కాటన్.. కొత్తగా...
ఇంటిప్స్
వేసవి కాలం కాటన్ వస్త్రాలదే మొదటి ప్లేస్. అయినా వీటిని మెయింటెయిన్ చేయడంలో సమస్యలుంటాయ ని చాలా మంది వెనుకంజవేస్తుంటారు. ఈ సమస్యలు లేకుండా కాటన్ దుస్తులు ఎక్కువకాలం మన్నాలంటే... హ్యాండ్లూమ్ శారీ లేదా డ్రెస్ మొదటి ఉతుకులో గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు వేసి, అందులో 10-15 నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ తర్వాత ఉతుకులో రంగు అంతగా పోదు.
కుంకుడు రసం కలిపిన నీళ్లలో ముంచి, ఉతికి ఆరేస్తే కాటన్ చీరలు, డ్రెస్సులు దీర్ఘకాలం మన్నుతాయి. మూడు ఉతుకులకు ఒకసారైనా సరిపడినంత గంజి పెట్టాలి. ఇందుకు మార్కెట్‌లో లిక్విడ్ స్ట్రార్చ్ కూడా లబిస్తుంది. బాగా ఆరిన తర్వాత ఇస్త్రీ చేస్తే, మళ్లీ కొత్తవాటిలా కనిపించడం హ్యాండ్లూమ్స్ స్పెషల్.