The disease
-
‘హోల్ లంగ్ లావేజ్’తో మీ జబ్బు నయం!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. నేను గృహిణిని. నాకు కొంతకాలంగా రెండు చేతి వేళ్లలో, మోకాళ్లలో విపరీతమైన నొప్పులు, వాపులు ఉన్నాయి. ఉదయాన్నే కొంత సేపటిదాకా ఏ పని చేసుకోలేకపోతున్నారు. డాక్టర్‌ను సంప్రదిస్తే రక్త పరీక్ష చేయించి,నాకు వచ్చి వ్యాధి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని నిర్థారించారు. అంటే ఏమిటి? దీనికి పరిష్కారం ఉందా? సలహా ఇవ్వగలరు. - లక్ష్మి, కాకినాడ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను వాడుక భాషలో ‘వాతం’ అంటారు. జీవక్రియల అసమతుల్యత వల్ల మన రోగనిరోధక శక్తే మన పట్ల ప్రతికూలంగా పని చేయడం వల్ల ఇది వస్తుంది. కారణాలు: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి గల కచ్చితమైన కారణాలు లేవు. ఇది కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, వాతావరణ మార్పుల వల్ల, వంశపారంపర్యంగా, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఎక్కువగా వస్తుంది. లక్షణాలు: ఈ వ్యాధి ప్రభావం మన కణజాలంతో పాటు అవయవాలపై కూడా ఉన్నప్పటికీ ప్రధానంగా కీళ్లపై (సైనోవియల్ జాయింట్స్) వ్యాధి మరింతగా ప్రభావం చూపుతుంది కీళ్లలో ఉండే సైనోవియల్ మెంబ్రేన్ క్రానిక్ (ఎక్కువ కాలం) ఇన్ఫ్లమేషన్కు గురి కావడం వల్ల కీళ్ల వాపు, నొప్పి, వేడిగా అనిపిం చడం వంటి లక్షణాలు కనపడతాయి శరీరంలోని ఇరుప్రక్కలా ఉండే ఒకే రకం కీళ్లలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపించడం అన్నది ఈ వ్యాధి ముఖ్య లక్షణం లక్షణాలు ముందుగా చిన్న కీళ్లు అయిన కాలివేళ్లు, చేతివేళ్లు, మణికట్టు, ఆ తరువాత పెద్ద కీళ్లైన భుజాలు, మోకాలు, తుంటి... ఈ వరుసలో వ్యాపిస్తుంటాయి ఉదయాన్నే నిద్ర లేవగానే కీళ్లు బిగుసుకుపోయి సాధారణ కదలికలకూ సాధ్యం కాని విధంగా ఉంటాయి. కొంత సమయం తర్వాత నిదానంగా అవి వదులవుతాయి కీళ్లపై చర్మం చిన్న కణుతుల్లా ఏర్పడతాయి. వీటినే ‘రుమటాయిడ్’ నాడ్యూల్స్’ అంటారు ఈ వ్యాధి బారిన పడ్డవారిలోని రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి (అథెరో స్ల్కీరోసిస్) గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైన తెలిపిన లక్షణాలే కాకుండా జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, రక్తహీనత మొదలైన ఇతర లక్షణాలు ఉండవచ్చు. హోమియో చికిత్స: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో సంపూర్ణ చికిత్స ఉంది. ఈ జబ్బుకి ఇతర చికిత్సా విధానాలలో కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభ్యమౌతుంది. అయితే రోగి వ్యక్తిగత లక్షణాలు, స్వరూప స్వభావాల ఆధారంగానే మందులు సూచించాల్సి ఉంటుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 65 ఏళ్లు. గత పదేళ్లుగా డయాబెటిస్ ఉంది. నా రక్తపరీక్షలో క్రియాటినిన్ 1.5 ఎంజీ/డీఎల్ ఉంది. నేను హైపర్‌టెన్షన్, థైరాయిడ్, గుండెజబ్బు వంటి వాటితో బాధపడుతున్నాను. ఇవన్నీ మూత్రపిండాలకు ముప్పుగా పరిణమిస్తాయా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. - డానియెల్, వసాయ్ (మహారాష్ట్ర) మీరు రాసిన వివరాలను బట్టి, మీరు డయాబెటిస్ ఉండటంతో పాటు మీరు పేర్కొన్న క్రియాటినిన్ మోతాదులను బట్టి ముందుగా మీరు నేత్ర వైద్యుణ్ణి సంప్రదించి, రెటీనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డయాబెటిస్ వల్ల రెటీనా దెబ్బతిని ఉంటే మూత్రంలో ప్రోటీన్ కూడా పోయే అవకాశం ఉంది. ఈ సమస్యలు ఉన్నవారు మూత్రపిండాలు దెబ్బతినకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోవాలి. తినకముందు బ్లడ్‌షుగర్ 110 ఎంజీ/డీఎల్ లోపు, తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్ లోపు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బీపీ 125/75 లోపల ఉండేలా చూసుకోండి. ఇక బ్లడ్ కొలెస్టరాల్ కూడా 150 ఎంజీ/డీఎల్ లోపు ఉండేలా జాగ్రత్తపడాలి. అవసరమైతే దీనికి సంబంధించిన మందులు వాడాలి. ఆహారపదార్థాలలో ఉప్పు బాగా తగ్గించాలి. మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. డాక్టర్ సూచించకుండా మీ అంతట మీరే పెయిన్‌కిల్లర్స్ కూడా వాడకూడదు. నా వయసు 38 ఏళ్లు. నాకు మూత్రవిసర్జన సమయంలో మంట అనిపిస్తోంది. తరచూ జ్వరం కూడా వస్తోంది. గైనకాలజిస్ట్‌ను సంప్రదించి మందులు వాడితే తగ్గిపోతోంది. నెలలోపే మళ్లీ జ్వరం, మూత్రంలో మంట కనిపిస్తున్నాయి. దీని నుంచి బయటపడటం ఎలాగో చెప్పండి. - వనజ, రాజమండ్రి మీరు తెలిపిన వివరాలను బట్టి మీరు రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇలా మీలో మాటిమాటికీ సమస్య తలెత్తడానికి కారణాలేమిటన్నది ముందుగా తెలుసుకోవాలి. మీకు డయాబెటిస్ ఉందో, లేదో రాయలేదు. ఒకవేళ డయాబెటిస్ ఉన్నట్లయితే తరచూ ఇలా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకైనా మంచిది ముందుగా మీరు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించండి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేయించి, మూత్రపిండాలలో రాళ్లుగానీ, మూత్రనాళాలలో వాపుగానీ లేవని నిర్ధారణ చేసుకోవాలి. ఒక్కోసారి మీరు మీ డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్ కోర్సు పూర్తి చేయకపోయినా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మూడు నెలల పాటు యాంటీబయాటిక్ కోర్సు వాడాలి. మీరు మంచినీళ్లు ఎక్కువగా తాగండి. మూత్రం వచ్చినట్లు అనిపించిన వెంటనే మూత్రవిసర్జనకు వెళ్లాలి. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. నేను మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. ఏడాదిగా నేను తీవ్రమైన ఆయాసంతో బాధపడుతున్నాను. ఒక్కోసారి ఊపిరి కూడా తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నాను. ఈమధ్య సమస్య తీవ్రం కావడంతో దగ్గర్లోని ఆస్పత్తిలో అడ్మిట్ అయ్యాను. డాక్టర్లు టెస్టులన్నీ చేసి లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ ఉందని, కొంతకాలం మందులు వాడితే సరిపోతుందని చెప్పారు. ఇంతకాలం మందులు వాడుతున్నా నా సమస్య ఇంకా తీవ్రమవుతోంది గానీ తగ్గడం లేదు. ఈమధ్యే ఒక సీనియర్ చెస్ట్ ఫిజీషియన్‌ను కలిస్తే ‘లంగ్ లావేజ్’ చేయడం ద్వారా నా ఆరోగ్యం బాగవుతుందని చెప్పారు. దయచేసి దాని గురించి పూర్తి వివరాలు తెలియజేయగలరు. - శ్రావణ్, హైదరాబాద్ మీరు వివరించిన అనారోగ్య లక్షణాలను పరిశీలిస్తే మీకు ‘పల్మనరీ అల్వియోలార్ ప్రొటియినోసిస్’ అనే అరుదైన లంగ్ వ్యాధి సోకినట్టు అనుమానంగా ఉంది. చాలా అరుదుగా వచ్చే దీని వల్ల ఊపిరితిత్తుల్లో ప్రొటీన్ చేరుతుంది. దీంతో వాటి పనితీరు దెబ్బతింటుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. చెస్ట్ సీటీ స్కాన్, బ్రాంకోస్కోపీ, లంగ్ బయాప్సీ ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయాలి. దీనిని వీలైనంత త్వరగా నివారించాలి. ఇందుకోసం ఏ లంగ్‌లో ప్రోటీన్ చేయిందనే విషయాన్ని మళ్లీ పరీక్షల ద్వారా తెలుసుకొని అందుకు తగినట్లుగా చికిత్స నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ‘పల్మనరీ అల్వియోలార్ ప్రొటియినోసిస్’ అనే వ్యాధిని ‘హోల్ లంగ్ లావేజ్’ ప్రక్రియ ద్వారా సమూలంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స విధానం దాదాపు రెండు వారాల పాటు ఉంటుంది. ఒకవేళ మీకు ఒకే లంగ్‌లో ప్రొటీన్ ఉత్పత్తి ఉంటే ఆ ఊపిరితిత్తిని మాత్రమే శుభ్రపరిస్తే సరిపోతుంది. ఇందుకు పదిరోజుల పాటు మీరు ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా రెండు ఊపిరితిత్తులకూ ఈ వ్యాధి సోకినట్లు పరీక్షల ద్వారా తేలితే మాత్రం రెండూ క్లీన్ చేయాలి. మొదటి విడతలో ఒక లంగ్‌ను మాత్రమే శుభ్రపరుస్తాం. ఆ ఊపిరితిత్తిని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత ఛాతీ ఫిజియోథెరపీ నిర్వహించి లంగ్‌ను డ్రై చేస్తాం. ఈ ప్రక్రియ ఆరు గంటల పాటు కొనసాగుతుంది. అనంతరం వారం గ్యాప్ ఇచ్చి రెండో లంగ్‌ను కూడా మొదటి లంగ్‌కు కొనసాగించిన విధానాన్నే పాటిస్తాం. మీరు అధైర్యపడకుండా ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకొని మీరు అనుభవిస్తున్న బాధ నుంచి త్వరగా ఉపశమనం పొందండి. డాక్టర్ ఎమ్.వి. నాగార్జున సీనియర్ పల్మనాలజిస్టు, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
మా పేరెంట్స్‌కు గుండెసమస్యలు... నాకు కూడా వస్తాయా?
హోమియో కౌన్సెలింగ్ మా బాబుకు పదేళ్లు. వాడికి పొట్టమీద , చర్మం మీదా ఎర్రగా గుండ్రంగా మచ్చలు ఏర్పడ్డాయి. ఆ మచ్చలు దురద అని ఏడుస్తున్నాడు. డాక్టర్‌కు చూపిస్తే ఎగ్జిమా అని చెప్పారు. అంటే ఏమిటి? ఇది ఎలా తగ్గుతుంది? సలహా చెప్పగలరు. - పుష్పలత, హైదరాబాద్. నూటికి 90 శాతం మంది ఏదో ఒక సాధారణ చర్మవ్యాధితో బాధపడుతూనే ఉంటారు. మీ బాబుకు వచ్చిన వ్యాధి గురించి మీరు ఆందోళన పడకండి. మందులు వాడితే నయం అవుతుంది. ఎగ్జిమాను తెలుగులో తామర అంటారు. ఎగ్జిమాలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ, ఎక్కువగా కనిపించే అటోపిక్ ఎగ్జిమాతో ఎక్కువమంది బాధపడుతుంటారు. శిశువులలో 55 శాతం, ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో 85 శాతం, ఈ సమస్య సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఈ సమస్య పెద్ద వయసు వారిలో కూడా కనిపిస్తుంది. శరీరంలో ఎక్కడయినా ఏర్పడే ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా మోకాలు వెనుక భాగం, మోచేయి, మణికట్టు మడతలలో, మెడపైన, కాలి మడమలు, పాదాలపైన కనిపిస్తాయి. ఎగ్జిమా రకాలు: అలర్జిక్ డర్మటైటిస్, కాంటాక్ట్ డర్మటైటిస్, అటోపిక్ డర్మటైటిస్, సెబోరిక్ డర్మటైటిస్, నమ్యులార్ డర్మటైటిస్, స్టేనిస్ డర్మటైటిస్, డిస్ హైడ్రాయ్టిక్ ఎగ్జిమా. కారణాలు: ఎక్కువగా పొడిచర్మం, ఏదైనా అలర్జీ కలిగించే వస్తువులు తగిలినప్పుడు, కొన్ని రసాయనాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థితి నుంచి ఎక్కువగా ప్రతిక్రియ జరపడంతో ఎగ్జిమా లక్షణాలు కనిపిస్తాయి. ప్రేరేపకాలు: వాతావరణ మార్పులు, పూల మొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు, దుమ్ము, ధూళి, జంతుకేశాలు, కొన్ని ఆహార పదార్థాలు, డిటర్జెంట్లు, చేతిగడియారాలు, ఇమిటేషన ఆభరణాలు, డయాపర్లు, డియోడరెంట్లు, ఉన్నివస్త్రాలు, ఇవేకాకుండా దురద పుట్టించే కొన్ని పదార్థాలు దీనిని తీవ్రతరం చేస్తాయి. ఒత్తిడి వల్ల కూడా ఎగ్జిమా ఎక్కువయే అవకాశం ఉంది. లక్షణాలు: ప్రధాన లక్షణం దురద. దీంతో చర్మం కమిలిపోయి ఎరుపు రంగుకు మారటం, ఆ తర్వాత చర్మం పైన వాపుతో కూడిన పొక్కులు ఏర్పడటం, క్రమేణా అవి నీటిబుడగలుగా మారి వాటినుంచి రసి కారటం, కొంతకాలానికి చర్మం దళసరిగా, నల్లగా మారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శిశువుల లో మొదట బుగ్గలపై దద్దుర్లుగా కనిపిస్తాయి. కొన్ని నెలలకు ఇవే దద్దులు చేతులు, కాళ్లతోపాటు ఇతర శరీర భాగాలకూ పాకుతాయి. నివారణ, హోమియో చికిత్స: పైన చెప్పిన వస్తువులు, పరిస్థితులకు దూరంగా ఉండటం ద్వారా కొంతవరకు నివారించుకోవచ్చు. హోమియోకేర్ అందించే కాన్స్టిట్యూషనల్ హోమియో చికిత్స ద్వారా వ్యాధిని నివారించడమే కాకుండా భవిష్యత్తులో ఈ ఎగ్జిమాను ప్రేరేపించే వస్తువులను ఉపయోగించినా మళ్లీ ఈ వ్యాధి సోకకుండా పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 42. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. మా అమ్మకు, నాన్నకు ఇద్దరికీ గుండెసమస్యలు ఉన్నాయి. నాకు కూడా వచ్చే అవకాశాలున్నాయేమో అని భయంగా ఉంది. గుండెపోటు రావడానికి కారణాలు, చికిత్సా విధానాలు తెల్పగలరు. - కె.కిరణ్ కుమార్, పీలేరు గుండెసమస్య ఎవరికైనా రావచ్చు. ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు, ధూమపానం, అధిక కొవ్వుశాతం, స్థూలకాయం, మానసిక ఒత్తిడి, వంశపారంపర్యత మొదలైనవి. సాధారణంగా రక్తనాళాల లో బ్లాకులు (అడ్డంకులు) ఏర్పడినప్పుడు మందుల ద్వారా లేదా ఆంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ ద్వారా చికిత్స చేయవచ్చు. శరీరంలో అధిక కొలెస్టరాల్ వల్ల వచ్చే అనర్థాలు, రక్తనాళాలలో కొవ్వు చేరడం వల్ల, గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కొలెస్టరాల్‌ను అదుపులో ఉంచుకోవాలి. సంవత్సరానికి ఒకసారి గుండెకు సంబంధించిన పరీక్షలైన 2డీ ఎకో, టి.ఎం.టి. కొలెస్టరాల్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె కండరాలు, గుండె పనితీరు తెలుస్తుంది. గుండెలో రక్తనాళాలలో అడ్డంకులు ఉంటే దీనికి ఆంజియోప్లాస్టీ అవసరం. ఆంజియోప్లాస్టీ అంటే సూక్ష్మనాళాన్ని మూసుకుపోయిన రక్తనాళంలోకి పంపి, తర్వాత సన్నటి వైరు వంటి దాని సాయంతో రక్తనాళాలలోని కొవ్వును తొలగిస్తారు. అవసరాన్ని బట్టి అక్కడ స్టంట్‌ను అమర్చడం ద్వారా ఆంజియోప్లాస్టీ చికిత్స పూర్తవుతుంది. రక్తనాళాలలో ఉన్న అడ్డంకిని తొలగించడం వల్ల రక్తప్రసారం మామూలు స్థాయికి చేరి గుండె కండరాలు బలహీన పడకుండా ఉంటాయి. నా వయసు 68. నాకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో డాక్టర్‌ను కలిశాను. తగిన పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్‌గారు నాకు వాల్యులో ప్లాస్టీ చికిత్స అవసరమని సూచించారు. దయచేసి వివరించగలరు. - కె.వి.రావ్, కోదాడ గుండె కవాటాలను సరిచేయడానికి చేసే చికిత్సను వాల్వులో ప్లాస్టీ అంటారు. గుండెకు ఎడమపక్కన ఉన్న మిట్రల్ కవాటం మూసుకుపోయినప్పుడు దాన్ని వాల్వులోప్లాస్టీ అనే ప్రక్రియ ద్వారా బెలూన్ సాయంతో వెడల్పు చేస్తారు. పల్మునరీ వాల్వులోప్లాస్టీ- పిబీపీవో- గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనికి ఉన్న కవాటం పల్మునరీ వాల్వ్ అంటారు. ఈ పల్మునరీ వాల్వ్ మూసుకుపోయినప్పుడు బెలూన్ ద్వారా దీన్ని తెరవవచ్చు. ఇది సాధారణంగా పుట్టుకతో వచ్చే లోపం కాబట్టి దీన్ని చిన్న వయసులోనే సరిచేయవచ్చు. పి.బి.ఎ.వి. గుండె నుంచి రక్తాన్ని శరీరానికి తీసుకు వెళ్లే ధమనికి ఉన్న కవాటం అమోర్టిక్ కవాటం మూసుకుపోయినప్పుడు ఈ పద్ధతి ద్వారా సరి చేస్తారు. మీరు భయపడకండి. డాక్టర్ అనుజ్ కపాడియా సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 27. గర్భం ధరించడంలో నాకు ఎలాంటి సమస్యా లేదు. అయితే నాకు చాలాసార్లు గర్భస్రావం అయ్యింది. ఎనిమిది వారాల గర్భం అప్పుడు ఒకసారి, పదకొండు వారాలకు ఒకసారి, తొమ్మిది వారాల టైమ్‌లో ఇంకోసారి గర్భస్రావం అయ్యింది. ఇక ఎనిమిది వారాల సమయంలో నాలుగోసారి కూడా గర్భస్రామైంది. దాంతో నాకు తీరని నిరాశకు లోనవుతున్నాను. నేను బిడ్డ పుట్టే అవకాశాలు లేవేమోనని ఆందోళనకు గురవుతున్నాను. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - ఒక సోదరి, విజయవాడ ఒకసారి గర్భస్రావం అయ్యిందంటే అది సాధారణంగా పరిగణించవచ్చు. కానీ మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు అదే జరిగితే వాటిని తరచూ జరిగే గర్భస్రావాలని (రికరెంట్ మిస్క్యారేజ్) భావించాలి. అసలు మీ సమస్యకు కారణం ఏమిటన్నది ముందుగా తెలుసుకోవాలి. మీ లేఖలో మీ వయసెంతో పేర్కొనలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ గర్భస్రావాలు అయ్యే అవకాశాలు పెరుగుతాయి. అండంలో నాణ్యత కూడా తగ్గుతుంది. ఉదాహరణకు 20-24 వయసు వారిలో గర్భస్రావం అయ్యేందుకు అవకాశాలు 11 శాతం మాత్రమే ఉంటాయి. అదే 40-44 ఏళ్ల వయసు వారిలో అది 50 శాతం ఉంటాయి. వయసుతో పాటు పెరిగే బరువు కూడా గర్భస్రావాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఒకసారి మీరూ, మీ భర్త ఇద్దరూ క్రోమోజోమ్ విశ్లేషణ పరీక్షలు చేయించుకోవాలి. దీనితో పాటు ఒకసారి మీరు థైరాయిడ్, డయాబెటిస్ పరీక్షలూ చేయించుకోండి. మీ గర్భసంచి ఎలా ఉందో తెలుసుకోడానికి హిస్టరోస్కోపీ లేదా లాపరోస్కోపీతో పాటు చేసే హిస్టెరోస్కోపీ 3-డీ స్కానింగ్ చేయించండి. మీకు ఏదైనా సమస్య ఉన్నట్లు తేలితే, దానికి తగిన చికిత్స చేయించాల్సి ఉంటుంది. మీకు ఏ సమస్యా లేకపోతే అందరిలాగే మీరూ గర్భవతి అయ్యేందుకు, పండంటి బిడ్డ పుట్టేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నిద్రించే అందాలు..!
మెడిక్షనరీ ఆ వ్యాధి పేరే ‘నిద్ర అందాలు’. ఇంగ్లిష్‌లో చెప్పాలంటే ‘స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్’. దీనికి క్లెయిన్ లెవిన్ సిండ్రోమ్ అని అంటారు. ఈ వ్యాధి సోకిన వాళ్లు ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలోకి జారుకుంటుంటారు. స్లీపింగ్ బ్యూటీ అన్న మాట విన్నప్పుడు ఇది యువతుల్లో ఎక్కువగా వస్తుందని అనిపించవచ్చు. కానీ యువతీ యువకులిద్దరిలోనూ ఇది వస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ తర్వాత ఇది వస్తుంటుంది. అయితే ఎలాంటి చికిత్సా తీసుకోనవసరం లేకుండానే దానంతట అదే తగ్గుతుంది. -
అక్కకు ఉంటే చెల్లికీ వస్తుందనేది అపోహ!
బ్రెస్ట్ క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ఇటీవల మా అక్కకు రొమ్ము క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఆమెకు వచ్చిన రొమ్ముక్యాన్సర్ పూర్తిగా నయం అవుతుందా? తోబుట్టువులలో ఒకరికి ఈ సమస్య ఉంటే మిగతా వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుందని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. అది నిజమేనా? రొమ్ముక్యాన్సర్‌ను నివారించేందుకు ఏం చేయాలి? దయచేసి మా సమస్యకు పరిష్కారం చూపించగలరు. - జ్యోత్స్న, హైదరాబాద్ రొమ్ము క్యాన్సర్ పట్ల ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. మీ సోదరికి రొమ్ము క్యాన్సర్ ఉన్నంత మాత్రాన మీకు కచ్చితంగా ఆ వ్యాధి రావాలని ఏమీ లేదు. మీ సోదరి రెండు రొమ్ముల్లోనూ క్యాన్సర్ వస్తేనే అప్పుడు మరో సోదరికీ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు సరైన జాగ్రత్తలు పాటిస్తే రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలను చాలావరకు తగ్గించుకోవచ్చు. అధిక బరువు ఉన్నవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ ఎత్తుకు తగిన బరువును కలిగి ఉంటూ క్రమం తప్పకుండా ప్రతిరోజూ వాకింగ్ గానీ, స్విమ్మింగ్ గానీ, వ్యాయామంగానీ చేయండి. దాంతోపాటు తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోండి. సాధ్యమైనంత వరకు జంక్ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్, నూనె పదార్థాలకు దూరంగా ఉండండి. మీ సోదరికి రొమ్ముక్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని తెలిపారు. చికిత్స విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తపడండి. ఎందుకంటే రొమ్ముక్యాన్సర్ ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఆ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. దురదృష్టవశాత్తు రొమ్ముక్యాన్సర్‌పై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు వీడండి. రొమ్ముక్యాన్సర్ అంటువ్యాధి కాదు. వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలూ చాలా తక్కువ. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించుకొని జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల ఆ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్ భారత్ వాస్వాని సీనియర్ హెమటో-ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 46 ఏళ్లు. మూడేళ్లుగా బీపీ ఉంది. సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే అందులో క్రియాటినిన్ 6 ఉంది. యూరియా 120 ఉంది. నాకు మూత్రపిండాల సమస్య ఉన్నట్లు డాక్టర్ చెబుతున్నారు. అయితే నాకు మూత్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాంటప్పుడు మూత్రపిండాల సమస్య ఉండవచ్చా? - సుధాకర్, అనకాపల్లి మీరు తెలిపిన వివరాలను బట్టి మీకు దీర్ఘకాలిక కిడ్నీ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. రిపోర్టులను బట్టి మీ కిడ్నీల పనితీరు 50 శాతం తగ్గినట్లుగా అనిపిస్తోంది. ఆ వివరాలు రక్త పరీక్షలో పూర్తిగా తెలియకపోవచ్చు. అలాగే వ్యాధి లక్షణాలూ కనిపించకపోవచ్చు. అయితే సాధారణంగా కిడ్నీల పనితీరులో 30 శాతం తగ్గితేనే వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. కొంతమందిలో కిడ్నీల పనితీరు చాలా ఎక్కువగా దెబ్బతిన్నా కూడా ఏ ఇబ్బందులూ కనిపించకపోవచ్చు. హైబీపీ, షుగర్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కుటుంబంలో ఎవరికైన కిడ్నీ వ్యాధులు ఉన్నట్లయితే క్రానిక్ కిడ్నీ డిస్ట్రెస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇలాంటి వాళ్లు ప్రతి ఏటా కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుందో తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంతగా మన కిడ్నీలను కాపాడుకునేందుకు అవకాశం ఉంది. నా వయసు 23 ఏళ్లు. గత రెండేళ్లుగా అప్పుడుప్పుడూ మూత్రం ఎరుపు రంగులో వస్తోంది ఇలా రెండు నుంచి మూడు రోజుల పాటు వస్తోంది. ఆ తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని ఇంతవరకూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇలా రావడం వల్ల కిడ్నీలు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా? - సురేశ్, కేసముద్రం సాధారణంగా కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కొందరికి ఇలాంటి సమస్య రావచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, యూరిన్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలు చేయించాలి. దాంతో మీ సమస్యకు అసలు కారణం ఏమై ఉంటుందో తెలుస్తుంది. అందుకే మీరు ఒకసారి డాక్టర్‌ను కలవడం మంచిది. సమస్య నిర్ధారణ అయితే దానికి తగిన మందులు వాడవచ్చు. మీకు సాధారణ ఇన్ఫెక్షన్ ఉంటే అది మామూలు యాంటీబయాటిక్ మందులతోనే తగ్గిపోతుంది. మీరు ఒకసారి యూరిన్‌లో ప్రోటీన్లు పోతున్నాయా అనే విషయాన్ని తెలుసుకునే పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. జనరల్ హెల్త్ కౌన్సెలింగ్ నా వయసు 27 ఏళ్లు. తరచూ వెన్నునొప్పి వస్తోంది. నడుము దగ్గర మరీ ఎక్కువ. నోట్లో పెదవులపైనా, నాలుకపైనా తరచూ పొక్కులు వస్తున్నాయి. ఎప్పుడూ ఒళ్లు వేడిగా ఉంటోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం సూచించండి. - ఎ. కుమారస్వామి, కత్తిపూడి మీరు వివరించిన లక్షణాలను బట్టి మీ శరీరంలో కీళ్లనొప్పులు... ముఖ్యంగా వెన్నెముక, మెడ, తుంటి భాగాల్లో ఉండటం, పెదవులపైనా, దవడలపైనా పొక్కులు, జ్వరంగా ఉండటం వంటివి చూస్తుంటే... మీకు కీళ్లవాతం (సీరోనెగెటివ్ ఆర్థోపతి) వంటి వ్యాధులు ఉండవచ్చునేమో అనిపిస్తోంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మొదట మీరు దీనికి సంబంధించిన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పరీక్షల్లో మీకు కీళ్లవాతానికి సంబంధించిన వ్యాధులు ఉన్నట్లు తెలిస్తే దానికి తగిన మందులు కొంతకాలం పాటు వాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మానసికంగా ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మీరు చెబుతున్న లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి మీకు అలాంటి ఒత్తిళ్లు ఏవైనా ఉంటే వాటికి పరిష్కారాలు కనుగొని ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి జనరల్ ఫిజీషియన్‌ను కలిసి వారి సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. నా వయసు 42 ఏళ్లు. వీపు మీద నల్లటి మచ్చలతో కూడిన గడ్డలు వస్తున్నాయి. సాధారణ గడ్డలే కదా అని డాక్టర్‌కు చూపించ లేదు. కానీ ఇటీవల అవి పెరుగుతున్నాయి. గడ్డ గట్టిగా అవుతోంది. నా సమస్యకు తగిన సలహా ఇవ్వండి. - కె. ఆనందరావు, ఉరవకొండ మీరు చెప్పిన విషయాలను బట్టి మీకు సివియర్ యాక్నే (మొటిమలు) ఉండి ఉండవచ్చనిపిస్తోంది. ముఖం మీదే కాకుండా ఒక్కోసారి వీపు మీద, ఛాతీ మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వెంటనే డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ సలహాపై తగిన పూతమందులు, అవసరమైతే యాంటీబయాటిక్స్ వంటివి వాడితే మీ సమస్య తేలికగానే పరిష్కారమవుతుంది. డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కన్సల్టెంట్ - ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటిస్, సెంచరీ హాస్పిటల్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
మొసలి కన్నీటి వ్యాధి...!
మెడిక్షనరీ మొసలి కన్నీటి వ్యాధి అనే పేరు చూడగానే ఇదేదో మనసులో లేని సానుభూతిని కురిపించే వ్యాధిగా పొరబడే అవకాశం ఉంది. అయితే ఏదైనా తినే పదర్థాలు చూసినా లేదా తింటున్నప్పుడు కళ్లలో నీళ్లు వచ్చే కండిషన్‌కు పెట్టిన పేరు. కొందరికి తాగుతున్నప్పుడు కూడా ఈ వ్యాధి కనిపిస్తుంది. ఇంగ్లిష్‌లో ‘క్రోకడైల్ టియర్స్ సిండ్రోమ్’గా పిలిచే ఈ వ్యాధి ఉన్నవారికి నోట్లో నీళ్లతో పాటు కళ్లలోనూ నీరు ఉబుకుతుంది. దీన్నే బోగోరాడ్స్ సిండ్రోమ్ అనీ, గస్టేటో లాక్రిమల్ రిఫ్లక్స్ లేదా గస్టేటరీ హైపర్ లాక్రిమేషన్ అని కూడా అంటారు. దీనికి కంటినిపుణులు లేదా ఈఎన్టీ నిపుణులు, న్యూరాలజిస్ట్లు బొటాక్స్ ఇంజెక్షన్‌తో చికిత్స చేస్తారు. -
మానవ తోడేలు వ్యాధి!
మెడిక్షనరీ ఈ వ్యాధి ఉన్నవారిలో తోడేలు రోమాల్లా అనిపించే కేశాలు ముఖం నిండా లేదా ఒంటి నిండా పెరుగుతాయి. గ్రీకు జానపదగాథల్లో ‘మానవ తోడేలు’ అని పిలిచే ఒక ఊహా జంతువు ఉంది దాని పేరే ‘వెరెవూల్ఫ్’. దాని పేరు మీద ఈ వ్యాధికి ఆ పేరు పెట్టారు. హిమాలయాల్లో నరవానరం (బిగ్‌ఫుట్) అని పిలిచే నరవానరం ఉందని మన దేశంలో కొందరు నమ్మినట్లే, యూరోపియన్ దేశాల్లో వెరెవూల్ఫ్ అని పిలిచే మానవతోడేలు ఉందని మరికొందరు నమ్ముతారు. వీళ్లలో కోరలు ఉంటాయనీ... ప్రతి పున్నమి రోజున ఈ మానవతోడేళ్లు పూర్తిగా ‘వెరెవూల్వ్స్’గా మారిపోతాయని పాశ్చాత్యదేశాల్లో కొందరి నమ్మకం. కోరలు తప్ప ముఖం నిండా రోమాలు మొలిచే ఈ వ్యాధి ఉండే కండిషన్‌ను ‘హ్యూమన్ వెరెవూల్ఫ్ సిండ్రోమ్’ అని అంటారు. దీన్నే వైద్యపరిభాషలో హైపర్ట్రైకోసిస్ అని అంటారు. కొందరికి ఈ జబ్బు పుట్టుకతోనే (కంజెనిటల్గా) ఉండవచ్చు. ఆ తర్వాతి దశలోనూ (అక్వైర్డ్) కొందరికి రావచ్చు. అవాంఛిత రోమాలకు చికిత్స చేసినట్లే చర్మవ్యాధి నిపుణులు ఈ వ్యాధికీ ట్రీట్మెంట్ అందిస్తారు. -
వికటిస్తే విరుగుడు
చేయూతనివ్వాల్సింది... చేటుతెచ్చారు... కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యం అంటే లక్షల్లో ఖర్చు తప్పనిసరి. అంత ఖర్చు భరించినా... అక్కడా మోసం జరిగితే ఎవరిని అడగాలి?! కేతిరి సాయిరెడ్డి కరీంనగర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నారు. హైదరాబాద్‌లో వ్యాధికి తగిన వైద్యం చేయని ఓ కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యంపై అతను ఎలాంటి పోరాటం చేశారో ఆయన మాటల్లోనే... భుజం నొప్పి అని ఆసుపత్రికి వెళితే... ‘‘ఓ రోజు అర్ధ్దరాత్రి.. కుడి భుజం నుంచి చేతి వరకు విపరీతమైన నొప్పి. తెల్లవార్లూ నొప్పిని ఓర్చుకుని, ఇక భరించలేక హైదరాబాద్‌లోని ఓ పెద్ద హాస్పిటల్‌కి వెళ్లాను. మంచి అనుభవజ్ఞుడనే పేరున్న న్యూరో ఫిజీషియన్ వచ్చారు. అన్ని చెకప్లూ చేశారు. వారు తేల్చి చెప్పినదేంటంటే.. ‘ఇది చాలా అరుదుగా వచ్చే గులియన్‌బ్యారీ సిండ్రోమ్’ అని. శరీరంలో ఒక్కో అవయం చచ్చుపడేలా చేయడం ఆ వ్యాధి లక్షణం అని చెప్పారు. చాలా భయపడ్డాను. ఇతర మందులతో పాటు ఐదు రోజుల పాటు ఐదు ఇంజెక్షన్లు చేయించుకోవాలన్నారు. ఒక్కో ఇంజక్షన్‌కు రూ.7,500లు. చెప్పినట్టే చేయించుకున్నాను. మూడు నెలలు ఫిజియోథెరపీ అవసరం అంటే, అన్ని రోజులూ ఫిజియోకేర్లో చేరాను. చెప్పినవన్నీ వాడాను. చెయ్యమన్నవన్నీ చేశాను. అయినా ఫలితం లేదు. మళ్లీ అదే ఆసుపత్రిలో నెల రోజులు చికిత్స తీసుకున్నాను. ఏడాది పాటు... ఇలాగే గడిచింది. ఒక సమస్యకు బదులు మరో సమస్య... మా స్నేహితుడు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యుడు. నన్ను కలవడానికి వచ్చి, రిపోర్టులు చూశాడు. ‘ఇది స్పాండిలోసిస్ సమస్య, ట్రీట్మెంట్ తప్పుగా జరిగింది. మెడలో ఉండో నరాలు కంప్రెషన్‌కు లోనయితే ఇలాంటి నొప్పి వస్తుంది’ అన్నాడు. నమ్మబుద్ధి కాలేదు. మా స్నేహితుడే మరో ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరకు తీసుకెళ్లాడు. అతను కూడా అదే నిర్ధారించాడు. ‘ఏడాది క్రితం కార్పొరేట్ హాస్సిటల్లో తీసిన ఎక్స్‌రేలో కూడా ఇదే విషయం స్పష్టంగా చూపుతోంది’ అని చెప్పాడు. ఆశ్చర్యపోయాను. తర్వాత, వాళ్లు చెప్పిన ట్రీట్మెంట్ తీసుకున్నాను. మొదట్లో సరైన వైద్యం అందకపోవడం వల్లే చెయ్యికి బలం లేకుండా పోయింది. ఆ ప్రభావం వల్ల అన్నం కూడా సరిగ్గా కలుపుకొని తినలేను. ఏం చేయాలి? ఏడాది పాటు నేను అనుభవించిన నరకం, మానసిక క్షోభ, డబ్బు ఖర్చు...ఎంతో నమ్మకం మీద పెద్ద ఆసుపత్రిలో చేరితే ఇలా జరిగింది. ఫోరంలో కేసు... కార్పొరేట్ ఆసుపత్రి ఇచ్చిన అన్ని రిపోర్టులను, బిల్లులను జత చేసి, వినియోగదారుల ఫోరంలో కేసు వేశాను. స్టేట్ కమిషన్ ఉస్మానియా వైద్యులతో చర్చించింది. మొదటి రిపోర్ట్‌లోనే ఎలాంటి సమస్య ఉందో తేల్చింది. వెంటనే రూ.25,000 లు ఆసుపత్రి నుంచి నష్టపరిహారం అందేలా చూసింది. అయితే నేను అనుభవించిన క్షోభకు ఇది పెద్ద అమౌంట్ కాదు. అందుకని జాతీయ వినియోగదారుల ఫోరంలో మళ్లీ కేసు వేశాను. అక్కడ 2 లక్షల రూపాయల ఫైన్ ఆసుపత్రికి వేసి, ఆ మొత్తం నాకు వచ్చేలా చేసింది. ఇందుకు 5-6 ఏళ్ల పాటు సమయం పట్టింది. కానీ, జరిగిన నష్టానికి కొంతైన పరిహారం అందింది. భయపడకుండా న్యాయం కోసం పోరాడితే మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించవచ్చు.’’ - కేతిరి సాయిరెడ్డి, కరీంనగర్ మీకూ ఇలాంటి సమస్య ఎదురైతే... వెంటనే వినియోగదారుల ఫోరమ్‌కి ఫిర్యాదు చేయండి. వినియోగదారుల హక్కుల రక్షణకు, పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో వినియోగదారుల రక్షణ మండళ్లను ఏర్పాటు చేశారు. ఎలా ఫిర్యాదు చేయాలంటే... వస్తు, సేవలు పొందిన రోజు నుండి రెండు సంవత్సరాలలోగా ఫిర్యాదును దాఖలు చేయవచ్చు.ఫిర్యాదు పత్రంలో ఫిర్యాదుదారు పేరు, చిరునామా, వృత్తి, నిందితుల వివరాలు సమగ్రంగా పేర్కొనాలి. బాధితుడు తనకు జరిగిన నష్టంపై వివరించాలి. నష్టాన్ని ధ్రువపరిచే పత్రాలను, బిల్లులను ఐదు సెట్లు తయారు చేసి, ఫిర్యాదు దరఖాస్తుతో జతచేయాలి. ఏ మేరకు నష్టపరిహారాన్ని కోరుతున్నామో స్పష్టంగా రాయాలి. జిల్లాఫోరంలో అయితే లక్ష రూపాయల లోపు నష్టపరిహారానికి రూ.100లు, ఐదు లక్షల లోపు అయితే రూ.200, పది లక్షల లోపు అయితే రూ.400, అదే 20 లక్షల లోపు అయితే 500 చొప్పున రుసుం చెల్లించాలి.