టైమ్స్ ఆఫ్ ఇండియా ఆవిర్భావం
ఆ నేడు 1838, నవంబర్ 3
దేశంలో అత్యధిక పాఠకాదరణ పొందిన ఆంగ్ల దినపత్రిక ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆవిర్భవించింది. సాహు జైన్ కుటుంబానికి చెందిన బెన్నెట్, కోల్‌మాన్ అండ్ కో లిమిటెడ్ బ్రిటిష్ రాజ్ కాలంలో ప్రతి శని, బుధవారాలలో మాత్రమే వెలువడేలా ‘ది బొంబాయి టైమ్స్ అండ్ జర్నల్ ఆఫ్ కామర్స్’ పేరుతో ఆవిర్భవించింది.
యూరప్, అమెరికా, భారతదేశ ఉపఖండం వార్తలను కలిగి ఉండే ఈ పత్రిక రోజువారీ సంచికలను 1850 నుంచి ప్రారంభించారు. 1861లో ‘బొంబాయి టైమ్స్’ అనే పేరును ది టైమ్స్ ఆఫ్ ఇండియా మార్చారు. దీనిని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) ప్రపంచంలోనే అత్యధిక సర్క్యులేషన్ గలదిగా 2008, 2012లలో ధ్రువీకరించింది.