
జాక్‌పాట్
శ్రీలంక సుందరి జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది.
గాసిప్
శ్రీలంక సుందరి జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది. అది చూసినవాళ్లంతా ఆమెకు ఏదో జాక్‌పాట్ తగిలిందేమో అనుకుంటున్నారు. నిజానికి అలాంటిదేమీ లేదు. ఆమె ఆనందానికి కారణం ఓ హీరో ఇచ్చిన కాంప్లిమెంట్. బోనీకపూర్ తనయుడు, యంగ్ హీరో అర్జున్ కపూర్ ఉన్నట్టుండి జాక్విలిన్‌ని పొగుడుతూ ఓ ట్వీట్ వదిలాడు.
‘జాక్విలిన్ మంచి నటే కాదు, మంచి వ్యక్తి కూడా. ఈ ప్రపంచంలో తనను మించిన హ్యాపీ సోల్ లేదు’ అంటూ అతగాడు ట్వీటేసరికి సంతోషంతో ఎగిరి గంతేస్తోంది జాక్విలిన్.