లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు | Close to the target | Sakshi
Sakshi News home page

లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు

Published Fri, Aug 7 2015 11:23 PM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు

లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు

టారో బాణి
 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
 మీ పనిలో విజయం సాధిస్తారు. అధికారంలోకి రావడానికి, మీ ఉనికిని చాటుకోవడానికీ తగిన పనులు చేపడతారు. పెట్టుబడులకు ఇది మంచి సమయం. జీవిత భాగస్వామితో కలతలు రేగకుండా జాగ్రత్త పడండి. అనవసరంగా వాదోపవాదాలకు దిగకండి. వాదనలు పెట్టుకున్నారంటే వివాదాలు తెచ్చిపెట్టుకున్నట్లే. కలిసొచ్చే రంగు: బ్రౌన్
 
 టారస్ (ఏప్రిల్ 21-మే 20)
 ఆనందం, అదృష్టం మీ వెంటే ఉంటాయి. కొత్తభాగస్వామితో మీ వ్యాపారం లాభాలబాటలో నడుస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. పొదుపుకి ఇది తగిన సమయం. అయితే పెట్టుబడుల విషయంలో కాదు. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. మీ మాటలకీ, చేతలకీ మధ్య సమన్వయం ఉండేలా చూసుకోండి. కలిసొచ్చే రంగు: గ్రీన్
 
 జెమిని (మే 21-జూన్ 21)

 చెడు సంఘటనలేమీ జరగవు. అనవసరంగా భయపడకండి. మీ ఉద్యోగంలో, కెరీర్‌లో అనుకూలమైన మార్పు ఉండవచ్చు. అధిక ఆదాయాన్ని ఆర్జించి పెట్టే కొత్త అవకాశం ఒకటి మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తుంది. ఆఫీసులో కొత్త పని ఏమైనా అప్పగిస్తే మీకు రానున్న ప్రమోషన్‌కు అదో సూచనగా గ్రహించండి. మీరు ప్రేమలో పడవచ్చు. కలిసొచ్చే రంగు: ఎల్లో
 
 క్యాన్సర్ (జూన్22-జూలై 23)

 మీ లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు, విజయం మీ వెంటే ఉందని గ్రహించండి. అత్యాధునికమైన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ధనానికి లోటు ఉండదు. గతంలో మీరెప్పుడూ చూడని కొత్తప్రదేశాలకు విహార యాత్రకు వెళతారు. ప్రేమ వ్యవహారాలలో తొందరపాటును, దుడుకుతనాన్ని ప్రదర్శించకండి. కలిసొచ్చే రంగు: సిల్వర్
 
 లియో (జూలై 24-ఆగస్టు 23)
 ప్రేమకు ఇది చాలా అనుకూలమైన వారం. చంద్రుని మూలంగా మీ ప్రేమ ఫలిస్తుంది. ఆరోగ్యపరంగా ఏమాత్రం తేడాగా అనిపించినా, అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. మీ పని ప్రదేశంలో డబ్బు విషయంలో కొందరు మీ మీద అసూయగా ఉన్నారు, వారి వల్ల మీకు ముప్పు ఏర్పడవచ్చు. జాగ్రత్తపడండి. కలిసొచ్చే రంగు: గ్రీన్
 
 వర్గో  (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
 మీదైన శైలిలో పని చేసి, అందరి దృష్టినీ ఆకట్టుకుంటారు; మిమ్మల్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. ప్రేమ విషయంలో మీకు కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. శ్రేయోభిలాషుల సలహా తీసుకోవడం మంచిది. జీవితమన్నాకఒడుదొడుకులు, సమస్యలు, సవాళ్లు సహజం.  ప్రతి క్షణాన్నీ ఆస్వాదించండి. కలిసొచ్చే రంగు: ఆరంజ్
 
 లిబ్రా  (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)

 మిమ్మల్ని మీ లక్ష్యానికి చేరువ చేసి, మీకు విజయాన్ని చేకూర్చి, మీకంటూ ఒక గుర్తింపు తెచ్చే వారమిది. మరింత బాగా శ్రమించడానికి ప్రయత్నించండి. మీ సృజనాత్మకతను వెలుగులోకి తీసుకు రండి. పాత పరిచయస్థులతో ప్రేమలో పడవచ్చు. అయితే అన్నింటికన్నా కెరీరే ప్రధానమని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: రస్ట్ కలర్
 
 స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
 ఇల్లు లేదా ఉద్యోగం మారవచ్చు. పనుల విషయంలో చురుగ్గా, సమస్యల విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. అనేక రకాల ప్రతికూలతలను  ఈవారం అధిగమిస్తారు. విజయానికి చేరువ అవుతారు. మీ సన్నిహితుడొకరు డబ్బు విషయంలో మీ వైఖరికి చాలా విసుగు చెందవచ్చు కనక హుందాగా వ్యవహరించండి. కలిసొచ్చే రంగు: ఆరంజ్
 
క్యాప్రికార్న్  (డిసెంబర్ 22-జనవరి 20)
 మీరు ఎదురు చూస్తున్న ఆరోగ్యం, ఆనందం, డబ్బు... ఈ మూడూ తాంబూలంలో పెట్టి ఎవరో ఇచ్చినట్లుగా మీకు అందుతాయి. ఒక స్త్రీ వల్ల మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఆమె  మీ కుటుంబ సభ్యురాలే కావచ్చు. మీ నిబద్ధతే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుందని గ్రహించండి. కొంతదూరంలో ఉన్న సన్నిహిత బంధువును కలుస్తారు. కలిసొచ్చే రంగు: ఎల్లో
 
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)

 మీ కలలు నెరవేర్చుకోవడానికీ, విదేశీ యానం చేయాలన్న మీ కోరిక తీరడానికీ తగిన సమయమిది. ఆధ్యాత్మికంగా ఇది మీలో మార్పును తెచ్చే వారం. పెట్టుబడులు పెట్టే ముందు అందుకు తగిన ప్రణాళిక వేసుకోవడం లేదా మీ పెట్టుబడులకు కొంత విరామం ఇచ్చి ఆ పెట్టుబడి అనేది నిజంగా అవసరమో కాదో, అనేది తేల్చుకోండి. కలిసొచ్చే రంగు: బ్రౌన్
 
 పైసిస్  (ఫిబ్రవరి 20-మార్చి 20)

 రకరకాల ఆలోచనలతో మానసికంగానూ, శారీరకంగానూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. అనేకమైన అవకాశాలు మీ తలుపు తడతాయి. వాటిలో సరైనదేదో ఎంపిక చేసుకోవడమే మీ ముందున్న ప్రధాన కర్తవ్యం. ప్రేమ విషయంలో అపార్థాలు తలెత్తుతాయి. ఫెంగ్‌షుయ్ పరికరాలతో ఇంటిని అలంకరించి, ఆనందాన్ని పొందండి. కలిసొచ్చే రంగు: వైట్
 
ఇన్సియా కె.
టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్
 
 
 సౌర వాణి
 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
 అప్రయత్నంగానే పనులు నెరవేరతాయి. ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేసుకోవడం మంచిది. వీలయినంతవరకూ కొత్త వస్తువాహనాలని కొనుగోలు చేయడం సరికాదు. శనిదోషం ఉన్న కారణంగా పరిచితులతో కూడా ఆర్థికమైన లావాదేవీలూ మరింత చనువుగా ఉండటాలూ క్షేమకరం కాదు. దూరపు ప్రయాణాలని మరీ అవసరమైతేనే చేయండి.
 
 టారస్ (ఏప్రిల్ 21-మే 20)

 మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గుర్తింపు వస్తుంది. ఆ కారణంగా మిమ్మల్ని చూసి  ఈర్ష్యపడేవాళ్లు ఎక్కువ అవుతారు కాబట్టి అందరితోనూ కలివిడిగానే ప్రవర్తించండి తప్ప, అహంకరించడం, కొందరిని దూరం చేసుకోవడం, అహంకరించడం మంచిది కాదు. మీ పై అధికారితో ఉన్న దగ్గరితనం లేదా పలుకుబడినీ గురించి మీకు మీరుగా చాటింపు వేసుకోవద్దు.
 
 జెమిని (మే 21-జూన్ 21)

 నిర్మాణరంగంలో ఉన్న వారికి తగిన రాబడులు వస్తాయి. వినోద పర్యాటక రంగాల్లో ఉన్నవారికి నష్టాలుండవు. కుటుంబంలో ఐకమత్యం ఉన్న కారణంగా మీకు కొత్త శక్తి వచ్చినట్లుంటుంది. ఆస్తి కొనుగోళ్ల విషయంలో అనుభవజ్ఞులను సంప్రదించి సరైన నిర్ణయాన్ని వెంటనే తీసుకోండి. అత్తమామలతో ప్రేమగా ఉండండి. అలాగని తలిదండ్రులని తక్కువ చేయకండి.
 
 క్యాన్సర్  (జూన్22-జూలై 23)
 ఏదైనా జరగరానిది జరుగుతుందేమోననే ఆందోళన పూర్తిగా తగ్గిపోతుంది. మీరు నడుస్తున్న ధర్మమార్గం మిమ్మల్ని పూర్తిగా రక్షించే మాట నిశ్చయం. మీవైపు మాట్లాడేందుకు మరికొందరు  ఉన్నారనే ఆనందం మీకు కొండంత ధైర్యాన్ని కలుగజేస్తుంది. కోర్టు తీర్పు వాయిదాలు పడుతూ కొంత నిరుత్సాహాన్ని కలుగజేస్తుంది. ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది.
 
 
లియో (జూలై 24-ఆగస్టు 23)

 అప్పులను మెల్లమెల్లగా తీర్చివేస్తూ ఒడ్డుకి చేరుతున్నందుకు సంతోషంగా ఉంటారు. మీ శ్రేయోభిలాషులు మీ పక్షాన నిలబడి మీకు అవసరమైన సందర్భంలో అక్కరకు వస్తారు. రుణాన్ని చేయవలసి వచ్చినప్పుడు మొహమాటం లేకుండా తీసుకోబోయే రుణానికి సంబంధించిన అన్ని వివరాలనీ లిఖితపూర్వకంగా తీసుకోండి. లేనిపక్షంలో మీకు తీవ్ర కష్టాన్ని కలిగించవచ్చు.
 
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
 మీ ప్రణాళికలు సక్రమంగా అమలు జరగక వాయిదా పడవచ్చు. ముఖ్యంగా న్యాయ- వైద్యరంగాల్లోని వారికి చేతికందాల్సిన సొమ్ము మరింత ఆలస్యం కావచ్చు. అనుకోకుండా విదేశీ ప్రయాణం లేదా వ్యాపారాల్లో వృద్ధికోసం స్వదేశంలోనే మరో ప్రదేశానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మొహమాటమనేది అన్ని సందర్భాల్లోనూ సరికాదనే ఓ జీవితపాఠాన్ని నేర్చుకుంటారు.
 
 
 లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
 ప్రయాణాల్లో వాహనాల విషయంలోనూ, బంగారు, వెండి వస్తువుల విషయంలోనూ శ్రద్ధ అవసరం. ఇంట్లో అనుకూలత అంతంతమాత్రంగా ఉండటం వల్ల మానసిక అశాంతి కలిగే అవకాశముంది. మీ వ్యాపారంలో ఏదైనా అధర్మ మార్గాలు ఉన్నట్లయితే అవి బహిరంగపడే అవకాశాలున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు మీ వృత్తివ్యాపారాలని గురించి అప్రమత్తత అవసరం.
 
 స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
 న్యాయస్థానంలో మీరు విజేత అవుతారు. కోర్టుకేసుల్లో జయాపజయాలతో మానసికంగా వైకల్యాన్ని పొందద్దు. కాలం కలిసిరాని పక్షంలో వచ్చే సమస్యలు ఇవే. కలిసొచ్చిన కాలంలో మీకు కలిగిన విజయాలని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దైవధ్యానమే ప్రశాంతతనిస్తుంది తప్ప వ్యాపార ప్రకటనలకి లోనై వేటి వెంటనో పడకండి. డబ్బు వృథా చేసుకోకండి.
 
 శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)

 జీవితమంటే ఉద్యోగ నిర్వహణకే అని అనుకోకండి. పై అధికారులు ఒత్తిడి చేస్తుంటే మృదువుగా వివరించి చెప్పి చేయలేననే యథార్థాన్ని చెప్పండి. వారి అంగీకారం ఉంటుంది మీకు. వీలయినంతవరకూ - కాదు- తప్పక నిదానంగానే న డవాలి తప్ప ఈ కాలంలో దూకుడుతనం ఏ మాత్రమూ సరికాదు. ఇతరులతో చాడీలు చెప్పడం- వినడం మంచిది కాదని గ్రహించండి .
 
 క్యాప్రికార్న్  (డిసెంబర్ 22-జనవరి 20)
 కుటుంబసభ్యులతో, తోటివారితో వాగ్వివాదాలు రాకుండా జాగ్రత్త పడండి. బలమైన వాదాన్ని వినిపించాల్సి వస్తే మాత్రం వెనుకాడవద్దు. ఎవరితో విరోధమో వారితోనే నేరుగా మాట్లాడడం మంచిది తప్ప, మీ అభిప్రాయాన్ని మధ్యవర్తి ద్వారా విన్పించడం మంచిది కానే కాదు ఈ కాలంలో. కుటుంబ సభ్యులతో విరోధాల విషయంలో పట్టుదలలకి వెళ్లడం సరికాదు.
 
 అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
 పలుకుబడి గల ఒక వ్యక్తి తారసపడవచ్చు. మీ ఉద్యోగం స్థిరపడటం, సంతానానికి సంబంధించిన పనుల్లో పురోగతి కనిపించడం వంటి సూచనలు కలగవచ్చు. దానధర్మాలు, తీర్థయాత్రలూ చేసే అవకాశముంది. మీరు పెట్టబోయే నూతన వ్యాపారానికి గానీ మరేదైనా నూతన కార్యక్రమానికి గానీ తాత్కాలికంగా వ్యతిరేకత ఎదురయినా తొందరలో అనుకూలత సిద్ధిస్తుంది.
 
 పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
 చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారం విద్య... మీకు అంత ఆనందంగా అన్పించకపోవచ్చు. అయితే మరోచోట ఉద్యోగ, వృత్తి వ్యాపార విద్యలకి తగిన అవకాశాన్ని చూసుకుని ముందడుగు వేయడం మంచిది. అనాలోచితంగా, తాత్కాలిక ఆవేశంతో చేస్తున్న పనిని విరమించడం వల్ల తీవ్ర ఇబ్బంది కలగవచ్చు. అయిన వాళ్లే మీపట్ల వ్యతిరేకతని పరోక్షంగా చూపిస్తూ ఉండచ్చు.
 
 డా॥మైలవరపు శ్రీనివాసరావు
సంస్కృత పండితులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement