చిన్నారి ఆపరేషన్కు బన్నీ సాయం
మన స్టార్లు తెర మీదే కాదు తెర వెనక కూడా హీరోలే అని ప్రూవ్ చేసుకుంటున్నారు. సామాన్య ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో తమ వంతుగా సాయం చేసే స్టార్లు వ్యక్తిగతంగా తమ దృష్టికి వచ్చిన సమస్యల విషయంలో కూడా పెద్ద మనసుతో స్పందిస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ చిన్నారి కాలేయ మార్పిడి ఆపరేషన్కు సాయం చేశాడు.
భీమవరానికి చెందిన నాగరాజు, దుర్గ ప్రశాంతిల 7 నెలల బాబు కొద్ది రోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. అభిమానుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న బన్నీ తన వంతుగా 8 లక్షల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం నుంచి కూడా కొంత డబ్బు రావటంతో శుక్రవారం ఆ చిన్నారికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. తమ చిన్నారి ప్రాణాలు కాపాడిన స్టైలిష్ స్టార్కు బాబు తల్లి దండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.