
సాక్షి, హైదరాబాద్: ఏటికేడాది పెరిగిపోతున్న మధుమేహాన్ని నియంత్రించేందుకు ఆహారపరమైన కొన్ని మార్పులు చేసుకుంటే చాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం రాకుండా ఉండాలంటే ఒమేగా–6 కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం మేలని సిడ్నీకి చెందిన ద జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు సూచించారు. దాదాపు పది దేశాలకు చెందిన 40 వేల మందిపై జరిపిన ప్రయోగాల ద్వారా ఈ అంచనాకు వచ్చినట్లు డాక్టర్ జేసన్ వూ తెలిపారు. సాధారణంగా ఆరోగ్యవంతులే అయిన వీరిని ప్రయోగాల్లో భాగంగా పలానా ఆహారం తీసుకోవాల్సిందిగా కోరారు.
కొన్ని రోజుల తరువాత రక్తంలో ఒమేగా–6 కొవ్వులు ఎక్కువగా ఉన్న వారిలో చక్కెర శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఒమేగా–6 కొవ్వులు ఆరోగ్యానికి మంచివి కావని కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై కూడా పరిశోధనలు చేశామని దీంట్లో ఎలాంటి వాస్తవమూ లేనట్లు స్పష్టమైందని వూ తెలిపారు. ద ల్యాన్‌సెట్ డయాబిటీస్ అండ్ ఎండోక్రైనాలజీ మ్యాగజైన్‌లో ఈ పరిశోధన తాలూకు వివరాలు ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment