
కాలేయ క్యాన్సర్‌ను తప్పించే కాఫీ!
కాఫీ కవర్స్ ద లివర్
మితిమీరి మద్యం తాగేవారికి కాలేయ క్యాన్సర్ రిస్క్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కాఫీ దీన్ని సమర్థంగా నివారిస్తుందని పేర్కొంటోంది ఇంగ్లాండ్‌కు చెందిన ‘వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్’ అనే సంస్థ. ప్రపంచవ్యాప్తంగా దాదాపు కాలేయ క్యాన్సర్ రిస్క్ ఉన్న 82 లక్షల మంది వ్యక్తులతో పాటు దాదాపు 24,500 మంది కాలేయ క్యాన్సర్ రోగులపై నిర్వహించిన 34 వేర్వేరు అధ్యయనాల్లో కాఫీ కాలేయ క్యాన్సర్‌ను సమర్థంగా తగ్గిస్తుందని తేలింది. క్యాన్సర్ రిస్క్ ఉన్నవారిని ఎంచుకొని వారికి రోజుకు పరిమితంగా ఒకటి లేదా రెండు చిన్న కప్పుల కాఫీ చాలాకాలం పాటు ఇస్తూపోయారు.
కొంతకాలం తర్వాత 82 లక్షల మందిని పరీక్షించగా అందులో కేవలం 14 శాతం మందికి మాత్రమే కాలేయ క్యాన్సర్ సోకిందని, మిగతావారిలో కాఫీ కాలేయ క్యాన్సర్‌ను నివారించేందుకు తోడ్పడిందని వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ సంస్థ పేర్కొంది.