బెటర్ ఆఫ్ ఫ్రెండ్స్... | Better Friends ... | Sakshi

బెటర్ ఆఫ్ ఫ్రెండ్స్...

Apr 2 2014 11:01 PM | Updated on Sep 2 2017 5:29 AM

బెటర్ ఆఫ్ ఫ్రెండ్స్...

బెటర్ ఆఫ్ ఫ్రెండ్స్...

యువత అభిమాన నవలగా మారిన ‘బెటర్ ఆఫ్ ఫ్రెండ్స్’ను ‘రొమాంటిక్ కామెడీ సూపర్‌స్టార్’గా పేరుగాంచిన ఎలిజబెత్ ఎల్‌బెర్గ్ రాశారు.

కొత్త పుస్తకం


 అబ్బాయితో అబ్బాయి స్నేహం చేస్తే ‘స్నేహం’ అంటాం కూల్‌గా.
 అబ్బాయి,అమ్మాయి స్నేహం చేస్తే ‘స్నేహం’ అనడానికి తడబడతాం. ‘ఇంకేదో ఉంది’ అనుకునే వరకు మనసు ఊరట చెందదు. ‘ఇంకేదో ఉంది’ అనే సందేహం  చుట్టూ అల్లుకున్న కథ  ఈ నవల.  యువత భావోద్వేగాలను స్పష్టంగా ప్రతిఫలించే నవల ఇది. ‘మెకెలెన్’ అనే అబ్బాయి ‘లెవి’ అనే అమ్మాయి స్కూలు రోజుల నుంచి మంచి మిత్రులు. టన్నుల కొద్ది జోకులను, లీటర్ల కొద్ది కన్నీళ్లను పంచుకున్నవాళ్లు. ఏదో సమయంలో ఒకరికొకరు సలహాలు ఇచ్చుకున్నవాళ్లు.
 
మెకెలెన్ ఫ్రెండ్‌తో లెవి ప్రేమలో పడుతుంది. అప్పుడు మెకెలెన్ ఫీలింగ్ ఏమిటి? వారి స్నేహంలో ఏమైనా ఎడబాటు వచ్చిందా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే నవల చదవాల్సిందే.
 
యువత అభిమాన నవలగా మారిన ‘బెటర్ ఆఫ్ ఫ్రెండ్స్’ను ‘రొమాంటిక్ కామెడీ సూపర్‌స్టార్’గా పేరుగాంచిన ఎలిజబెత్ ఎల్‌బెర్గ్  రాశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement