
‘‘వీడేంట్రా.. మిరపకాయలు తిన్నట్టు ధుమధుమ లాడుతున్నాడు’’ ఈ డైలాగ్ ఎప్పుడో ఒకప్పుడు మీరూ వినే ఉంటారు. ఏదో సామెత కొద్దీ చెప్పుంటారులే అనుకుని ఉంటారు కూడా. అయితే ఇందులో ఎంతోకొంత నిజం లేకపోలేదు... అంటోంది బింగ్‌హాంటన్ విశ్వవిద్యాలయం. అంతేకాదు మనం తినే తిండి ప్రభావం యువకులపై ఒకలా ఉంటే, వయసు మీదపడ్డ వారిపై ఇంకోలా ఉంటుందని వీరు ఒక సర్వే ద్వారా నిర్ధారించారు. న్యూరో కెమిస్ట్రీ, బయాలజీల ఆధారంగా రూపుదిద్దుకున్న ప్రశ్నలతో కూడిన ఈ సర్వేలో యువకులు తినే తిండి కారణంగా వారి మెదళ్లలో చేరే రసాయనాలు వారి మూడ్‌ను ప్రభావితం చేస్తున్నట్లు తెలిసింది.
తరచూ మాంసం తింటూ ఉంటే.. వారి మెదళ్లలో సెరటోనినన్, డోపమైన్ వంటి రసాయనాల ఉత్పత్తి ఎక్కువవుతుందని, వ్యాయామం ద్వారా కూడా ఇలాంటి ఫలితాలే ఉంటాయని ఈ సర్వే నిర్వహించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారంలో మూడు కంటే తక్కువసార్లు మాంసం తినేవాళ్లు.. వ్యాయామం పెద్దగా చేయని యువకుల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని బెగ్‌డాచే అనే శాస్త్రవేత్త చెప్పారు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం.. మితాహారం వంటి కారణాల వల్ల వయసు మళ్లిన వాళ్లలో ఒత్తిడికి సంబంధించిన సమస్యలు కొంతవరకూ తగ్గుతాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment