
సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందించిన సహకారంతో 48 గంటల్లో ముగ్గురికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. సౌత్ ఆసియన్ లివర్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు చేశారు.
డాక్టర్ టామ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆ ముగ్గురికీ ఆర్థిక సాయం అందించడంతో వారి ప్రాణాలను కాపాడగలిగామన్నారు. వారికి కాలేయ మార్పిడి చికిత్స చేయకపోతే ప్రాణాలతో ఉండటం కష్టమేనన్నారు. కాగా, 2016 నుంచి తమ ఆస్పత్రిలో 40 కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించామని డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment