసారి శాంతించాడు. ఇవాళ (జులై 7) జరుగుతున్న ఐదో యూత్‌ వన్డేలో 42 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్‌రేట్‌తో 33 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో వైభవ్‌ ఇంత తక్కువ స్ట్రయిక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేయడం ఇదే మొదటిసారి. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వైభవ్‌ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 130కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు.తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్‌.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌ వైభవ్‌ విధ్వంసం ధాటికి ఇంగ్లండ్‌ యువ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వైభవ్‌ ప్రతి మ్యాచ్‌ల కనీసం రెండైనా సిక్సర్లు కొట్టాడు.ఇంగ్లండ్‌ పర్యటనలో వైభవ్‌ తొలిసారి శాంతించడంతో భారత్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఇవాళ జరుగుతున్న ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన యంగ్‌ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 210 పరుగులు మాత్రమే చేసింది. ఆర్‌ఎస్‌ అంబ్రిష్‌ (66) అజేయ అర్ద శతకంతో రాణించి టీమిండియాకు ఈ మాత్రం స్కోరైనా అందించాడు. జట్టులో నెక్స్‌ హైయ్యెస్ట్‌ స్కోర్‌ వైభవ్‌దే. మిగతా ఆటగాళ్లలో రాహుల్‌ కుమార్‌ (21), హర్వంశ్‌ పంగాలియా (24), కనిశ్క్‌ చౌహాన్‌ (24), యుద్దజిత్‌ గుహా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆయుశ్‌ మాత్రే (1) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మరో స్టార్‌ బ్యాటర్‌ విహాన్‌ మల్హోత్రా (1) కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఫ్రెంచ్‌, ఆల్బర్ట్‌ చెరో 2 వికెట్లు తీయగా.. ఫిర్బాంక్‌, మోర్గాన్‌, గ్రీన్‌, ఎకాంశ్‌ సింగ్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ విజయం దిశగా అడుగులు వేస్తుంది. 21 ఓవర్ల తర్వాత ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. బెన్‌ డాకిన్స్‌ (66) అర్ద సెంచరీతో రాణించగా.. బెన్‌ మేస్‌ (45) ఇంగ్లండ్‌ను గెలుపు దిశగా తీసుకెళ్తున్నాడు. మేస్‌కు జతగా కెప్టెన్‌ రూ (2) క్రీజ్‌లో ఉన్నాడు.కాగా, ఈ సిరీస్‌ను భారత్‌ ఇదివరకే కైవసం చేసుకుంది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో భారత్‌ మూడింట విజయాలు సాధించింది. చివరిదైన ఈ మ్యాచ్‌లో ఓడినా టీమిండియాకు ఒరిగేదేమీ ఉండదు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ రెండో వన్డేలో మాత్రమే నెగ్గింది. వన్డే సిరీస్‌ అనంతరం భారత్‌ ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌ల యూత్‌ టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. తొలి టెస్ట్‌ జులై 12 నుంచి 15 వరకు బెకెన్హమ్‌లో జరుగనుంది.

YSRCp Perni Nani Slams AP Chandrababu Govt5
‘ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. జగన్‌ జెండా వదిలేదే లేదు’

పల్నాడు: సత్తెనపల్లి పోలీసులు అమాయకులని, అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే పోలీసులు భయపడి పెడుతున్నారని కూటమి ప్రభుత్వ అరాచక పాలనపై మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పేర్ని నానికి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన ఈరోజు(జూలై 7) విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘సత్తెనపల్లి పోలీసులు అమాయకులు. అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే పోలీసులు భయపడి తప్పుడు కేసులు పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పర్యటనలో పాల్గొన్నందుకు నాపై కేసు పెట్టారు. పోలీసులు నిన్న మా ఇంటికి నోటీసు అంటించి వెళ్ళిపోయారు. 11 సెక్షన్లతో నామీద నేరం నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు మూడు కార్లు 100 మందిలో నేను ఒక వ్యక్తిని. నా మీద కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే బదిలీలు, సస్పెండ్ గాని చేస్తామని అధికార పార్టీ వారు బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో సైకో పరిపాలన నరకాసుని పరిపాలన జరుగుతుంది. మహా అయితే బందర్ నుండి సత్తెనపల్లికి కేసులు పెట్టి తిప్పుతారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి జగన్ జెండా వదిలేదే లేదు’ అని పేర్ని నాని స్పష్టం చేశారు.

Bank Of Baroda Dropping Minimum Balance Charges6
ఇక ఈ బ్యాంక్‌లోనూ మినిమమ్‌ బ్యాలెన్స్ అక్కర్లేదు..

పేదలు, సామాన్యులకు బ్యాంకింగ్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక్కొక్కటిగా ముందుకువస్తున్నాయి. ఇందులో భాగంగా బ్యాంక్‌ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించకపోతే విధించే చార్జీలను రద్దు చేస్తున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ జాబితాలో చేరింది. ప్రామాణిక పొదుపు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఛార్జీలను తొలగించింది.బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీల తొలగింపు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మార్పు ప్రీమియం ఉత్పత్తులు మినహా అన్ని సాధారణ పొదుపు ఖాతాలకు వర్తిస్తుంది.కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లు ఇటీవలే పొదుపు ఖతాలకు కనీస బ్యాలెన్స్‌ ఛార్జీలు తొలగించిన తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా అనుసరించింది. ఇక అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్ ఆవశ్యకతలను ఎత్తివేస్తూ ఈ దిశగా చర్యలు తీసుకుంది.మినిమమ్‌ బ్యాలెన్స్ లేని ఖాతాలపై విధిస్తున్న జరిమానాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య చర్చలు కొనసాగుతున్న క్రమంలో ఈ మార్పు చోటు చేసుకుంది. చౌక కరెంట్, పొదుపు ఖాతాల డిపాజిట్ల వాటాలో తగ్గుదలను బ్యాంకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ అంశం దృష్టిని ఆకర్షించింది.

Producer blames Mohanlal film issues with CBFC on Janaki vs State of Kerala 7
జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వివాదం.. అంతా మోహన్ లాల్ సినిమా వల్లే!

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జానకి వర్సెస్ స్టేర్ ఆఫ్ కేరళ. ఈ మూవీ రిలీజ్‌కు ముందే చిక్కుల్లో పడింది. దీనికి ప్రధాన కారణం ఆ మూవీ టైటిల్. సినిమా టైటిల్‌లో జానకి పేరు ఉపయోగించడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవికి మరో పేరైన జానకి టైటిల్ మారిస్తేనే సెన్సార్ చేస్తామని నిర్మాతలకు సూచించింది. దీంతో ఈ పంచాయతీ కాస్తా కోర్టుకు చేరింది.అయితే ఈ వివాదంపై నిర్మాత సురేశ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది విడుదలైన మోహన్‌ లాల్ చిత్రం ఎంపురాన్-2 పేరును ప్రస్తావించారు. ఆ సినిమా వల్లే ఈ పరిస్థితులు ఎదురయ్యాయని ఆరోపించారు. ఎంపురాన్ మూవీ విడుదల తర్వాత వివాదం తలెత్తడంతో సెన్సార్ బోర్డ్ మరోసారి సెన్సార్ చేయాల్సి వచ్చిందన్నారు. అందుకే సెన్సార్ బోర్డు మరింత జాగ్రత్తగా వ్యవహరించిందని.. ఈ సమస్య అంతా ఆ సినిమాతోనే ప్రారంభమైందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉన్నందున మాకు అనుకూలంగానే తీర్పు వస్తుందని భావిస్తున్నట్లు నిర్మాత జి సురేశ్ కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. పృథ్వీరాద్ సుకుమారన్ డైరెక్షన్‌లో వచ్చిన ఎంపురాన్-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Jyoti Malhotra was Hired by Kerala Tourism RTI8
కేరళ శారీలో పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ కోసం గూఢచర్యం చేశారన్న అరోపణలతో అరెస్టయిన హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా విచారణలో ఆమె నడిపిన అనేక బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా కేరళ పర్యాటకరంగ ప్రోత్సహక ప్రచారంలో అతిథిగా భాగస్వామ్యం వహించారని, ఈ సందర్భంగా ఆమె కేరళను సందర్శించారని వెల్లడయ్యింది. సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు వచ్చిన సమాధానంలో జ్యోతి మల్హోత్రాతో ముడిపడిన ఒక అంశం వెలుగు చూసింది. దక్షిణాదిని పర్యాటకంపరంగా ప్రోత్సహించేందుకు అతిథులుగా ఎంపిక చేసిన 41 మంది ఇన్‌ఫ్లుయెన్లర్లలో జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారని తేలింది. వీరి పర్యటనకు కేరళ ప్రభుత్వం నిధులు సమకూర్చిందని, వారి ప్రయాణం, వసతి, ఆహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించిదని సమాచారం. అలాగే వీడియోలను చిత్రీకరించడంలో వారికి సహాయం చేయడానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీని కూడా ప్రభుత్వం నియమించింది.జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం సహకరించిందన్న విషయం బయటపడిన దరిమిలా ప్రతిపక్షాలు అధికార ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. కేరళ ప్రభుత్వం సరైన వెరిఫికేషన్ లేకుండా విదేశీ గూఢచారులను ఆహ్వానించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వీటిపై కేరళ పర్యాటక మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ స్పందిస్తూ కేరళకు ఇతర ఇన్‌ఫ్లుయెన్లర్లతో పాటు జ్యోతిని ఆహ్వానించారని అన్నారు. ఇది కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో చేసిన ప్రయత్నమన్నారు. ఇది పారదర్శకంగా, మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమమని, గూఢచారులని ముందుగా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యపడదని అన్నారు.కేరళలో జ్యోతి మల్హోత్రా కొచ్చి, కన్నూర్, కోజికోడ్, అలప్పుజ, మున్నార్, తిరువనంతపురం ప్రాంతాలను సందర్శించారు. వీటికి సంబంధించిన వ్లాగ్‌లను ఆమె తన యూట్యూబ్‌ ఛానల్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో షేర్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత గత మే నెలలో ఆమెను అరెస్టు చేశారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌ను సందర్శించారని పోలీసుల విచారణలో తేలింది.జరిగింది ఇదే.. జ్యోతి మల్హోత్రా.. హర్యానాకు చెందిన 33 ఏళ్ల యూట్యూబ్ వ్లాగర్, "Travel with Jo" అనే ఛానెల్ ద్వారా పలు దేశాల్లోని ప్రయాణ అనుభవాలను పంచుకుంటూ ప్రజాదరణ పొందారు. అయితే, 2025 మేలో ఆమెపై పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసిన ఆరోపణలతో అరెస్ట్‌ చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.2023లో ఆమె మొదటిసారిగా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అక్కడ ఆమెకు "దానిష్" అనే పాక్ అధికారి పరిచయం అయ్యాడు. అదే సమయంలో ఆమె పాక్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. 2023 నుంచి 2025 మధ్యకాలంలో ఆమె కనీసం మూడు సార్లు పాకిస్తాన్‌కు ప్రయాణించినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. లాహోర్, కటాస్ రాజ్ ఆలయం వంటి ప్రదేశాల్లో ఆమె తీసిన వీడియోలు ఇప్పుడు దర్యాప్తులో భాగంగా పరిశీలించబడుతున్నాయి. 2024–2025లో కేరళ టూరిజం శాఖ ఆమెను అధికారికంగా ఆహ్వానించి, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టూరిజం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆహ్వానించింది. ఆమె ప్రయాణ ఖర్చులు, వసతి, షెడ్యూల్ అన్నీ ప్రభుత్వమే భరించింది. ఆమె "కేరళ సారీ" ధరించి తేయ్యం ప్రదర్శనలో పాల్గొన్న వీడియో వైరల్ అయింది. 2025 ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడికి ముందు ఆమె పాకిస్తాన్‌లో కనిపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెకు అక్కడ సాయుధ రక్షణ ఉండటం గమనార్హం. ఇది ఆమెపై ఉన్న అనుమానాలను మరింత బలపరిచింది. దర్యాప్తులో భాగంగా.. ఆమె యూట్యూబ్ ఛానెల్‌లోని పాక్, బంగ్లాదేశ్‌, థాయిలాండ్ వీడియోలన్నీంటిని ఏజెన్సీలు పరిశీలించాయి. డిలీట్‌ చేసిన డాటాను సైతం రికవరీ చేసి గుట్టును తేల్చే ప్రయత్నంలో ఉన్నాయి. 2025 మే 16న హర్యానాలోని హిసార్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెపై Official Secrets Act, 1923 కింద కేసు నమోదు చేశారు. జూన్ 12న బెయిల్ అభ్యర్థన తిరస్కరించబడింది. జూన్ 23న న్యాయస్థానం ఆమె న్యాయ హిరాసతను మరో రెండు వారాలు పొడిగించింది. తదుపరి విచారణ జూలై 7న(ఇవాళ) జరగనుంది. పాక్‌కు భారత రహస్యాలను చేరవేశారనే అభియోగాల కింద జ్యోతితో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో మరో 12 మందిని అరెస్ట్ చేశారు.

Donald Trump Tariff warns To BRICS Nations Full Details Here9
బ్రిక్స్‌తో పొత్తు ఉంటే.. ట్రంప్‌ లేటెస్ట్‌ వార్నింగ్‌

బ్రిక్స్‌ సదస్సు వేళ.. అమెరికా అధ్యక్షుడు మరో సంచలన ప్రకటన చేశారు. బ్రిక్స్‌తో పొత్తు ఉంటే 10 శాతం అదనపు సుంకాలు తప్పవని హెచ్చరించారు. బిక్స్‌ విధానాలు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ఆయన.. ఈ అడిషనల్‌ టారిఫ్‌ల విధింపులో ఎలాంటి మినహాయింపు ఉండబోదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల BRICS దేశాలపై గట్టి హెచ్చరిక జారీ చేశారు. BRICS కూటమి అమెరికా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని ట్రంప్ ఆరోపించారు. BRICS‌తో పొత్తు పెట్టుకునే ఏ దేశమైనా 10% అదనపు టారిఫ్‌కు గురవుతుందని ప్రకటించారు. ఈ విధానంలో ఏ దేశానికి.. ఎలాంటి మినహాయింపులు ఉండబోదు అని స్పష్టం చేశారు. అయితే బ్రిక్స్‌ను అమెరికా వ్యతిరేక కూటమిగా ఆయన ఎందుకు అభివర్ణించారో స్పష్టత లేనప్పటికీ.. .. బ్రెజిల్‌ రియో డి జనీరో వేదికగా BRICS 2025 సమ్మిట్ జరుగుతున్న వేళ.. ట్రంప్‌ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. తాజాగా BRICS దేశాలు అమెరికా-ఇజ్రాయెల్‌ దేశాలు ఇరాన్‌పై దాడులను తీవ్రంగా ఖండించాయి. అమెరికా యుద్ధ చర్యలతో వాణిజ్య ఆంక్షలు వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. అంతేకాదు.. అమెరికా, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్లను ప్రస్తావించకుండానే.. ప్రతీకార సుంకాలు, బెదిరింపులను ఖండిస్తూ రియో డి జనీరో డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. ఇందులో.. BRICS నేతలు ఏకపక్ష టారిఫ్ విధానాలను తీవ్రంగా ఖండించారు ఈ సుంకాలు WTO నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఈ నిర్ణయాలు.. ప్రపంచ వాణిజ్య స్థిరత్వాన్ని ఇది దెబ్బతీస్తుందని హెచ్చరించారు.BRICS 2009లో ఏర్పాటైంది. భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, UAE, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్.. సభ్య దేశాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం 11 సభ్య దేశాల కూటమి జనాభా.. ప్రపంచ జనాభాలో సుమారు 49.5% (దాదాపు 3.93 బిలియన్ మంది) కలిగి ఉంది. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో (GDP) సుమారు 40% వాటా కలిగి ఉన్నాయి. అంతేకాదు.. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 26% వాటా BRICS దేశాలదే.ట్రంప్ ఇప్పటికే 12 దేశాలకు టారిఫ్ నోటీసులు సిద్ధం చేశారని తెలిపారు. అమెరికా టారిఫ్‌ మినహాయింపు 90 రోజుల గడువు ముగుస్తుండడంతో.. ఈ నిర్ణయం జూలై 9న అమలులోకి వచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ మొదలైంది. అయితే..ఆగస్టు 1 నుంచి నూతన వాణిజ్య సుంకాలు: అమెరికా నూతన సుంకాలు జులై 9 నుంచి అమల్లోకి వస్తాయని గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అవి ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని తాజాగా అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్‌ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాలను నిర్ణయించే పనిలో ట్రంప్‌ నిమగ్నమై ఉన్నారని వెల్లడించారు.

Without Going To Gym Woman weight came down From 95 Kg To 65 Kg10
జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది

అధిక బరువుకు కారణాలనేకం. జీవన శైలి, ఆహార అలవాట్లు, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అయితే ‘‘చిన్నప్పటినుంచీ నేనింతే’’ అని కొంతమంది సరిపెట్టుకుంటే, మరికొంతమంది మాత్రం భిన్నంగా ఉంటారు. అధిక బరువుతో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా అయితేనే నేమి, అందంగా ఆరోగ్యంగా ఉండాలనే కోరికతోనేమి కష్టపడి శరీర బరువును తగ్గించు కుంటారు. అలా జిమ్‌ కెళ్లకుండానే 95 కిలోల వెయిట్‌ నుంచి 65 కిలోలకు చేరుకుందో యవతి. అదెలాగో తెలుసుకుందాం.ఇది ఉదితా అగర్వాల్ వెయిట్‌ లాస్‌ జర్నీ. బరువు తగ్గడం అనేది కష్టమైన ప్రయాణం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ బరువు తగ్గాల్సి వస్తే ఇంకా కష్టం. అందుకే కారణాలను విశ్లేషించుకుని నిపుణుల సలహాతో ముందుకు సాగాలి. అలా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అయిన ఉదితా అగర్వాల్ కేవలం ఫిట్‌నెస్ కోసం మాత్రమే కాకుండా తన ఆరోగ్యాన్ని మెరుగుపరచు కోవడానికి కూడా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. అద్బుతమైన విజయాన్ని సాధించింది.ఇదీ చదవండి: 300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లుఉదితా చిన్నప్పటి నుంచి ఊబకాయంతో బాధపడేది. దీనికి తోడు పిగ్మెంటేషన్, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, విపరీతంగా జుట్టు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద అన్‌వాంటెడ్‌ హెయిర్‌ ఇలా సవాలక్ష సమస్యలతో సతమతమయ్యేది. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలికి మారడం ద్వారా 8 నెలల్లో 30 కిలోల బరువు తగ్గింది. అదీ జిమ్‌కు వెళ్లకుండానే 95 కిలోల బరువున్న ఉదితా 65 కిలోలకు చేరుకుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడింది. View this post on Instagram A post shared by Udita Agarwal (@udita_agarwal20) తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. శుభ్రమైన ఆహారాలు తినడం ద్వారా ఆమె సహజంగానే 30 కిలోల బరువు తగ్గింది. ముఖ్యంగా "బరువు తగ్గడంలో జంక్‌ ఫుడ్‌ను మానేయడమే అది పెద్ద చాలెంజ్‌’’ అని ఆమె చెప్పుకొచ్చింది.చదవండి: చిన్నతనం నుంచే ఇంత పిచ్చా, పట్టించుకోకపోతే ముప్పే : ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ఉదిత వెయిట్‌ లాస్‌లో సాయపడిన అలవాట్లుడీటాక్స్ వాటర్: ప్రతిరోజూ డీటాక్స్ వాటర్ తీసుకునేది. ముఖ్యంగా జీరా, అజ్వైన్, సోంపు, మెంతిని నీటిలో మరిగించి తాగేది. ఇది ఉబ్బరాన్ని నివారించి జీర్ణక్రియకు సహాయపడుతుంది.ఆహారంపై దృష్టి: అప్పుడప్పుడు చీట్‌ మీల్‌ తీసుకున్నా.. ఆరోగ్యకరమైన ఆహార నియమాన్ని కచ్చితంగా పాటించేది.ఒక్కోసారి వెయిట్‌ పెరిగినా నిరాశపడలేదు: ప్రతీ రోజు వెయిట్‌ చెక్‌ చేసుకుంటూ ఉండేది. ఒకసారి బరువు పెరిగినా నిరుత్సాహ పడేది కాదు,అసలు ఆ హెచ్చుతగ్గులను పట్టించుకోలేదు.ఇంటి ఫుడ్‌: ఇంట్లో ఉన్నా, బయటికెళ్లినా, ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినేది. చియా సీడ్ వాటర్: చియా విత్తనాలను అర లీటరు నీటి నాన బెట్టి రోజుకు 3-4 లీటర్ల చొప్పున రోజంతా తాగేది. రోజుకు ఒకసారి టీ, మైదా ఫుడ్‌కు దూరంగా ఉంటూ అతిగా తినకుండా ఉండటానికి ఉదిత ప్రతి భోజనానికి ముందు నీరు త్రాగేది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement