హైదరాబాద్: ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రాణాంతకమైన ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ హెపటాలజిస్ట్ డాక్టర్ నవీన్ పోలవరపు చెప్పారు. ఆదివారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి అనేది కొవ్వు అధికంగా ఉండటం వల్ల సంభవించే వ్యాధి అని... దీనిని ఫ్యాటీ లివర్ వ్యాధి అని కూడా అంటారని తెలిపారు. కాలేయంలో అధికంగా కొవ్వు నిలువలు ఉండటం చేత ఈ వ్యాధి వస్తుందన్నారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని ప్రాధమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని చెప్పారు.