డిజిటల్ బ్యాక్ ప్యాక్
ఇరుకైన రద్దీ ప్రదేశాల్లోనూ క్యాంపెయిన్ చిరువ్యాపారులు, క్లినిక్‌ల కోసం ప్రత్యేకం వినూత్న పద్ధతిలో వ్యాపార ప్రకటనల ప్రచారంనగరానికి చెందిన బొల్లం ప్రజ్వల్ కొంత భిన్నంగా ఆలోచించారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేశారు. డిజిటల్ అడ్వరై్టజింగ్, యానిమేషన్ రంగంలో విశేష అనుభవం సాధించారు. ఆర్థిక స్థోమత అంతగా లేని చిరువ్యాపారులు, చిన్న చిన్న క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్స్‌కు ప్రచారం కలి్పంచేందుకు వీలుగా ‘డిజిటల్ అడ్వరై్టజింగ్ బ్యాక్ ప్యాక్’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పర్యాటక ప్రదేశాలు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన రహదారులు, షాపింగ్మాల్్స, ఇతర సందర్శనీయ ప్రదేశాల్లో తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకునేందుకు వీలుగా దీన్ని రూపొందించారు.తక్కువ ఖర్చుతో... చాలా తక్కువ ఖర్చుతో (రూ.15000) దీన్ని తయారు చేశారు. 24 ఇంచుల ఎల్ఈడీ టీవీకి వీడియోలు అప్లోడ్ చేసిన పెన్ డ్రైవ్‌ను అనుసంధానించారు. సాయంత్రం చీకటి పడిన తర్వాత రద్దీ ప్రదేశాల్లో నడుచుకుంటూ వెళ్తూ, కొనుగోలు దారుల దృష్టిని ఆకర్షించే విధంగా దీన్ని తయారు చేశారు. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ ఒకే చోట ఉంటుంది. అటు వైపు వెళ్లే వారు మాత్రమే దీన్ని చూసే అవకాశం ఉంటుంది. అదే ఈ ‘డిజిటల్ అడ్వర్టైజింగ్ బ్యాక్ ప్యాక్’ ఏకకాలంలో వేలాది మంది దృష్టిని ఆకర్షించనుంది.మార్కెట్లో వ్యాపార ప్రకటనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. భారీ హోర్డింగ్‌లు, కళ్లు చెదిరే రంగుల్లో కని్పంచే దృశ్యాలతో ఆకట్టుకునే వ్యాపార ప్రకటనలు తాజాగా హ్యూమన్ మొబైల్ హోర్డింగ్స్ దర్శనమిస్తున్నాయి. ఎల్ఈడీ స్క్రీన్‌ను వీపుపై ధరించి ఆయా వ్యాపార ప్రకటనలను ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏదైనా ఉత్పత్తి సంస్థ కానీ, షాపింగ్ మాల్, హోల్‌సేల్, రిటైల్ దుకాణాల వినియోగదారులను ఆకర్షించేందుకు భారీ హోర్డింగ్స్ ఉండేవి.. అయితే వీటితోపాటు ప్రస్తుతం నగరంలో ఓ నయా ట్రెండ్ నడుస్తోంది. అదే బ్యాక్ ప్యాక్.నిరుద్యోగ యువత కోసం.. ఈ తరహా ప్రచారం ఇప్పటికే విదేశాల్లో ఉంది. తాజాగా నగరవాసులకు దీన్ని పరిచయం చేశారు ప్రజ్వల్. ఒక్క రోజుకు అడ్వరై్టజింగ్ చేసినందుకు టారీఫ్ రూ.1500 గా నిర్ణయించినట్లు ప్రజ్వల్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఇది ఉపాధి కలి్పంచనుందని తెలిపారు.