మానవ తోడేలు వ్యాధి! | Disease of the human wolf! | Sakshi
Sakshi News home page

మానవ తోడేలు వ్యాధి!

Published Thu, Nov 5 2015 11:40 PM | Last Updated on Thu, Jul 11 2019 8:00 PM

Disease of the human wolf!

మెడిక్షనరీ

ఈ వ్యాధి ఉన్నవారిలో తోడేలు రోమాల్లా అనిపించే కేశాలు ముఖం నిండా లేదా ఒంటి నిండా పెరుగుతాయి. గ్రీకు జానపదగాథల్లో ‘మానవ తోడేలు’ అని పిలిచే ఒక ఊహా జంతువు ఉంది దాని పేరే ‘వెరెవూల్ఫ్’. దాని పేరు మీద ఈ వ్యాధికి ఆ పేరు పెట్టారు. హిమాలయాల్లో నరవానరం (బిగ్‌ఫుట్) అని పిలిచే నరవానరం ఉందని మన దేశంలో కొందరు నమ్మినట్లే, యూరోపియన్ దేశాల్లో వెరెవూల్ఫ్ అని పిలిచే మానవతోడేలు ఉందని మరికొందరు నమ్ముతారు.

వీళ్లలో కోరలు ఉంటాయనీ... ప్రతి పున్నమి రోజున ఈ మానవతోడేళ్లు పూర్తిగా ‘వెరెవూల్వ్‌స్’గా మారిపోతాయని పాశ్చాత్యదేశాల్లో కొందరి నమ్మకం. కోరలు తప్ప ముఖం నిండా రోమాలు మొలిచే ఈ వ్యాధి ఉండే కండిషన్‌ను ‘హ్యూమన్ వెరెవూల్ఫ్ సిండ్రోమ్’ అని అంటారు. దీన్నే వైద్యపరిభాషలో హైపర్‌ట్రైకోసిస్ అని అంటారు. కొందరికి ఈ జబ్బు పుట్టుకతోనే (కంజెనిటల్‌గా) ఉండవచ్చు. ఆ తర్వాతి దశలోనూ (అక్వైర్డ్) కొందరికి రావచ్చు. అవాంఛిత రోమాలకు చికిత్స చేసినట్లే చర్మవ్యాధి నిపుణులు ఈ వ్యాధికీ ట్రీట్‌మెంట్ అందిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement