
ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో హానర్ -4సీ
కొత్త సరకు
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువాయి తన హానర్ శ్రేణిలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఏకంగా ఎనిమిది కోర్‌ల ఎస్‌ఓసీ మైక్రోప్రాసెసర్ కలిగి ఉండే ఈ హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.8150. ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈస్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
అయిదు అంగుళాల స్క్రీన్ సైజుతోపాటు రెండు గిగాబైట్ల ర్యామ్‌తో వచ్చే హానర్ 4సీలో ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఎల్‌ఈడీ ఫ్లాష్, సీమాస్ సెన్సర్ ఎఫ్/2.0 అపెర్చర్ కలిగిన 13 మెగాపిక్సెళ్ల కెమెరా దీని సొంతం. సెల్ఫీల కోసం 5 ఎంపీ కెమెరా కూడా ఉంది. మెమరీ విషయానికొస్తే... ఇన్‌బిల్ట్ మెమరీ 8 జీబీలు కాగా... ఎస్‌డీ కార్డు ద్వారా దీన్ని 32 జీబీల వరకూ పెంచుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 2550 ఎంఏహెచ్!