నాకు ఈమధ్య విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. ఎన్ని చోట్ల చికిత్స తీసుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. దీనికి హోమియోలో చికిత్స ఉందా?
– రమేశ్ కుమార్, గుంటూరు
ఇటీవల వెన్నునొప్పి చాలా ఎక్కువ మందిలో కనిపిస్తోంది. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, మన రోజువారీ జీవితంలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో సమస్యలను తట్టుకొని నరాల మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా కాపాడుకోవడం వెన్నెముక ప్రధాన విధి. అధికంగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. మనం ఏ పని చేయాలన్నా ప్రతిక్షణం మెడ, నడుములోని వెన్నుపూసలు పనిచేయాలి. అందుకే ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. ‘వెన్నుపూసలు అరిగి వెన్నునొప్పి వస్తుంది కాబట్టి మందులతో దాన్ని పరిష్కరించలేమనీ, ఆపరేషనే మార్గమని’ ఒక అపోహ ఉంది. పైగా ఇది జీవితాంతం వేధిస్తూ ఉంటుందని నిస్పృహ కూడా. అయితే... వెన్నునొప్పికి కారణమైన డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. ఇలాంటి వెన్ను నొప్పులు వచ్చినప్పుడు... అంటే ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి హోమియోలో కోబాల్ట్ లాంటి ప్రభావపూర్వకమై మందులు అందుబాటులో ఉన్నాయి.
మెడభాగంలో వెన్నుపూసలు అరిగి వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలు సర్వైకల్ పూసలు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్‌బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడంతో మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. ఇలాంటి వారికి యాసిడ్‌ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పులకు రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకు సిమిసిఫ్యూగా వంటివి చాలా బాగా పనిచేస్తాయి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి, హైదరాబాద్
వెన్నునొప్పి... మందులతో తగ్గుతుందా?
Published Wed, Oct 11 2017 11:55 PM | Last Updated on Thu, Oct 12 2017 5:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment