liver transplantation
-
Devananda: ఇలాంటి కూతురు ఉండాలి!
‘ఈ అమ్మాయిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ప్రతి తల్లిదండ్రులకు ఇలాంటి కూతురు ఉండాలి’ అని సాక్షాత్తు కేరళ హైకోర్టు 17 ఏళ్ల దేవనంద గురించి అంది. ఎందుకో చదవండి! కేరళలోని త్రిసూర్‌లో కాఫీ హోటల్ నడుపుకునే 48 ఏళ్ల ప్రతీష్‌కు నిన్న మొన్నటి దాకా జీవితం సాఫీగానే సాగింది. భార్య ధన్య, కూతురు దేవనంద, కొడుకు ఆదినాథ్... అందరిలాంటి ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం. అయితే ఈ మధ్య కాలు వాపు తరచూ కనిపిస్తుండేసరికి డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. పరీక్షలు చేశాక డాక్టర్లు పిడుగులాంటి వార్త చెప్పారు– లివర్ కేన్సర్. వైద్యం అంటూ లేదు... లివర్ ట్రాన్స్‌ప్లాంటేషనే శరణ్యం అని తేల్చి చెప్పారు. అది కూడా వెంటనే జరగాలని చెప్పారు. ఆ మధ్యతరగతి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కొచ్చిలోని రాజగిరి హాస్పిటల్ వారు మీరు డోనర్ని తెస్తే మేము ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం అని భరోసా ఇచ్చారు. కాని లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు డోనర్ దొరకడం అంత సులభం కాదు. దొరికినా సూట్ కావాలి. సమయం లేదు... మరి ఏం చెయ్యాలి? నేనే ఎందుకు ఇవ్వకూడదు అనుకుంది కూతురు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న దేవనంద తండ్రిని కోల్పోవడానికి సిద్ధంగా లేదు. మరో ఆలోచన చేయకుండా ఆస్పత్రి వర్గాల దగ్గరకు పోయి తనే లివర్‌లోని కొంత భాగం డొనేట్ చేయవచ్చా అని అడిగింది. చేయచ్చు గాని ‘ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్ 1994’ ప్రకారం మైనర్లకు అనుమతి లేదని చెప్పారు. దేవనంద ఇంటర్నెట్ జల్లెడ పట్టింది. గతంలో ఇలాంటి కేసులో ఒక మైనర్‌కు ఆర్గాన్ డొనేట్ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చినట్టుగా చదివింది. అయితే ఆ మైనర్ నుంచి ఆర్గాన్ డొనేషన్ జరగలేదు. ఆ తీర్పు ఆధారంగా తాను హైకోర్టుకు వెళ్లాలని నిశ్చయించుకుంది. జడ్జి పూనుకొని హైకోర్టులో జస్టిస్ వి.జి.ఆరుణ్ సమక్షానికి ఈ కేసు వచ్చింది. ప్రత్యేకమైన కమిటీని వేసి ఆర్గాన్ యాక్ట్‌లో ఏదైనా మినహాయింపుతో దేవనంద తన తండ్రికి లివర్ ఇవ్వొచ్చోకూడదో సూచించమని ఆదేశించాడాయన. కమిటీ అధ్యయనం చేసి చిన్న వయసులో ఇవ్వడానికి ఏ మాత్రం వీలు లేదని, దేవనందను ఇందుకు అనుమతించ వద్దని తేల్చి చెప్పింది. కాని దేవనంద కమిటీ రిపోర్టును మళ్లీ సవాలు చేసి తండ్రిని కాపాడుకునే హక్కు తనకు ఉందని కోర్టుకు చెప్పింది. ‘నాన్నను కోల్పోతే మేము దిక్కులేని వాళ్లం అవుతాం’ అని చెప్పింది. జస్టిస్ వి.జి.అరుణ్ దేవనంద పట్టుదలను, తండ్రి కోసం ఆమె పడుతున్న ఆరాటాన్ని ఎంతో ప్రశంసించారు. ‘ఇలాంటి కూతురు అందరికీ ఉండాలి’ అన్నారు. ఈసారి మరో కమిటీని వేశారు. ఆ కమిటీ దేవనందకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వడంతో డిసెంబర్ 2022లో అనుమతి ఇస్తూ తీర్పు చెప్పారు. అన్ని విధాలా సిద్ధమయ్యి ఈ విషయం తెలిసి బంధువులు వారించినా దేవనంద వెనక్కు తగ్గలేదు. తండ్రికి ఆరోగ్యకరమైన లివర్ ఇవ్వడానికి జిమ్‌లో చేరింది. మంచి పోషకాహారం తీసుకుంది. తండ్రి కోసం ఫిబ్రవరి 9న ఆపరేషన్ బల్ల ఎక్కింది. పెద్ద వైద్యుల బృందం ఆధ్వర్యంలో తండ్రీకూతుళ్లకు సర్జరీ చేసి లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతం చేశారు. ఆపరేషన్ జరిగిన రాజగిరి హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ల బృందం దేవనందకు ఫ్యాన్స్ అయ్యా రు. తండ్రీ కూతుళ్లు డిశ్చార్జ్ అవుతుంటే అందరూ వచ్చి జ్ఞాపికతో వారిని సాగనంపారు. అంతేనా? దేవనంద పట్టుదల, ప్రేమను చూసి తండ్రి ఆపరేషన్ ఖర్చులను మాఫీ చేశారు. కూతురు ప్రేమ సాధించిన ఘన విజయంగా దీనిని అభివర్ణించవచ్చు. -
'అయ్యో భగవంతుడా.. మేం ఏ పాపం చేశాం'!
పుట్టిన బిడ్డ పురిట్లోనే కన్నుమూస్తే ఆ తల్లి గర్భశోకం తీర్చలేనిది. అందులోనూ తొలిచూలు బిడ్డను కోల్పోయి, పుట్టెడు దుఃఖంలో ఉండగా ఆశలదీపంగా పుట్టిన మరో బిడ్డ కూడా ప్రాణాపాయంలో పడిపోతే..ఆ దంపతుల బాధ వర్ణనాతీతం. తన బిడ్డను కాపాడుకునేందుకు ఒక తల్లి పడుతున్న ఆవేదన ఇది!! తొలిసారి పుట్టిన కొడుకు చనిపోతే ఆ బాధను పంటి బిగువున భరించా. అయితే ఆదేవుడి దయ వల్ల మేఘనాథ్ రూపంలో మరో బిడ్డ పుట్టడంతో కొడుకును కోల్పోయామన్న బాధను మర్చిపోయాం. పొత్తిళ్లల్లోని మేఘనాథ్ స్పర్శతో అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యా అలాకొన్ని రోజులు గడిచాయో లేదో.. నా ఆనందాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో...మేఘనాథ్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. శరీరం, కళ్ళు పాలిపోయాయి. దీంతో ఈ బిడ్డనైనా కాపాడమని వేడుకుంటూ ఆస్పత్రికి పరుగెత్తా.. డాక్టర్లు పరీక్షలు చేశారు. అలా పరీక్షలు చికిత్సతో రోజులు గడుస్తున్నాయి. అయినా బాబు ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పైగా పరిస్థితి చేయి దాటి పోతోందన్న ఆందళన కలిగింది. కడుపు ఉబ్బరంగా ఉండడంతో అనుమానం వచ్చి నేను నా భర్త వెంటనే మరో ఆస్పత్రికి తరలించాం. మరోసారి వైద్యులు టెస్ట్‌లు, స్క్రీనింగ్‌లు చేశారు. అనంతరం డాక్టర్లు పిడుగులాంటి వార్త చెప్పారు. పుట్టుకతోనే వచ్చే బిలియరీ అట్రేసియా అనే వ్యాధి బారిన పడ్డాడని చెప్పడంతో నా గుండె పగిలింది. నా బిడ్డ ప్రాణాలతో ఉండాలంటే కాలేయమార్పిడి చేయాల్సిందేనని వైద్యులు తేల్చి చెప్పారు. దీనికయ్యేమొత్తం ఖర్చు రూ. 18 లక్షలు ($ 22506.34). అయ్యో భగవంతుడా...పసిగుడ్డుకు ఎంత కష్టం వచ్చింది. దీనికి మందేలేదా అని ఇద్దరమూ కంటికి మిన్నగా రోదించాం. అయితే కాలేయ మార్పిడి ఈ సమస్యకు పరిష్కారమని, డోనర్లు దొరికితే నా కొడుకు ప్రాణాలు కాపాడతామని డాక్టర్లు చెప్పారు. నా ప్రాణం పోయినా సరే నా బిడ్డను బ్రతికించుకోవాలని నిశ్చయించుకున్నా. నా లివర్‌ను దానం చేయడానికి నేను సిద్ధం. కానీ నిరుపేదలమైన మాకు ఈ మొత్తం ఖర్చు భరించే శక్తి లేదు. అందుకే మీ సాయం కోసం అభ్యర్థిస్తున్నా. తొలిసారి నెలలు నిండకుండానే పుట్టిన మగబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా. మరోసారి ఈ కడుపు శోకాన్ని భర్తించే శక్తి నాకు లేదు. మేఘానంద్కు ఆరోగ్యం బాగాలేదని చెప్పిన నాటి నుంచి వాడి ప్రాణాల్ని కాపాడుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నా. వైద్యం కోసం ఇల్లు వాకిలి అన్నీ అమ్మేశా. పెట్రోల్ బంకులో పనిచేసే నా భర్త చాలీ చాలని జీతంతో ఇంటిని వెళ్లదీస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మేఘనాధ్‌కు ట్రీట్మెంట్ చేయించలేక ప్రతీ రోజూ నరకం అనుభవిస్తున్నాం. అందుకే మేఘనాథ్ ఆరోగ్యంగా ఉండేందుకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దయచేసి సాయం చేయండి. నా మేఘనాధ్‌కు ప్రాణ భిక్ష పెట్టమని కన్నీళ్లతో వేడుకుంటున్నా. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
AP: ప్రభుత్వ సాయంతో ముగ్గురికి కాలేయ మార్పిడి
సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందించిన సహకారంతో 48 గంటల్లో ముగ్గురికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. సౌత్ ఆసియన్ లివర్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు చేశారు. డాక్టర్ టామ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆ ముగ్గురికీ ఆర్థిక సాయం అందించడంతో వారి ప్రాణాలను కాపాడగలిగామన్నారు. వారికి కాలేయ మార్పిడి చికిత్స చేయకపోతే ప్రాణాలతో ఉండటం కష్టమేనన్నారు. కాగా, 2016 నుంచి తమ ఆస్పత్రిలో 40 కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించామని డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ అన్నారు. -
పసి ప్రాణానికి అండగా ‘సీఎం సహాయనిధి’.. రూ.10 లక్షలు మంజూరు
గన్నవరం రూరల్: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి ‘ముఖ్యమంత్రి సహాయనిధి’ అండగా నిలిచింది. గంటల వ్యవధిలోనే ఆపరేషన్‌కు అవసరమైన రూ.10 లక్షలు మంజూరు కావడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడేనికి చెందిన మెట్లపల్లి రాఘవరావు వ్యవసాయ కూలీ. అతని భార్య నాగలక్ష్మి గృహిణి. వీరికి గతేడాది నవంబర్ 6న మగబిడ్డ జన్మించాడు. అయితే బిడ్డ అనారోగ్యంతో ఉండటంతో పలు ఆస్పత్రుల్లో చూపించి చివరికి హైదరాబాద్‌లోని రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని, రూ.10 లక్షలకు పైగానే ఖర్చవుతుందని, వెంటనే చేయకపోతే ప్రమాదమని చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబం ఇక చేసేది లేక చంటి బిడ్డతో ఇంటికి తిరిగొచ్చేశారు. సోమవారం గ్రామానికి చేరుకున్న తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రామ వైఎస్సార్సీపీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రూ.10 లక్షలు మంజూరు వైఎస్సార్సీపీ నేతలు బాలుడి విషయాన్ని ఫోన్ ద్వారా ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి రెయిన్బో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి చిన్నారి చికిత్సకు చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధికి వివరాలు పంపి రూ.10 లక్షలు మంజూరు చేయించారు. కేవలం గంటల వ్యవధిలో చిన్నారి చికిత్సకు రూ.10 లక్షలు మంజూరు కావడంతో తల్లిదండ్రులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంజూరైన రూ.10 లక్షల చెక్కును బుధవారం వీరపనేనిగూడెం గ్రామ సచివాలయంలో వైఎస్సార్సీపీ నేతలు మేచినేని బాబు, పడమట సురేష్, కైలే శివకుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు ఎలిజబెత్‌రాణి, సర్పంచ్ జేజమ్మ, ఎంపీటీసీ పద్మావతి, ఉప సర్పంచ్ నాగసాంబిరెడ్డి, సహకార బ్యాంకు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు బాధిత కుటుంబానికి అందించారు. -
తండ్రికి ‘తల్లై’ పునర్జన్మనిచ్చింది..
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): కంటే కూతుర్నే కనాలి అంటారు..నిజమే ఈ సంఘటనతో మరోసారి రుజువైంది. కాలేయవ్యాధితో మృత్యువుకు దగ్గరవుతున్న తండ్రిని కాపాడుకునేందుకు ఏకంగా తన కాలేయంలో సగ భాగమిచ్చి రుణం తీర్చుకుంది ఓ కుమార్తె. సీఎం రిలీఫ్ ఫండ్, కేర్ ఆస్పత్రి వైద్యులు ఒక ప్రాణం నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలానికి చెందిన నీలకంఠేశ్వరరావు రెండేళ్లుగా లివర్ సమస్యతో బాధపడతున్నాడు. చివరి దశ కాలేయ వ్యాధితో మృత్యువుకు దగ్గరలో ఉన్న తరుణంలో తన కుమార్తె వాణి ముందుకు వచ్చింది. తన కాలేయంలో కొంత భాగాన్ని తండ్రి నీలకంఠేశ్వరరావుకు ఇచ్చేందుకు సిద్ధమైంది. వైజాగ్‌లోని కేర్ హాస్పటల్స్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మహ్మద్ అబ్దుల్ నయూ మ్ నేతృత్వంలో కేర్ హాస్పటల్స్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ కింజరాపు రవిశంకర్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనస్థిషియా డాక్టర్ రాజ్‌కుమార్, వైద్య బృందం శస్త్రచికిత్సకు పూనుకున్నారు. అక్టోబర్ 2వ తేదీన ఉదయం 7 గంటలకు ప్రారంభించిన శస్త్రచికిత్స దాదాపు 16 గంటల పాటు సాగింది. ఆపరేషన్ విజయవంతం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నయూమ్ మాట్లాడుతూ కాలేయ వ్యాధిగ్రస్తుల ప్రాణాలు కాపాడడానికి లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానం సరికొత్త పరిష్కారాన్ని చూపుతుందని, సరైన సమయంలో చికిత్స చేయకపోవడం వల్ల కాలేయవ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని చెప్పారు. శస్త్ర చికిత్స విజయవంతమై నీలకంఠేశ్వరరావు సాధారణ స్థితికి చేరుకున్నారని, అలాగే లివర్ ఇచ్చిన వాణి కూడా పూర్తిగా కోలుకుందని, ఆరు వారాల్లో ఆమె కాలేయం యథాస్థితికి చేరుకుందని డాక్టర్ నయూమ్ చెప్పారు. నీలకంఠేశ్వరరావు పోర్టల్ హైపర్ టెన్షన్‌తో డీకంపెన్సేటెడ్ సిర్రోసిస్ ఆఫ్ లివర్ కూడా క్షీణించి హెపటోరెనల్ సిండ్రోమ్ అనే పరిస్థితికి దారి తీసిందని, అతనికి వీలైనంత త్వరగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి వచ్చిందని, అందుకు అతని కుమార్తె వాణి ముందుకు రావడం అభినందనీయమన్నారు. మీడియా సమావేశంలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ కింజరాపు రవిశంకర్ పాల్గొన్నారు. సైన్స్‌పై పట్టు ఉండడం వల్లే.. తాను బైపీపీ విద్యార్థిని కావడంతో కొంత అవగాహన ఉండడంతో కాలేయం దానం చేసేందుకు ముందుకొచ్చానని, నా కాలేయంలో సగ భాగం తీసి తండ్రి నీలకంఠేశ్వరరావుకు అమర్చారని, ప్రస్తుతం ఇద్దరం బాగానే ఉన్నామని మీడియాకు వాణి వివరించారు. ఆపరేషన్ విజయవంతం చేసిన వైద్యులు..ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
పిల్లల తారుమారు.. 28 ఏళ్లకు కోటి పరిహారం..
బిజీంగ్: అడ్వాన్స్డ్ లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తికి ఓ వార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చినా. .. మరో రూపంలో అతని కుటుంబానికి కోటిరూపాయలు నష్టపరిహారంగా దొరికాయి. విచిత్రంగా ఉన్న ఈ సంఘటన ఈస్ట్ చైనా జియాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన యోసే అని వ్యక్తి జీవితంలో జరిగింది. 28 ఏళ్ల క్రితం హువాయ్ ఆసుపత్రిలో జన్మించిన యో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో తన సొంత తల్లిదండ్రులకు కాకుండా మరెవరో దంపతులకు బిడ్డగా మారిపోయాడు. ఈ విషయం తెలియని ఇరు కుటుంబాల వారు తమ దగ్గర ఉన్న బిడ్డలని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో యోకు అడ్వాన్స్డ్ లివర్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే కొంత ఉపయోగం ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో యో వాళ్ల అమ్మ లివర్ డొనేట్ చేసేందుకు మందుకు వచ్చారు. కానీ ఆమె బ్లడ్‌గ్రూప్ యోకు మ్యాచ్ కాలేదు. అనుమానం వచ్చిన యో కుటుంబం యో పుట్టిన ఆసుపత్రిలో ఎంక్వైరీ చేశారు. అక్కడ యో బయోలాజికల్ తల్లిదండ్రులు వీళ్లు కాదని తెలిసింది. ఆసుపత్రి చేసిన తప్పిదాన్ని కైఫెంగ్ ఇంటర్మీడియెట్ పీపుల్స్ కోర్టు ముందుంచారు. పిల్లలను మార్చినందుకుగాను ఆసుపత్రి కోటిరూపాయల నష్టపరిహారం చెల్లించమని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించింది. దీంతో యో కుటుంబానికి రూ.1,12,78,809 నష్టపరిహారంగా అందనుంది. అయితే యో అసలైన తల్లికి కూడా లివర్ క్యాన్సర్ ఉందట. అందువల్లే యోకూ కూడా వంశపారంపర్యంగా వచ్చిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆనోటా ఈనోటా ఈవిషయం తెలుసుకున్న నెటిజన్లు ఈ పరిహారం ఏం సరిపోతుంది? యో వైద్యానికి అయ్యే ఖర్చుమొత్తం ఆసుపత్రి చెల్లించాల్సిందని అభిప్రాయపడతున్నారు. -
సుద్దాల అశోక్ తేజకు శస్త్రచికిత్స.. !
హైదరాబాద్ : ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు. అయితే ఆపరేషన్ నిమిత్తమై ఆయనకు బీ నెగిటివ్ రక్తం అవసరం ఉన్నట్టుగా సమాచారం. ఈ విషయాన్ని ఆయన స్నేహితులు ధ్రువీకరించారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నా కొడుకును బతికించరూ..
ఆ బాలుడి వయస్సు తొమ్మిదేళ్లు.. తొడబుట్టిన చెల్లెలితో సరదాగా ఆడుకుంటూ, పాఠశాలకు ఉత్సాహంగా వెళ్లి వస్తుంటాడు. రాగానే తల్లిఒడిలో సేదదీరుతూ ఆనందంగా గడుపుతాడు. కుటుంబ భారాన్ని మోసే తండ్రి పనికిపోయివచ్చిన వెంటనే తన ముద్దుముద్దు మాటలతో పలకరించి అలరిస్తాడు. ఇలా సంతోషంగా సాగుతున్న ఆకుటుంబాన్ని ఓ పిడుగులాంటి వార్త కంటిమీద కునుకులేకుండా చేసింది. హుషారుగా ఉండే తన కుమారుడికి లివర్ సమస్య ఉందని తెలిసి ఆ తల్లిదండ్రుల గుండెలు బరువెక్కాయి. రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబానికి చెందిన పసిబాలుడు ఆయాన్ దీనగాథపై సాక్షి కథనం. – కాజీపేట అర్బన్ సాక్షి, వరంగల్ : కుమారుడిని బతికుంచుకోవాలని, కన్న కొడుకు లివర్ మార్పిడికి తల్లిదండ్రులు పడుతున్న ఆరాటం హృదయాన్ని కలిచివేస్తుంది. కాజీపేట బాపూజీనగర్‌కు చెందిన నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందిన షేక్ జావేద్, జీనద్లకు 9 సంవత్సరాల కుమారుడు షేక్ అయాన్, 7 సంవత్సరాల అలీనా ఫిర్దోస్ కూతురు ఉన్నారు. ఓ ప్రైవేట్ షోరూంలో సేల్స్‌మేన్‌గా జీవనం కొనసాగిస్తున్న షేక్ జావేద్‌కు మూడు నెలల క్రితం కుమారుడికి లివర్ పాడై ఊహించని దెబ్బ ఎదురయింది. రెండో తరగతి చదువుతున్న తన కుమారుడు ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకునేవాడు. కాగా ఒకరోజు అకస్మాత్తుగా కడుపు ఉబ్బిపోవడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుపోగా కామెర్లు వచ్చాయని నిర్ధారించారు. దీంతో కామెర్లు తగ్గేందుకు చికిత్స చేయించారు. కాగా కడుపు ఉబ్బు మాత్రం తగ్గలేదు. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నీలోఫర్‌కు తీసుకుని వెళ్లగా అక్కడ వైద్యులు లివర్ సిరాసిస్గా గుర్తించి లివర్ మార్పిడి ఒక్కటే మార్గమని తెలిపారు. దాతల సాయం కోసం ఎదురుచూపులు నీలోఫర్ ఆస్పత్రిలో ఆయాన్‌కు లివర్ మార్పిడి చేయాలని, ఇందుకుగాను రూ.25 లక్షల ఖర్చవుతుందని తెలిపారు. ఒక్కసారిగా తల్లిదండ్రులకు ఎం చేయాలో తెలియని అచేతన స్థితికి చేరుకున్నారు. కాగా ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్లో తన కుమారుడి ధీనగాథను తండ్రి పోస్ట్ చేయగా చెనైలోని రెలా హస్పిటల్ చారిటబుల్ ట్రస్ట్ రూ.20లక్షలు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చారు. నిరుపేద కుటుంబానికి చెందిన తాను రోజు పనికి వెళ్తేకాని ఇల్లు గడవని పరిస్థితిలో రూ.5 లక్షలు సమకూర్చలేని స్థితి. మరో వైపు కన్నకుమారుడికి తన లివర్‌ను అందించి బతికించుకోవాలనే తండ్రి తపన. దీంతో దాతల సాయం కోసం, అప్పన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.దాతలు స్పందించిన తన కుమారుడు ఆయాన్‌ను బ్రతికించాలని వేడుకుంటున్నారు. దాతలు ఆర్థిక సాయాన్ని అందించాల్సిన అకౌంట్ నెంబర్....006901565086, ifsc code & icic0002303 సెల్ నెంబర్..91777 61108 -
ప్రాణదాతలూ.. కరుణించండి
తూర్పుగోదావరి , రౌతులపూడి (ప్రత్తిపాడు): ఆ నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. కూలి పనులు చేసుకుంటూ అష్టకష్టాలు పడుతున్న వారి ఇంటిలోని బాలుడికి కాలేయ మార్పిడి చేయాల్సి వచ్చింది. రూ.25 లక్షలతో ఈమేరకు శస్త్రచికిత్స చేయించలేదని వారు దాతల సాయాన్ని కోరుతున్నారు. మండలంలోని బలరామపురానికి చెందిన దాసరి శ్రీనివాస్, జానకి కుమారుడు ఉమా మణికంఠస్వామి కాలేయ వ్యాధితో కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నాడు. పదో తరగతి చదువుతోన్న ఇతడికి కాలేయ మార్పిడి అవసరమని వైద్యులు నిర్ధారించారు. ఇందుకు శస్త్రచికిత్స చేయడానికి రూ.25 లక్షలు అవసరమని వారు చెప్పారు. బిడ్డను రక్షించుకునేందుకు అంత సొమ్ము ఎలా సమకూర్చుకోవాలో తెలియక అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఒక ప్రాణాన్ని రక్షించేందుకు దాతలు సహాయం చేయాలని బుధవారం వారు విలేకరుల వద్ద ప్రాథేయపడ్డారు. ప్రస్తుతం ఈ విద్యార్థికి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. సహాయం చేసేవారు దాసరి ఉమా మణికంఠస్వామి ఆంధ్రా బ్యాంకు ఖాతా 056110100330227, ఐఎఫ్ఎస్సీ కోడ్ నెంబరు: ఏఎన్‌డీబీ 0000561కు జమ చేయాలని వారు వేడుకున్నారు. పూర్తి వివరాలకు 80086 22695కు ఫోన్ చేయాలని వారు కోరుతున్నారు. -
ఆయేషాకు ఆర్థికసాయం
వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట: కడపలోని రాజీవ్ గాంధీనగర్‌కు చెందిన ఆయేషా(8) చిన్ని వయసులోనే పెద్ద వ్యాధితో ఇబ్బంది పడుతోంది. ఉన్నట్టుండి కోమాలోకి వెళుతోంది. కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం లేదని వైద్యులు చెప్పారు. ఇందుకోసం సుమారు రూ.40లక్షలు అవసరం అవుతాయి. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద తల్లిదండ్రులు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ విషయంపై ఈ నెల5న అయ్యో ఆయేషా శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల (ఏఐటీఎస్) విద్యార్థులు షేక్‌మస్తాన్, షేక్ ఖాదర్‌వల్లి స్పందించారు. సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. గురువారం వారు మాట్లాడుతూ ఆయేషాకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఆర్థిక సాయం అందించాలని భావించామన్నారు.తమ నగదుతోపాటు రాజంపేట పట్టణంలోని కాకతీయ, నలందా విద్యాసంస్థలకు చెందిన విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించామన్నారు. ఈ విధంగా వచ్చిన రూ.50వేలను ఆయేషా తల్లిదండ్రులకు అందజేసినట్లు వివరించారు. ప్రస్తుతం చిన్నారి చెన్నైలోని ఎగ్మోర్‌పరిధిలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పోందుతోందని చెప్పారు. -
అయ్యో...ఆయేషా..!
కడప కార్పొరేషన్: ముద్దులొలికే ఈ చిన్నారి పాప పేరు ఆయేషా(8). కడప నగరం రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన హుస్సేన్‌ఖాన్, షాహీనా దంపతుల పెద్ద కుమార్తె. జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న చర్చి స్కూల్లో 3వ తరగతి చదువుతోంది. ఈ ఏడాది మే మాసంలో ఆ పాపకు ఉన్నట్టుండి జ్వరం రావడంతో తల్లిదండ్రులు హాస్పిటల్లో చూపించగా కామెర్లు అని వైద్యులు తెలిపారు. జ్వరం తగ్గినప్పటికీ కడుపు, కాళ్లు వాపులు ఎక్కువ కావడంతో బెంగళూరులోని ఇందిరా గాంధీ హాస్పిటల్, మధురైలోని వేలమ్మాల్ ఆసుపత్రి, చెన్నైలోని ఐసీహెచ్ అండ్ హెచ్‌సీ హాస్పిటల్లో వైద్యం చేయించారు. ఇందుకోసం రూ.2లక్షల వరకూ ఖర్చు చేసుకున్నారు. కాలేయంలో కాఫర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆయేషాకు తీవ్రమైన సమస్య ఏర్పడిందని, దీనికి కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం లేదని వైద్యులు తేల్చిచెప్పారు. ఇందుకోసం సుమారు రూ.40లక్షలు ఖర్చు చేయాల్సి ఉండటంతో రెక్కాడితేగానీ డొక్కాడని ఆ నిరుపేద తల్లిదండ్రులు అంతమొత్తం ఎలా తెచ్చుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉండే ఆయేషాను బాత్రూమ్కు కూడా తల్లిదండ్రులే ఎత్తుకొని పోవాల్సి వస్తోంది. కాళ్లు చేతుల వాపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ తమ బిడ్డ పడుతున్న అవస్థను కళ్లారా చూస్తూ వారు లోలోపలే కుమిలిపోతున్నారు. ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతుండటంతో చెన్నైకి పరుగులు పెట్టడం ఆ తల్లిదండ్రులకు పరిపాటిగా మారింది. ఇప్పటికి మూడుసార్లు అలా కోమాలోకి వెళ్లిపోవడంతో చెన్నైకి వెళ్లి చికిత్స చేయించుకొని తీసుకొచ్చారు. పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారు కంటిమీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. ‘త్వరగా ఆపరేషన్ చేస్తే తప్పా మా బిడ్డ బతకదని వైద్యులు చెబుతున్నారు, నా బిడ్డను ఎలాగైనా కాపాడండి’ అని ఆ తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకుంటున్నారు. దాతలు సహకరించి సాయం చేస్తే ఆయేషా మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. వివరాలకు 6300163449 ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. -
తనయుడికి పునరజన్మనిచ్చిన తండ్రి
ఏ తల్లయినా, తండ్రయినా.. తమ సంతానానికి ఒక్కసారే జన్మనిస్తారు. కానీ, ఈ తండ్రి మాత్రం.. తన బిడ్డడికి పునర్జన్మ ప్రసాదించాడు. ఇదెలా సాధ్యం..? ఇదెక్కడ జరిగింది..? ఆ తండ్రీకొడుకులెవరు..? వీటన్నిటికి సమాధానమే ఈ కథనం... ముదిగొండ : అతని పేరు దొంతగాని ఉప్పలయ్య. వికలాంగుడు. బీఈడీ పూర్తి చేశాడు. ఇతడికి భార్య లలిత.కుమారుడు శశికిరణ్ 9వ తరగతి, కుమార్తె 8వ తరగతి (మేడేపల్లిలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో) చదువుతున్నారు. ఆ రోజు ఏమైందంటే... ఒక రోజు, శశికిరణ్ బాగా నీరసించాడు. ఖమ్మంలోని ప్రయివేటు ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మందులు ఇస్తున్నారు. వాటిని వాడినా కూడా నీరసం తగ్గడం లేదు. సాధారణంగా, ఒకట్రెండు రోజుల్లో నీరసం తగ్గుతుంది. కానీ, శశికిరణ్‌ను మాత్రం అది వదలకుండా పట్టి పీడిస్తోంది. పదకొండు నెలలపాటు ఖమ్మం, హైదరాబాద్‌లోని అనేక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పిడుగులాంటి వార్త... చివరికి, ప్రత్యేక వైద్య నిపుణులు పరీక్షించి, పిడుగులాంటి వార్తను బయటపెట్టారు. శశికిరణ్ నీరసానికి కారణాన్ని కనుగొన్నారు. అతడి కాలేయం పూర్తిగా పనిచేయడం లేదట. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయాలట. ఆ తల్లితండ్రులు తట్టుకోలేకపోయారు. అప్పటికే ఆస్పత్రుల ఖర్చులకు పెద్ద మొత్తంలో ఖర్చయింది. కాలేయ మార్పిడికి లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అవయవ దానానికి ఎవ్వరూ ముందుకు రాలేదు (బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి, వారి కుటుంబీకుల అంగీకారంతో అవయవాలను సేకరిస్తారు). ఆపరేషన్ ఆలస్యం చేస్తే ప్రాణానికే ముప్పు. ఆ తండ్రిలో నిరంతరం ఒక్కటే ప్రశ్న.. ఎలా...? ఎలా...? ఎలా...? పునర్జన్మ ప్రసాదించాడు... కాలేయ మార్పిడి ఆపరేషన్‌కు లక్షల రూపాయలు అవసరమవుతాయి. అదే, ఎవరైనా కాలేయ దానం చేస్తే ఖర్చు తగ్గుతుంది. చివరికి, తన కుమారుడు శశికిరణ్కు కాలేయం ఇవ్వడానికి ఆ తండ్రి ఉప్పలయ్య సిద్ధమయ్యాడు. అతడికి వైద్యులు అవసరమైన అన్ని పరీక్షలు చేశారు. ఆపరేషన్ ద్వారా ఆయన కాలేయంలోని సగ భాగాన్ని తొలగించి, శశికిరణ్కు అమర్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం ఇది జరిగింది. ఉప్పలయ్య నుంచి తీసిన సగం కాలేయాన్ని శశికిరణ్ శరీరంలో అమర్చడానికి డాక్టర్లు ఒక రోజంతా శ్రమించారు (ఆపరేషన్ చేశారు). ఆపరేషన్ విజయవంతమైంది. శశికిరణ్ కోలుకునేందుకు దాదాపుగా నెల రోజులు పడుతుంది. అప్పటివరకు అతడిని స్పెషల్ ఐసీయూలో ఉంచుతారు. అందరిలోనూ ఆనందం... ఇప్పుడు ఉప్పలయ్య–లలిత దంపతులు హ్యాపీ... తమ బిడ్డడిని బతికించుకున్నందుకు..! వారి కుమార్తెకు హ్యాపీ... తన సోదరుడు కోలుకుంటున్నందుకు...!! పునర్జన్మ ప్రసాదించినందుకు తండ్రి ఉప్పలయ్యకు, పునర్జన్మ పొందినందుకు కుమారుడు శశికిరణ్కు డబుల్ హ్యాపీ...!!! అభినందనల వెల్లువ కాలేయ దానం ద్వారా కుమారుడికి పునర్జన్మ ప్రసాదించిన ఉప్పలయ్యకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శశికిరణ్ వైద్య ఖర్చుల కోసం మేడేపల్లి పాఠశాల ఉపాధ్యాయులు 25వేల రూపాయలను తల్లికి లలితకు అందజేశారు. ఉప్పలయ్యకు తమ అభినందనలను తెలపాలని ఆమెను కోరారు. తమ విద్యార్థి శశికిరణ్ సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని వారు ఆకాంక్షించారు. -
మృత్యువుతో పోరాటం.. బతకాలని ఆరాటం
సాక్షి, హైదరాబాద్: ఇలా ఒకరు ఇద్దరు కాదు.. సుమారు 70 మంది కాలేయ సంబంధిత బాధితులు ప్రస్తుతం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. చికిత్స చేసే వైద్య నిపుణులు ఉన్నా.. ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జీవన్‌దాన్‌లో 5,002 మంది అవయవాల కోసం పేర్లు నమోదు చేసుకుంటే, వీరిలో 2,706 మంది కిడ్నీల కోసం, 2,197 మంది కాలేయాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క ఉస్మానియాలోనే 70 మంది బాధితులు కాలేయ మార్పిడి చికిత్సల కోసం ఎదురు చూస్తున్నారు. కోమాలో ఉస్మానియా గ్యాస్ట్రో ఎంటరాలజీ.. ప్రతిష్టాత్మక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాన్ని 2010లో ఏర్పాటు చేశారు. ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలో ఇప్పటివరకు ఏడు కాలేయ(బ్రెయిన్‌డెత్ కేసుల నుంచి అవయవాలను సేకరించి బాధితునికి అమర్చడం) మార్పిడి చికిత్సలను విజయవంతంగా చేశారు. పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యసేవలను పొందే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల నిరుపేద బాధితులు చికిత్సల కోసం ఇక్కడికి వస్తున్నారు. అయితే సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి ఆపరేషన్ థియేటర్ కానీ, ఐసీయూ కానీ లేదు. దీంతో వేరే విభాగానికి చెందిన థియేటర్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. రోగుల నిష్పత్తికి తగినన్ని బ్రెయిన్‌డెత్ కేసులు లేకపోవడంతో బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అవయవాన్ని దానం చేసేందుకు బంధువులు(లైవ్ డోనర్) ముందుకొచ్చినా.. ఆస్ప త్రిలో అవసరమైన ఆపరేషన్ థియేటర్, ఐసీయూ లేదు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా.. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ చికిత్సల్లో ఎదురవుతున్న ఇబ్బందులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సహా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లైవ్‌డోనర్ సర్జరీల కోసం మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ సహా అత్యాధునిక ఐసీయూను ఏర్పాటు చేయాలని భావిస్తూ.. ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించింది. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కింగ్‌కోఠి ఆస్పత్రిలో వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. అత్యవసర సమయంలో చికిత్సలు అందించేందుకు అవసరమైన విభాగాలు, నిపుణులు అక్కడ లేకపోవడంతో వెనుకడుగు వేశారు. ఉస్మానియాలో నూతన భవన నిర్మాణానికి మరో ఐదారేళ్లు పట్టే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాన్ని గాంధీకి తరలించాలని భావించింది. అక్కడికి వెళ్లి చికిత్సలు చేసేందుకు వైద్యులు సుముఖంగా ఉన్నా.. ఆయా ఆస్పత్రుల్లో వైద్యుల సంఘం నేతలుగా చలామణి అవుతున్న ఇద్దరు వ్యక్తుల వల్ల ఈ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. అనంతపురం జిల్లా సిండికేట్‌నగర్‌కు చెందిన దేవి ఒక్కగానొక్క కుమారుడు ధర్మతేజ(14) పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. నాలుగేళ్ల క్రితం రక్తపువాంతులు కావడంతో స్థానిక వైద్యులకు చూపించారు. ఫలితం లేకపోవడంతో ఇటీవల ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు కాలేయం పనితీరు పూర్తిగా దెబ్బతిందని, కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారమని స్పష్టం చేశారు. జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసినా.. కాలేయం దొరకలేదు. బాబు ఆరోగ్యం క్షీణించడంతో తన కాలేయంలో కొంత భాగం ఇచ్చేందుకు తల్లి దేవి ముందుకొచ్చింది. అయితే లైవ్‌డోనర్ నుంచి అవయవాన్ని సేకరించి, సర్జరీ చేసే అవకాశం ఉస్మానియాలో లేకపోవడంతో వైద్యులు ఏమీ చేయలేని పరిస్థితి. యాదాద్రి జిల్లాకు చెందిన నర్సింహ, అరుణల కుమారుడు అద్విత్ కుమార్(12 నెలలు) పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం నిలోఫర్‌కు వెళ్లగా, ఉస్మానియాకు సిఫార్సు చేశారు. పరీక్షించిన వైద్యులు కాలేయ మార్పిడి చేయాలని సూచించారు. అయితే ఆస్పత్రిలో లైవ్‌డోనర్ చికిత్సలు అందుబాటులో లేకపోవడంతో బాబు తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు. ‘కార్పొరేట్’ సహకారంతో బాలికకు పునర్జన్మ నాగర్‌కర్నూలు జిల్లా చారగొండకు చెందిన శ్రీకాంత్, రాణి దంపతుల కుమార్తె సాయివర్షిత(7) పుట్టుకతోనే కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. పాప ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ‘ఆటో ఇమ్యూనో డిసీజ్’తో ఆమె బాధపడుతున్నట్లు గుర్తించి.. వెంటనే కాలేయ మార్పిడి చేయాలన్నారు. తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసేందుకు తల్లి రాణి ముందుకొచ్చింది. ఆస్పత్రిలో లైవ్‌డోనర్ చికిత్సకు అవకాశం లేకపోవడంతో ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి దాతల సహాయంతో చికిత్స చేశారు. అనంతపురం జిల్లా సిండికేట్‌నగర్‌కు చెందిన దేవి ఒక్కగానొక్క కుమారుడు ధర్మతేజ(14) పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. నాలుగేళ్ల క్రితం రక్తపువాంతులు కావడంతో స్థానిక వైద్యులకు చూపించారు. ఫలితం లేకపోవడంతో ఇటీవల ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు కాలేయం పనితీరు పూర్తిగా దెబ్బతిందని, కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారమని స్పష్టం చేశారు. జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసినా.. కాలేయం దొరకలేదు. బాబు ఆరోగ్యం క్షీణించడంతో తన కాలేయంలో కొంత భాగం ఇచ్చేందుకు తల్లి దేవి ముందుకొచ్చింది. అయితే లైవ్‌డోనర్ నుంచి అవయవాన్ని సేకరించి, సర్జరీ చేసే అవకాశం ఉస్మానియాలో లేకపోవడంతో వైద్యులు ఏమీ చేయలేని పరిస్థితి. యాదాద్రి జిల్లాకు చెందిన నర్సింహ, అరుణల కుమారుడు అద్విత్ కుమార్(12 నెలలు) పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం నిలోఫర్‌కు వెళ్లగా, ఉస్మానియాకు సిఫార్సు చేశారు. పరీక్షించిన వైద్యులు కాలేయ మార్పిడి చేయాలని సూచించారు. అయితే ఆస్పత్రిలో లైవ్‌డోనర్ చికిత్సలు అందుబాటులో లేకపోవడంతో బాబు తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు. -
ఈ చిట్టితల్లికి ఎంత కష్టం..
చిత్తూరు, పలమనేరు: లక్ష్మి ఎనిమిదేళ్ల చిన్నారి..పలమనేరు లిటిల్ ఏంజెల్స్ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. తోటి పిల్లలతో చలాకీగా కనిపించే లక్ష్మికి అనుకోని జబ్బు వచ్చి పడింది. బిడ్డకు కాలేయం పాడైందని తెలిసి ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుంగిపోయారు. బిడ్డను బతికించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు పేదరికం శాపంలా మారింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన శివప్రసాద్ ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పది రోజుల క్రితం కుమార్తె లక్ష్మి అనారోగ్యానికి గురికావడంతో తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు లివర్ సంబంధిత వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. వారి సూచన మేరకు ఈనెల 12న బెంగళూరులోని వైదేహీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు. పేద కుటుంబం కావడంతో ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా వారు కొంత సాయం చేశారు. సోషల్ మీడియా సాయంతో మరికొంత వచ్చింది. ఆపరేషన్‌కు రూ.15లక్షల దాకా అవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లి దండ్రులు మంత్రి అమరనాథరెడ్డికి విన్నవిం చారు. అంతమొత్తంలో సాయం చేయలేమని ఆయన చెప్పడంతో మరింత నిరాశకు గురయ్యారు. దాతలు ఎవరైనా ఉంటే 94940 66812, 9642951204లను సంప్రదించాలని కోరుతున్నారు. -
బాలుడి వైద్యానికి రూ.25 లక్షలు
11 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్సకు సీఎం సాయం సాక్షి, హైదరాబాద్: 11 నెలల పసిబాలుడికి వైద్య చికిత్సను అందించేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు మానవతా హృదయంతో స్పందించారు. కాలేయ మార్పిడికి అవసర మైన చికిత్సను అందించేందుకు సీఎం సహా యనిధి నుంచి రూ.25 లక్షలు మంజూరు చేశారు. గజ్వేల్‌కి చెందిన హనుమాన్ దాస్ కుమారుడైన దేవసాని శ్రీమాన్ పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు చేయించగా కాలేయానికి సంబంధించిన సమస్య తలెత్తిందని, కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారమని వైద్యులు చెప్పారు. దీంతో అంత ఖర్చు భరించలేని పేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వివిధ పత్రికలలో వచ్చిన కథనాలతో ముఖ్యమంత్రి బాలుడి గురించి ఆరా తీశారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన వైద్యాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో కలెక్టర్ బాలుడి కుటుంబీకులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాలేయ మార్పిడికి రూ.25 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పటంతో స్పందించిన ముఖ్యమంత్రి సీఎం సహాయ నిధి నుంచి ఆ నిధులను మంజూరు చేశారు. అందుకు సంబంధించిన చెక్కును కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి తల్లిదండ్రులకు సోమవారం అందజేశారు. ‘సాక్షి’ సాయాన్ని మరచిపోలేం: శ్రీమాన్ తండ్రి ‘‘మాకొచ్చిన కష్టాన్ని ప్రపంచానికి తెలిసేలా సాక్షి పత్రిక కథనం ప్రచురించడం.. సీఎం కేసీఆర్ స్పందించడం కొండంత అండనిచ్చింది. సీఎం చొరవతో మా బాబు మంచి భవిష్యత్తును పొందుతాడనే నమ్మకం కలిగింది. దీనికి కారణమైన ‘సాక్షి’ మేలు మరచిపోలేం. సీఎంకి రుణపడి ఉంటాం’’ అని శ్రీమాన్ తండ్రి హనుమాన్‌దాస్ చెప్పారు. -
‘పసివాడి ప్రాణం’ కోసం..
నడుంకట్టిన మిత్రులు, శ్రేయోభిలాషులు ♦ సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం ♦ కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు రూ. 20 లక్షల సేకరణ గజ్వేల్: లక్షల మందిలో ఒకరికి సంక్రమించే ‘బిలరి అస్టీరియా’వ్యాధి.. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బాబును కబళించడంతో ఆ దంపతులు కుంగిపోయారు. అయితే మానవత్వం పరిమళించి పసివాడిని మేం బతికిస్తాం.. అంటూ మిత్రులు, శ్రేయోభిలాషులు ముందుకొచ్చి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఫలితంగా రూ. 20 లక్షలు పోగయ్యాయి. గజ్వేల్ పట్టణానికి చెందిన దేవసాని హనుమాన్‌దాస్–ఉమామహేశ్వరి దంపతులు. హనుమాన్‌దాస్ స్క్రీన్ ప్రింటింగ్ పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. వీరికి ఏడాది క్రితం కవలపిల్లలు జన్మించారు. వారిలో కూతురు స్వీకృతి ఆరోగ్యంగా ఉండగా.. శ్రీమాన్‌కు 4 నెలల క్రితం పచ్చకామెర్లు సోకాయి. ఈ క్రమంలోనే ఆ బాబును నిలోఫర్‌లో చూపించారు. పుట్టుకతో వచ్చిన పచ్చకామెర్ల వల్ల కాలేయం దెబ్బతిన్నదని అక్కడి వైద్యులు తెలిపారు. ఆపరేషన్ చేసినా విజయవంతం కాకపోవడంతో సమస్య యథాతథంగానే మారింది. నిలోఫర్ వైద్యులు పరీక్షల కోసం నిమ్స్‌కు పంపిం చారు. శ్రీమాన్‌కు ‘బిలరి అస్టీరియా’అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు అక్కడ గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కాలేయ మార్పిడే తరుణోపాయమని.. ఈ ఆపరేషన్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన మహ్మద్ రేలా అనే వైద్యుడు మాత్రమే చేయగలరని తెలిపారు. డాక్టర్ రేలా హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆసుపత్రికి తరచూ వస్తారని తెలుసుకున్నారు. కానీ ఆపరేషన్‌కు రూ. 20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిసి.. చేతిలో చిల్లిగవ్వలేక... కన్నకొడుకును దక్కించుకునే మార్గం తెలియక ఆందోళన చెందాడు. ఇదే సమయంలో హనుమాన్‌దాస్ మిత్రులు గజ్వేల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేల నవీన్, బషీర్‌బాగ్ ఎస్ఐ వెంకటేశ్, హరీశ్‌రెడ్డి, తౌటి శ్రీనివాస్, శ్రీకాంతాచారి, గుంటుక శ్రీనివాస్, గుడాల రాధాకృష్ణ, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ తదితరులు అండగా నిలిచారు. శ్రీమాన్ స్థితిపై వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఆపరేషన్‌కు ఆదుకోవాలని వినతులు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది స్పం దించారు. శస్త్రచికిత్స చేయించనున్న గ్లోబల్ ఆసుపత్రి అకౌంట్‌కు ఇప్పటి వరకు 1,250 మంది రూ. 20 లక్షల వరకు అందించారు. ఇందులో ప్రధానంగా వర్గల్ విద్యాసరస్వతీ ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి రూ.లక్ష విరాళంగా అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. తన కన్నపేగును బతికించుకోవడానికి తల్లి ఉమామహేశ్వరి కాలేయం ఇస్తోంది. ఇం దుకు సంబంధించి బాబుకు, ఉమామహేశ్వరికి వేర్వేరుగా పరీక్షలు చేశారు. మొత్తానికి రెండుమూడు రోజుల్లో ఆపరేషన్ జరగనుండగా.. తమ బాబు మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటాడని, అందరిలా ఆడుకుంటాడనే ఆశతో ఉన్నారు. ఆపరేషన్‌కు రూ.20 లక్షలు సర్దుబాటు అయినా భవిష్యత్తులో జరిగే చికిత్స ఖరీదైనదేనని వైద్యులు చెబుతు న్నారు. ఆరు నెలలపాటు నెలకు రూ. 50 వేల నుంచి రూ. 1లక్ష వరకు ఖర్చవుతుందని చెబుతున్నట్లు హనుమాన్‌దాస్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. దాతలు తన ఖాతా నంబర్: 4174101000434, ఐఎఫ్ఎస్సీ కోడ్: సీఎన్ఆర్బీ0004174 –కెనరా బ్యాంక్ గజ్వేల్ శాఖకు విరాళాలు పంపించాలని కోరారు. ప్రభుత్వం ఆదుకోవాలి -
చిన్నారి ఆపరేషన్‌కు బన్నీ సాయం
మన స్టార్లు తెర మీదే కాదు తెర వెనక కూడా హీరోలే అని ప్రూవ్ చేసుకుంటున్నారు. సామాన్య ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో తమ వంతుగా సాయం చేసే స్టార్లు వ్యక్తిగతంగా తమ దృష్టికి వచ్చిన సమస్యల విషయంలో కూడా పెద్ద మనసుతో స్పందిస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ చిన్నారి కాలేయ మార్పిడి ఆపరేషన్‌కు సాయం చేశాడు. భీమవరానికి చెందిన నాగరాజు, దుర్గ ప్రశాంతిల 7 నెలల బాబు కొద్ది రోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. అభిమానుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న బన్నీ తన వంతుగా 8 లక్షల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం నుంచి కూడా కొంత డబ్బు రావటంతో శుక్రవారం ఆ చిన్నారికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. తమ చిన్నారి ప్రాణాలు కాపాడిన స్టైలిష్ స్టార్‌కు బాబు తల్లి దండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
చిన్నారి జ్ఞానసాయికి చికిత్స ప్రారంభం
చెన్నై: పుట్టుకతో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిట్టితల్లి జ్ఞానసాయికి చెన్నై గ్లోబల్ హెల్త్ సిటీలో వైద్య చికిత్స అందిస్తున్నారు. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ మహ్మద్ రేల పర్యవేక్షణలో వైద్య బృందం పరీక్షల్ని వేగవంతం చేసింది. 20 రోజుల్లోపు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు తగిన చర్యలు తీసుకోనున్నారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం వేపూరి కోట పంచాయతీ బత్తలాపురం రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన రమణప్ప, సరస్వతి దంపతుల ఎనిమిది నెలల కుమార్తె జ్ఞానసాయి కాలేయ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు తగిన స్థోమత లేకపోవడంతో కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని రమణప్ప కోర్టును ఆశ్రయించారు. వ్యవహారం మీడియాలో రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు తగ్గ చర్యలు తీసుకోవాలని గ్లోబల్ ఆసుపత్రి చైర్మన్ రవీంద్రనాథ్‌కు సూచించడంతో, చిన్నారిని చెన్నైకు తరలించారు. సోమవారం జ్ఞానసాయిని రమణప్ప, సరస్వతి దంపతులు పెరుంబాక్కంలోని గ్లోబల్ హెల్త్ సిటీకి తీసికెళ్లారు. వారి వెంట ములకలచెరువు ఎంపీపీ ఆషాబీ ఉన్నారు. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ మహ్మద్ రేల పర్యవేక్షణలో కాలేయ సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ నరేష్ షణ్ముగం బృందం వైద్య పరీక్షలు వేగవంతం చేసింది. దీనిపై ఆ హెల్త్‌సిటీ ఉపాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి, తమ చైర్మన్ రవీంద్రనాథ్ ఆదేశాలతో జ్ఞానసాయికి వైద్య పరీక్షలు వేగవంతం చేశామన్నారు. చిన్నారి చలాకీగా ఉన్న దష్ట్యా, ఔట్ పేషెంట్‌గా పరిగణించి చికిత్సలు అందించేందుకు నిర్ణయించామని వివరించారు. స్క్రీనింగ్, ఇతర పరీక్షలు సాగుతున్నాయన్నారు. కాలేయం దానానికి సంబంధించి, ఆ చిన్నారి తల్లిదండ్రులకు పరీక్షల జరపనున్నామని, వారి కాలేయం సరిపడే అవకాశాలు ఎక్కువే అని పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు వారం పది రోజులు సమయం పట్టే అవకాశం ఉందని, తదుపరి అనుమతులకు మరో ఐదు రోజులు పట్టవచ్చన్నారు. 20 రోజుల్లోపు చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరుగుతుందని స్పష్టం చేశారు. సంక్లిష్ట పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చిన చిన్న పిల్లలకు డాక్టర్ రేల శస్త్ర చికిత్సలను విజయవంతం చేశారని, జ్ఞానసాయి సంపూర్ణ ఆరోగ్యంతో ఇక్కడి నుంచి వెళ్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చిన్నారి తండ్రి రమణప్ప మాట్లాడుతూ జ్ఞానసాయిని సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా అప్పగించాలని వైద్యులకు విన్నవించామన్నారు. -
ఇక ఉస్మానియాలో కాలేయ మార్పిడి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో కాలేయ మార్పిడి ఆపరేషన్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతించింది. అందులో భాగంగా ఇద్దరు రోగుల ఆపరేషన్ ఖర్చును భరించాలని నిర్ణయించింది. వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. వారిద్దరికి త్వరలో కాలేయ మార్పిడి ఆపరేషన్ చేసేందుకు ఉస్మానియా వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో కంటే తక్కువ ఖర్చుతో కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయొచ్చని ఉస్మానియా వైద్యులు ఇటీవల ప్రభుత్వానికి నివేదించడం తెలిసిందే. సీఎం దాన్ని ప్రశంసించడంతో పాటు ఆ ప్రతిపాదనను వెంటనే సరేననడంతో సంబంధిత ఫైలు రెండు రోజులుగా ఆగమేఘాల మీద కదిలింది. ఉస్మానియాలో కాలేయ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎంటెక్ విద్యార్థి మహేశ్, నల్లగొండ జిల్లాకు చెందిన ఆటోడ్రైవర్ సైదులు పేర్లను సీఎం కార్యాలయానికి పంపించారు. వారికి సీఎం సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేస్తూ ఫైలుపై మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో మంగళవారం సచివాలయంలో సీఎం సంతకం చేశారు.