
బ్యాక్ బ్యూటీ కోసం...
బ్యూటిప్స్
చీరలకు తగ్గట్టుగా అందమైన బ్లౌజులు వేసుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ కొందరికి వీపుపై ఉండే మొటిమలు, మచ్చల కారణంగా వారు డీప్ నెక్స్ వేసుకోవడానికి భయపడుతుంటారు. అలాంటి వారు వారానికోసారి బ్యాక్ ప్యాక్ వేసుకుంటే ఆ సమస్య నుంచి దూరం కావచ్చు. ఒక కప్పు తేనెను వేడి చేసి పెట్టుకోవాలి.
అది కొద్దిగా చల్లారాక అందులో చక్కెర వేసి వీపుపై ప్యాక్ వేసుకోవాలి. ఓ అరగంట తర్వాత వృత్తాకారంలో మర్దన చేసుకుంటూ గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా ఓ నెలపాటు చేస్తే వీపుపై మొటిమలు, మచ్చలు మాయమవుతాయి.