రారండోయ్‌ | Chilukuri Devaputra Award Gives To Lalluri Rukmini | Sakshi
Sakshi News home page

రారండోయ్‌

Published Mon, Apr 22 2019 12:49 AM | Last Updated on Mon, Apr 22 2019 12:49 AM

Chilukuri Devaputra Award Gives To Lalluri Rukmini - Sakshi

చిలుకూరి దేవపుత్ర స్మారక సాహిత్య పురస్కారాన్ని 2019 సంవత్సరానికిగానూ ఆయన జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 24న అనంతపురంలో నల్లూరి రుక్మిణికి ప్రదానం చేయనున్నారు. నిర్వహణ: చిలుకూరి దీవెన, దేవపుత్ర కుటుంబ సభ్యులు. 31వ ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు–2018ని ‘అద్వంద్వం’ కవి పుప్పాల శ్రీరామ్‌కు ఏప్రిల్‌ 28న అనంతపురంలో ప్రదానం చేయనున్నట్టు అవార్డు వ్యవస్థాపకులు డాక్టర్‌ ఉమ్మడిశెట్టి రాధేయ తెలియ జేస్తున్నారు. ఇందులోనే ఉమ్మడిశెట్టి సత్యాదేవి ప్రతిభా పురస్కారాలను మూలే విజయలక్ష్మి, వాడ్రేవు వీరలక్ష్మి, ఘంటశాల నిర్మల, ప్రతిమ, గండికోట వారిజ, గాయత్రీ రవిశంకర్‌కు ప్రదానం చేస్తారు.

వచన కవిత్వం నుంచి లఘురూప కవిత్వాన్ని వేరుచేసి, దానికో ప్రత్యేక అస్తిత్వాన్ని కల్పించే ఉద్దేశంతో లఘురూప కవితా వేదిక ప్రారంభమైంది. వ్యవస్థాపక అధ్యక్షులు: సుగమ్‌బాబు. వివరాలకు: 9866651094
ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్క రించుకుని ఏప్రిల్‌ 23 ఉదయం 8 గంటలకు కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌ నుండి ‘పుస్తక శోభా యాత్ర’ జరుగుతుంది. ఉదయ సాహితి, తెలంగాణ కళావేదిక, నవ తెలం గాణ పబ్లిషింగ్‌ హౌజ్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ శోభా యాత్రలో జిల్లాలోని కవులు, సాహితీ ప్రియులు తాము రచించిన లేదా మిత్రులు, ఇతరుల రచనలతో పాల్గొనవచ్చు. రాజాం రచయితల వేదిక సమావేశం ఏప్రిల్‌ 28న ఉదయం 9.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా రాజాంలో గల విద్యానికేతన్‌ పాఠశాలలో జరుగుతుంది. ‘పద్య నాటకాలు – తిరుపతి వేంకటకవులు’ అనే అంశంపై నేతేటి గణేశ్వరరావు ప్రసంగిస్తారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement