బిజీంగ్: అడ్వాన్స్‌డ్ లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తికి ఓ వార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చినా. .. మరో రూపంలో అతని కుటుంబానికి కోటిరూపాయలు నష్టపరిహారంగా దొరికాయి. విచిత్రంగా ఉన్న ఈ సంఘటన ఈస్ట్ చైనా జియాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన యోసే అని వ్యక్తి జీవితంలో జరిగింది. 28 ఏళ్ల క్రితం హువాయ్ ఆసుపత్రిలో జన్మించిన యో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో తన సొంత తల్లిదండ్రులకు కాకుండా మరెవరో దంపతులకు బిడ్డగా మారిపోయాడు. ఈ విషయం తెలియని ఇరు కుటుంబాల వారు తమ దగ్గర ఉన్న బిడ్డలని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో యోకు అడ్వాన్స్‌డ్ లివర్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే కొంత ఉపయోగం ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో యో వాళ్ల అమ్మ లివర్ డొనేట్ చేసేందుకు మందుకు వచ్చారు.
కానీ ఆమె బ్లడ్‌గ్రూప్ యోకు మ్యాచ్ కాలేదు. అనుమానం వచ్చిన యో కుటుంబం యో పుట్టిన ఆసుపత్రిలో ఎంక్వైరీ చేశారు. అక్కడ యో బయోలాజికల్ తల్లిదండ్రులు వీళ్లు కాదని తెలిసింది. ఆసుపత్రి చేసిన తప్పిదాన్ని కైఫెంగ్ ఇంటర్మీడియెట్ పీపుల్స్ కోర్టు ముందుంచారు. పిల్లలను మార్చినందుకుగాను ఆసుపత్రి కోటిరూపాయల నష్టపరిహారం చెల్లించమని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించింది. దీంతో యో కుటుంబానికి రూ.1,12,78,809 నష్టపరిహారంగా అందనుంది. అయితే యో అసలైన తల్లికి కూడా లివర్ క్యాన్సర్ ఉందట. అందువల్లే యోకూ కూడా వంశపారంపర్యంగా వచ్చిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆనోటా ఈనోటా ఈవిషయం తెలుసుకున్న నెటిజన్లు ఈ పరిహారం ఏం సరిపోతుంది? యో వైద్యానికి అయ్యే ఖర్చుమొత్తం ఆసుపత్రి చెల్లించాల్సిందని అభిప్రాయపడతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment