ఓ ఆంగ్ల దినపత్రికపై నిప్పులు చెరిగిన కేసీఆర్!
ఓ ఆంగ్ల దినపత్రికపై నిప్పులు చెరిగిన కేసీఆర్!
Published Fri, Aug 1 2014 6:05 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
హైదరాబాద్: ఓ ఆంగ్ల దినపత్రికపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ను పక్కన పెట్టారంటూ ఓ ఆంగ్ల దిన పత్రిక కథనంపై కేసీఆర్ స్పందించారు. బడ్జెట్ రూపకల్పనలో మంత్రి ఈటెలను పట్టించుకోవడం లేదని, బడ్జెట్ అంశాలను చదివే విధంగా నామమాత్రపు పాత్రకే కేసీఆర్ పరిమితం చేస్తున్నారంటూ ఆంగ్ల దినపత్రిక కథనంలో పేర్కొంది.
పత్రిక వెల్లడించిన కథనమంతా ఓ చెత్త అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ రూపకల్పన అనే అంశం ఏ ఒక్కరికి పరిమితం కాదు. అదోక టీమ్ వర్క్. వివిధ మంత్రుల సిఫారసులను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ రూపకల్పన ఉంటుంది.
ఆ పత్రిక వెల్లడించిన కథనంలో వాస్తవాలు లేవన్నారు. సెన్సెషనల్ హెడ్ లైన్స్ కోసం రాసే వార్తలు తప్పుడు సంకేతాలను పంపుతాయని కేసీఆర్ అన్నారు. ఆతర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మీడియా సహకారం అందించాలని కేసీఆర్ విజ్క్షప్తి చేశారు.
Advertisement
Advertisement