నవజాత శిశువుకు తల్లిపాలకు మించిన ఆరోగ్య రక్షణ లేదని అంటారుగానీ.. మధుమేహం విషయంలో ఇది తల్లికీ మేలని అంటున్నారు శాస్త్రవేత్తలు. దాదాపు 30 ఏళ్ల సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన కైసర్ పెర్మనెన్‌టే శాస్త్రవేత్తలు తెలిపారు. పాలిచ్చే తల్లులకు రొమ్ము, అండాశయ కేన్సర్ల ముప్పూ తక్కువగా ఉంటుందన్నది తెలిసిందే. యువతుల్లో గుండెజబ్బులు వచ్చేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయడం లక్ష్యంగా 1986లో కైసర్ పెర్మనెన్‌టే శాస్త్రవేత్తలు కొంతమంది మహిళలపై ఒక అధ్యయనం చేపట్టారు. ఇందులో 18 – 30 మధ్య వయస్కులు దాదాపు ఐదే వేల మంది పాల్గొన్నారు.
గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని మినహాయించి తరచూ జరిపిన పరిశోధనల ద్వారా తేలింది ఏమిటీ అంటే.. ఆరునెలల కంటే ఎక్కువ సమయం పిల్లలకు స్తన్యమిచ్చే వారిలో సగం మందిలో మధుమేహ లక్షణాలేవీ కనిపించలేదు. పాలు అస్సలు పట్టని తల్లులతో పోలిస్తే ఆరు నెలల కంటే తక్కువ పాలిచ్చే తల్లుల్లో మధుమేహం ముప్పు 25 శాతం తక్కువని తేలింది. ఈ ఫలితాలు ఇతర పరిశోధనల ఫలితాలకు దగ్గరగా ఉన్నాయని, అన్ని ప్రాంతాల మహిళలు (ఆఫ్రికన్లు, ఇతరులు) ఇదే రకమైన ధోరణి కనపరిచారని ఈ అధ్యయనం నిర్వహించిన డాక్టర్ గుండెర్‌సన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment