మద్యపానంతో కేన్సర్
మెల్‌బోర్న్ : మద్యం సేవించేవారికి కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. కేన్సర్ కారకాలపై ఒటాగో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. న్యూజిలాండ్‌లో 2012లో కేన్సర్‌తో 236 మంది మరణించారు.. మద్యం సేవించే అలవాటు ఉన్నవారు పేగు, రొమ్ము, నోరు, గొంతు, అన్నవాహిక, స్వరపేటిక, కాలేయ కేన్సర్‌ల బారిన పడినట్లు అధ్యయనంలో తేలింది.
అక్కడి మహిళల మరణాలు దాదాపు 60 శాతం రొమ్ము కేన్సర్ వల్లే సంభవిస్తున్నాయనిశాస్త్రవేత్తలు తెలిపారు. రొమ్ము కేన్సర్‌తో 2007 సంవత్సరంలో చనిపోయినవారిలో 71 మందికి మద్య పానం అలవాటు ఉందని, 2012లో చనిపోయిన వారిలో 65 మంది మద్యం సేవించే అలవాటు ఉన్నట్లు గుర్తించామని వివరించారు.