
మానుషి ఛిల్లార్. ప్రపంచ సుందరి. అంతర్జాతీయ స్థాయిలో అందగత్తెగా ఈ కిరీటాన్ని అందుకోవాలంటే శరీరాన్ని అద్భుతంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. వైద్య కుటుంబానికి చెందిన ఈమె తన స్లిమ్ ఫిజిక్ కోసం ఏం చేశారు?ఈ మెగా ఈవెంట్‌కు సిద్ధమయ్యే సమయంలో మరింత ఎక్కువగా ఫుడ్/వర్కవుట్స్‌కు సమయాన్ని కేటాయించారు. సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ మామీ అగర్వాల్ ఆమె తిండి, నిద్ర వంటి విషయాల్ని పర్యవేక్షించారు. అత్యధిక ప్రొటీన్ల బ్యాలెన్స్‌డ్ డైట్‌ను ఫాలో అయ్యారు.
బ్రేక్‌ఫాస్ట్ టు డిన్నర్... ఇదీ డైట్
బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్‌మీల్, ఎటువంటి ఫ్లేవర్లూ కలపని పెరుగు లేదా వీట్ ఫ్లేక్స్, తాజా పండ్లు, ధాన్యాలు, అవకాడో, కేరట్, బీట్స్, స్వీట్ పొటాటో కలిపిన 2/3 ఎగ్ వైట్స్ వంటివి అల్పాహారం. ఫుడ్‌లో పెరుగు, తాజా పండ్లు తప్పనిసరి. మిడ్ మీల్‌గా కొబ్బరి నీళ్లు, పండ్లు. లంచ్‌లోకి క్వినోవా రైస్, చపాతీ, వెజిటబుల్స్, చికెన్, ్జకాయధాన్యాలు మెనూ. సాయంత్రం పూట కీరదోసకాయ, కేరట్ ముక్కలు స్నాక్స్. అత్యధిక ప్రొటీన్ల ఫుడ్ డిన్నర్ స్పెషల్. చికెన్/ఫిష్ (గ్రిల్డ్/రోస్టెడ్),ఉడకబెట్టిన కూరగాయలు. క్వినోవా పులావ్, సలాడ్, సూప్‌లు ఉంటాయి. రోజుకి కనీసం 3 లీటర్ల నీళ్లు తాగుతూ ఎప్పుడూ డీహైడ్రేట్ అనే సమస్యే రాకుండా చూసుకుంటారామె. ‘‘బ్రేక్‌ఫాస్ట్ మిస్ కావద్దు. ఇది రాత్రి వేళలో ఆకలి సమస్యను తీవ్రతరం చేస్తుంది. రెగ్యులర్‌గా మీల్స్ తీసుకోండి. అయితే చిన్నప్లేట్స్ ఉపయోగించండి. ఇది ఫ్యాట్, సుగర్స్ ఎక్కువ ఉండే స్నాక్స్ తీసుకోవాలనే టెంప్టేషన్స్‌ను తగ్గిస్తుంది. పంచదార తగ్గించండి. ముఖ్యంగా రిఫైన్డ్ సుగర్స్‌కి నో చెప్పండి ’’ అంటూ డైట్ టిప్స్ చెబుతారు మానుషి.
యోగా మస్ట్... డ్యాన్స్‌తో రెస్ట్...
‘‘యోగా రోజూ చేస్తాను. అయితే వర్కవుట్ మాత్రం వారానికి 4 నుంచి 5 సార్లు చేస్తాను. స్క్వాట్స్, ఫ్రీ రన్నింగ్ కూడా వర్కవుట్ రొటీన్‌లో తప్పనిసరి భాగం’’ అంటున్నారు మానుషి. యోగా అనేది శరీరపు భంగిమను కరెక్ట్‌గా ఉంచుతుంది. కండరాలు టోన్డ్‌గా ఉండేలా చేస్తుంది. ఫ్లెక్సిబులిటీ, కోర్ స్ట్రెంగ్త్‌కు ఉపకరిస్తుంది. కాబట్టి తప్పకుండా యోగా చేయాలనేది ఆమె సూచన. మొత్తంగా శరీరాన్ని వార్మప్ చేసే ప్రక్రియలో కోర్ ట్విస్టింగ్ అనేది చాలా ప్రధానం. అది శరీరాన్ని డిటాక్స్ చేసి, టోన్డ్‌గా మార్చడంలో ఉపకరిస్తుంది. నొప్పుల్ని నిరోధిస్తుంది. వయసుకు అతీతంగా ప్రతి ఒక్కరి వర్కవుట్ రొటీన్‌లో స్క్వాట్స్ తప్పనిసరిగా భాగం కావాలని ఆమె ట్రైనర్ అంటారు. అవి తొడ కండరాలు, దిగువ కండరాలను టోన్ చేయడం మాత్రమే కాకుండా మొత్తం శరీర. కండర సామర్థ్యాన్ని పెంచుతాయని, ఒత్తిడి అనిపిస్తే పరుగు తీయడం లేదా నచ్చిన ట్యూన్లకు నృత్యం చేయడం ఎంచుకోవాలనీ సూచిస్తున్నారు. తప్పకుండా 8గంటల రాత్రి నిద్ర ఉండాలి. అలాగే నిద్రపోవడానికి 2గంటల ముందుగా మొబైల్ స్విచాఫ్ చేయాలి వంటివి కూడ ఈ సుందరి ఫాలో అయిన బ్యూటీ టిప్స్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment