liver cancer
-
ఎస్పీజీ డైరెక్టర్ ఏకే సిన్హా కన్నుమూత
సాక్షి, ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భద్రతను పర్యవేక్షించే ప్రత్యేక భద్రతా బృందం ఎస్పీజీ(special protection group) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. 2016 నుంచి SPG డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు ఆయన. అంతకు ముందు ఆ పొజిషన్ 15 నెలలు ఖాళీగా ఉండడం విశేషం. ఈ ఏడాది మే 30వ తేదీన ఆయన పదవీ కాలం ముగియగా.. అంతకు ముందు రోజే ఆయన పదవీ కాలం పొడిగిస్తూ ఉత్తర్వులపై ప్రధాని మోదీ సంతకం చేశారు. ఎస్పీజీ డైరెక్టర్ బాధ్యతల కంటే ముందు ఆయన.. కేరళ డీజీపీ(ప్రత్యేక సేవలు, ట్రాఫిక్) నిర్వర్తించారు. కేరళ క్యాడర్‌కు చెందిన అరుణ్ కుమార్ సిన్హా.. 1987 ఐపీఎస్ బ్యాచ్. ఆ రాష్ట్ర పోలీస్‌విభాగంలో పలు బాధ్యతలు కూడా నిర్వహించారాయన. ప్రత్యేక భద్రతా బృందం ఎస్పీజీ.. 1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య ఘటన తర్వాత ఏర్పాటైంది. 1985 నుంచి ఇది ప్రధానులకు, మాజీ ప్రధానులకు, వాళ్ల వాళ్లకు కుటుంబ సభ్యలకు భద్రత కల్పిస్తూ వస్తోంది. ప్రస్తుతం ప్రధాని, ఆయన కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతలను మాత్రమే చూసుకుంటోంది. -
Devananda: ఇలాంటి కూతురు ఉండాలి!
‘ఈ అమ్మాయిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ప్రతి తల్లిదండ్రులకు ఇలాంటి కూతురు ఉండాలి’ అని సాక్షాత్తు కేరళ హైకోర్టు 17 ఏళ్ల దేవనంద గురించి అంది. ఎందుకో చదవండి! కేరళలోని త్రిసూర్‌లో కాఫీ హోటల్ నడుపుకునే 48 ఏళ్ల ప్రతీష్‌కు నిన్న మొన్నటి దాకా జీవితం సాఫీగానే సాగింది. భార్య ధన్య, కూతురు దేవనంద, కొడుకు ఆదినాథ్... అందరిలాంటి ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం. అయితే ఈ మధ్య కాలు వాపు తరచూ కనిపిస్తుండేసరికి డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. పరీక్షలు చేశాక డాక్టర్లు పిడుగులాంటి వార్త చెప్పారు– లివర్ కేన్సర్. వైద్యం అంటూ లేదు... లివర్ ట్రాన్స్‌ప్లాంటేషనే శరణ్యం అని తేల్చి చెప్పారు. అది కూడా వెంటనే జరగాలని చెప్పారు. ఆ మధ్యతరగతి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కొచ్చిలోని రాజగిరి హాస్పిటల్ వారు మీరు డోనర్ని తెస్తే మేము ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం అని భరోసా ఇచ్చారు. కాని లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు డోనర్ దొరకడం అంత సులభం కాదు. దొరికినా సూట్ కావాలి. సమయం లేదు... మరి ఏం చెయ్యాలి? నేనే ఎందుకు ఇవ్వకూడదు అనుకుంది కూతురు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న దేవనంద తండ్రిని కోల్పోవడానికి సిద్ధంగా లేదు. మరో ఆలోచన చేయకుండా ఆస్పత్రి వర్గాల దగ్గరకు పోయి తనే లివర్‌లోని కొంత భాగం డొనేట్ చేయవచ్చా అని అడిగింది. చేయచ్చు గాని ‘ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్ 1994’ ప్రకారం మైనర్లకు అనుమతి లేదని చెప్పారు. దేవనంద ఇంటర్నెట్ జల్లెడ పట్టింది. గతంలో ఇలాంటి కేసులో ఒక మైనర్‌కు ఆర్గాన్ డొనేట్ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చినట్టుగా చదివింది. అయితే ఆ మైనర్ నుంచి ఆర్గాన్ డొనేషన్ జరగలేదు. ఆ తీర్పు ఆధారంగా తాను హైకోర్టుకు వెళ్లాలని నిశ్చయించుకుంది. జడ్జి పూనుకొని హైకోర్టులో జస్టిస్ వి.జి.ఆరుణ్ సమక్షానికి ఈ కేసు వచ్చింది. ప్రత్యేకమైన కమిటీని వేసి ఆర్గాన్ యాక్ట్‌లో ఏదైనా మినహాయింపుతో దేవనంద తన తండ్రికి లివర్ ఇవ్వొచ్చోకూడదో సూచించమని ఆదేశించాడాయన. కమిటీ అధ్యయనం చేసి చిన్న వయసులో ఇవ్వడానికి ఏ మాత్రం వీలు లేదని, దేవనందను ఇందుకు అనుమతించ వద్దని తేల్చి చెప్పింది. కాని దేవనంద కమిటీ రిపోర్టును మళ్లీ సవాలు చేసి తండ్రిని కాపాడుకునే హక్కు తనకు ఉందని కోర్టుకు చెప్పింది. ‘నాన్నను కోల్పోతే మేము దిక్కులేని వాళ్లం అవుతాం’ అని చెప్పింది. జస్టిస్ వి.జి.అరుణ్ దేవనంద పట్టుదలను, తండ్రి కోసం ఆమె పడుతున్న ఆరాటాన్ని ఎంతో ప్రశంసించారు. ‘ఇలాంటి కూతురు అందరికీ ఉండాలి’ అన్నారు. ఈసారి మరో కమిటీని వేశారు. ఆ కమిటీ దేవనందకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వడంతో డిసెంబర్ 2022లో అనుమతి ఇస్తూ తీర్పు చెప్పారు. అన్ని విధాలా సిద్ధమయ్యి ఈ విషయం తెలిసి బంధువులు వారించినా దేవనంద వెనక్కు తగ్గలేదు. తండ్రికి ఆరోగ్యకరమైన లివర్ ఇవ్వడానికి జిమ్‌లో చేరింది. మంచి పోషకాహారం తీసుకుంది. తండ్రి కోసం ఫిబ్రవరి 9న ఆపరేషన్ బల్ల ఎక్కింది. పెద్ద వైద్యుల బృందం ఆధ్వర్యంలో తండ్రీకూతుళ్లకు సర్జరీ చేసి లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతం చేశారు. ఆపరేషన్ జరిగిన రాజగిరి హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ల బృందం దేవనందకు ఫ్యాన్స్ అయ్యా రు. తండ్రీ కూతుళ్లు డిశ్చార్జ్ అవుతుంటే అందరూ వచ్చి జ్ఞాపికతో వారిని సాగనంపారు. అంతేనా? దేవనంద పట్టుదల, ప్రేమను చూసి తండ్రి ఆపరేషన్ ఖర్చులను మాఫీ చేశారు. కూతురు ప్రేమ సాధించిన ఘన విజయంగా దీనిని అభివర్ణించవచ్చు. -
ప్రొస్టేట్ క్యాన్సర్‌పై నానో కత్తి
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మగవారికి ప్రొస్టేట్ క్యాన్సర్ శాపంగా పరిణమిస్తోంది. దీన్ని గుర్తించిన తర్వాత రేడియో థెరపీ లేదా ఆపరేషన్ చేసి ప్రొస్టేట్ గ్రంధిని తొలగించడమనే మార్గాలు మాత్రమే రోగులకు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా దీన్ని పూర్తిగా నిర్మూలించే సరికొత్త చికిత్సా విధానంపై డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గంటలోపు పూర్తయ్యే ఈ చికిత్స ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నయం చేస్తుందంటున్నారు. ఈ చికిత్సలో మందులకు లొంగని కణతులపైకి ఎలక్ట్రిక్ తరంగాలను పంపి వాటిని నాశనం చేస్తారు. ‘నానో నైఫ్’గా పిలిచే ఈ సరికొత్త చికిత్సా విధానం చాలా సులువైనదని, సైడ్ ఎఫెక్టులు చాలా స్వల్పమని యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్ సర్జన్లు చెప్పారు. నిజానికి ఈ నానో నైఫ్ చికి త్సను ఇప్పటికే లివర్, క్లోమ క్యాన్సర్లలో వాడుతున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌పై దీన్ని తొలిసారి వాడినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఏమిటీ నానో నైఫ్.. ఈ ట్రీట్మెంట్ పేరు నానో నైఫ్ కానీ, నిజంగా చికిత్సలో నైఫ్ (కత్తి) వాడరు. చర్మం ద్వారా ఒక సూదిని పంపి ఆల్ట్రాసౌండ్స్ను ఉపయోగించి కణతులను (ట్యూమర్లు) గుర్తిస్తారు. అనంతరం ఆ కణితి చుట్టూ నాలుగు సూదులు గుచ్చుతారు. వీటి ద్వారా నానో నైఫ్ మిషన్ ఎలక్ట్రిక్ తరంగాలను పంపుతుంది. ఈ తరంగాలు కణతుల్లోని కణాలపై ఉండే త్వచాన్ని ధ్వంసం చేస్తాయి. దీంతో ఆ కణుతులు నాశనం అవుతాయి. ఈ మొత్తం ప్రక్రియ 45–60 నిమిషాల్లో పూర్తవుతుంది. లకి‡్ష్యత కణుతులపైకి కరెంట్ తరంగాలను పంపి నిర్వీర్యం చేసే ఈ పద్దతిని ఇర్రివర్సబుల్ ఎలక్ట్రోపోరేషన్ అంటారు. దీనివల్ల కణతులకు చుట్టుపక్కల కణజాలంపై పెద్దగా ప్రభావం పడకుండా ఉంటుంది. సాంకేతికత సాధించిన విజయాల్లో ఇది ఒకటని ఈ ఆపరేషన్ తొలిసారి నిర్వహించిన డాక్టర్ ఆలిస్టర్ గ్రే అభిప్రాయపడ్డారు. ముదిరితే కానీ తెలియదు.. మగవారిలో మూత్రాశయం దిగువన ఉండే ప్రొస్టేట్ గ్రంధిలో కణజాలం అదుపుతప్పి పెరగడాన్ని ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో సంభవించే క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో, పురుషుల్లో ఈ క్యాన్సర్ అంతే ప్రమాదకారిగా మారింది. ఏటా లక్షలమంది దీని బారినపడి మరణిస్తున్నారు. ఇతర క్యాన్సర్లలో కనిపించినట్లు ఈ క్యాన్సర్ సోకగానే లక్షణాలు కనిపించవు. దీంతో చాలామందిలో ఇది సోకిన విషయం చివరి దశలో కానీ బయటపడదు. మూత్ర విసర్జనలో ఇబ్బంది అనిపిస్తే డాక్టర్లు ప్రొస్టేట్ క్యాన్సర్‌గా అనుమానిస్తారు. బయాప్సీ ద్వారా ఈ క్యాన్సర్‌ను నిర్ధారిస్తారు. రేడియోథెరపీ నిర్వహించడం, ఆపరేషన్‌తో కణుతులను తొలగించడం వంటి చికిత్సామార్గాలున్నాయి. అయితే వీటితో సైడ్ ఎఫెక్టులు ఎక్కువ. ఇండియాలో ఏడాదికి సుమారు లక్షకుపైగా ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 85 శాతం కేసులు 3, 4వ దశల్లో మాత్రమే గుర్తించడం జరుగుతోంది. ఇది సోకడానికి నిర్దిష్ఠ కారణాలు తెలియదు. ఎలాంటి దురలవాట్లు లేనివారికి కూడా ఇది సోకే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడం ద్వారా ఇది రాకుండా నివారించవచ్చు. – నేషనల్ డెస్క్,సాక్షి -
మీ సాయం.. నిలుపుతుంది ప్రాణం
కోవెలకుంట్ల: నాలుగేళ్ల వయస్సులోనే ఓ చిన్నారికి పెద్దకష్టం వచ్చింది. ఆడుతూ, పాడుతూ ఆరోగ్యంగా గెంతులేయాల్సిన పసిబాలుడు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నాడు. లివర్ కేన్సర్‌తో రోజులు లెక్కపెడుతున్న దుస్థితి నెలకొంది. కోవెలకుంట్ల పట్టణంలోని ఆటోనగర్‌లో నివాసం ఉంటున్న చాకలి మహేష్, బనగానపల్లెకు చెందిన మహాదేవికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు సుబ్బ మద్దిలేటి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్ల వయస్సు ఉన్న గణ మద్దిలేటి రెండవ కుమారుడు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో బాడుగ ఇంట్లో నివాసం ఉంటున్నారు. చాకలి వృత్తి, వ్యవసాయ, ఉపాధి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెండవ కుమారుడికి నాలుగు నెలల క్రితం తీవ్ర జ్వరం రావడంతోపాటు తల వెంట్రుకలు ఊడిపోవడం, పొట్ట, కాళ్లు, చేతులు వాపురావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు లివర్ కేన్సర్ సోకిందని హైదరాబాదుకు తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇప్పటి వరకు చిన్నారికి ఆధార్‌కార్డు కూడా లేకపోవడంతో ఆరోగ్యశ్రీ పథకం వర్తించే అస్కారం లేకుండా పోయింది. నాలుగు నెలల నుంచి ఇప్పటి వరకు రూ.లక్ష వరకు ఖర్చు కాగా తల్లిదండ్రులు దొరికిన చోటంతా అప్పులు చేసి చిన్నారి ప్రాణాన్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం సుమారు రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో దాతల ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలెవరైనా 9133483763 నంబర్‌కు ఫోన్ చేసి ఆదుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు. చదవండి: మేయరమ్మా... ఇదేంటమ్మా! ఎవరికీ అనుమానం రాదు.. ఈ దొంగ ప్రత్యేకత ఇదే.. -
పిల్లల తారుమారు.. 28 ఏళ్లకు కోటి పరిహారం..
బిజీంగ్: అడ్వాన్స్డ్ లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తికి ఓ వార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చినా. .. మరో రూపంలో అతని కుటుంబానికి కోటిరూపాయలు నష్టపరిహారంగా దొరికాయి. విచిత్రంగా ఉన్న ఈ సంఘటన ఈస్ట్ చైనా జియాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన యోసే అని వ్యక్తి జీవితంలో జరిగింది. 28 ఏళ్ల క్రితం హువాయ్ ఆసుపత్రిలో జన్మించిన యో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో తన సొంత తల్లిదండ్రులకు కాకుండా మరెవరో దంపతులకు బిడ్డగా మారిపోయాడు. ఈ విషయం తెలియని ఇరు కుటుంబాల వారు తమ దగ్గర ఉన్న బిడ్డలని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో యోకు అడ్వాన్స్డ్ లివర్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే కొంత ఉపయోగం ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో యో వాళ్ల అమ్మ లివర్ డొనేట్ చేసేందుకు మందుకు వచ్చారు. కానీ ఆమె బ్లడ్‌గ్రూప్ యోకు మ్యాచ్ కాలేదు. అనుమానం వచ్చిన యో కుటుంబం యో పుట్టిన ఆసుపత్రిలో ఎంక్వైరీ చేశారు. అక్కడ యో బయోలాజికల్ తల్లిదండ్రులు వీళ్లు కాదని తెలిసింది. ఆసుపత్రి చేసిన తప్పిదాన్ని కైఫెంగ్ ఇంటర్మీడియెట్ పీపుల్స్ కోర్టు ముందుంచారు. పిల్లలను మార్చినందుకుగాను ఆసుపత్రి కోటిరూపాయల నష్టపరిహారం చెల్లించమని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించింది. దీంతో యో కుటుంబానికి రూ.1,12,78,809 నష్టపరిహారంగా అందనుంది. అయితే యో అసలైన తల్లికి కూడా లివర్ క్యాన్సర్ ఉందట. అందువల్లే యోకూ కూడా వంశపారంపర్యంగా వచ్చిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆనోటా ఈనోటా ఈవిషయం తెలుసుకున్న నెటిజన్లు ఈ పరిహారం ఏం సరిపోతుంది? యో వైద్యానికి అయ్యే ఖర్చుమొత్తం ఆసుపత్రి చెల్లించాల్సిందని అభిప్రాయపడతున్నారు. -
కొడుకుకు మతిస్థిమితం లేదు.. అనారోగ్యంతో కూతురు
వరంగల్, ఆత్మకూరు : చేతికొచ్చిన కూతురు, కుమారుడు అనారోగ్యం బారినపడడంతో కన్నవారి ఆశలు అడియాశలయ్యాయి. జీర్ణకోశ, కాలేయ, మూత్రపిండాల వ్యాధితో కుమార్తె ఏడేళ్లుగా బాధపడుతోంది. దీనికితోడు రెండేళ్ల క్రితం కొడుకు మతిస్థిమితం కోల్పోయాడు. వారి దీనస్థితిని చూస్తు తల్లిదండ్రులు కన్నీరు కార్చని రోజు లేదు. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం కామారం గ్రామానికి చెందిన నర్మేటి సుధాకర్–కవిత దంపతులకు కుమార్తె దీప ఉంది. ఈమె వయసు ఇప్పుడు 20 ఏళ్లు, కుమారుడు రంజిత్ వయసు 21 ఏళ్లు. గీతకార్మికుడి వృత్తిపై సుధాకర్ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చాలీచాలని ఆదాయంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఏడేళ్ల క్రితం కూతురు దీప అనారోగ్యానికి గురైంది. వరంగల్‌తో పాటు హైదరాబాద్‌లో పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. రూ.10లక్షల వరకు అప్పుచేసి వైద్యం చేయించినా ఫలితం కానరాలేదు. జీర్ణకోశ, కాలేయ, మూత్రపిండాల వ్యాధులతో దీప మంచానికే పరిమితమైంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మెరుగైన వైద్యం చేయించలేక తల్లడిల్లిపోతున్న ఆ తల్లిదండ్రులకు కుమారుడు రంజిత్ అనారోగ్య పరిస్థితి పిడుగుపాటుగా పరిణమించింది. అతడు రెండేళ్లుగా మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తిస్తున్నాడు. ఎదిగిన పిల్లలు ఇలా అనారోగ్యంతో ఉండడంతో దిక్కుతోచక కన్నవారు కన్నీటిపర్యంతమవుతున్నారు. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్థిక సాయం చేయాలనుకున్న వారు మెరుగైన వైద్యం చేయించే శక్తిలేదు.. చేతికందిన బిడ్డ, కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో ఆస్పత్రులు తిరిగాము. హైదరాబాద్‌లో చూపిస్తే ఆపరేషన్లు చేయాలే అంటున్నారు. అందుకు డబ్బులు బాగా అయితాయని చెప్పారు. పూటగడవడానికే కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఖరీదైన వైద్యం చేయించలేక పోతున్నాం. 7569411059 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు. దయగలవారు ఆదుకుని తమ పిల్లలను కాపాడాలని చేతులెత్తి మొక్కుతున్నాము.– నర్మేటి కవిత–సుధాకర్ -
మధుమేహులూ... కాలేయం జాగ్రత్త!!
మధుమేహంతో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నది శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతున్న విషయమే. క్వీన్ మేరీ యూనివర్శిటీ, గ్లాస్గౌ యూనివర్శిటీలు ఈ జాబితాకు ఇంకో సమస్యను చేర్చారు. టైప్ –2 మధుమేహం ఉన్న వారిలో అత్యధికులు కాలేయ సంబంధిత లివర్ సైరోసిస్ లేదా కేన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఈ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు చెబుతున్నరు. యూరప్‌లోని దాదాపు కోటీ ఎనభై లక్షల మంది నుంచి వివరాలు సేకరించి విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త విలియం అలజవాయి తెలిపారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వందలో పాతిక మందికి వచ్చే వ్యాధే అయినప్పటికీ దీనికి టైప్ –2 మధుమేహానికి మధ్య దగ్గరి సంబంధం ఉందని... చాలా సందర్భాల్లో దీన్ని ఎవరూ గుర్తించరని ఆయన వివరించారు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యాధి కాస్తా ముదిరి కాలేయం దెబ్బతినేందుకు కారణమవుతుంది. సకాలంలో ఇలాంటి రోగులను గుర్తించగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మధుమేహం ఉన్న వారు మరింత జాగ్రత్తగా కాలేయ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని తమ అధ్యయనం చెబుతోందని ఆయన వివరించారు -
కాలేయ క్యాన్సర్... ఇకపై ప్రాణాంతకం కాబోదు!
కాలేయ క్యాన్సర్ వచ్చిందంటే చాలు... రోగికి ఇక రోజులు దగ్గరపడ్డాయనేది సాధారణంగా ప్రజల్లో ఒక అపోహ. కానీ... వ్యాధి ఉన్న భాగాన్ని తొలగించి, కాలేయ మార్పిడిలోలాగే ఆరోగ్యకరమైన భాగాన్ని ఉంచేస్తే అది మళ్లీ మామూలు సైజుకు పెరుగుతుంది. ఈ తరహా శస్త్రచికిత్సతో అనవసరంగా, నిరర్థకంగా పోతున్న ఎన్నో ప్రాణాలు నిలబడతాయంటున్నారు ప్రొఫెసర్ టామ్ చెరియన్. కానీ ఈ వైద్యం ఎందరికో అందడం లేదు. చాలామందికి ఈ శస్త్రచికిత్స గురించి తెలియనే తెలియదు. ఈ అవగాహనను ప్రజలందరికీ పంచి, అమూల్యమైన ప్రాణాలను కాపాడటం కోసమే ఈ ప్రత్యేక కథనం. కాలేయ క్యాన్సర్లతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కేవలం ఒక్క మనదేశంలోనే ప్రతీఏటా 1.50,000 నుంచి 2.10,000 మంది కాలేయ క్యాన్సర్లతో ప్రాణాలొదులుతున్నారు. కానీ కేవలం అవగాహన లోపంతోనే ఇన్ని ప్రాణాలు పోతున్నాయని, వీటిలో చాలా ప్రాణాలను రక్షించవచ్చునంటున్నారు ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్. ఎంపిక చేసిన 51 మంది రోగులపై నిర్వహించిన శస్త్రచికిత్సతో వారు కొత్త ఊపిరిపోసుకున్నారు. అంతేకాదు... వారిలో కేవలం 10% మందిలో మాత్రమే వ్యాధి మళ్లీ తిరగబెట్టింది. ఈ చికిత్స గనక చాలామందికి అందితే నిరర్ధకంగా పోతున్న ఎన్నో ప్రాణాలు నిలబడతాయంటున్నారాయన. కాలేయ (లివర్) క్యాన్సర్లలో హెపాటోసెల్యులార్ క్యాన్సర్లు మొదలుకొని కొలాంజియోకార్సినోమా వరకు అనేక రకాలున్నాయి. మిగతా క్యాన్సర్లతో పోలిస్తే కాలేయానికి సంబంధించిన క్యాన్సర్ వచ్చి అది అడ్వాన్స్డ్ దశకు చేరిందంటే దాన్ని తుదిమజిలీ (టెర్నినల్ ఇల్నెస్)గానే అందరూ అనుకుంటారు. ఇది చాలావరకు నిజమే అయినా మరీ అంతగానూ నిరాశపడాల్సిందేమీ లేదని భరోసా ఇస్తున్నారు ప్రొఫెసర్ డాక్టర్ టామ్చెరియన్. అధునాతనమైన ఇమేజింగ్ ప్రక్రియలు, సాంకేతికంగా సంక్లిష్టమైన, అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడిన శస్త్రచికిత్సతో అడ్వాన్స్డ్ దశగా పరిగణించే వ్యాధితో బాధపడుతున్న 51 మంది రోగుల ప్రాణాలు కాపాడగలిగారాయన. ఈ రోగుల ప్రత్యేకత ఏమిటి? శస్త్రచికిత్సకు ఎంపిక చేసిన ఈ రోగుల గ్రూపును ఒకసారి పరిశీలిస్తే కాలేయ క్యాన్సర్ రోగుల భవిష్యత్తు ఎంత ఆశాజనకంగా ఉందో తెలుస్తుంది. వీళ్లలో చాలామంది దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు (క్రానిక్ లివర్ డిసీజ్) లేదా సిర్రోసిస్‌తో బాధపడుతున్నవారు. మామూలుగానైతే వీరికి శస్త్రచికిత్స చేయడం అంటే అది సాధ్యం కాదనే భావన ఉంటుంది. ఇక వీరిలో ముగ్గురు నలుగురు 70 ఏళ్లకు పైబడ్డవారు. ఆ వయసులో సిర్రోసిస్ వచ్చిన వారికి శస్త్రచికిత్స చేస్తే వారు తట్టుకోలేరనేది మరొక అపోహ. చాలా పెద్ద పెద్ద సెంటర్లలో సైతం వారికి ఆపరేషన్ సాధ్యం కాదంటూ పెద్ద పెద్ద డాక్టర్లూ తేల్చేశారు. అంటే వాళ్లంతా ఏదో నిర్లక్ష్యంతో ఆ మాట అన్నారని చెప్పలేం. ఎందుకంటే ఈ రంగంలో వచ్చిన అధునాతన ఇమేజింగ్ ప్రక్రియలు, ఆపరేషన్ తాలూకు సునిశితత్వాల గురించి వారికీ తెలియకపోవడమే ఇందుకు కారణం. ఇలాంటి గ్రూపులో అందరికీ శస్త్రచికిత్స అయ్యాక కనీసం 2% నుంచి 3% కేసుల్లోనైనా మరణం సంభవించడం సాధారణంగా జరుగుతుంది. అయితే అదృష్టవశాత్తూ అందరి శస్త్రచికిత్సలూ విజయవంతమయ్యాయి. అందరూ జీవిస్తూ ఉన్నారు. మంచి ప్రమాణాలతో కూడిన ఉన్నతస్థాయి శస్త్రచికిత్స టెక్నిక్, ఆపరేషన్ అయ్యాక తీసుకున్న జాగ్రత్తలు (పోస్ట్ ఆపరేటివ్ కేర్) లాంటి ఎన్నో అంశాలు ఈ గ్రూపుపై నిర్వహించిన శస్త్రచికిత్సలు విజయవంతమయ్యేందుకు తోడ్పడ్డాయి. వీరిలో కొందరైతే కేవలం 10 రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యారు. వారు తమ తమ రోజువారీ పనులు చేసుకుంటున్నారు. సాధారణంగా పరిశోధనాత్మకంగా ఇలా కొత్త శస్త్రచికిత్స ప్రక్రియలను లండన్, న్యూయార్క్ వంటి చోట్ల నిర్వహిస్తుంటారని వింటుంటాం. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే జరిగింది. ఇక ఈ శస్త్రచికిత్సలోని సాంకేతికత పురోగతిని, నైపుణ్యాలను ఎందరో డాక్టర్లకు అందేలా చేసి, ఎన్నో ప్రాణాలు నిరర్థకంగా పోకుండా కాపాడటమే ఇప్పటికి మన ముందున్న సవాలు. ఎలా ఉపయోగపడుతుందీ శస్త్రచికిత్స? కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలో కొంత కాలేయభాగాన్ని మాత్రమే అమర్చితే... అది మళ్లీ పూర్తి కాలేయంగా రూపొందుతున్నదన్న విషయం తెలిసిందే. సరిగ్గా ఇదే తరహా విధానాన్ని కాలేయంలోని క్యాన్సర్ తొలగింపునకూ వర్తింపజేశారు డాక్టర్ టామ్ చెరియన్. తాను ఎంపిక చేసుకున్న 50 మంది రోగులకు ఈ తరహా శస్త్రచికిత్సలు నిర్వహించారు. వీరిలో అందరూ కాలేయ క్యాన్సర్‌నుంచి విముక్తులయ్యారు. ఒక్కటంటే ఒక్క మరణమూ సంభవించలేదు. అయితే ఒక్కమాట. కాలేయ క్యాన్సర్లతో బాధపడుతున్న లక్షలాది రోగులతో పోలిస్తే బతికి బయటపడ్డవారి సంఖ్య చాలా చాలా చిన్నది. కానీ ఇదే భవిష్యత్తుకు ఆశారేఖ అయ్యింది. కాలేయ క్యాన్సర్ అంటే మరణమే అనే జనంలోని ఒక అపోహను తుడిచిపెట్టే సందర్భం వచ్చింది. ఇదే పద్ధతిని అనుస రిస్తే అనవసరంగా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి. ఇప్పటికి ఇదే మంచి శుభవార్త. శస్త్రచికిత్సే ఎందుకు? కాలేయ గడ్డలు (ట్యూమర్స్) చాలామటుకు కీమోకు గానీ, రేడియోథెరపీకి గానీ ఒకపట్టాన లొంగవు. కాబట్టి ఆ ప్రక్రియలతో వ్యాధి నయం చేయడం సాధ్యం కాదు. ఇక శస్త్రచికిత్స అయితే వాటిని తొలగించడానికి సాధ్యమవుతుంది. అయితే ఇంతగా సంక్లిష్టమైన ఈ శస్త్రచికిత్స నిర్వహించగలిగే నైపుణ్యం ఉన్న శస్త్రచికిత్సకులు పెద్దగా లేకపోవడంతో పాటు, దీని గురించి ప్రజల్లో అవగాహన లేమి, కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అనంతర దుష్పరిణామాలతో నివారించడానికి సాధ్యమయ్యే ఎన్నో మరణాలు అనవసరంగా చోటుచేసుకుంటున్నాయి. ప్రొఫెసర్ టామ్ చెరియన్, నేషనల్ డైరెక్టర్, హెచ్‌పీబీ సర్జరీ అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, కేర్ హాస్పిటల్స్ గ్రూప్ అండ్ ప్రొఫెసర్ అండ్ సర్జన్, నిమ్స్, హైదరాబాద్ -
విటమిన్ – డి తో కేన్సర్ ముప్పు తక్కువ...
శరీరంలో విటమిన్ – డి ఎక్కువగా ఉండేలా చూసుకుంటే కాలేయ కేన్సర్‌తోపాటు పలు ఇతర కేన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని జపాన్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. సూర్యరశ్మి ఆసరాతో శరీరంలో తయారయ్యే విటమిన్ – డి... క్యాల్షియం మోతాదులను నియంత్రించడం ద్వారా ఎముకలు, పళ్లను దృఢంగా ఉంచుతుందని ఇప్పటికే పలు పరిశోధనలు రుజువు చేశాయి. కేన్సర్ల విషయంలోనూ ఇది మేలు చేస్తుందని గతంలోనే కొన్ని వాదనలు ఉన్నప్పటికీ కచ్చితమైన రుజువులు లేకపోవడం వల్ల విస్తృత ప్రచారంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన పబ్లిక్ హెల్త్ సెంటర్ శాస్త్రవేత్తలు దాదాపు 33 వేల మందిపై అధ్యయనం చేశారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, రక్తంలో విటమిన్ – డి∙మోతాదులను నమోదు చేసుకున్న తరువాత వీరిపై దీర్ఘకాల పరిశోధనలు మొదలుపెట్టారు. ఋతువులకు అనుగుణంగా విటమిన్ – డి మోతాదులో వచ్చే మార్పులనూ పరిగణలోకి తీసుకున్న శాస్త్రవేత్తలు దాదాపు 16 ఏళ్లపాటు పరిశీలనలు కొనసాగించారు. ఈ కాలంలో వీరిలో దాదాపు 3301 మందికి కేన్సర్ సోకింది. వయసు, వ్యాయామం చేసే అలవాటు, ధూమపానం, మద్యపానం వంటి అన్ని ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషించినప్పుడు సాధారణ స్థాయి కంటే ఎక్కువ విటమిన్ – డి ఉన్న వారికి కేన్సర్ సోకే అవకాశాలు 20 శాతం తక్కువగా ఉన్నట్లు తెలిసింది. కాలేయ కేన్సర్ విషయంలో ఇది 30 – 50 శాతం వరకూ ఉన్నట్లు తెలిసింది. ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ కేన్సర్ల విషయంలో ప్రభావం పెద్దగా లేదు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ అంశాన్ని రూఢి చేసుకుంటే విటమిన్ –డి ని కేన్సర్ నిరోధక కార్యక్రమాల్లో వాడుకోవచ్చునని భావిస్తున్నారు. -
హృదయాల్ని పిండేస్తున్న పాట.. వైరల్ వీడియో
వాషింగ్టన్ : సాధారణంగా ఆస్పత్రులలో పేషెంట్లకు వైద్య సిబ్బంది ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు, ఇతరత్రా మెడిసిన ఇచ్చి వారి అనారోగ్యాన్ని దూరం చేసేందుకు చూస్తారు. అయితే అమెరికాలోని కూక్ విల్లేలో పేషెంట్ విషయంలో నర్స్ చూపిన ప్రేమ, ఆత్మీయతతో ఆమె అందరి మనసుల్ని ద్రవింపచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ తల్లి చివరిక్షణాలు ఎంతో హాయిగా గడిచేలా చూసిన నర్స్ కు అందంతో పాటు అందమైన మనసు ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మార్గరెట్ స్మిత్ అనే పెద్దావిడ గత కొంతకాలం నుంచి కాలేయ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. గతవారం మార్గరెట్ తీవ్ర అస్వస్థతకు లోనవడంతో ఆమెను కుటుంబసభ్యులు వండర్ బిల్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించారు. అయితే రెండు రోజుల్లోనే ఆమె చనిపోయింది. కానీ ఆస్పత్రిలో తన తల్లిని కన్నకూతురి కంటే ఎక్కువగా ఓ నర్స్ ఓలివియా న్యూఫెల్డర్ చూసుకున్నారని మేగన్ స్మిత్ ఓ వీడియోతో పాటు సందేశాన్ని ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. తన సపర్యలు చేసిన నర్స్ ఓలివియాను ముద్దుగా ఏంజెల్ అని పెద్దావిడ మార్గరెట్ పిలుచుకునేవారు. కొన్ని గంటల్లోనే తాను చనిపోతానని భావించిన మార్గరెట్.. తన ఏంజెల్‌ను ఫెవరెట్ సాంగ్ పాడమని అడిగారు. 'డ్యాన్సింగ్ ఇన్ ద స్కై' అనే పాటను నర్స్ పాడుతుండగా పేషెంట్ మార్గరెట్ స్వరం కలిపారు. ఆ సమయంలో మరో నర్స్ పెద్దావిడకు ఇంజెక్షన్ ఇస్తున్నా.. ఆ బాధమీ లేదన్నట్లుగా తన తల్లి పాట పాడుతూ చివరి క్షణాలను ఆస్వాదించారని ఆ పోస్ట్‌లో మేగన్ పేర్కొన్నారు. పెద్దావిడ కోసం 'ఎంజెల్' నర్స్ పాట పాడుతూ కన్నీళ్లు కార్చడం వీక్షకుల మనసులను ద్రవింపచేస్తుంది. ఏం ఇచ్చినా ఆ నర్స్ తన తల్లిపై చూపిన ప్రేమకు సరితూగదని మేగన్ అభిప్రాయపడ్డారు. -
హృదయాల్ని పిండేస్తున్న పాట.. వైరల్ వీడియో
-
కాలేయం ఖల్లాస్
జూలై 28 వరల్డ్ హెపటైటిస్ డే హెపటైటిస్... ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో ఇదొకటి. హెపటైటిస్‌లో ఎ, బి, సి, డి, ఇ, జి అనే రకాలు ఉన్నాయి. హెపటైటిస్-బి, హెపటైటిస్-సితో బాధపడుతున్న వారి సంఖ్య అత్యధికంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక హెపటైటిస్-బి, హెపటైటిస్-సితో దాదాపు 50 కోట్ల మంది బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మరణాలకు దారితీస్తున్న వ్యాధుల్లో హెపటైటిస్ ఎనిమిదో స్థానంలో ఉంది. హెపటైటిస్-బి, హెపటైటిస్-సి ముదిరిపోతే లివర్ సిర్రోసిస్, లివర్ కేన్సర్ వంటి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయి. సకాలంలో నియంత్రించకుంటే హెపటైటిస్ మొత్తం కాలేయాన్నే ఖల్లాస్ చేసేస్తుంది. హెపటైటిస్ ఏ రకానికి చెందినదైనా, ఇది కాలేయానికి సోకే ఇన్ఫెక్షన్ వల్ల తలెత్తే వ్యాధి. సకాలంలో గుర్తించి, తగిన చికిత్స తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. హెపటైటిస్‌తో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారిలో చాలావరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇది ముదిరితే పచ్చకామెర్లు, ఆకలి తగ్గుదల, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా సందర్భాల్లో వైరస్ వల్ల హెపటైటిస్ తలెత్తుతుంది. అరుదుగా కొన్ని సందర్భాల్లో పారాసెటిమాల్ వంటి నొప్పి నివారణ మందులు, పారిశ్రామిక వ్యర్థాలు, మొక్కలకు చెందిన విష పదార్థాలు, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా హెపటైటిస్‌కు దారితీసే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా హెపటైటిస్ కొనసాగితే, కాలేయం మొద్దుబారడం, బిరుసెక్కడం వంటి దుష్పరిణామాలు తలెత్తుతాయి. చివరకు లివర్ సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక పరిస్థితులూ వాటిల్లుతాయి. సాధారణంగా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల హెపటైటిస్ సోకుతుంది. అయితే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల, పరాన్న జీవుల వల్ల, మితిమీరిన మద్యం అలవాటు వల్ల కూడా హెపటైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మద్యం అలవాటు లేకపోయినా, కొందరిలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (ఎన్ఏఎఫ్ఎల్) వల్ల కూడా హెపటైటిస్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. అరుదుగా కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల, కాలేయానికి గాయం కావడం వల్ల కూడా హెపటైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా గుర్తించాలి చాలా సందర్భాల్లో హెపటైటిస్ సోకినా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అందువల్ల ఎప్పటికప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా మాత్రమే ఈ వ్యాధిని గుర్తించడం సాధ్యమవుతుంది. రక్త పరీక్ష, అల్ట్రాసౌండ్, సీటీ స్కానింగ్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా, లివర్ బయాప్సీ ద్వారా హెపటైటిస్‌ను గుర్తిస్తారు. పరిశుభ్రత పాటించడం, కలుషితమైన నీటికి, ఆహారానికి దూరంగా ఉండటం ద్వారా చాలా వరకు హెపటైటిస్ బారిన పడకుండా ఉండవచ్చు. హెపటైటిస్-సి, హెపటైటిస్-ఇ మినహా మిగిలిన రకాల హెపటైటిస్‌కు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నందున ముందుగానే వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా చాలా వరకు రక్షణ పొందవచ్చు. వ్యాధి ఉన్నట్లు పరీక్షల్లో తేలితే వెంటనే తగిన చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని నయం చేసుకోవచ్చు. ఆర్థికభారం అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను హెపటైటిస్ వ్యాధి ఆర్థిక వ్యవస్థపై పెను భారం మోపుతోంది. పనిచేసే వయసులో ఉన్న వ్యక్తికి హెపటైటిస్ సోకితే కనీసం 27 పనిదినాలు నష్టపోవాల్సి వస్తుంది. చాలా దేశాల్లో హెపటైటిస్ చికిత్స కారణంగా ఎదురవుతున్న ఆర్థికభారంపై కచ్చితమైన అంచనాలేవీ లేవు. అయితే, అమెరికా ఆర్థికరంగంపై హెపటైటిస్ కారణంగా ఏటా 650 కోట్ల డాలర్ల (రూ.43,595 కోట్లు) భారం పడుతున్నట్లు అంచనా. అమెరికా వంటి అగ్రరాజ్యాలతో పోల్చుకుంటే, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే హెపటైటిస్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్రపంచానికి పెనుసవాళ్లలో ఒకటిగా నిలుస్తున్న హెపటైటిస్పై అవగాహన కల్పించేందుకు 2010లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) జూలై 28వ తేదీని వరల్డ్ హెపటైటిస్ డేగా ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ‘హెపటైటిస్‌ను నివారించండి: అది మీ చేతుల్లోనే ఉంది’ నినాదంతో ప్రచారం చేపడుతోంది. నివారణ జాగ్రత్తలు * వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మరుగుదొడ్లను క్రిములకు దూరంగా ఉంచుకోవాలి. * ఒకరి టూత్‌బ్రష్‌లు, రేజర్లు మరొకరు వాడకుండా ఉండాలి. ఆస్పత్రులలో డిస్సోజబుల్ సిరంజీలు, సూదులు వాడాలి. * రక్తమార్పిడి చేసే ముందు రక్తాన్ని క్షుణ్ణంగా పరీక్షించి, వ్యాధులేవీ లేవని నిర్ధారించుకోవాలి. * వ్యాధి సోకిన వారితో లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి. * కలుషితమైన ఆహారానికి, నీటికి దూరంగా ఉండాలి. హెపటైటిస్ వాస్తవాలు * హెపటైటిస్-బి, హెపటైటిస్-సి మాత్రమే లివర్ కేన్సర్‌కు దారితీస్తాయి. హెపటైటిస్-ఎ వల్ల లివర్ కేన్సర్ సోకే అవకాశం లేదు. * రోగనిరోధక శక్తి బలంగా ఉన్నవారికి హెపటైటిస్-ఎ ఒకవేళ సోకినా, ఎలాంటి చికిత్స తీసుకోకపోయినా దానంతట అదే నయమైపోతుంది. * కలుషితమైన నీరు, ఆహారం వల్ల హెపటైటిస్-ఎ సోకుతుంది. * రక్తం, ఇతర శరీర స్రావాలు, మ్యూకస్ ద్వారా, లైంగిక సంబంధాల ద్వారా హెపటైటిస్-బి సోకుతుంది. * హెపటైటిస్-బి సోకినవారిలో 90 శాతానికి పైగా చిన్నారులే. ఈ వైరస్ సోకిన తల్లుల నుంచి వారికి ఈ వ్యాధి సంక్రమిస్తోంది. లైంగిక సంబంధాల ద్వారా హెపటైటిస్-బి సోకే అవకాశాలు ఉన్నా, అవి చాలా అరుదు. * గర్భిణిగా ఉన్నప్పుడు హెపటైటిస్ సోకితే, గుర్తించిన తర్వాత వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే, పుట్టే పిల్లలకు వ్యాధి సోకకుండా కాపాడుకోవచ్చు. * హెపటైటిస్-బి సోకిన వారిలో 25 శాతం మందికి మాత్రమే సిర్రోసిస్ లేదా కేన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగిలిన వారు చికిత్స తర్వాత సాధారణ జీవితం గడిపే అవకాశాలు ఉంటాయి. * హెపా-బి వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే లివర్ కేన్సర్ సోకకుండా బయటపడవచ్చు. * హెచ్ఐవీ సోకిన వారికి హెపటైటిస్-సి సోకే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. * ఒకరికి వాడిన సూదులు, రేజర్లు మరొకరికి వాడటం, రక్తమార్పిడి వంటి కారణాల ద్వారా కూడా హెపటైటిస్-సి సోకుతుంది. -
14 ఏళ్ల బాలునికి అరుదైన చికిత్స
♦ ‘మేజర్ హెపటెక్టమీ’తో బాధపడుతున్న బాలుడు ♦ క్యాన్సర్ సోకిన 80 శాతం కాలేయం తొలగింపు ♦ కోలుకున్న బాధితుడు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ సాక్షి, సిటీబ్యూరో: నిమ్స్ వైద్యులు మరో అరుదైన చికిత్స చేశారు. కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న ఓ బాలునికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. బాధితుడు కోలుకోవడంతో శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన చౌదరి(14) కొంత కాలంగా మేజర్ హెపటెక్టమీ (కాలేయ క్యాన్సర్)తో బాధపడుతున్నాడు. చికిత కోసం అనేక మంది వైద్యులను ఆశ్రయించాడు. దీంతో వారు నిమ్స్‌లోని సర్జికల్ క్యాన్సర్ విభాగం అధిపతి డాక్టర్ సూర్యనారాయణరాజును సంప్రదించగా, ఆయన ఈ నెల 5న బాధితుడికి ఆపరేషన్ నిర్వహించి క్యాన్సర్ సోకిన 80 శాతం కాలేయాన్ని తొలగించారు. అతడిని ఐసీసీయూలో ఉంచి చికిత్స అందించారు. మెడికల్ సపోర్టుతో ఊపిరితిత్తులు, మూత్ర పిండాల పని తీరును మెరుగుపరి చారు. చిన్న పిల్లల్లో చాలా అరుదుగా కాలేయ క్యాన్సర్లు వెలుగు చూస్తాయని, అరుదైన ఈ మేజర్ హెపటెక్టమీతో బాధపడే వారికి చిన్న వయసులోనే ఇలాంటి చికిత్స చేయడం చాలా రిస్కుతో కూడినదని డాక్టర్సూర్యనారాయణరాజు తెలిపారు. రూ. 10 లక్షలకు పైగా ఖర్చయ్యే ఈ ఆపరేషన్‌ను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అతను కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామన్నారు. -
మద్యపానంతో కేన్సర్
మెల్బోర్న్ : మద్యం సేవించేవారికి కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. కేన్సర్ కారకాలపై ఒటాగో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. న్యూజిలాండ్‌లో 2012లో కేన్సర్‌తో 236 మంది మరణించారు.. మద్యం సేవించే అలవాటు ఉన్నవారు పేగు, రొమ్ము, నోరు, గొంతు, అన్నవాహిక, స్వరపేటిక, కాలేయ కేన్సర్ల బారిన పడినట్లు అధ్యయనంలో తేలింది. అక్కడి మహిళల మరణాలు దాదాపు 60 శాతం రొమ్ము కేన్సర్ వల్లే సంభవిస్తున్నాయనిశాస్త్రవేత్తలు తెలిపారు. రొమ్ము కేన్సర్‌తో 2007 సంవత్సరంలో చనిపోయినవారిలో 71 మందికి మద్య పానం అలవాటు ఉందని, 2012లో చనిపోయిన వారిలో 65 మంది మద్యం సేవించే అలవాటు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. -
మాకెందుకీ శాపం..!
అనారోగ్యంతో మంచానపడిన భార్యాభర్తలు ఒకరికి లివర్ కేన్సర్.. మరొకరికి హార్ట్ సర్జరీ మందులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న దంపతులు {పైవేట్ టీచర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న పెద్ద కూతురు మానవతావాదులు ఆదుకోవాలని వేడుకోలు పోచమ్మమైదాన్ : వరంగల్ నగరంలోని 11వ డివిజన్ క్రిస్టియన్ కాలనీకి చెందిన మేకల నర్సయ్య, నిర్మల దంపతులకు ఇద్దరు కూతు ళ్లు అరుణ, అపర్ణ, కుమారుడు చందు ఉన్నారు. అరుుతే నర్సయ్య స్థానిక చక్కర్ బీడీ ఖార్కానాలో కొన్నేళ్ల నుంచి ప్యాకింగ్ పనులు చేస్తూ భార్య, పిల్లలను పోషించుకుంటున్నారు. కాగా, నర్సయ్య కొన్ని నెలల నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల నొప్పి ఎక్కువగా రావడంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆయనను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లి హార్ట్ సర్జరీ చేరుుంచారు. అరుుతే గుండెకు ఆపరేషన్ జరగడంతో నర్సయ్య రోజువారీ పనులకు వెళ్లకుండా మంచానికే పరిమితమయ్యారు. భార్యకు లివర్ కేన్సర్.. కొద్ది రోజుల క్రితం నర్సయ్య హార్ట్ సర్జరీ చేయించుకుని ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు సపర్యలు చేస్తుండడంతోపాటు భార్య నిర్మల స్థానికంగా ఉన్న కేక్‌ల ఫ్యాక్టరీలో రోజువారీ కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది. అరుుతే పనులకు వెళ్లిన సమయంలో నిర్మలకు ఒకసారి కడుపులో తీవ్రంగా నొప్పి వచ్చింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఆమెను వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు నిర్మల లివర్ కేన్సర్‌తో బాధపడుతున్నట్లు చెప్పారు. దీంతో నిర్మల సొంత ఖర్చులతో హైదరాబాద్‌లోని జీఎన్ఎమ్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంది. అరుుతే వారానికి మూడు రోజులు హైదరాబాద్‌కు వచ్చి చికిత్స పొందాలని, ప్రతి నెల రూ. 10వేలు విలువ చేసే మందులు వేసుకుంటేనే ఆరోగ్యం కొంతవరకు కుదుటపడుతుందని డాక్టర్లు చెప్పడంతో భార్యాభర్తలు బోరున విలపిస్తున్నారు. కూలీనాలి చేసుకుని కుటుం బాన్ని పోషించుకుంటున్న ఆ దంపతులపై రోగాల పిడుగు పడింది. మాయదారి జబ్బులతో వారు మంచానికే పరిమితమై బోరున విలపిస్తున్నారు. అరుుతే అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మానాన్నను కాపాడుకునేందుకు వారి పిల్లలు పడరాని పాట్లు పడుతున్నారు. మానవతావాదులు స్పందించి తమ తల్లిదండ్రుల ను ఆదుకోవాలని చేతులెత్తి వేడుకుం టున్నారు. హృద్రోగం, లివర్ కేన్సర్ తో తల్లడిల్లుతున్న నిరుపేద దంపతులపై ప్రత్యేక కథనం. మందులకు డబ్బులు లేక ఇబ్బందులు.. నర్సయ్య పెద్ద కూతురు అరుణ పీజీ పూర్తి చేసి స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. అరుుతే ఆమెకు నెలకు రూ. 2,500 వేతనం వస్తుండడంతోపాటు నర్సయ్యకు వృద్ధాప్య పిం ఛన్ కింద నెలకు రూ. 1000 వస్తుంది. దీంతో వచ్చిన డబ్బులతో అరుణ ఇంటి అవసరాలను తీర్చుతుం దే కానీ.. తల్లిదండ్రులకు మందులు కొనుగోలు చేయలేకపోతుంది. కాగా, నర్సయ్య కూతుర్లు, కొడుకు రోజు ఒక పూటనే భోజనం చేస్తూ రెండు రోజులకోసారి వారికి మందులు కొనుగోలు చేసి ఇస్తున్నారు. ఇదిలా ఉండగా, అనారోగ్యంతో బాధపడుతున్న నర్సయ్య దంపతుల పరిస్థితిని చూసిన స్థానికులు సుమారు 20 మంది ఇటీవల ఇంటికి రూ.100 చొప్పున వసూలు చేసి వారికి అందజేశారు. కాగా, అరు ణ రోజు మందులు వేసుకునే పరిస్థితి లేకపోవడంతో లివర్ సైజు పెరుగుతూ కడుపు ఉబ్బుతోంది. దీం తో తల్లిదండ్రుల అనార్యోగాన్ని చూడలేక పిల్లలు నిత్యం గుండెలవిసేలా రోదిస్తున్నారు. దాతలు ఆదుకోవాలి.. అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మానాన్నకు మందులు కొనుగోలు చేసి ఇచ్చేందుకు మా దగ్గర డబ్బులు లేవు. లివర్ కేన్సర్‌తో అమ్మ పొట్ట సైజు రోజురోజుకూ పెరుగుతోంది. గుండెకు ఆపరేషన్ జరగడంతో నాన్న ఏపనిచేసే పరిస్థితిలో లేడు. దాతలు సాయం అందించి అమ్మానాన్నకు మెరుగైన వైద్యం అందించాలి. సాయం చేసే మానవతావాదులు సెల్ నంబర్ 95738-25964లో సంప్రదించాలి. -అరుణ, అపర్ణ, చందు -
'ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ వ్యాధి’
హైదరాబాద్: ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రాణాంతకమైన ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ హెపటాలజిస్ట్ డాక్టర్ నవీన్ పోలవరపు చెప్పారు. ఆదివారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి అనేది కొవ్వు అధికంగా ఉండటం వల్ల సంభవించే వ్యాధి అని... దీనిని ఫ్యాటీ లివర్ వ్యాధి అని కూడా అంటారని తెలిపారు. కాలేయంలో అధికంగా కొవ్వు నిలువలు ఉండటం చేత ఈ వ్యాధి వస్తుందన్నారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని ప్రాధమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని చెప్పారు. -
కాలేయ క్యాన్సర్‌ను తప్పించే కాఫీ!
కాఫీ కవర్స్ ద లివర్ మితిమీరి మద్యం తాగేవారికి కాలేయ క్యాన్సర్ రిస్క్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కాఫీ దీన్ని సమర్థంగా నివారిస్తుందని పేర్కొంటోంది ఇంగ్లాండ్‌కు చెందిన ‘వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్’ అనే సంస్థ. ప్రపంచవ్యాప్తంగా దాదాపు కాలేయ క్యాన్సర్ రిస్క్ ఉన్న 82 లక్షల మంది వ్యక్తులతో పాటు దాదాపు 24,500 మంది కాలేయ క్యాన్సర్ రోగులపై నిర్వహించిన 34 వేర్వేరు అధ్యయనాల్లో కాఫీ కాలేయ క్యాన్సర్‌ను సమర్థంగా తగ్గిస్తుందని తేలింది. క్యాన్సర్ రిస్క్ ఉన్నవారిని ఎంచుకొని వారికి రోజుకు పరిమితంగా ఒకటి లేదా రెండు చిన్న కప్పుల కాఫీ చాలాకాలం పాటు ఇస్తూపోయారు. కొంతకాలం తర్వాత 82 లక్షల మందిని పరీక్షించగా అందులో కేవలం 14 శాతం మందికి మాత్రమే కాలేయ క్యాన్సర్ సోకిందని, మిగతావారిలో కాఫీ కాలేయ క్యాన్సర్‌ను నివారించేందుకు తోడ్పడిందని వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ సంస్థ పేర్కొంది. -
కాలేయ కేన్సర్ తెలుగు రాష్ట్రాల్లో అధికం
* ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు * జీవన శైలి, ఆహారపు అలవాట్లు మారాలి * పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ వినియోగం తగ్గాలి * గర్భాశయ కేన్సర్‌తో పోటీపడుతున్న రొమ్ము కేన్సర్ * క్షేత్రస్థాయిలో ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించాలి * అమెరికాలోకంటే భారత్‌లోనే మందులు చౌక * ‘విస్టా ఇమేజింగ్ సెంటర్’లో ఎంఆర్ ఎలాస్ట్రోగ్రఫీ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఇతర దేశాలతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాలేయ కేన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు. ఇక్కడ హెపటైటిస్ బీ, సీ కారక వైరస్ ఎక్కువగా ఉండటం, అధికంగా ఆల్కహాల్‌ను వినియోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. బాధితుల్లో చాలా మంది వ్యాధి ముదిరిన తర్వాత వైద్యులను ఆశ్రయించడం వల్ల ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. జీవనశైలితోపాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల కాలేయ కేన్సర్ రాకుండా జాగ్రత్తపడవచ్చని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ‘విస్టా ఇమేజింగ్ మెడికల్ సెంటర్’లో కొత్తగా ఏర్పాటు చేసిన అధునాతన ‘ఎంఆర్ ఎలాస్ట్రోగ్రఫీ’ యంత్ర పరికరాన్ని ఆదివారం నోరి దత్తాత్రేయుడు ఆవిష్కరించారు. విస్టా ఇమేజింగ్ సెంటర్ సీఈవో గోపీకృష్ణ, డెరైక్టర్ డాక్టర్ వైఎస్ అరుణ్‌కుమార్‌రెడ్డి, చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ విజయ్‌భాస్కర్ నోరి, పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ డాక్టర్ పరిణితతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేన్సర్‌పై అనేక పరిశోధనలు జరుగుతున్నాయని, ఏటా కొత్తగా అనేక రకాల మందులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల కేన్సర్‌కు కారణమవుతున్న కణాలను చంపే ‘టోర్సివా’ మాత్ర అందుబాటులోకి వచ్చిందన్నారు. అయితే అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే కేన్సర్ మందుల ధరలు భారత్‌లోనే తక్కువగా ఉన్నట్లు నోరి తెలిపారు. అయితే దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ ధరలు ఇంకా తగ్గాల్సిన అవసరముందన్నారు. నోరు, గొంతు, ఊపిరితిత్తుల కేన్సర్‌కు పొగాకు ఉత్పత్తుల వినియోగమే ప్రధాన కారణమని, గుట్కా, సిగరెట్, బీడీ వంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమమని తెలిపారు. బీపీ, షుగర్‌లాగే కేన్సర్.. బీపీ, షుగర్‌లాగే కేన్సర్ కూడా సర్వసాధారణమైనదని నోరి వివరించారు. ‘‘దేశంలో ఏటా 13 నుంచి 15 లక్షల మంది కేన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఒకప్పుడు కేన్సర్ వస్తే చావు తప్పదని భావించేవారు. నేడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేన్సర్ రాకుండా ఉండేందుకు ముందస్తు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు మందులతో బీపీ, షుగర్ మాదిరే కేన్సర్‌ను కూడా నియంత్రించి, జీవి తకాలాన్ని పెంచుకునే అవకాశముంది. అమెరికాలో ఇప్పటికే ఈ తరహా వైద్యసేవలు ఉన్నాయి. త్వరలో భారత్‌లోనూ అందుబాటులోకి వస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు. దేశం లో ఇప్పటివరకు గర్భాశయ ముఖద్వారా కేన్సర్లే ఎక్కువగా నమోదయ్యేవని, కానీ ఇప్పుడు రొమ్ము కేన్సర్ కేసులు సర్వసాధారణంగా మారిపోయాయని నోరి దత్తాత్రేయుడు తెలిపారు. ‘‘దేశంలో నిత్యం 200 మంది మహిళలు రొమ్ము కేన్సర్‌తో చనిపోతున్నారు. 50 ఏళ్లు దాటిన ప్రతి మహిళ విధిగా ‘మమ్మోగ్రామ్’ పరీక్షలు చేయించుకోవాలి. గర్భాశయ కేన్సర్ సోకకుండా ఉండేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కేన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే నయం చేయడం చాలా సులువు. క్షేత్రస్థాయిలోని మహిళలకు ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించడం ఒక్కటే దీనికి పరిష్కారం’’ అని నోరి సూచించారు. ఇంట్లో ఒక్కరు కేన్సర్ బారినపడినా ఆ ప్రభావం మొత్తం కుటుం బంపై పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ కేన్సర్ విభాగాలను అభివృద్ధి పరి చి వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాలకు సూచించారు. -
హృదయాన్ని మెలిపెట్టే ప్రేమ గాథ
వివాహం ఓ వ్యక్తి జీవితంలో మరపురాని, మధురమైన రోజు. ఇద్దరు వ్యక్తులు ప్రేమతో కలకాలం జీవించేందుకు తోడ్పడే బంధం. మరణించే వరకూ తోడూ.. నీడగా ఉంటానని భరోసా కల్పించే అనుబంధం. ఫిలిప్పైన్స్కు చెందిన రౌడెన్ గో కూడా ఇదే కోరుకున్నాడు.. తన జీవితంలోనూ పెళ్లి రోజు మరచిపోలేనిది కావాలనుకున్నాడు.. ఎందుకంటే అతని ఆఖరి కోరిక కూడా ఇదే మరి. రౌడెన్ గో.. అతని భాగస్వామి లెజైల్ మే.. రెండేళ్ల కుమార్తె జాకియా రౌజెల్.. వీరిది ఓ అందమైన కుటుంబం. రౌడెన్ 30వ పుట్టిన రోజైన జూలై 8న పెళ్లిచేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకుంది. మనిషి ఓవిధంగా తలిస్తే.. విధి మరోవిధంగా నడిపిస్తుంది. రౌడెన్ ఆశలను తుంచేసే చేదునిజం ఒకటి కొద్ది రోజుల క్రితమే తెలిసింది. అతనికి లివర్ కేన్సర్. అది కూడా స్టేజ్ 4. దీంతో రౌడెన్ ఆస్పత్రికే పరిమితమైపోయాడు. అయితే విధి రాతతో పోరాడేందుకు నిర్ణయించుకున్న రౌడెన్గో స్నేహితులు.. కుటుంబ సభ్యులు ఒక్కటై.. అతని ఆఖరి కోరిక తీర్చేందుకు నడుంబిగించారు. తన ప్రేమ చిహ్నమైన లెజైల్తో రౌడెన్ పెళ్లిని గ్రాండ్‌గా చేయాలని నిర్ణయించారు. అయితే ఆస్పత్రిలో ఉన్న రౌడెన్ను బయటకు తీసుకొచ్చే దారి లేదు. దీంతో చర్చినే అతని దగ్గరకు తీసుకొచ్చారు. 12 గంటల పాటు కష్టపడి వీరి పెళ్లికి అన్ని ఏర్పాట్లూ చేసి అతని కలను నిజం చేశారు. వీరి పెళ్లి వేడుక సంప్రదాయబద్ధంగా పూర్తయ్యింది. జీవితాంతం నీకు తోడు-నీడగా ఉంటానని రౌడెన్ లెజైల్కు బాస చేస్తూ.. ఆమె చేతిని అందుకున్నాడు. అయితే అతని బాస పది గంటల సేపు మాత్రమే నిలిచింది. పెళ్లైన పది గంటలకే రౌడెన్ తుది శ్వాస విడవటం అందరినీ విషాదంలో నింపేసింది. హృదయాన్ని మెలిపెట్లే రౌడెన్-లెజైల్ల గాథ ఇప్పుడు యూట్యూబ్‌లో ఓ సెన్సేషన్. వీరి వీడియోను చూస్తూ.. తమ ప్రేమ సంగతులు నెమరువేసుకుంటున్నారు లక్షలాది మంది. జూన్ 18న అప్లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 40 లక్షలమంది చూసేశారు. -
విధిరాత
-
ప్రాణభిక్ష పెట్టరూ..
క్యాన్సర్ బారిన కొడుకు చికిత్స చేయించలేని స్థితిలో తల్లిదండ్రులు దాతలు ఆదుకోవాలని వేడుకోలు మామడ మండలం పోతారం గ్రామానికి చెందిన చిరువ్యాపారి పబ్బవార్ లక్ష్మణ్, శ్రీదేవి దంపతుల ఏకైక కుమారుడు శ్రీకర్(20). అతడు మొదటినుంచీ చదువులో ప్రతిభ కనబర్చేవాడు. ఇంటర్మీడియెట్ అనంతరం సీఏ కోర్సు చదువుతానంటే రెండేళ్ల క్రితం విజయవాడలోని కళాశాలలో చేర్పించారు. కుమారుడు సీఏ పూర్తిచేసి తమ కుటుంబానికి అండగా ఉంటాడని తల్లిదండ్రులు ఆశించారు. వారి అంచనాల మేరకు సీఏ మొదటి సంవత్సరంలో శ్రీకర్ మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. సెకండియర్ చదువుతుండగా ఓ రోజు అతడికి కడుపునొప్పి రావడంతో స్నేహితులు ఆస్పత్రిలో చూపించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు చేరుకొని కొడుకును ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యపరీక్షల అనంతరం శ్రీకర్ లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు ఏడు నెలల క్రితం ధ్రువీకరించారు. ఇది తెలిసిన తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. కుమారుడిని విజయవాడ, హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చూపించారు. అప్పులు తెచ్చి ఇప్పటి వరకు సుమారు రూ.5 లక్షల వరకు చికిత్సకు వెచ్చించారు. ప్రస్తుతం కిమోథెరపీ చికిత్స చేయిస్తున్నారు. శ్రీకర్‌కు 15 రోజులకు ఒకసారి వైద్యులు రూ.30 వేల విలువైన ఇంజెక్షన్లు, మందులు ఇస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. చికిత్స మరికొంత కాలం కొనసాగించాలని వైద్యులు చెప్పారని, వైద్యం చేయించడానికి తమవద్ద డబ్బుల్లేవని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఖరీదైన వైద్యం చేయించే స్థోమతలేక కొడుకును ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. కళ్ల ముందే కుమారుడు మంచానికే పరిమితం కావడం.. రోజురోజుకు అతడి ఆరోగ్యం క్షీణించడం చూసి తట్టుకోలేకపోతున్నారు. మరికొంతకాలం చికిత్స చేయిస్తే కుమారుడి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు స్పందించి ఆపన్నహస్తం అందించాలని వేడుకుంటున్నారు. తద్వారా తన కొడుక్కి ప్రాణభిక్ష పెట్టాలని కోరుతున్నారు. -
కాలేయ కేన్సర్‌కు ల్యాప్రోస్కోపిక్ చికిత్స
సాక్షి, హైదరాబాద్: కాలేయ కేన్సర్.. ఎంతోమంది దీనివల్ల మృత్యువాత పడ్డారు. దీని చికిత్స సైతం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అంతేకాదు.. చికిత్సకోసం ఛాతీపై భారీగా కోతలు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడీ పరిస్థితికి తెరపడింది. ల్యాప్రోస్కోపిక్ విధానంతో కాలేయంలోని కేన్సర్ గడ్డలను సులభంగా తొలగించే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఛాతీపై భారీ కోతలకు స్వస్తి చెబుతూ కేవలం 2.5 సెంటీమీటర్ల రంధ్రంతోనే కాలేయంలోని కేన్సర్ గడ్డలను విజయవంతంగా తొలగించారు హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు. గుంటూరుకు చెందిన కోటేశ్వరరావు (57), ఒంగోలుకు చెందిన అబ్దుల్ రషీద్ (50) అనే రోగులకు ఈ విధానం ద్వారా ఇటీవల లివర్ కేన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేశారు. దీనిపై బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్లోబల్ హాస్పిటల్స్ గ్రూప్ సీఎండీ డాక్టర్ కె.రవీంద్రనాథ్, ఇతర వైద్యులు మాట్లాడారు. ఈ విధానం వల్ల రోగి త్వరగా కోలుకోవడంతోపాటు వైద్యానికవుతున్న ఖర్చు కూడా తగ్గుతుందని రవీంద్రనాథ్ స్పష్టం చేశారు. లాప్రోస్కోప్లో కొత్తగా వచ్చిన 3డీ ైడెమైన్షన్ కెమెరా ద్వారా కేన్సర్ కణాలను సులభంగా గుర్తించడంతోపాటు వాటిని తొలగించే అవకాశం లభించినట్లు తెలిపారు. ఈ చికిత్సను ప్రస్తుతం గ్లోబల్ అస్పత్రులలో మాత్రమే ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ టాం చెరియన్ మాట్లాడుతూ.. 70 శాతం మంది వ్యాధి ముదిరాకే చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్, హెపటైటిస్-బి, సి వైరస్ ఇన్ఫెక్షన్లతోపాటు మధుమేహం, అధిక బరువు కాలేయ కేన్సర్‌కు కారణమని తెలిపారు. హెపటాలజిస్ట్ డాక్టర్ ధర్మేష్కపూర్ మాట్లాడుతూ దేశంలో ఏటా 50 వేలమంది కాలేయ కేన్సర్ బారిన పడుతున్నారని చెప్పారు. జీవనశైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని చెప్పారు. -
కాలేయ క్యాన్సర్...
మన శరీరంలోని అతి పెద్ద అవయవం కాలేయం. అనేక కీలక వ్యవహారాలు నిర్వహించే కేంద్రమిది. అత్యంత పెద్ద గ్రంథి. దీనికి క్యాన్సర్ సోకితే అది చాలా ప్రమాదం. మన దేశంలో సంభవించే క్యాన్సర్ మరణాలన్నింటికీ మూడో అతి పెద్ద కారణం కాలేయ క్యాన్సర్. ఇది ప్రమాదకరమైనదే అయినా... కేవలం చిన్న రక్తపరీక్షతో దీన్ని గుర్తించి, ఒక ఆపరేషన్ చేయిస్తే చాలు... ఓ ప్రాణం నిలుస్తుంది. సంపూర్ణ జీవితానికి ఆస్కారం దొరుకుతుంది. అందుకే దీని గురించి అవగాహన ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. ఈ అవగాహన కోసమే నేడు క్యాన్సర్ డే రోజున ఈ ప్రత్యేక కథనం. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స హెపటోసెల్యులార్ కార్సినోమా (హెసీసీ) అనే లివర్ క్యాన్సర్ బాధితుల్లో కాలేయం పనితీరు పూర్తిగా మందగిస్తే... దాన్ని మళ్లీ పనిచేసేలా చేయడం కష్టం. వారిలో కొందరికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స ఓ ప్రత్యామ్నాయం. అయితే ప్రతి రోగికీ ఇది వర్తించదు. ఎందుకంటే... కాలేయంలో గడ్డల సంఖ్య, వాటి పరిమాణం వంటి అనేక అంశాలు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు పరిమితులు విధిస్తాయి. అందుకే కేవలం నిర్దిష్టమైన కొన్ని కేసుల్లోనే కాలేయ మార్పిడి ఉపకరిస్తుందని గుర్తుంచుకోవాలి. పైగా చాలా సందర్భాల్లో కాలేయ లభ్యతా ఒక ప్రతిబంధకమే. మరి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స ఎవరికి చేయవచ్చు... చాలా కొద్దిమంది రోగులకే ఈ కాలేయ మార్పిడి శస్త్రచికిత్స వరప్రదాయని అవుతుంది. ఇందుకోసం తనకు కాలేయాన్ని ఇచ్చే దాత అవసరం. ఆయన ఇచ్చే కాలేయం కూడా రోగి కాలేయంతో సరిపడాలి. అంటే రోగి, దాతల కాలేయాలు సరిగా జతగూరతాయా అని పరిశీలించేందుకు చేసే మ్యాచింగ్ పరీక్షలు విజయవంతం అయితేనే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స సాధ్యం. కొందరు రోగుల్లో కాలేయ క్యాన్సర్ పక్క అవయవాలకూ వ్యాపిస్తే... ఇక అలాంటి రోగులకు కాలేయ మార్పిడి సత్ఫలితాలు ఇవ్వదు. ఇది ఎవరికి సత్ఫలితాలు ఇస్తుందో తెలుసుకోడానికి రోగిని ఆసుపత్రిలో చేర్చి ఒకటి, రెండు వారాలు పరీక్షలు చేయాలి. అనంతర ఫాలో-అప్లూ చాలా కీలకం... కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం అయ్యాక కూడా డాక్టర్లతో నిత్యం ఫాలోఅప్లలో ఉండటం అవసరం. ఈ సమయాల్లో డాక్టర్లు రోగిని అనేక అంశాలు అడుగుతుంటారు. ఉదాహరణకు లక్షణాలు, భౌతికంగా ఏవైనా బయటకు కనిపించే గమనించదగ్గ అంశాలు, నిత్యం ఏఎఫ్‌పీ వంటి రక్తపరీక్షలు; కాలేయ పనితీరు పరీక్షలు చేయించడం, అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్, సీటీ, ఎమ్మారై స్కాన్లు చేయించాలి. కాలేయ క్యాన్సర్‌ను శస్త్రచికిత్సతో తొలగించాక మొదటి రెండేళ్ల పాటు ప్రతి మూడు లేదా ఆర్నెల్లకొకసారి; ఆ తర్వాత... ప్రతి 6 లేదా 12 నెలలకోసారి చొప్పున రక్తపరీక్షలు చేయించుకోవాలి. ఈ దశల్లో వ్యాధి పునరావృతమవుతోందా అన్న అంశంతో పాటు ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ కనపడుతున్నాయా అని డాక్టర్లు నిత్యం పరిశీలిస్తూ ఉంటారు. ఒకవేళ కాలేయ క్యాన్సర్ హెపటైటిస్-బి లేదా సీ వైరస్ కారణంగా వస్తే... అప్పుడు అనేక రకాల మందులను వాడుతూ కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకుంటూ ఉండాలి. శస్త్రచికిత్సల్లో అత్యంత ఆధునిక పద్ధతులు పోర్టల్ వెయిన్ ఎంబోలైజేషన్ ఫర్ సర్జరీ... శస్త్రచికిత్సల్లో ఇదో సరికొత్త ప్రక్రియ. కాలేయంలో కొంత భాగాన్ని తొలగించినా మళ్లీ పూర్వపు స్థితికి పెరగగలిగే శక్తి మన శరీరంలోని అన్ని అవయవాల్లో కేవలం కాలేయానికి మాత్రమే ఉంది. అయితే ఇలా కాలేయం మళ్లీ పూర్వస్థితికి పెరగాలంటే నిర్దిష్టమైన కొంత భాగాన్ని అక్కడ ఉంచాలి. అప్పుడే అది పూర్వస్థితికి పెరగ గలుగుతుంది. మరి వ్యాధి తీవ్రత కారణంగా అక్కడ ఉంచాల్సిన దానికంటే ఎక్కువగా తొలగించాల్సి వస్తే...? అందుకే అలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు కాలేయానికి రక్తసరఫరాకు తోడ్పడే పోర్టర్ వెయిన్ భాగాన్ని వ్యాధి ఉన్న భాగం వైపు రక్తసరఫరా ఆగేలా మూసేస్తారు. దాంతో వ్యాధిలేని మరోవైపునకు కాలేయం పూర్తిగా పెరిగేలా చేస్తారు. ఈ ట్రిక్ చేయడం ద్వారా వ్యాధిలేని ఆరోగ్యకరమైన భాగమే పూర్తి కాలేయంగా పెరుగుతుంది. దీన్నే పోర్టల్ వెయిన్ ఎంబోలైజేషన్ ప్రక్రియ అంటారు. ట్రాన్స్-ఆర్టీరియల్ కీమో ఎంబోలైజేషన్ (టేస్) థెరపీ ఈ ప్రక్రియలో కాలేయంలోని క్యాన్సర్ ఉన్న భాగాలకు రక్తసరఫరా జరగకుండా చూస్తారు. ఇలా రక్తసరఫరాకు అడ్డుపడేందుకు రక్తనాళాల్లోనికి కొన్ని పదార్థాలను ఇంజెక్ట్ చేస్తారు. ప్రధానంగా కాలేయానికి రక్తసరఫరా చేసే హెపాటిక్ ఆర్టరీలో ఈ అడ్డంకులు కల్పిస్తారు. దీంతో క్యాన్సర్ కణాలు ఉన్న కాలేయ భాగానికి రక్తసరఫరా ఆగిపోతుంది. ఇక అదే సమయంలో ఆరోగ్యకరమైన కాలేయ కణాలకు పోర్టల్ వెయిన్ ద్వారా రక్తసరఫరా జరిగేలా చేస్తారు. అంటే... ఈ ప్రక్రియలో అనారోగ్యకరమైన క్యాన్సర్ కణాలకు రక్తసరఫరా జరగకుండానూ, ఆరోగ్యకరమైన కణాలకు మాత్రమే రక్తం అందేలాగానూ చూస్తారన్నమాట. దాంతో క్యాన్సర్ కణాలు రక్తసరఫరా అందక చనిపోతాయి. శస్త్రచికిత్స చేసి క్యాన్సర్ గడ్డను తొలగించడానికి అవకాశం లేని రోగుల్లో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రక్రియలో కొన్నిసార్లు ఆరోగ్యకరమైన కాలేయ భాగానికీ రక్తసరఫరా ఆగిపోయే అవకాశం ఉన్నందున హెపటైటిస్ లేదా సిర్రోసిస్ ఉన్న కొందరు రోగులకు ఇది అంత మంచి ప్రత్యామ్నాయం కాకపోవచ్చు. కొన్నిసార్లు ఈ ‘టేస్’ ప్రక్రియ కీమోథెరపీతో కలిపి చేయాల్సి రావచ్చు. రక్తప్రవాహానికి అడ్డుపడే పదార్థాలను పంపాక, అప్పుడు రోగగ్రస్థమైన భాగానికి రేడియేషన్ చికిత్స ఇచ్చి దాన్ని నాశనం చేస్తారు. అయితే ఈ ప్రక్రియలో పొట్టనొప్పి, వాంతులు, వికారం, కాలేయంలోని కొన్ని భాగాలకు ఇన్ఫెక్షన్ రావడం, గాల్‌బ్లాడర్ వాపు (ఇన్ఫ్లమేషన్), కాలేయానికి చెందిన కొన్ని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ర్పభావాలు కనిపించే అవకాశం ఉంది. టార్గెటెడ్ థెరపీ... కాలేయ క్యాన్సర్ వచ్చిన రోగుల్లో అది ప్రాథమిక దశలో ఉంటే కేవలం కొన్ని టాబ్లెట్లను వాడటం ద్వారానే వ్యాధిని అదుపు చేసే ప్రక్రియ ఓ ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఈ థెరపీలో సొరాఫెనిబ్ అనే మందును వాడటం ద్వారా కేవలం వ్యాధిగ్రస్తమైన కణాలనే నాశనం చేసే వీలుంది. ఇవేగాక... ఎర్లోటినిబ్ అనే టార్గెటెడ్ థెరపీ మందుతో పాటు పాడైపోయిన కాలేయానికి రక్తసరఫరాను పునరుద్ధరించి మళ్లీ కొత్త రక్తనాళాలు సైతం ఏర్పడేలా చేసే బివాసిజుమాబ్ వంటి కొత్త మందులూ కాలేయ క్యాన్సర్ చికిత్సలో ఆశాకిరణాలను ప్రసరింపజేస్తున్నాయి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి కాలేయ క్యాన్సర్ కారణాలు... మన దేశంతోపాటు ఆసియాలోని చైనా, కొరియాల్లో హెపటైటిస్-బి చాలా ఎక్కువ. దీని కారణంగా హెచ్‌సీసీ క్యాన్సర్లు ఎక్కువ. ఇక హెపటైటిస్-సి కూడా కాలేయ క్యాన్సర్లకు ఒక కారణమే. హీమోక్రొమటోసిస్ అనే కండిషన్ కూడా. వ్యాయామం చేయకపోవడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ కండిషన్ కూడా అరుదుగా కాలేయ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. పుట్టుకతో వచ్చే కాలేయ లోపాలు విపరీతంగా ఆల్కహాల్ తీసుకునే అలవాటు కాలేయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. ఇక ఆల్కహాల్ తీసుకునే సమయంలో సిగరెట్ తాగడం చాలా ప్రమాదకరం. గోధుమ, వేరుశనగ, వరి, మొక్కజొన్న, సోయాధాన్యాలకు వచ్చే ఒక రకం శిలీంధ్రం (మౌల్డ్)లోని విషం అఫ్లోటాక్సిన్ కూడా కాలేయ క్యాన్సర్‌కు కారణమే. రిస్క్ ఫ్యాక్టర్లు స్థూలకాయం, అనువంశికంగా వచ్చే పొట్ట వంటి ఒబేసిటీ కాలేయ క్యాన్సర్‌కు ఒక కారణం. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో హెచ్‌సీసీ తరహా క్యాన్సర్‌కు అవకాశం ఎక్కువ. చిన్నప్పుడు వచ్చే బిలియరీ అట్రేషియా, ఇన్‌ఫ్యాంటైల్ కొలెస్టాసిస్, గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్‌ల వంటివి కూడా హెచ్‌సీసీకి దారితీసే అవకాశం ఉంది. వినైల్ క్లోరైడ్, ఆర్సినిక్ వంటి కలుపు మొక్కలను నివారించే మందులు కూడా కాలేయ క్యాన్సర్‌కు కారకాలు కావచ్చు. దాని శక్తే దానికి శాపం..! కాలేయానికి అపరిమితమైన శక్తి ఉంటుంది. ఫలితంగా అది దాదాపు 90 శాతం పనిచేయకుండా పోయే వరకూ కాలేయ వ్యాధికి సంబంధించిన ఎలాంటి లక్షణాలూ బయటికి కనిపించవు. అందుకే కాలేయ వ్యాధులను కనుగొనడం ఒకింత కష్టమైన పని. అలా జరిగే జాప్యం కూడా కాలేయ వ్యాధులను ప్రాణాంతకం చేస్తుంటుంది. అందుకే దాని అపరిమితమైన శక్తే దానికి ఒక శాపం లాంటిది. మరి ముందే తెలుసుకోవడం సాధ్యమేనా? లక్షణాలు కనపడకముందే దాన్ని కనుగొనడం ఒకింత కష్టమే. పైగా గడ్డలను తడిమి తెలుసుకోవాలంటే కాలేయం ఉరఃపంజరం ఎముకల కింద సురక్షితంగా ఉంటుంది. అందుకే చాలా సందర్భాల్లో గడ్డను కనుగొనే సమయానికే వ్యాధి ముదిరిపోతుంటుంది. పైగా రిస్క్ ఫ్యాక్టర్లు లేనివారికి కాలేయ క్యాన్సర్‌కు స్క్రీనింగ్ పరీక్షలనూ సూచించే ఆస్కారం ఉండదు. అందుకే కాలేయ క్యాన్సర్ రిస్క్ ఉన్నవారు కొన్ని పరీక్షలను ముందే చేయించుకోవడం మేలు. సిర్రోసిస్ కండిషన్ కాలేయ క్యాన్సర్‌కు దారితీసే అంశం. కాబట్టే సిర్రోసిస్ ఉన్న పేషెంట్లకు డాక్టర్లు కాలేయ క్యాన్సర్ పరీక్షలు చేయిస్తుంటారు. అయితే శుభవార్త ఏమిటంటే... కాలేయ క్యాన్సర్‌ను ముందే కనుగొంటే మరణాన్ని తప్పించుకోడానికి ఉండే అవకాశాలు 80 శాతం కంటే ఎక్కువ. ఇదీ చాలా చిన్న పరీక్షలతోనే జరిగిపోతుంది. ఆ పరీక్షలే... అల్ఫా-ఫీటోప్రొటీన్ (ఏఎఫ్‌పీ) అనే రక్తపరీక్ష, అల్ట్రా సౌండ్ స్కానింగ్ అనే తేలికపాటి మరో పరీక్ష. ఈ రెండు పరీక్షలనూ రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నవారు ప్రతి ఆరు నెలలు/ఏడాదికి ఒకసారి చేయించుకుంటుంటే కాలేయ క్యాన్సర్ ఉనికి తెలుస్తుంది. ఒకవేళ అది ఉన్నట్లు తెలిస్తే ఒకే శస్త్రచికిత్సతో పరిస్థితి చక్కబడుతుంది. కాలేయ క్యాన్సర్ నివారణ ఇలా... చాలా చిన్న చిన్న అంశాలే ప్రమాదకరమైన కాలేయ క్యాన్సర్‌ను నివారిస్తాయంటే నమ్మగలరా? అవేమిటంటే... మంచి జీవనశైలి. అంటే సమయానికి సమతుల ఆహారం, శరీరానికి తగిన వ్యాయాయం. బరువు పెరగకుండా అదుపులో పెట్టుకోవడం. పొగతాగడాన్ని పూర్తిగా మానేయడం, ఆల్కహాల్ తీసుకోవడాన్ని పూర్తిగా వదిలేయడం, అది సాధ్యం కాకపోతే చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవడం. హెపటైటిస్‌కు వ్యాక్సిన్ తీసుకోవడం లేదా ఒకవేళ వ్యాధి అప్పటికే వస్తే మెరుగైన చికిత్స తీసుకోవడం. ఏవైనా మందులు, రసాయనాలు వాడాల్సి వచ్చినప్పుడు వాటి దుష్ర్పభావాలను తెలుసుకోవడం. భద్రతామార్గదర్శకాలను (సేఫ్టీ గైడ్‌లైన్స్)ను విధిగా పాటించడం. ఐరన్ టాబ్లెట్ల వంటివి వాడాల్సి వస్తే వాటిని డాక్టర్ల సలహా మేరకే వాడటం. స్టెరాయిడ్స్ వంటి మందులను డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలని గుర్తుపెట్టుకోవడం. ఒకవేళ కాలేయ వ్యాధులు వచ్చినవారిలోనూ పైన పేర్కొన్న ఆరోగ్య పరిరక్షణ/నివారణ విధానాలు అవలంబిస్తే వ్యాధి తిరగబెట్టే అవకాశాలు తక్కువ. నివారణలకు కొత్త పరిశోధనలు ఇప్పుడు హెపటైటిస్ రాకుండానే నివారించేందుకు, ఒకవేళ హెపటైటిస్ వచ్చినా అది క్యాన్సర్‌కు దారితీయకుండా ఉండేందుకు గల అవకాశాలపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. హెపటైటిస్-సి ను నివారించేందుకు వ్యాక్సిన్ రూపకల్పన కోసం కూడా అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. దీర్ఘకాలిక హెపటైటిస్ చికిత్స విధానాలపైనా విస్తృతమైన అధ్యయనాలు సాగుతున్నాయి. సర్జరీ అనంతర చికిత్సల్లో న్యూట్రెండ్స్... ఇప్పుడు శస్త్రచికిత్స తర్వాత చేయాల్సిన అనంతర చికిత్సా విధానాల్లో విషయంలోనూ ఎన్నెన్నో కొత్త పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికి జరిగిన అధ్యయనాల వల్ల తేలిందేమిటంటే... శస్త్రచికిత్స తర్వాత కీమోథెరపీ లేదా కీమో ఎంబోలైజేషన్ థెరపీ చేయించుకున్నవారిలో అంతగా మంచి ఫలితాలేమీ కనిపించలేదు. అయితే మరింత సమర్థంగా పనిచేయగల కొత్త మందుల రూపకల్పనల్లో పరిశోధకులు నిమగ్నమై ఉన్నారు. వారి పరిశోధనల ఫలితంగా టార్గెటెడ్ థెరపీ రూపంలో ఉపయోగించేందుకు ఇప్పుడు ‘సొరాఫెనిబ్’ వంటి మంచి మందులను సర్జరీ తర్వాత వాడితే వ్యాధి తిరగబెట్టే అవకాశాలు తగ్గుతాయి. రేడియేషన్ థెరపీ: కాలేయ క్యాన్సర్‌కు రేడియేషన్ థెరపీ ఇస్తే అది అక్కడి ఆరోగ్యకరమైన కణాలనూ నాశనం చేస్తుంది. అందుకే ఫోకస్ రేడియేషన్ పేరిట కేవలం క్యాన్సర్‌కు గురైన ప్రాంతాన్నే ప్రభావితం చేసేలా రేడియేషన్ ఇచ్చేలా పరిశోధనలు సాగుతున్నాయి. కీమోథెరపీ: ప్రస్తుతానికి వీటి ఫలితాలు అంతగా ప్రోత్సాహకరంగా లేనప్పటికీ కాలేయ క్యాన్సర్‌ను అదుపు చేసేందుకు కొత్త కొత్త రసాయనాల కాంబినేషన్లను ఉపయోగించి చికిత్స చేసేందుకు క్లినికల్ ట్రయల్స్ సాగుతున్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఏఎప్పీ అనే రక్తపరీక్ష, అల్ట్రా సౌండ్ స్కాన్ అనే ప్రాథమిక పరీక్షలతో పాటు సీటీ స్కాన్, కాంట్రాస్ట్ ఎమ్మారై స్కాన్ అనే పరీక్షలూ వ్యాధి నిర్ధారణ, వ్యాధి ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం ఉపయోగపడతాయి. ఆ తర్వాత లివర్ బయాప్సీ అనే పరీక్ష ద్వారా ఆ గడ్డలు ప్రమాదం కలిగించని (బినైన్) గడ్డలా లేక ప్రాణాంతకమైనవా (మాలిగ్నెంట్) అన్నది తేలుతుంది. ఇక లాపరోస్కోపిక్ ప్రక్రియ కూడా చిన్న గడ్డలను పరీక్షించడానికి, సిర్రోసిస్ తీవ్రతను తెలుసుకోడానికి లేదా బయాప్సీ కోసం ముక్కను సేకరించడానికి ఉపయోగపడుతుంది కాలేయ క్యాన్సర్ - చికిత్సా విధానాలు కాలేయ క్యాన్సర్ వచ్చిన వారికి శస్త్రచికిత్సే అత్యుత్తమ చికిత్స. కేవలం ఒక్క శస్త్రచికిత్స ద్వారానే వ్యాధి అంతా నయమైపోయే అవకాశం చాలా సందర్భాల్లో ఉంటుంది. కానీ ఇలా జరగాలంటే వ్యాధి... మరి ఇంకే అవయవానికీ పాకక ముందే కనుగొనాల్సి ఉంటుంది. ఇక మందుల వంటి ఇతర మార్గాలు కాలేయ క్యాన్సర్ విషయంలో అంత ప్రభావపూర్వకమైనవి కావు. ఇప్పుడు ఈ శస్త్రచికిత్స ప్రక్రియల్లోనూ పార్షియల్ హెపటెక్టమీ, పూర్తి కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంట్) వంటివి మరింత సురక్షితంగా, ప్రభావవంతంగా జరుగుతున్నాయి. కాలేయం... కథా కమామిషూ... మన దేహంలోని అంతర్గత భాగాల్లో అత్యంత పెద్దది కాలేయం. ఎంత పెద్దదో అంత కీలకం. దీని బరువు దాదాపు 1.5 కిలోలు. ఇంతటి కీలకమైన అవయవం కాబట్టే దీనికి రక్తం ధారాళంగా అందాలి. అలా అందజేసే రక్తనాళాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టే ఈ అవయవానికి ఈ ముదురు ఎరుపు రంగు. కాలేయ విధులెంతో కీలకం... శరీరంలోని ఎన్నో కీలక కార్యకలాపాలను కాలేయం నిర్వహిస్తుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో పెద్ద పెద్ద పదార్థాలను శరీరం స్వీకరించే చిన్న పోషకాల్లోకి మార్చడం, జీర్ణక్రియ దీని ప్రధాన విధుల్లో ఒకటి. జీర్ణం చేసేందుకు ఉపయోగపడే పైత్యరసాన్ని స్రవింపజేస్తుంది. కొవ్వులను, పిండిపదార్థాలను, ప్రోటీన్లను, విటమిన్లను (ప్రధానంగా విటమిన్ ఏ, విటమిన్ బి12) నిల్వ చేస్తుంది. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే అంశాలను రూపొందిస్తుంది. ఒకవేళ కాలేయం ఆ పని చేయకపోతే చిన్న దెబ్బ తగిలినా తీవ్ర రక్తస్రావంతో మరణం ఖాయం. ఇక శరీరంలోకి చేరే అన్ని విషపదార్థాలను విరిచేసే ప్రధాన విధి కాలేయానిది. క్యాన్సర్‌లో ప్రధాన రకాలు కాలేయ క్యాన్సర్‌లో ప్రధానంగా రెండు రకాలున్నాయి. మొదటిది కాలేయంలోనే ఆవిర్భవించే క్యాన్సర్. ఇలాంటివి యూఎస్‌లో ఎక్కువ. ఇక భారత్ లాంటి ఆసియా దేశాల్లో వచ్చేవాటిల్లో ముఖ్యమైనది హెపటోసెల్యులార్ కార్సినోమా (హెచ్‌సీసీ). దీనికి కారణం మన వద్ద హెపటైటిస్ వైరస్ కారణంగా వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉండటం. ఇక కాలేయం అనేక రకాలైన కణాలతో నిర్మితమై ఉండటం వల్ల రకరకాల క్యాన్సర్ గడ్డలు రావడమూ ఎక్కువ. అయితే ఆ వచ్చినది ఏ రకం అనే దానిపై అది ఎంత వరకు నయమవుతుందనే అంశం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు హిమాంజియోమా, హెపాటిక్ అడినోమా, ఫోకల్ నాడ్యులార్ హైపర్‌ప్లేసియా వంటి గడ్డల్లా వచ్చే వాటితోపాటు కొన్ని నీటితిత్తులు (సిస్ట్) పూర్తిగా ప్రమాదరహితమైనవి. చికిత్సకు తేలిగ్గా లొంగిపోతాయి. నిజానికి క్యాన్సర్‌కు చేసినట్లుగా వీటికి చికిత్స అవసరం ఉండదు. నొప్పి లేదా రక్తస్రావం అవుతున్నప్పుడు ఆ భాగాన్ని తొలగిస్తే చాలు. చికిత్స పూర్తయినట్లే. అయితే హెచ్సీసీతో పాటు కొలాజియోకార్సినోమా వంటివి పైత్యనాళ (బైల్ డక్ట్) క్యాన్సర్లు. వీటిని కాస్త సీరియస్‌గా పరిగణించాల్సి ఉంటుంది.