A Child Needs your Help for his Liver Transplant Surgery
Sakshi News home page

'అయ్యో భగవంతుడా.. మేం ఏ పాపం చేశాం'!

Published Thu, Aug 25 2022 1:35 PM | Last Updated on Fri, Sep 2 2022 12:34 PM

save my son meghanath who need liver Transplantation please help - Sakshi

పుట్టిన బిడ్డ పురిట్లోనే కన్నుమూస్తే ఆ తల్లి గర్భశోకం తీర్చలేనిది. అందులోనూ తొలిచూలు బిడ్డను కోల్పోయి, పుట్టెడు దుఃఖంలో ఉండగా ఆశలదీపంగా పుట్టిన మరో బిడ్డ కూడా ప్రాణాపాయంలో పడిపోతే..ఆ దంపతుల  బాధ వర్ణనాతీతం. తన బిడ్డను కాపాడుకునేందుకు ఒక తల్లి పడుతున్న ఆవేదన ఇది!! 

తొలిసారి పుట్టిన కొడుకు చనిపోతే ఆ బాధను పంటి బిగువున భరించా.  అయితే  ఆదేవుడి దయ వల్ల మేఘనాథ్‌ రూపంలో మరో బిడ్డ పుట్టడంతో కొడుకును కోల్పోయామన్న బాధను మర్చిపోయాం.  పొత్తిళ్లల్లోని మేఘనాథ్‌ స్పర్శతో అనిర్వచనీయమైన అనుభూతికి  లోనయ్యా అలాకొన్ని రోజులు గడిచాయో లేదో.. నా ఆనందాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో...మేఘనాథ్‌ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. శరీరం, కళ్ళు పాలిపోయాయి.  దీంతో  ఈ బిడ్డనైనా కాపాడమని వేడుకుంటూ ఆస్పత్రికి పరుగెత్తా.. డాక్టర్లు పరీక్షలు చేశారు. అలా పరీక్షలు చికిత్సతో రోజులు గడుస్తున్నాయి. అయినా బాబు ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పైగా పరిస్థితి చేయి దాటి పోతోందన్న ఆందళన కలిగింది. కడుపు ఉబ్బరంగా ఉండడంతో అనుమానం వచ్చి నేను నా భర్త వెంటనే మరో ఆస్పత్రికి తరలించాం.

 

మరోసారి  వైద్యులు టెస్ట్‌లు, స్క్రీనింగ్‌లు చేశారు. అనంతరం డాక్టర్లు పిడుగులాంటి వార్త చెప్పారు.  పుట్టుకతోనే వచ్చే బిలియరీ అట్రేసియా అనే వ్యాధి బారిన పడ్డాడని చెప్పడంతో నా గుండె పగిలింది. నా బిడ్డ ప్రాణాలతో ఉండాలంటే కాలేయమార్పిడి చేయాల్సిందేనని వైద్యులు తేల్చి చెప్పారు. దీనికయ్యేమొత్తం ఖర్చు  రూ. 18 లక్షలు ($ 22506.34). 

అయ్యో భగవంతుడా...పసిగుడ్డుకు ఎంత కష్టం వచ్చింది. దీనికి మందేలేదా అని ఇద్దరమూ కంటికి మిన్నగా రోదించాం. అయితే కాలేయ మార్పిడి ఈ సమస్యకు పరిష్కారమని, డోనర్లు దొరికితే నా కొడుకు ప్రాణాలు కాపాడతామని డాక్టర్లు చెప్పారు.  నా ప్రాణం పోయినా సరే నా బిడ్డను బ్రతికించుకోవాలని నిశ్చయించుకున్నా. నా లివర్‌ను దానం చేయడానికి నేను సిద్ధం. కానీ నిరుపేదలమైన  మాకు ఈ మొత్తం ఖర్చు భరించే శక్తి లేదు. అందుకే మీ సాయం  కోసం అభ్యర్థిస్తున్నా.

తొలిసారి నెలలు నిండకుండానే పుట్టిన మగబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా. మరోసారి ఈ కడుపు శోకాన్ని భర్తించే శక్తి నాకు లేదు. మేఘానంద్‌కు ఆరోగ్యం బాగాలేదని చెప్పిన నాటి నుంచి  వాడి ప్రాణాల్ని కాపాడుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నా. వైద్యం కోసం ఇల్లు వాకిలి అన్నీ అమ్మేశా. పెట్రోల్‌ బంకులో పనిచేసే నా భర్త చాలీ చాలని జీతంతో ఇంటిని వెళ్లదీస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మేఘనాధ్‌కు ట్రీట్‌మెంట్‌ చేయించలేక ప్రతీ రోజూ నరకం అనుభవిస్తున్నాం.  అందుకే  మేఘనాథ్‌ ఆరోగ్యంగా ఉండేందుకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దయచేసి సాయం చేయండి. నా మేఘనాధ్‌కు  ప్రాణ భిక్ష పెట్టమని కన్నీళ్లతో వేడుకుంటున్నా. (అడ్వర్టోరియల్‌

👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement